మిచెల్ మెరుపులు.. ఫైనల్‌కు న్యూజిలాండ్
టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఓపెన్ డారెల్ మిచెల్(42 బంతుల్లో 72, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టును తొలిసారి ఫైనల్ చేర్చాడు. కాగా ఓపెనర్ మార్టిన్ గప్టిల్(4), కెప్టెన్ కేన్ విలియమ్సన్(5) తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ తర్వాత వచ్చిన డెవన్ కాన్వే 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చివర్లో జేమ్స్ నీషమ్ 11 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 27 పరుగులు కొట్టి కివీస్‌ను ఒత్తిడి నుంచి బయటపడేశాడు. ఇక ఓపెనర్ డారెల్ మిచెల్ ఇన్నింగ్స్ ఆధ్యంతం నిలకడైన ఇన్నింగ్స్ కొనసాగించి జట్టును గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లివింగ్‌స్టోన్ చెరో 2 వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ ఒక వికెట్ తీశాడు. ఇక టి20 ప్రపంచకప్‌ల్లో న్యూజిలాండ్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఇక గురువారం పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న సెమీఫైనల్ 2 విజేతతో ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.
కాన్వే(46) ఔట్.. న్యూజిలాండ్ 102/3
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ కాన్వే(46) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. డారిల్ మిచెల్, కాన్వేలిద్దరు కలసి మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. ఈ దశలో కాన్వే లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు యత్నించి స్టంప్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం మిచెల్ 44, ఫిలిప్స్ 1 పరుగుతో ఆడుతున్నారు.
10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 27 పరుగులు, డెవన్ కాన్వే 26 పరుగులతో ఆడుతున్నారు.
కేన్ విలియమ్సన్(5) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన కివీస్
క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్(5) ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 12, డెవన్ కాన్వే 14 పరుగులతో ఆడుతున్నారు.
గప్టిల్(4) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
ఓపెనర్ మార్టిన్ గప్టిల్(4) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో గప్టిల్ మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 1 ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ 20 ఓవర్లలో 166/4.. న్యూజిలాండ్ టార్గెట్ 167
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన డేవిడ్ మలాన్(42) రాణించాడు. మలాన్ ఔటైన అనంతరం వచ్చిన మొయిన్ అలీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అలీ ఓవరాల్‌గా 51 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, ఇష్ సోధీ, ఆడమ్ మిల్నే, నీషమ్ తలా ఒక వికెట్ తీశారు.
16 ఓవర్లలో ఇంగ్లండ్ 119/3
సమయం:20:52.. 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. మొయిన్ అలీ 32, లివింగ్‌స్టోన్ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 42 పరుగులు చేసిన మలాన్ సౌథీ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
డేంజర్ మ్యాన్ బట్లర్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
సమయం: 20:15.. ఓపెనర్ జాస్ బట్లర్(29) రూపంలో ఇంగ్లండ్ కీలక వికెట్ కోల్పోయింది. ఇష్ సోథీ బౌలింగ్‌లో బట్లర్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. మలన్ 10, మొయిన్ అలీ 2 పరుగులతో ఆడుతున్నారు.
కేన్ మామ సూపర్ క్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
సమయం: 20:00.. మిల్నే బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్‌కు ఓపెనర్ బెయిర్ స్టో(13) వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. బట్లర్ 29, మలాన్ 5 పరుగుతో ఆడుతున్నారు.
4 ఓవర్లలో ఇంగ్లండ్ 29/0
సమయం: 19:47.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. బట్లర్ 17, బెయిర్ స్టో 7 పరుగులతో ఆడుతున్నారు.
అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ 12 దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన ఇంగ్లండ్ ఫెవరెట్‌గా కనిపిస్తుంది. ఇక గ్రూఫ్-2లో న్యూజిలాండ్ పాకిస్తాన్‌పై ఓటమి మినహా మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. అబుదాబి వేదికగా ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ మాత్రం ఒకదాంట్లో గెలిచి.. మరొకటి ఓడిపోయింది. ఇక ముఖాముఖి పోరులో టి20ల్లో 21సార్లు తలపడగా.. ఇంగ్లండ్ 13సార్లు.. న్యూజిలాండ్ 7 సార్లు గెలిచాయి.
ఇక టి20 ప్రపంచకప్‌ల్లో ఐదుసార్లు తలపడగా.. ఇంగ్లండ్ మూడుసార్లు.. న్యూజిలాండ్ రెండుసార్లు విజయం సాధించాయి. ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంలో జాస్ బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అటు న్యూజిలాండ్ బ్యాటింగ్ అంతంతమాత్రంగానే కనిపిస్తుంది. ఇక చివరిసారి ఐసీసీ మేజర్ ఈవెంట్ పరంగా చూస్తే 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్ : జోస్ బట్లర్(వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment