Eoin Morgan
-
CWC 2023: ధోని, పాంటింగ్ సరసన చేరిన కమిన్స్
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ కెప్టెన్‌గా తన తొలి వరల్డ్‌కప్ సాధించి, ఓ వినూత్న ఘనత సాధించాడు. పెళ్లైన మరుసటి ఏడాదే వన్డే ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా దిగ్గజాల సరసన చేరాడు. గతంలో రికీ పాంటింగ్ (2003), మహేంద్ర సింగ్ ధోని (2011), ఇయాన్ మోర్గన్లు (2019) పెళ్లైన మరుసటి ఏడాదే ప్రపంచకప్ సాధించిన ఆటగాళ్లుగా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా కమిన్స్ వీరి సరసన చేరి అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. Who should get married in 2026?🤔 pic.twitter.com/RtVJ8PGUuf — CricTracker (@Cricketracker) November 20, 2023 కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
CWC 2023: ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో జరుగుతుంది..!
ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుస పరాజయాలు (6 మ్యాచ్‌ల్లో 5 అపజయాలు) ఎదుర్కొంటూ ఘోర నిష్క్రమణ దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ ఇయాన్ మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగి, ఇంత పేలవ ప్రదర్శన కనబర్చిన జట్టును నేనెప్పుడూ చూడలేదని ప్రస్తుత ఇంగ్లండ్ జట్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఏదో అస్థిరత స్పష్టంగా కనిపిస్తుంది.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశాడు. గెలుపు కోసం జట్టు అవలంబిస్తున్న పద్ధతి, మ్యాచ్‌లను వారు కోల్పోయిన తీరు చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతుందని బాంబు పేల్చాడు. 2019లో ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ అందించి, ఆ దేశ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మోర్గాన్, సొంత జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. మోర్గాన్ చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలీదు కానీ, అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు సభ్యుడు లివింగ్‌స్టోన్ స్పందించాడు. జట్టు సభ్యులందరికీ మోర్గాన్‌పై అమితమైన గౌరవం ఉంది. అతను ఈ తరహా వ్యాఖ్యలు చేసి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. గుండెల పై చెయ్యి వేసుకుని చెప్పగలను అతను అన్న విధంగా జట్టులో ఎలాంటి మనస్పర్థలు లేవు. మోర్గాన్ ఊహించిన విధంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏమీ జరగడం లేదు. జట్టులో అందరం కలిసికట్టుగా ఉన్నాం. ప్రతి మ్యాచ్‌లో వంద శాతం విజయాల కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే మాకేదీ కలిసి రావడం లేదంటూ మోర్గాన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చాడు. ఇదిలా ఉంటే, టీమిండియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని (230) కూడా చేధించలేక 100 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో కేవలం బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలుపొందిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. బట్లర్ సేన తదుపరి జరిగే 3 మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్) రెండు మ్యాచ్‌ల్లో ఒడినా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత కోల్పోతుంది. కాగా, ప్రపంచకప్‌లో లీగ్ దశ తర్వాత టాప్-7లో నిలిచే జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. -
టీమిండియా మాజీ బౌలర్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక కమిటీలో చోటు
లండన్: ప్రతిష్టాత్మక మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వరల్డ్ క్రికెట్ కమిటీలో భారత మాజీ పేసర్ జులన్ గోస్వామికి స్థానం లభించింది. ఆమెతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, హీతర్ నైట్లను కూడా కమిటీలోకి తీసుకున్నట్లు ఎంసీసీ చైర్మన్ మైక్ గ్యాటింగ్ వెల్లడించారు. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీలో భాగమైన వరల్డ్ క్రికెట్ కమిటీ కొత్తగా వచ్చే సాంకేతిక అంశాలను, వాటిని ఉపయోగించడానికి సంబంధించి తగిన సూచనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంసీసీ ప్రధాన కేంద్రం లార్డ్స్ మైదానంలో ఉంది. లార్డ్స్‌లోనే జరిగిన ఫైనల్ మ్యాచ్‌లలో 2019 వన్డే వరల్డ్ కప్, 2017 వన్డే వరల్డ్ కప్‌లలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఈ టీమ్‌లకు మోర్గాన్, హీతర్ నైట్ కెప్టెన్లుగా వ్యవహరించారు. గత ఏడాది ఇదే లార్డ్స్ మైదానంలో తన ఆఖరి వన్డే ఆడి జులన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 355 వికెట్లు పడగొట్టిన జులన్‌కు ఈ ఏడాదే ఎంసీసీ గౌరవ సభ్యత్వం దక్కింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
Eoin Morgan: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, ఆ దేశ పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇదివరకే (2022 జూన్ 28) గుడ్‌బై చెప్పిన మోర్గాన్.. తాజాగా అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. మోర్గాన్.. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత మిడిల్సెక్స్ (ఇంగ్లండ్ కౌంటీల్లో), సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ జట్ల తరఫున కొనసాగుతున్నాడు. తాజాగా వీటి నుంచి కూడా వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. pic.twitter.com/1x1w0unGL2 — Eoin Morgan (@Eoin16) February 13, 2023 అయితే క్రికెట్‌తో తన అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా బ్రాడ్కాస్టర్లతో తన అనుబంధం కొనసాగుతుందని తెలిపాడు. తాను విడుదల చేసిన లేఖలో మోర్గాన్ ఇలా అన్నాడు. విశ్వవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల చాలా నేర్చుకున్నానని, ఈ క్రమంలో చాలామంది వ్యక్తులతో జీవితకాల పరిచయం ఏర్పరచుకున్నానని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత కుటుంబంతో ఎక్కువగా గడపగలుగుతున్నానని.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇంకాస్త అధిక సమయం వారికి కేటాయించే అవకాశం ఉంటుందని అన్నాడు. తన క్రికెట్ జర్నీలో తోడుగా, అండగా ఉన్న అభిమానులకు, సహచరులకు, కుటుంబానికి మోర్గాన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా, ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మోర్గాన్.. ఇంగ్లండ్ తరఫున తన 13 ఏళ్ల కెరీర్లో 225 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగుల రికార్డులు మోర్గాన్ పేరిటే నమోదై ఉన్నాయి. 2019లో ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన 36 ఏళ్ల మోర్గాన్.. గత సంవత్సరకాలంగా ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్‌గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్‌తో కలుపుకుని) 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. -
కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు
''ఎక్కడ పారేసుకున్నావో.. అక్కడే వెతుకు కచ్చితంగా దొరుకుతుంది'' అని మన పెద్దలు అనడం వింటూనే ఉంటాం. ఈ సారాంశం ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్‌కు సరిగ్గా సరిపోతుంది. టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో కెప్టెన్ బట్లర్‌తో కలిసి విధ్వంసం సృష్టించాడు. 86 పరుగులు నాటౌట్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన అలెక్స్ హేల్స్‌ను టీమిండియా అభిమానులు అంత తొందరగా మరిచిపోలేరు. అసలు విషయమేంటంటే ముందు అలెక్స్ హేల్స్ అసలు ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టులోనే లేడు. స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో గాయపడడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు అలెక్స్ హేల్స్. అయితే హేల్స్ జట్టులోకి రావడం వెనుక ఉన్నది మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్. బట్లర్ తనపై పెట్టుకున్న నమ్మకానికి అలెక్స్ హేల్స్ పూర్తిశాతం న్యాయం చేశాడు. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇక అలెక్స్ హేల్స్ 2019 వన్డే వరల్డ్ కప్‌కు ముందు సరదాగా ప్రమాదకరం కాని ‘రిక్రియేషనల్ డ్రగ్స్’ తీసుకున్నాడు. దాంతో అతనిపై 3 వారాల నిషేధం విధించారు. అలా మూడు వారాలు కాస్త మూడు సంవత్సరాలైపోయాయి. హేల్స్ మూడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమవ్వడానికి కారణం మరో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. మోర్గాన్ దృష్టిలో మాత్రం డ్రగ్స్ వ్యవహారం చిన్న తప్పుగా అనిపించలేదు. దీనిని ‘నైతికత’కు సంబంధించిన అంశంగా వాదించిన మోర్గాన్ వరల్డ్ కప్ జట్టులోంచి హేల్స్‌ను తీసేయించాడు. నిజానికి 2015 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఘోర వైఫల్యం తర్వాత జట్టు పునరుజ్జీవంలో హేల్స్ కూడా కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో ఇంగ్లండ్ రికార్డు స్కోర్లలో అతనిదే ప్రధాన పాత్ర. అయినా సరే మోర్గాన్ మాత్రం తగ్గలేదు. హేల్స్‌ను జట్టుకు దూరంగా ఉంచి తన మాట నెగ్గించుకున్నాడు. సరిగ్గా చెప్పాలంటే ‘నేను కెప్టెన్‌గా ఉన్నంత వరకు నువ్వు మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి రాలేవు’ అని సందేశం ఇచ్చాడు. చివరకు అదే జరిగింది. అలా మూడేళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు దూరమైన హేల్స్ మోర్గాన్ రిటైర్మెంట్ కాగానే మళ్లీ జట్టులోకి వచ్చాడు. బట్లర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాకా తన మార్క్‌ను చూపెట్టాలని అలెక్స్ హేల్స్‌ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చాడు. ఈ సెప్టెంబర్‌లో పాకిస్తాన్ టూర్లో హేల్స్ మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ అప్పటికే టి20 ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేయగా అందులో హేల్స్ లేడు. కానీ బెయిర్ స్టో గాయపడడం హేల్స్‌కు కలిసి వచ్చింది. అలా ఒక వరల్డ్‌కప్ ఆడే చాన్స్ మిస్ అయింది. కానీ మరో వరల్డ్‌కప్ ఆడే అవకాశం వచ్చింది. వచ్చిన రెండో అవకాశాన్ని హేల్స్ వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకేముంది వెనక్కి తిరిగి చూస్తే హేల్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ నుంచి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇక టీమిండియాతో జరిగిన సెమీస్‌లో హేల్స్ ఇన్నింగ్స్‌ను మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా చూశాడు. వరల్డ్‌కప్‌లో స్కై స్పోర్ట్స్ కామెంటరీ టీమ్‌లో భాగంగా ఉన్న ఇయాన్ మోర్గాన్ హేల్స్ బ్యాటింగ్‌కు చప్పట్లు కొడుతూ అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అందుకే అంటారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మొన్న తిట్టినోడే ఇవాళ మెచ్చుకున్నాడు. అంటూ అభిమానులు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: ఆటలో లోపం లేదు.. టాలెంట్‌కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో! WC 2022: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’.. రేసులో 9 మంది! కోహ్లితో పాటు -
T20 World Cup 2022: అహో హేల్స్...
‘నేను మళ్లీ ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదు’... సెమీస్ ముగిసిన తర్వాత అలెక్స్ హేల్స్ వ్యాఖ్య ఇది. బహుశా భారత అభిమానులు కూడా అదే జరిగి ఉంటే బాగుండేదని అనుకొని ఉంటారు! మూడేళ్ల పాటు ఆటకు దూరమై పునరాగమనంలో మళ్లీ చెలరేగుతున్న హేల్స్ కథ కూడా ఎంతో ఆసక్తికరం. ► ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలలో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా మూడేళ్ల పాటు అతనికి టీమ్‌లో చోటు దక్కలేదు. ఆ బాధను అధిగమించి అతను ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ ఏడాది జూన్‌లో మోర్గాన్ రిటైర్ అయ్యాడు... సెప్టెంబర్‌లో హేల్స్‌కు టీమ్‌లో స్థానం లభించింది. పాకిస్తాన్ పర్యటనలో ఆకట్టుకున్న అతను వరల్డ్ కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో తానేంటో నిరూపించాడు. ► పాక్ టూర్ తర్వాత కూడా ఇంగ్లండ్ వరల్డ్ కప్ జట్టులో హేల్స్‌కు స్థానం దక్కలేదు. అయితే బెయిర్‌స్టో అనూహ్యంగా గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హేల్స్‌ను టీమ్‌లోకి తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత సరైన నిర్ణయమో ఇంగ్లండ్‌కు ఇప్పుడు తెలిసింది. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. –సాక్షి క్రీడావిభాగం -
కొత్త కోచ్ వేటలో పంజాబ్ కింగ్స్.. కుంబ్లేకు మంగళం పాడనుందా!
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ షాకివ్వనున్నట్లు సమాచారం. పంజాబ్ కింగ్స్ కోచ్‌గా అనిల్ కుంబ్లే స్తానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ సెప్టెంబర్‌తో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్‌తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కుంబ్లేతో ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ పదవికి ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ సహా హైదరాబాద్ మాజీ కోచ్ ట్రెవర్ బెలిస్ పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి పేరు కూడా పరిశీలినలో ఉంది. మరో వారంలో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ ఎవరనే దానిపై సందిగ్దం వీడనుందని ఫ్రాంచైజీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక కుంబ్లే హయాంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో 42 మ్యాచ్‌ల్లో 19 విజయాలు అందుకుంది. అనిల్ కుంబ్లే కోచింగ్‌లో వరుసగా నాలుగు సీజన్లలోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్. నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, ప్లేయర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు. అందుకే కుంబ్లేని సాగనంపి, కొత్త హెడ్ కోచ్‌ని నియమించుకునేందుకు పంజాబ్ కింగ్స ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఐపీఎల్ ప్రారంభం నుంచి పంజాబ్ కింగ్స్ 2014 మినహా ఒక్కసారి కూడా ఫైనల్ చేరిన దాఖలాలు లేవు. ఎంతమంది కెప్టెన్లు, కోచ్‌లు, ఆటగాళ్లు మారినా ఆ జట్టు ఆట తీరు మాత్రం మెరుగపడడం లేదు. అంతేకాదు జట్టు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మెగావేలంలోనూ దూకుడు కనబరిచింది పంజాబ్ కింగ్స్. వేలంలో శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్ స్టో, కగిసో రబడా లాంటి పేరున్న ఆటగాళ్లను తీసుకుంది. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వెళ్లిపోవడంతో.. శిఖర్ ధావన్‌ను కాదని మయాంక్ అగర్వాల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్సీ ఒత్తిడిలో పడి మయాంక్ తన బ్యాటింగ్‌ను పూర్తిగా మరిచిపోయాడు. సీజన్లో కొన్ని మంచి విజయాలు అందుకున్నప్పటికి పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు.. ఏడు పరాజయాలతో ఆరో స్థానంలో నిలిచి మరోసారి లీగ్ దశకే పరిమితమయింది. మరి కొత్త కోచ్ రాకతో పంజాబ్ కింగ్స్ దశ వచ్చే సీజన్లోనైనా మారుతుందేమో చూడాలి. -
చెమటోడుస్తున్న యువీ.. ఇదంతా ఆ మ్యాచ్ కోసమేనా?
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నెట్స్‌లో త్రీవంగా చెమటోడుస్తున్నాడు. యువీ బ్యాటింగ్‌లో శ్రమిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి యువరాజ్ ఇంతకు దేనికోసం ఇంత ప్రాక్టీస్ చేస్తున్నట్లు.. అనే డౌట్ వచ్చిందా. అక్కడికే వస్తున్నాం.భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ ఒక స్పెషల్ మ్యాచ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ జట్టుకు గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, యూసఫ్ పఠాన్ సహా మరికొంత మంది ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. అయితే, యువీ పేరు ఇటీవల ప్రకటించిన జట్టులో లేనప్పటికీ ఈ మేరకు ఈ మాజీ డాషింగ్ ఆల్కరౌండర్ నెట్స్‌లో శ్రమించడం విశేషం. దీంతో ఆఖరి నిమిషంలోనైనా యువీ ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు. కాగా యువరాజ్ ప్రాక్టీస్‌కు ముందు ఒక అభిమాని.. ''మీ కార్లో క్రికెట్ కిట్ ఏం చేస్తోంది'' అని అడిగాడు. యువీ స్పందిస్తూ.. నాకు కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఏదైనా మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ప్రాక్టీస్ చేయడం అవసరం. పేర్కొన్నాడు. ఆ తర్వాత యువరాజ్ తన కిట్ ఓపెన్ చేసి తన ప్యాడ్లను చూపిస్తూ ''వారియర్ ఈజ్ బ్యాక్''.. రానున్న జరగబోయే మ్యాచ్‌కోసం నేను మంచి ఉత్సాహంతో ఉన్నా.. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్తున్నా అంటూ తెలిపాడు. ఇక ప్రాక్టీస్ ముగిసిన అనంతరం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి బాగా అలసిపోయా.. కొద్దిసేపు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమయింది. ఆల్ ది బెస్ట్.. ఇండియన్ మహరాజాస్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 19 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేశాడు. Didn’t do too bad, did I? 🤪 Super excited for what’s coming up! pic.twitter.com/MztAU5nyZJ — Yuvraj Singh (@YUVSTRONG12) August 16, 2022 Are you as excited about the special India@75 match between India @IndMaharajasLLC and World @WorldGiantsLLC? Announcing the full squads of #Legends in the next tweet! #LegendsLeagueCricket #AzadiKaAmritMahotsav@Souravganguly @Eoin16 @AmritMahotsav @cabcricket @DasSanjay1812 pic.twitter.com/oUZZQaOUFv — Legends League Cricket (@llct20) August 12, 2022 ఇండియా మహరాజాస్: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ సింగ్ జడేజా,ఆర్ పీ సింగ్ , జోగిందర్ శర్మ వరల్డ్ జెయింట్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, హెర్షెల్ గిబ్స్, జాక్వెస్ కల్లిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకద్జా, మష్రాఫ్ మోర్టాజా, అస్గ్హర్ మోర్టాజా, అస్గ్హర్ట్జాన్ అఫ్ట్సన్, , కెవిన్ ఓ'బ్రియన్, దినేష్ రామ్‌దిన్ చదవండి: ఇండియా మహరాజాస్ కెప్టెన్‌గా గంగూలీ.. పోటీకి సన్నద్ధం! LLC 2022: ఇండియా మహరాజాస్‌తో మ్యాచ్.. సనత్ జయసూర్య అవుట్! షేన్ వాట్సన్ ఇన్ -
Sourav Ganguly: ఇండియా మహరాజాస్ కెప్టెన్‌గా దాదా.. పోటీకి సై!
Sourav Ganguly- September 15th in Legends League Cricket Match: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 తాజా సీజన్ ఓ ప్రత్యేక మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం)లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో సెప్టెంబరు 15న జరిగే ఈ మ్యాచ్‌లో సుమారు 10 దేశాలకు చెందిన ఆటగాళ్లు భాగం కానున్నారు. కాగా టీమిండియా మాజీ సారథి, భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడనే సంగతి తెలిసిందే. అయితే, ఫండ్ రైజింగ్ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్‌కు దాదా కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు తాజాగా వెల్లడించారు. ఇక వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. దాదా జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ సహా మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇక వరల్డ్ జెయింట్స్‌లో వెస్టిండీస్ దిగ్గజం లెండిల్ సిమన్స్, ప్రొటిస్ మాజీ ప్లేయర్ హర్షల్ గిబ్స్, శ్రీలంక లెజెండ్ సనత్ జయసూర్య వంటి 17 మంది మాజీ క్రికెటర్లకు చోటు దక్కింది. ఇండియా మహరాజాస్ జట్టు: సౌరవ్ గంగూలీ(కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్,యూసఫ్ పఠాన్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా(వికెట్ కీపర్), అక్షశ్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగీందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి. వరల్డ్ జెయింట్స్ జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లెండిల్ సిమన్స్, హర్షల్ గిబ్స్, జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్(వికెట్ కీపర్), నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హోమిల్టన్ మసకజ్ద, మష్రాఫ్ మోర్తజా, అస్గర్ అఫ్గన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒ బ్రెయిన్, దినేశ్ రామ్‌దిన్(వికెట్ కీపర్). 6 పట్టణాల్లో 22 రోజులు.. 15 మ్యాచ్‌లు ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ తర్వాత సెప్టెంబరు 17 నుంచి అసలు పోటీ ఆరంభం కానుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్-2లో టైటిల్ కోసం నాలుగు జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్‌లు ఉంటాయి. ఆరు పట్టణాల్లో 22 రోజుల పాటు అక్టోబరు 8 వరకు లీగ్ సాగనుంది. జట్ల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక భారత 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఈ ఎడిషన్‌ను అంకితమిస్తున్నట్లు లీగ్ కమిషనర్ రవిశాస్త్రి తెలిపాడు.కాగా మొదటి సీజన్‌ను వరల్డ్ జెయింట్స్ గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: Asia Cup 2022: టీమిండియాతో తొలి మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ షాక్! ఇక కష్టమే! View this post on Instagram A post shared by Legends League Cricket (@llct20) -
కొత్త అవతారమెత్తబోతున్న మోర్గాన్.. ఇండియాతో సిరీస్ నుంచి..?
ఇంగ్లండ్ తాజా మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. జూన్ 28న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేసిన మోర్గాన్.. కొద్ది నిమిషాల్లోనే తన ఫ్యూచర్ ప్లాన్‌ను వెల్లడించాడు. ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కామెంటేటర్‌గా మారబోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని మోర్గాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ‘స్కై’ నెట్వర్క్ ధృవీకరించింది. మోర్గాన్ తమ కామెంటరీ టీమ్‌లో చేరబోతున్నడని ప్రకటన విడుదల చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్ ఆడబోయే తదుపరి సిరీస్‌ల నుంచి మోర్గాన్ స్కై నెట్‌వర్క్‌లో భాగస్వామిగా ఉంటాడని పేర్కొంది. మొత్తానికి ఇంగ్లండ్ తరఫున క్రికెటర్‌గా 13 ఏళ్ల కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే మోర్గాన్ మరో పనిని వెతుక్కున్నాడు. త్వరలో జరుగబోయే ఇండియా, సౌతాఫ్రికా సిరీస్‌ల నుంచి మోర్గాన్ కామెంటేటర్‌గా తన కెరీర్ మొదలుపెట్టనున్నాడు. ఐర్లాండ్ తరఫున కెరీర్ ప్రారంభించి ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎనలేని సేవలనందించిన మోర్గాన్.. తన హయాంలో ఇంగ్లండ్‌కు వన్డే ప్రపంచకప్ (2019) అందించాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్‌గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్‌తో కలుపుకుని) 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. చదవండి: Ind Vs Eng: ఇంగ్లండ్‌తో టెస్టుకు కెప్టెన్ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా? -
బాధాకరమే అయినా.. రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణమిదే.. ఇకపై!
లండన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక శకం ముగిసింది. వన్డే క్రికెట్లో ఆ జట్టు 44 ఏళ్ల కల నెరవేర్చిన నాయకుడు ఇయాన్ మోర్గాన్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ వన్డేలు, టి20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు 36 ఏళ్ల మోర్గాన్ ప్రకటించాడు. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడంతో పాటు గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో మధురానుభూతులు ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన మోర్గాన్... గాయంతో చివరి మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ‘రిటైర్మెంట్కు ఇదే సరైన సమయంగా భావించా. ఇది బాధాకరమే అయినా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. కెరీర్ ఆరంభం నుంచి 2019 ప్రపంచకప్ గెలవడం వరకు నా కెరీర్లో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ప్రస్తుత స్థితిలో జట్టు కూర్పు నుంచి నేను తప్పుకుంటే కొత్తగా వచ్చే కెప్టెన్‌కు జట్టును రాబోయే వరల్డ్‌కప్‌లలో సమర్థంగా నడిపించేందుకు తగినంత సమయం లభిస్తుందని భావించా. దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగుతా’ అని మోర్గాన్ వ్యాఖ్యానించాడు. ఒకదశలో తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు వెన్నెముకలా నిలిచిన మోర్గాన్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు. 2021 జనవరి నుంచి 48 ఇన్నింగ్స్‌లో అతను ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌గా ప్రత్యేక అధ్యాయం... డబ్లిన్‌లో పుట్టిన మోర్గాన్ 16 ఏళ్ల వయసులో సొంత దేశం ఐర్లాండ్ తరఫున అరంగేట్రం చేసి 2007 వన్డే వరల్డ్‌కప్ ఆడాడు. మొత్తం 23 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఇంగ్లండ్ జట్టుకు మారాడు. మొదటి నుంచి దూకుడైన బ్యాటింగ్ శైలి కలిగిన మోర్గాన్ 2010 టి20 వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో కూడా సభ్యుడు. అప్పటి నుంచి అతను రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో రెగ్యులర్‌గా మారిపోయాడు. అయితే అతని కెరీర్లో అసలు మలుపు కెప్టెన్‌గా వచ్చింది. 2015 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అనూహ్యంగా అలిస్టర్ కుక్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో మోర్గాన్‌ను ఈసీబీ ఎంపిక చేసింది. అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ప్రదర్శన పేలవంగా ఉన్నా... తర్వాతి నాలుగేళ్లలో అతను జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. అప్పటి వరకు వన్డేలను కూడా టెస్టుల తరహాలోనే ఆడుతూ వచ్చిన ఇంగ్లండ్... ఎన్నడూ లేని రీతిలో విధ్వంసకర జట్టుగా ఎదిగింది. వన్డేల్లో అతని హయాంలోనే ఇంగ్లండ్ ఐదుసార్లు 400కు పైగా పరుగులు సాధించగా, టాప్–3 ఆ జట్టు ఖాతాలోనే ఉన్నాయి. 2016 టి20 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన మోర్గాన్ కెరీర్ లో 2019 వన్డే వరల్డ్‌కప్ విజయం అత్యుత్తమ క్షణం. బ్యాటర్‌గా కూడా పలు ఘనతలు సాధించిన మోర్గాన్ పేరిటే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల (17) రికార్డు ఉంది. 16 టెస్టుల తర్వాత తన వల్ల కాదంటూ 2012లోనే అతను ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇయాన్ మోర్గాన్ కెరీర్ ►248 వన్డేల్లో 39.29 సగటుతో 7,701 పరుగులు (14 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు). ►115 అంతర్జాతీయ టి20ల్లో 136.17 స్ట్రయిక్‌రేట్‌తో 2458 పరుగులు (14 అర్ధ సెంచరీలు). చదవండి: IND vs IRE: ఉత్కంఠపోరులో టీమిండియా విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్ "It's been the most enjoyable time of my life." Morgs' reflects on his incredible England career after announcing his international retirement 🏏#ThankYouMorgs — England Cricket (@englandcricket) June 28, 2022 -
రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. తాను సాధించిన దాని గురించి గర్వపడుతున్నానని, గొప్ప వ్యక్తులతో తన జ్ఞాపకాలు చిరకాలం గుర్తుపెట్టుకుంటానని తెలిపాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మంగళవారం ట్విటర్ వేదికగా ధృవీకరించింది. You’ve changed English cricket forever. An innovator 🏏 A motivator 💪 A champion 🏆 Your legacy will live on...#ThankYouMorgs ❤️ pic.twitter.com/a32SSvCDXI — England Cricket (@englandcricket) June 28, 2022 మోర్గాన్.. ఇంగ్లీష్ క్రికెట్ రూపురేఖలను మార్చిన గొప్ప క్రికెటర్ అని కొనియాడింది. మోర్గాన్ ఓ ఇన్నోవేటర్, ఓ మోటివేటర్, ఓ ఛాంపియన్ అంటూ ఆకాశానికెత్తింది. నీ వారసత్వం ఇలానే కొనసాగుతుంది.. థ్యాంక్యూ మోర్గాన్ అంటూ ట్విట్లో పేర్కొంది. కాగా, మోర్గాన్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని బ్రిటిష్ మీడియాలో గత కొన్ని రోజులుగా కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. "I'm hugely proud of what I have achieved, but what I will cherish and remember most are the memories I made with some of the greatest people I know."#ThankYouMorgs 👏 — England Cricket (@englandcricket) June 28, 2022 ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మోర్గాన్.. ఇంగ్లండ్ తరఫున తన 13 ఏళ్ల కెరీర్లో 225 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగుల రికార్డులు మోర్గాన్ పేరిటే నమోదై ఉన్నాయి. 2019లో ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన 35 ఏళ్ల మోర్గాన్.. గత సంవత్సరకాలంగా ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన అతను ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్‌గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్‌తో కలుపుకుని) 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. చదవండి: అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..! -
ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..!
టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలం పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు బ్రిటిష్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గార్డియన్ నివేదిక ప్రకారం.. జూలై తొలి వారంలో అంతర్జాతీయ క్రికెట్‌కు మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక మోర్గాన్ సారథ్యంలోనే 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. కాగా తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన మెర్గాన్ కేవలం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మెర్గాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. గాయం కారణంగా అఖరి వన్డేకు మోర్గాన్ దూరమ్యాడు. మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ఒక వేళ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే అతడి స్థానంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అదే విధంగా 2015 నుంచి ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా బట్లర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఇంగ్లండ్-భారత మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జూలై 7 న ప్రారంభం కానుంది. చదవండి: Ranji Trophy 2022: 'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను' -
నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. సిరీస్ కైవసం
ఆదివారం ఆమ్స్టెల్వీన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 36.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాసన్ రాయ్(73), ఫిలిప్ సాల్ట్(77) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో మెర్గాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు, ఇక డచ్ బౌలర్లలో ఆర్యన్ దత్ రెండు, టామ్ కూపర్, ప్రింగల్ తలా వికెట్ సాధించారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. అయితే తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 41ఓవర్లలలో 7 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, రషీద్ చెరో రెండు వికెట్లు, బ్రైడన్ కార్స్, లివింగ్ స్టోన్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్లు మధ్య అఖరి వన్డే బుధవారం జరగనుంది. చదవండి: ENG vs NED: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. నెదర్లాండ్స్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! -
'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్
నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న చందంగా ఇంగ్లండ్ ఆటతీరు ఉంది. 50 ఓవర్లలో ఇంగ్లండ్ చేసింది 498 పరుగులు.. కోల్పోయింది నాలుగు వికెట్లు. మరో రెండు పరుగులు చేసి ఉంటే 500 పరుగుల మార్క్ అందుకునేదే. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొత్తం ఆడింది నలుగురు బ్యాటర్లు మాత్రమే. ఆ ముగ్గురు బ్యాటర్లు(జాస్ బట్లర్, సాల్ట్, డేవిడ్ మలాన్) సెంచరీలు చేస్తే.. లియామ్ లివింగ్ స్టోన్ అర్థ సెంచరీతో మెరిశాడు. మరి మిగతా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లో ఒకరు గోల్డెన్ డక్ అయితే.. మరొకరు ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. గోల్డెన్ డక్ అయింది కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కాగా.. ఒక్క పరుగుకే ఔటయ్యింది జేసన్ రాయ్. తాజాగా మోర్గాన్, రాయ్‌లను ఉద్దేశించిన టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ''ముగ్గురు సెంచరీలు.. ఒక అర్థసెంచరీ.. ఒక గోల్డెన్ డక్.. ఒక్క పరుగుకే ఔట్.. వారెవ్వా మోర్గాన్, జేసన్ రాయ్ ఏం ఎనర్జీ భయ్యా మీ ఇద్దరిది. వేగంగా ఆడిన నలుగురు క్రికెటర్లకు అంతే పోటీగా.. అదే ఎనర్జీతో అంతే తొందరగా పెవిలియన్ చేరారు. అంతా ఓకే కాని.. మీ ఇద్దరి పరిస్థితి(మోర్గాన్, రాయ్) తలుచుకుంటే త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుకువచ్చింది. అందులో తాము పరీక్షలో ఫెయిలయ్యామనే బాధలో మాధవన్, శర్మాన్ జోషిలు ''నీకు నేను.. నాకు నువ్వు'' అన్నట్లుగా అనుకుంటూ నడుస్తారు.. ఇక్కడ మోర్గాన్.. కూడా రాయ్ భుజం తడుతూ ''బాధపడకూ.. నీకు నేను తోడుగా ఉన్నా రాయ్'' అన్నట్లుగా మీమ్‌తో జాఫర్ సెటైర్ వేశాడు. Same energy 😅 #ENGvsNED pic.twitter.com/DrrfpT9lNm — Wasim Jaffer (@WasimJaffer14) June 17, 2022 చదవండి: ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి పాక్ బౌలర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా.. ఒక్కదానికే! -
టి20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త రికార్డు
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ టి20ల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా రోహిత్ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ టీమిండియా టి20 కెప్టెన్‌గా స్వదేశంలో 15 విజయాలు అందుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ విజయం రోహిత్‌కు కెప్టెన్‌గా 16వ విజయం. తద్వారా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్సన్లను(చెరో 15 విజయాలు) రోహిత్ అధిగమించడం విశేషం. ఇప్పటికే స్వదేశంలో టి20 కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో కోహ్లి(13), ఎంఎస్ ధోని(10)లను రోహిత్ ఎప్పుడో దాటేశాడు. ఓవరాల్‌గా టి20ల్లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా 27 మ్యాచ్‌ల్లో.. ఇది 23వ విజయం కావడం విశేషం. ఇక టీమిండియాకు పొట్టి ఫార్మాట్లో వరుసగా 11వ విజయం. టి20 ప్రపంచకప్‌లో అఫ్గనిస్తాన్‌పై గెలుపుతో మొదలైన విజయాల పరంపరను టీమిండియా దిగ్విజయంగా కొనసాగిస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 75; 11 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. చివర్లో షనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది. అనంతరం భారత్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), సామ్సన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించాయి. చదవండి: IPL 2022 CSK: అతనితో బ్యాటింగ్ చేయడంలో ఉన్న కిక్కే వేరప్పా.. Rohit Sharma: కోహ్లి రికార్డుకే ఎసరు పెట్టిన హిట్‌మ్యాన్ -
Ind Vs Wi 3rd T20: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు
Ind Vs Wi T20 Series- India Clean Sweep Series 3-0: వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా సిరీస్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. పర్యాటక విండీస్ జట్టును 3-0తో వైట్‌వాష్ చేసి సత్తా చాటింది. సూర్యకుమార్ యాదవ్ సూపర్ హాఫ్ సెంచరీ(65)కి తోడు బౌలర్లు హర్షల్ పటేల్(3 వికెట్లు), దీపక్ చహర్(2), వెంకటేశ్ అయ్యర్(2), శార్దూల్ ఠాకూర్(2) అద్భుతంగా రాణించడంతో విజయం టీమిండియా సొంతమైంది. ఇక ఇప్పటికే వన్డే సిరీస్‌ను కూడా భారత జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో మూడు లేదంటే అంతకంటే ఎక్కువ సిరీస్‌లను వైట్‌వాష్ చేసిన భారత కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. కాగా 2017లో కోహ్లి గైర్హాజరీలో రోహిత్ సారథ్యంలోని రోహిత్ సేన శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసింది. అదే విధంగా 2018లో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఇక విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న క్రమంలో రోహిత్ శర్మ పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్(2021)తో సిరీస్‌ను వైట్‌వాష్(3-0) చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ జాబితాలో పాకిస్తాన్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్(5 విజయాలు), అఫ్గనిస్తాన్ ఆటగాడు అస్గర్ అఫ్గర్(4) రోహిత్ కంటే ముందు వరుసలో ఉన్నారు. కోహ్లిని దాటేశాడు... అదే విధంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును కూడా రోహిత్ ఈ మ్యాచ్ విజయం ద్వారా అధిగమించాడు. స్వదేశంలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. సొంతగడ్డ మీద రోహిత్ సారథ్యంలో 15 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 14 మ్యాచ్‌లు గెలిచింది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్సన్ 15 విజయాలతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. చదవండి: Rahul Dravid-Wriddhiman Saha: సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్... అతడంటే నాకు గౌరవం ఉంది.. కానీ కాస్త.. 𝐓𝐇𝐀𝐓. 𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆. 𝐅𝐄𝐄𝐋𝐈𝐍𝐆 ☺️ ☺️ What a performance this has been by the @ImRo45 -led #TeamIndia to complete the T20I series sweep! 🏆 👏#INDvWI | @Paytm pic.twitter.com/L04JzVL5Sm — BCCI (@BCCI) February 20, 2022 -
ఆర్సీబీ కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్!
ఐపీఎల్-2022 మెగా వేలంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కోసం మూడు జట్లు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ మోర్గాన్‌ను రీటైన్ చేసుకోలేదు. వేలంలో 1.5 కోట్ల బేస్ ఫ్రైజ్‌కు తన పేరును మోర్గాన్ నమోదు చేసుకున్నాడు. కాగా గత కొద్ది రోజులు నుంచి ఫామ్‌లో లేకపోయినా, అతడి కెప్టెన్‌గా అనుభవం ఉండడంతో అతడిని ఫ్రాంచైజీలు దక్కించుకోనేందుకు మక్కువ చూపుతున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ వేలంలో మోర్గాన్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్ అనంతరం విరాట్ కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోర్గాన్‌ను కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మోర్గాన్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ మెగా వేలానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బీసీసీఐ వేలాన్ని నిర్వహించనుంది. ఈ మెగా వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గోనబోతున్నారు. చదవండి: IND vs WI 3rd ODI: మొన్న ప్రపంచ రికార్డు.. ఈరోజేమో మరీ ఇలా.. నిరాశపరిచావు కదా! -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా మోయిన్ అలీ.. మోర్గాన్ దూరం
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మిగితా రెండు టీ20ల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం అధికారికంగా ధృవీకరించింది. "తొడ కండరాల గాయం కారణంగా మిగిలిన సిరీస్‌కు మోర్గాన్ దూరం కానున్నాడు" అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇక మోర్గాన్ దూరం కావడంతో మోయిన్ అలీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా మూడో టీ20 మ్యాచ్‌కు కూడా మోర్గాన్ దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో అలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో ఘోర పరజాయం చెందిన ఇంగ్లండ్.. రెండో టీ20లో అనూహ్యంగా 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఇక మూడో టీ20లో ఇంగ్లండ్ ఓటమి చెందింది. కగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మోర్గాన్ అంతగా రాణించలేకపోయాడు. కేవలం 30 పరుగులు మాత్రమే సాధించాడు. చదవండి: తెర మీదే అయినా... తగ్గేదే లే! -
Eng Vs WI T20 Series: 16 మంది సభ్యులతో కూడిన జట్టు ప్రకటించిన ఇంగ్లండ్.. కొత్తగా
England Tour OF West Indies- T20 Series Squad: వచ్చే ఏడాది ఆరంభంలో వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో లెఫ్టార్మ్ సీమర్ డేవిడ్ పైన్, జార్జ్ గార్టన్లకు చోటు దక్కింది. విండీస్ టూర్ సందర్భంగా వీరు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నారు. ఇక ఈ సిరీస్‌కు పాల్ కోలింగ్‌వుడ్ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. మార్కస్ ట్రెస్కోథిక్ అసిస్టెంట్ కోచ్‌గా విధులు నిర్వర్తించనున్నాడు. ఈ విషయం గురించి కోలింగ్‌వుడ్ మాట్లాడుతూ... ‘‘పటిష్టమైన జట్టును ఎంపిక చేశాం. ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాన్ని సమతుల్యం చేసుకుంటూ ఆటగాళ్లను సెలక్ట్ చేశాం’’అని చెప్పుకొచ్చాడు. కాగా విండీస్ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో 11 మంది టీ20 ప్రపంచకప్-2021 ఈవెంట్లో పాల్గొన్న ఆటగాళ్లు ఉండటం గమనార్హం. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ ప్రకటించిన జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, టామ్ బాంటన్, సామ్ బిల్లింగ్స్, లియామ్ డాసన్, జార్జ్ గార్టన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, సకీబ్ మహమూద్, టైమల్ మిల్స్, డేవిడ్ పైన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లే, జేమ్స్ విన్సే. ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్- టీ20 సిరీస్- షెడ్యూల్: ►తొలి మ్యాచ్- జనవరి 22 ►రెండో మ్యాచ్- జనవరి 23 ►మూడో మ్యాచ్- జనవరి 26 ►నాలుగో మ్యాచ్- జనవరి 29 ►ఐదో మ్యాచ్- జనవరి 30. చదవండి: Kapil Dev: కపిల్‌లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్ గెలుస్తారు! రోహిత్.. ఇంకా కోహ్లి... Justin Langer: మూడు ఫార్మాట్లలో కొనసాగుతా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడమే లక్ష్యం: హెడ్‌కోచ్ -
మేము ఆ పని చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం...
Eoin Morgan Reacts After Semifinal Loss vs New Zealand: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా తొలి సెమిఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి న్యూజిలాండ్ తొలి సారిగా ఫైనల్లో అడుగు పెట్టింది. కాగా ఈ ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ఏమన్నాడంటే.. "ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే మాకు తెలుసు ప్రత్యర్ధి జట్టు అన్ని విధాలుగా పటిష్టంగా ఉందని.. ఈ మ్యాచ్‌లో పూర్తి క్రెడిట్ న్యూజిలాండ్ జట్టుకే ఇవ్వాలి.ఎందుకంటే వాళ్లు మా జట్టుకన్నా బాగా ఆడారు. కివీస్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. వాళ్ల స్పిన్నర్లు కూడా అద్బుతంగా రాణించారు. ఈ టోర్నీలో మేము కూడా చాలా కష్టపడ్డాం. ఆ క్రెడిట్ అంతా మా బాయ్స్‌కు ఇవ్వాలి. ఈ మ్యాచ్‌లో 17వ, 18వ ఓవర్ల వరకు విజయం మావైపే ఉందని అనుకున్నాం. కానీ ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. సాధారణంగా మా జట్టు సిక్స్‌లు బాగా కొట్టగలదు. కానీ ఈ మ్యాచ్‌లో సిక్సర్లు కొట్టడానికి చాలా కష్టపడ్డాము. ప్రత్యర్ధి ముందు మేము మెరుగైన లక్ష్యాన్ని ఉంచాము. కానీ న్యూజిలాండ్ జట్టు మా కన్నా నిలకడగా, ఉత్తమంగా ఆడింది. ముఖ్యంగా జెమ్మీ నీషమ్ అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు" అని మ్యాచ్ అనంతరం మోర్గాన్ పేర్కొన్నాడు. మరో వైపు పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమిఫైనల్ మ్యాచ్ గురువారం(నవంబర్-11) జరగనుంది. చదవండి: Pak Vs Aus: ఆసీస్‌తో సెమీస్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాకులు.. వాళ్లు లేకుండా ఫైనల్ చేరడం కష్టమే?! We’re gutted, but we’re proud. One game will never define us. We’ll keep pushing our boundaries, keep entertaining and keep striving to make more history. In 2022, we will be right there again. pic.twitter.com/Mk37DR8ExH — England Cricket (@englandcricket) November 10, 2021 -
ENG vs NZ: మిచెల్ మెరుపులు.. ఫైనల్‌కు తొలిసారిగా న్యూజిలాండ్
మిచెల్ మెరుపులు.. ఫైనల్‌కు న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఓపెన్ డారెల్ మిచెల్(42 బంతుల్లో 72, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టును తొలిసారి ఫైనల్ చేర్చాడు. కాగా ఓపెనర్ మార్టిన్ గప్టిల్(4), కెప్టెన్ కేన్ విలియమ్సన్(5) తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ తర్వాత వచ్చిన డెవన్ కాన్వే 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో జేమ్స్ నీషమ్ 11 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 27 పరుగులు కొట్టి కివీస్‌ను ఒత్తిడి నుంచి బయటపడేశాడు. ఇక ఓపెనర్ డారెల్ మిచెల్ ఇన్నింగ్స్ ఆధ్యంతం నిలకడైన ఇన్నింగ్స్ కొనసాగించి జట్టును గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లివింగ్‌స్టోన్ చెరో 2 వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ ఒక వికెట్ తీశాడు. ఇక టి20 ప్రపంచకప్‌ల్లో న్యూజిలాండ్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఇక గురువారం పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న సెమీఫైనల్ 2 విజేతతో ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. కాన్వే(46) ఔట్.. న్యూజిలాండ్ 102/3 ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ కాన్వే(46) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. డారిల్ మిచెల్, కాన్వేలిద్దరు కలసి మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. ఈ దశలో కాన్వే లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు యత్నించి స్టంప్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం మిచెల్ 44, ఫిలిప్స్ 1 పరుగుతో ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 27 పరుగులు, డెవన్ కాన్వే 26 పరుగులతో ఆడుతున్నారు. కేన్ విలియమ్సన్(5) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన కివీస్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్(5) ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 12, డెవన్ కాన్వే 14 పరుగులతో ఆడుతున్నారు. గప్టిల్(4) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(4) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో గప్టిల్ మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 1 ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 166/4.. న్యూజిలాండ్ టార్గెట్ 167 న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన డేవిడ్ మలాన్(42) రాణించాడు. మలాన్ ఔటైన అనంతరం వచ్చిన మొయిన్ అలీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అలీ ఓవరాల్‌గా 51 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, ఇష్ సోధీ, ఆడమ్ మిల్నే, నీషమ్ తలా ఒక వికెట్ తీశారు. 16 ఓవర్లలో ఇంగ్లండ్ 119/3 సమయం:20:52.. 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. మొయిన్ అలీ 32, లివింగ్‌స్టోన్ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 42 పరుగులు చేసిన మలాన్ సౌథీ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డేంజర్ మ్యాన్ బట్లర్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సమయం: 20:15.. ఓపెనర్ జాస్ బట్లర్(29) రూపంలో ఇంగ్లండ్ కీలక వికెట్ కోల్పోయింది. ఇష్ సోథీ బౌలింగ్‌లో బట్లర్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. మలన్ 10, మొయిన్ అలీ 2 పరుగులతో ఆడుతున్నారు. కేన్ మామ సూపర్ క్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సమయం: 20:00.. మిల్నే బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్‌కు ఓపెనర్ బెయిర్ స్టో(13) వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. బట్లర్ 29, మలాన్ 5 పరుగుతో ఆడుతున్నారు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ 29/0 సమయం: 19:47.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. బట్లర్ 17, బెయిర్ స్టో 7 పరుగులతో ఆడుతున్నారు. అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ 12 దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన ఇంగ్లండ్ ఫెవరెట్‌గా కనిపిస్తుంది. ఇక గ్రూఫ్-2లో న్యూజిలాండ్ పాకిస్తాన్‌పై ఓటమి మినహా మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. అబుదాబి వేదికగా ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ మాత్రం ఒకదాంట్లో గెలిచి.. మరొకటి ఓడిపోయింది. ఇక ముఖాముఖి పోరులో టి20ల్లో 21సార్లు తలపడగా.. ఇంగ్లండ్ 13సార్లు.. న్యూజిలాండ్ 7 సార్లు గెలిచాయి. ఇక టి20 ప్రపంచకప్‌ల్లో ఐదుసార్లు తలపడగా.. ఇంగ్లండ్ మూడుసార్లు.. న్యూజిలాండ్ రెండుసార్లు విజయం సాధించాయి. ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంలో జాస్ బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అటు న్యూజిలాండ్ బ్యాటింగ్ అంతంతమాత్రంగానే కనిపిస్తుంది. ఇక చివరిసారి ఐసీసీ మేజర్ ఈవెంట్ పరంగా చూస్తే 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ : జోస్ బట్లర్(వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్ -
ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా!
New Zeland May Take Revenge On England For 2019 ODI World Cup Final Loss.. టి20 ప్రపంచకప్-2021 నాకౌట్ పోరుకు వచ్చింది. ఫైనల్ బరిలో నిలిచేందుకు నాలుగు జట్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ముందుగా ‘కప్’ వేటలో నిలిచేదెవరో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో తేలుతుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య ఆసక్తికర సమరానికి అబుదాబి వేదిక కాగా... ఈ సారైనా ప్రపంచకప్ ముచ్చట తీర్చుకోవాలని న్యూజిలాండ్ తహతహలాడుతోంది. ఫైనల్లో ఆడుగుపెట్టేందుకు... ఇంగ్లండ్ అడ్డంకి తొలగించుకునేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ప్రధాన ఆటగాళ్లు జేసన్ రాయ్, టైమల్ మిల్స్ గాయాలతో దూరమవడాన్ని అనుకూలంగా మలచుకోవాలని, గత రెండు పరాజయాలకు గట్టి దెబ్బ కొట్టాలని న్యూజిలాండ్ చూస్తోంది. బట్లర్‌కు జోడీగా బెయిర్‌స్టో కీలక ఆటగాళ్లు గాయాలపాలవడం ఇంగ్లండ్ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. అయితే అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ముందడుగు వేయాలనే నిశ్చయంతో ఉంది. డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ కాలిపిక్క గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఫామ్‌లో ఉన్న బట్లర్‌కు జోడీగా బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. మరోవైపు ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల్లోనే కాదు... గడిచిన 21 టి20 మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్‌దే పైచేయి. పొట్టి పోరులో కివీస్ ఏడు గెలిస్తే, ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. జోరు మీదున్న కివీస్ లీగ్ దశలో ఇంగ్లండ్ అన్నీ గెలిచి ఆఖరి మ్యాచ్‌లో ఓడితే... కివీస్ తొలి మ్యాచ్ ఓడాక మిగతావన్నీ గెలుస్తూ ఆత్మవిశ్వాసంతో ఉంది. పైగా ప్రపంచకప్‌లకు అడ్డంకిగా మారిన ఇంగ్లండ్‌ను దెబ్బతీయాలనే లక్ష్యంతో విలియమ్సన్ బృందం ఉంది. కెప్టెన్ విలియమ్సన్ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ, ఇన్నింగ్స్‌ను కుదుటపరుస్తూ జట్టును నడిపిస్తున్నాడు. ఓపెనింగ్‌లో గప్టిల్, మిచెల్ మెరుపుదాడి చేస్తే ఆఖరి ఓవర్లలో అదరగొట్టేందుకు... తడబడితే ఆదుకునేందుకు ఫిలిప్స్, నీషమ్‌లతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్ తన పేస్ బౌలింగ్‌తో నిప్పులు చెరుగుతున్నాడు. సౌతీ కూడా రాణిస్తున్నాడు. వీరిద్దరు ఇంగ్లండ్ ఆరంభాన్ని చెదరగొడితే కివీస్ పట్టుబిగించడం ఖాయం. చదవండి: Virat Kohli: ఫెయిలయ్యుండొచ్చు.. కానీ కెప్టెన్ అంటే కోహ్లినే ఐసీసీ ఈవెంట్లలో ఇంగ్లండ్ , న్యూజిలాండ్ మద్య మ్యాచ్ అనగానే మొదటగా అందరికి గుర్తుకు వచ్చేది 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్. ఆ ఫైనల్లో ఇరు జట్లు సమానంగా స్కోర్లు చేయడంతో మ్యాచ్ టై అయింది. అలా సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు 15 పరుగులే చేయడంతో మరోసారి టై అయింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించింది. అలా న్యూజిలాండ్‌కు వన్డే వరల్డ్‌కప్‌లో నిరాశే మిగిలింది. తాజాగా టి20 ప్రపంచకప్ 2021లో సెమీస్‌లో మరోసారి ఈ ఇద్దరు తలపడుతుండడంతో కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. పిచ్, వాతావరణం బ్యాటింగ్ పిచ్ ఇది. అఫ్గాన్‌పై భారత్ టోర్నీలోనే అత్యధిక 210/2 స్కోరు ఇక్కడే చేసింది. అందుకేనేమో కివీస్ స్పిన్నర్ సాన్‌ట్నర్ బౌలర్లకు కష్టమే అన్నాడు. వాతావరణంతో ఇబ్బంది లేదు. వాన ముప్పేమీ లేదు. చదవండి: T20 WC 2021: క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్ -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్..
Eoin Morgan Becomes The Most Successful T20I Captain Of All Time: అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ సారధి ఇయాన్ మోర్గాన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిక కెప్టెన్‌గా (43 విజయాలు) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా శ్రీలంకపై గెలుపుతో మోర్గాన్ ఈ ఘనత సాధించాడు. మోర్గాన్‌కు ముందు ఈ రికార్డు(42 విజయాలు) అస్గర్ అఫ్గాన్ (అఫ్గానిస్తాన్), ఎంఎస్ ధోని (భారత్)ల పేరిట సంయుక్తంగా ఉండేది. శ్రీలంకపై ఇంగ్లండ్ గెలుపుతో మోర్గాన్ వారి రికార్డును బద్దలు కొట్టాడు. మోర్గాన్ ఈ ఘనతను సాధించేందుక 69 మ్యాచ్‌లు తీసుకోగా.. ధోని 72, అస్గర్ అఫ్గాన్ 52 మ్యాచ్‌ల్లో సాధించారు. ఇదిలా ఉంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్న మోర్గాన్.. ఇంగ్లండ్ జట్టును 2019 వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్‌ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. చదవండి: Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్.. ఛీ ఇంతకు దిగజారుతారా? -
మ్యాచ్ గెలవడంతో పాటు రికార్డుల మోత మోగించింది
England Breaks Records Vs SL Match T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటవడంతో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ విజయం సాధించడంతో పాటు పలు రికార్డులను బద్దలు కొట్టింది. జాస్ బట్లర్ సెంచరీతో మొదలుకొని.. విజయం సాధించడం వరకు ఇంగ్లండ్ సాధించిన రికార్డులు పరిశీలిద్దాం. చదవండి: టి20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్ ►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక విజయాలు సాధించిక కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ (43 విజయాలు) రికార్డు నెలకొల్పాడు. 42 విజయాలతో అస్గర్ అఫ్గాన్ (అఫ్గానిస్తాన్), ఎమ్మెస్ ధోని (భారత్) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును మోర్గాన్ బద్దలు కొట్టాడు. ►టి20 ప్రపంచకప్‌లలో ఇది 9వ సెంచరీ. బట్లర్‌కు ముందు గేల్ (2 సార్లు), మెకల్లమ్, అహ్మద్ షహజాద్, రైనా, హేల్స్, తమీమ్, జయవర్ధనే ఈ ఘనత సాధించారు. ►అంతర్జాతీయ పురుషుల క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా బట్లర్ రికార్డు సృష్టించాడు. మహిళల విభాగంలో గత ఏడాది హీథెర్ నైట్ ఇంగ్లండ్ తరఫున ఈ ఘనత సాధించింది. ►అంతర్జాతీయ టి20ల్లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన నాలుగో క్రికెటర్ బట్లర్. గతంలో అలెక్స్ హేల్స్ (116 నాటౌట్; శ్రీలంకపై 2014లో), డేవిడ్ మలాన్ (103 నాటౌట్; న్యూజిలాండ్‌పై 2019లో), లివింగ్‌స్టోన్ (103; పాకిస్తాన్‌పై 2021లో) ఈ ఘనత సాధించారు. ►టి20 ప్రపంచకప్‌లోని ఓ మ్యాచ్‌లో అత్యధిక బంతులు ఆడిన బ్యాటర్‌గా జోస్ బట్లర్ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో బట్లర్ 67 బంతులు ఎదుర్కొన్నాడు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ (66 బంతులు; భారత్‌పై 2010లో), మర్లోన్ సామ్యూల్స్ (66 బంతులు; ఇంగ్లండ్‌పై 2016లో) పేరిట సంయుక్తంగా ఉంది. చదవండి: T20 World Cup 2021 IND Vs NZ: కోహ్లి వ్యూహాలను ఏకి పారేసిన గంభీర్