సిక్సర్ల వర్షం కురిపించిన మోర్గాన్ | Eoin Morgan beats seven sixes in T20 match against india | Sakshi
Sakshi News home page

సిక్సర్ల వర్షం కురిపించిన మోర్గాన్

Published Sun, Sep 7 2014 8:55 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

సిక్సర్ల వర్షం కురిపించిన మోర్గాన్

సిక్సర్ల వర్షం కురిపించిన మోర్గాన్

బర్మింగ్‌హామ్: టీమిండియాతో జరుగుతున్న టి20 మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ధోని సేనకు 181 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ విజృభించి ఆడాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 26 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. హేల్స్ 40, రూట్ 26, బొపారా 15, బట్లర్ 10 పరుగులు చేశారు. చివరి 5 ఓవర్లలోనే ఇంగ్లండ్  81 పరుగులు చేయడం విశేషం. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ, కరణ్ శర్మ, జడేజా తలో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement