birmingham
-
అమెరికాలో కాల్పులు.. నలుగురు దుర్మరణం
బిర్మింగ్హమ్: అమెరికాలోని అలబామా రాష్ట్రం బిర్మింగ్‌హమ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా, 18 మంది గాయాలపాలయ్యారు. శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. నగరంలో రెస్టారెంట్లు, బార్లకు నిలయమైన ఫైవ్ పాయింట్స్ సౌత్ ఎంటర్టెయిన్మెంట్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఆ ప్రాంతంలో గుమికూడిన జనం పైకి కొందరు విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్లు గుర్తించామన్నారు. -
2 గర్భసంచులు.. 2 రోజులు..2 ప్రసవాలు
అమెరికా మహిళ అరుదైన రికార్డు అద్భుతాలకే అద్భుతంగా చెప్పదగ్గ ఈ ఉదంతం అమెరికాలో జరిగింది. అలబామాకు చెందిన కెల్సీ హాచర్ అనే 32 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో డిసెంబర్ 19న యూనివర్సిటీ ఆఫ్ అలబామాలోని బర్మింగ్‌హాం ఆస్పత్రి (యూఏబీ)లో చేరింది. 10 గంటల పురిటి నొప్పుల తర్వాత సాధారణ కాన్పులో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ పురిటి నొప్పులు మాత్రం అలాగే కొనసాగాయి. మరో 10 గంటల తర్వాత సిజేరియన్ ద్వారా మరో ఆడపిల్లకు జన్మనిచ్చి అబ్బురపరిచింది. కెల్సీకి రెండు గర్భసంచులుండటం, రెండింట్లోనూ ఒకేసారి గర్భధారణ జరగడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైంది. మహిళల్లో ఇలా రెండు గర్భసంచులుండే ఆస్కారమే కేవలం 0.3 శాతమట! వారిలోనూ రెండింట్లోనూ ఒకేసారి గర్భం ధరించే ఆస్కారమైతే 10 లక్షల్లో ఒక్క వంతు మాత్రమేనట! అరుదైన ఈ జంట అద్భుతాలు రెండూ కలిసి రావడంతో కెల్సీ ఇలా అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది!! తొలి మూడు కాన్పులు సాధారణమే... కెల్సీకి రెండు గర్భసంచులు ఉన్నట్టు 17వ ఏట బయట పడింది. కానీ పెళ్లి తర్వాత తొలి కాన్పుల్లోనూ సాధారణంగా ఒక్కొక్కరే పుట్టారు. ఈసారీ అలాగే జరగనుందని నెల తప్పినప్పుడు కెల్సీ అనుకుందట. ‘‘కానీ అల్ట్రా సౌండ్ చేయిస్తే రెండు గర్భసంచుల్లోనూ పిండాలున్నట్టు తెలిసి చెప్పలేనంత థ్రిల్‌కు లోనయ్యా. అసలలాంటిది సాధ్యమని మొదట నమ్మకమే కుదర్లేదు’’ అని సంబరంగా చెప్పుకొచ్చిందామె! అక్కణ్నుంచి కెల్సీ తన అసాధారణ జంట గర్భధారణ గాథను ఇన్‌స్టాగ్రాంలో రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచి్చంది. చూస్తుండగానే నెలలు నిండటం, ఆస్పత్రిలో చేరడం, వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు పాపాయిలకు జన్మనిచ్చి రికార్డులకెక్కడం చకచకా జరిగిపోయాయి. ఈ అరుదైన కాన్పుల కోసం ఆస్పత్రి డబుల్ ఏర్పాట్లు చేయడం విశేషం! డబుల్ మానిటరింగ్, డబుల్ చారి్టంగ్ మొదలుకుని కాన్పు కోసం రెండింతల సిబ్బందిని నియమించడం దాకా అన్నీ ‘రెట్టింపు స్పీడు’తో జరిగాయి. ఇద్దరు పాపాయిలూ గర్భంలో ఆరోగ్యంగా పెరిగినట్టు కాన్పు చేసిన వైద్య బృందానికి సహ సారథ్యం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిస్ తెలిపారు. ‘‘ఒకే గర్భసంచిలో రెండు పిండాలు పెరిగిన బాపతు సాధారణ గర్భధారణ కాదిది. పిల్లలిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లాట్లలో మాదిరిగా ఎవరి గర్భసంచిలో వారు స్వేచ్ఛగా ఎదిగారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘డిసెంబర్ 19న రాత్రి 7.45 గంటలకు తొలి పాప పుట్టింది. 10 గంటల పై చిలుకు పురిటి నొప్పుల తర్వాత డిసెంబర్ 20న ఉదయం 6.10 గంటలకు సిజేరియన్ చేసి రెండో పాపను బయటికి తీశాం. ఇంతటి అరుదైన ఘటనకు సాక్షులుగా నిలిచామంటూ మా వైద్య బృందమంతా కేరింతలు కొట్టాం’’ అని వివరించారు. పిల్లల బుల్లి రికార్డు...! నవజాత శిశువులు కూడా రికార్డుల విషయంలో తమ తల్లికి ఏ మాత్రమూ తీసిపోలేదు. వేర్వేరు గర్భసంచుల్లో పెరగడమే గాక ఏకంగా వేర్వేరు పుట్టిన రోజులున్న అత్యంత అరుదైన కవలలుగా రికార్డులకెక్కారు. అంతేకాదు, వీరు ఎవరికి వారు వేర్వేరు అండం, వీర్య కణాల ఫలదీకరణ ద్వారా కడుపులో పడటం మరో విశేషం! ఇలాంటి కవలలను ఫ్రాటర్నల్ ట్విన్స్‌గా పిలుస్తారని ప్రొఫెసర్ రిచర్డ్ తెలిపారు. మొత్తానికి రికార్డులు సృష్టించడంలో తల్లికి తీసిపోమని పుట్టీ పుట్టగానే నిరూపించుకున్నారంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు! బంగ్లా మహిళ బంపర్ రికార్డు! ఇలాంటి అరుదైన ‘జంట జననాలు’ అత్యంత అరుదే అయినా అసలు జరగకుండా పోలేదు. 2019లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటన దీన్ని తలదన్నేలా ఉండటం విశేషం! రెండు గర్భసంచుల్లోనూ గర్భం దాలి్చన ఓ మహిళ తొలి కాన్పు తర్వాత ఏకంగా నెల రోజుల తర్వాత రెండో పాపాయికి జన్మనిచ్చిందట! ఆ పురుళ్లు పోసిన వైద్యుడు అప్పట్లో ఈ వింతను బీబీసీతో పంచుకున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రిటన్‌లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!
బ్రిటన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన బర్మింగ్‌హామ్ (Birmingham) దివాలా (bankrupt) తీసింది. స్థానిక సంస్థ అయిన బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ మిలియన్ల పౌండ్ల వార్షిక బడ్జెట్ లోటు కారణంగా దివాలా తీసినట్లు ప్రకటించింది. బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆధీనంలో పాలన సాగిస్తోంది. 100 మందికి పైగా కౌన్సిలర్లతో ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక సంస్థ ఇది. నగదు లోటుతో సంస్థ దివాలా తీసిందని, పౌరుల రక్షణ, ఇతర చట్టబద్ధమైన సేవలను మినహాయించి అన్ని కొత్త ఖర్చులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు సెక్షన్ 114 నోటీసును జారీ చేసింది. సంక్షోభానికి కారణమదే.. "సమాన వేతనాల చెల్లింపు" చేపట్టాల్సి రావడంతో తీవ్ర సంక్షోభం తలెత్తిందని, ఇందు కోసం ఇప్పటిదాక 650 మిలియన్ పౌండ్ల నుంచి 760 మిలియన్ పౌండ్లు ఖర్చు చేశామని, నిధుల లోటుతో భయంకరమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడిందని కౌన్సిల్ పేర్కొంది. ఈ మేరకు కౌన్సిల్ తాత్కాలిక ఫైనాన్స్ డైరెక్టర్ ఫియోనా గ్రీన్వే స్థానిక ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 114(3) కింద ఒక నివేదికను విడుదల చేశారు. 2012లో బర్మింగ్‌హామ్ కౌన్సిల్‌పై కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.1 బిలియన్ల పౌండ్ల సమాన వేతన క్లెయిమ్‌లను చెల్లించింది. ఈ కేసులో యూకే సుప్రీం కోర్ట్ 174 మంది మహిళా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అథారిటీ పరిధిలో పనిచేసే మహిళా టీచింగ్ అసిస్టెంట్లు, క్లీనర్, క్యాటరింగ్ సిబ్బంది, చెత్తను సేకరించేవారు, వీధులు శుభ్రం చేసే కార్మికులు పురుషలతో సమానంగా బోనస్ ఇవ్వాలని కేసు వేశారు. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల మాదిరిగానే, బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ కూడా వయోజన సామాజిక సంరక్షణ డిమాండ్, ఆదాయ తగ్గుదల కారణంగా తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని కౌన్సిల్ నాయకుడు జాన్ కాటన్, డిప్యూటీ లీడర్ షారన్ థాంప్సన్ ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యత అని వివరించారు. -
తొలిటెస్టు ఆసీస్‌దే.. ఇంగ్లండ్‌పై రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం (ఫొటోలు)
-
చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆట ఆఖరిరోజు వరుణుడు అడ్డుపడడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడం మ్యాచ్‌ను ఆ జట్టువైపు తిప్పింది. అయితే చివరి సెషన్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియోన్లు వీరోచిత పోరాటం ఆసీస్‌ను గెలుపు దిశగా నడిపించింది. బజ్‌బాల్ అంటూ దూకుడు మీదున్న ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టి పలు రికార్డులను ఆసీస్ తన పేరిట లిఖించుకుంది. అవేంటో పరిశీలిద్దాం. ► ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో 275 అంతకంటే ఎక్కువ టార్గెట్‌ను చేధించడం ఇది 15వ సారి కాగా.. ఈ ఏడాదే ఐదుసార్లు ఉండడం గమనార్హం ► ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఇది ఐదోసారి. ఇంతకముందు 1948లో హెడ్డింగేలో ఆస్ట్రేలియా 404 పరుగుల టార్గెట్‌ను, 1984లో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ 342 పరుగుల టార్గెట్‌ను, 2017లో హెడ్డింగే వేదికగా వెస్టిండీస్ 322 పరుగుల టార్గెట్‌ను, 2008లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సౌతాఫ్రికా 281 పరుగుల టార్గెట్‌ను చేధించాయి. ► ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్లలో బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 80 పరుగులతో పాటు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. ఇంతకముందు బాబ్ సింప్సన్ నాలుగుసార్లు, జార్జ్ గిఫెన్ రెండుసార్లు, వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, రిచీ బెర్నాడ్, అలెన్ బోర్డర్, పాట్ కమిన్స్ తలా ఒకసారి ఈ ఘనత సాధించారు. ► టెస్టుల్లో చేజింగ్ సందర్భాల్లో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జంటగా పాట్ కమిన్స్-నాథన్ లియోన్ నిలిచారు. ఈ ద్వయం ఇంగ్లండ్‌తో టెస్టులో తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఇక తొలి స్తానంలో 81 పరుగులు - వీవీఎస్ లక్ష్మణ్ & ఇషాంత్ శర్మ (IND) vs AUS, మొహాలి, 2010; 61* పరుగులు - జెఫ్ డుజోన్ & విన్స్టన్ బెంజమిన్ (WI) vs PAK, బ్రిడ్జ్‌టౌన్, 1988; 56* పరుగులు - టిబ్బి కాటర్ & గెర్రీ హాజ్లిట్ (AUS) vs ENG, సిడ్నీ, 1907; 55* పరుగులు - పాట్ కమ్మిన్స్ & నాథన్ లియోన్ (AUS) vs ENG, ఎడ్జ్‌బాస్టన్, 2023 ; 54 పరుగులు - బ్రియాన్ లారా & కర్ట్లీ ఆంబ్రోస్ (WI) vs AUS, బ్రిడ్జ్‌టౌన్, 1999 ఉన్నారు. ► ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో పాట్ కమిన్స్ చోటు సంపాదించాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కమిన్స్ ఐదు సిక్సర్లు కొట్టాడు. ఇంతకముందు రికీ పాంటింగ్ 2005లో న్యూజిలాండ్‌పై ఐదు సిక్సర్లు, ఇయాన్ చాపెల్ 1972లో పాకిస్తాన్‌పై నాలుగు సిక్సర్లు కొట్టాడు. ► యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఆస్ట్రేలియాకు ఇది ఐదోసారి. ఇంతకముందు 404 పరుగుల టార్గెట్‌ను 1948లో హెడ్డింగే వేదికగా, 315 పరుగుల టార్గెట్‌ను అడిలైడ్ వేదికగా 1901-02లో, 286 పరుగుల టార్గెట్‌ను మెల్బోర్న్ వేదికగా 1928-29లో, తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లో(2023లో) 281 పరుగుల టార్గెట్‌ను, 1897-98లో సిడ్నీ వేదికగా 275 పరుగుల టార్గెట్‌ను చేధించింది. ► యాషెస్ చరిత్రలో ఇది ఆరో క్లోజెస్ట్ విజయం. ఇంతకముందు ఇంగ్లండ్ మూడు సందర్భాల్లో ఒక వికెట్ తేడాతో, ఒకసారి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ఆస్ట్రేలియా రెండు సందర్బాల్లో రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చదవండి: బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా?
'బజ్‌బాల్' అంటూ దూకుడు కనబరుస్తున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా ముకుతాడు వేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆటకు ఇవాళ చివరి రోజు కావడంతో ఇంగ్లండ్ విజయానికి ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ విజయానికి 174 పరుగుల దూరంలో ఉంది. అయితే చివరి రోజు బౌలర్లకు అనూకూలంగా ఉంటుందన్న అంశం ఇంగ్లండ్ బౌలర్లకు ఊరటనిచ్చే అంశం. అయితే ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచి చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ పోరాడకుండా మాత్రం ఉండదు. చేయాల్సింది 174 పరుగులే కావడం.. క్రీజులో ఉస్మాన్ ఖవాజా ఉండగా.. ట్రెవిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీలు ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని వీలైనంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు క్లిక్ అయినా ఆసీస్ తొలి టెస్టును కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం చూసుకుంటే ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. 2005 రిపీట్ అవుతుందా? అయితే 2005లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. అప్పట్లో 282 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ 279 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 407 పరుగులు చేయగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు 101 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా ఇంగ్లండ్ 182 పరుగులకే కుప్పకూలింది. దీంతో 281 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ విజయానికి కేవలం రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరిగినప్పటికి చివర్లో షేన్ వార్న్ 42, బ్రెట్ లీ 43 పరుగులు సంచలన ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే ఆండ్రూ ఫ్లింటాఫ్ నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం 2023లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు పరిస్థితి కూడా అచ్చం అదే పరిస్థితిని తలపిస్తుంది. బజ్‌బాల్ మంత్రంతో ఇంగ్లండ్ ఆసీస్ ఆట కట్టిస్తుందా లేక ఆసీస్ ఇంగ్లండ్‌కు షాకిస్తుందా అన్నది చూడాలి. చదవండి: #Ashes2023: ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు.. ఆసీస్‌కు 174 పరుగులు -
బర్మింగ్హమ్ లార్డ్ మేయర్‌గా బ్రిటిష్ ఇండియన్
లండన్: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్ నగర లార్డ్ మేయర్‌గా బ్రిటిష్–ఇండియన్ కౌన్సిలర్ చమన్‌లాల్ ఎన్నికయ్యారు. తద్వారా బర్మింగ్హమ్ తొలి బ్రిటిష్–ఇండియన్ మేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. సిక్కు మతంలోని రవిదాసియా వర్గానికి చెందిన చమన్ లాల్ భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ జిల్లాలోని పఖోవాల్ గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన తండ్రి సర్దార్ హర్నామ్‌సింగ్ బంగా 1954లో ఇంగ్లాండ్‌కు వలస వచ్చారు. బర్మింగ్హమ్లో స్థిరపడ్డారు. చమన్‌లాల్ 1964లో తన తల్లి సర్దార్నీ జై కౌర్‌తో కలిసి ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి బర్మింగ్‌హమ్‌లోనే నివసిస్తున్నారు. చమన్ లాల్ 1971లో విద్యావతిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజకీయాలపై ఆసక్తితో చమన్‌లాల్ 1989లో లేబర్ పార్టీలో చేరారు. అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా జరిగిన సామాజిక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. -
All Eng Open: సంచలనాలకు సెమీస్‌లో ముగింపు..
బర్మింగ్హమ్: ప్రతిష్టాతక్మ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన యువ జంట గాయత్రి పుల్లెల, ట్రెసా జోలీల సంచలన ప్రదర్శన సెమీస్‌లో ముగిసింది. బర్మింగ్హమ్లో శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో కొరియాకు చెందిన బేక్ నా హా, లీ సో హీ జంట చేతిలో 10-21, 10-21తో ఓటమి పాలయ్యారు. 46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తొలి గేమ్‌లో 0-4తో వెనుకబడిన గాయత్రి జోడి ఆ తర్వాత కాస్త ప్రతిఘటించడంతో 9-13కు తగ్గింది. ఆ తర్వాత అదే టెంపోను కొనసాగించడంలో విఫలమైన ఈ జోడి చివరకు రెండు వరుస గేముల్లో ఓడి సెమీస్‌లోనే తమ పోరాటాన్ని ముగించారు. ఒకవేళ ఫైనల్ చేరి ఉంటే మాత్రం ఈ ఇద్దరు చరిత్ర సృష్టించేవారు. కానీ ఏం చేస్తాం మంచి చాన్స్ మిస్ అయింది. #AllEngland2023 #Badminton 🏸 ✅ Defeated world No 8 ✅ Defeated world No 9 ✅ Defeated a rising pair from 🇨🇳 ❌ Lost against one of the most in-form Korean pairs End of a fine week again at All England for Gayatri Gopichand and Treesa Jolly.https://t.co/QruEtFPI0N pic.twitter.com/lGWrccz45d — The Field (@thefield_in) March 18, 2023 చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. హర్మన్ కూడా ఊహించి ఉండదు -
సంచలనం.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి–ట్రెసా జోడీ
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ 2023 ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సంచలనం కొనసాగుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన మాజీ వరల్డ్ నెంబర్‌వన్ జోడి.. మాజీ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్స్ యుకీ ఫుకుషిమా, సయకా హిరోతా జంటపై 21-14, 24-22 తేడాతో స్టన్నింగ్ విక్టరీ అందుకొని క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. 50 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను తొందరగానే గెలుచుకున్న గాయత్రి-టెస్రా జోడి రెండో గేమ్‌ను గెలవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. భారత జోడి 9 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న సమయంలో జపాన్ జంట ఫుంజుకున్నారు. అయితే ఆరవ పాయింట్ దగ్గర గాయత్రి-టెస్రాలు సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. Women on a mission went past WR-9 pair in style 😎🔥 📸: @badmintonphoto #AllEngland2023#IndiaontheRise#Badminton pic.twitter.com/ce4NANZnWN — BAI Media (@BAI_Media) March 16, 2023 ✅ @BAI_Media https://t.co/Iau4RzgK0Y pic.twitter.com/2YlD6gKmKg — 🏆 Yonex All England Badminton Championships 🏆 (@YonexAllEngland) March 16, 2023 -
చెలరేగిన మొయిన్ అలీ.. రెచ్చిపోయిన లివింగ్‌స్టోన్
హండ్రెడ్ లీగ్ 2022లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. సోమవారం ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేయగా.. బర్మింగ్‌హామ్ జట్టు మరో 14 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ మొయిన్ అలీ ఆల్‌రౌండ్ షోతో (1/3; 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు), లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో బర్మింగ్‌హామ్ సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. బర్మింగ్‌హామ్ కోల్పోయిన 3 వికెట్లు లూక్ వుడ్ ఖాతాలో చేరాయి. అంతకుముందు డేనియల్ సామ్స్ (25 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రెగరీ (22 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో ట్రెంట్ రాకెట్స్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆ జట్టులోని భారీ హిట్టర్లు అలెక్స్ హేల్స్ (1), డేవిడ్ మలాన్ (9), మన్రో (11) దారుణంగా నిరాశపరిచారు. బర్మింగ్‌హామ్ బౌలర్ హోవెల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో బర్మింగ్‌హామ్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. ప్రస్తుత ఎడిషన్‌లో తొలి ఓటమి చవిచూసిన ట్రెంట్ రాకెట్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. 4 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన లండన్ స్పిరిట్ ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఓవల్ ఇన్విన్సిబుల్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఆతర్వాతి స్థానంలో నిలిచింది. నార్త్రన్ సూపర్ చార్జర్స్ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), సథరన్ బ్రేవ్ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం), మాంచెస్టర్ ఒరిజినల్స్ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు), వెల్ష్ ఫైర్ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఇంగ్లండ్ యువ బ్యాటర్ విధ్వంసం.. ఫాస్టెస్ సెంచరీ రికార్డు బద్దలు -
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్విమ్మర్.. తొలి పతకం దక్కేనా!
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టాడు. పురుషుల స్విమ్మింగ్ 100 మీ బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్లో ప్రవేశించాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ సెమీఫైనల్ హాట్-2లో రేసును 54.55 సెకన్లలో పూర్తి చేసిన నటరాజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో ప్లేయర్‌గా ఫైనల్లో అడుగుపెట్టిన నటరాజ్ పతకంపై ఆశలు పెంచాడు. ఇక ఫైనల్ రేసు ఆదివారం జరగనుంది. కాగా బెంగళూరుకు చెందిన నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరిన నాలుగో భారత స్విమ్మర్‌గా నిలిచాడు. ఇంతకముందు 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో సందీప్ సెజ్వాల్, విరాద్వాల్ కాదేలు ఫైనల్ చేరగా.. 2018లో సాజన్ ప్రకాశ్ ఫైనల్లో అడుగుపెట్టినప్పటికి పతకాలు సాధించలేకపోయారు. మరి ఈసారైనా నటరాజ్ మెరిసి పతకం తెస్తాడని భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్ ప్రకాశ్ (50 మీ. బటర్‌ఫ్లయ్) హీట్స్‌లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్ (400 మీటర్ల ఫ్రీస్టయిల్) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు. చదవండి: Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం
బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత స్క్వాష్ క్రీడాకారిణి అనహత్ సింగ్ సంచనలనం నమోదు చేసింది. భారత్ నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన అనహత్ సింగ్ తొలి రౌండ్‌ను దిగ్విజయంగా ముగించింది. రౌండ్ ఆఫ్ 64.. స్క్వాష్ గేమ్‌లో భాగంగా మహిళల సింగిల్స్ మ్యాచ్ జరగ్గా.. సెయింట్ విన్సెంటి అండ్ గ్రెనడైన్స్కి చెందిన జాడా రాస్‌ను ఓడించిన అనహత్ సింగ్ రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన అనహత్ జాడా రాస్‌ను 11-5,11-2,11-0తో వరుస గేమ్‌ల్లో ఓడించింది. తొలి రౌండ్ గేమ్‌లో జాడా రాస్ ఐదు పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికి.. ఏ మాత్రం తడబడని అనహత్.. ఆ తర్వాత ఆధిక్యంలోకి వెళ్లడమే గాక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుసగా మూడు గేమ్స్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక రౌండ్ ఆఫ్ 32లో అనహత్ సింగ్.. వేల్స్‌కు చెందిన ఎమిలి విట్లాక్తో తలపడనుంది. చదవండి: Commonwealth Games 2022: బ్యాడ్మింటన్, టీటీలో జోరు -
CWG 2022: అంగరంగ వైభవంగా.. కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభోత్సవం (ఫోటోలు)
-
బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్
-
డోపింగ్‌లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలకు వారం రోజుల ముందు బర్మింగ్‌హామ్‌కు అర్హత సంపాదించిన స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఇద్దరు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. 37 మంది సభ్యుల అథ్లెట్ల బృందం నుంచి తప్పించారు. 100 మీ. పరుగు, 4x100 మీ. రిలే పరుగుకు అర్హత సంపాదించిన ధనలక్ష్మి నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) మేలో, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) జూన్‌లో నమూనాలు సేకరించింది. ఈ రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది. రిలే బృందం నుంచి ఆమెను తప్పించి ఎం.వి.జిల్నాను ఎంపిక చేశారు. గత నెలలో జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఐశ్వర్య 14.14 మీటర్ల జంప్‌తో జాతీయ రికార్డుతో స్వర్ణం గెలిచింది. ఆ సమయంలోనే ఆమె నమూనాలను సేకరించిన ‘నాడా’ పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. -
ఆత్మ విశ్వాసంతో ఆడండి..!!
-
Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు!
Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు ఆటగాళ్లు సమాయత్తమవుతున్నారు. జూలై 28 నుంచి ఆగష్టు 8 వరకు ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్లు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లతో కలిసి గ్రూప్ ‘ఏ’లో ఉన్నాయి ఈ రెండు జట్లు. ఈ క్రమంలో మొదట ఆసీస్‌తో తలపడనున్న హర్మన్‌ప్రీత్ సేన.. రెండో మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. పాక్ జట్టు బార్బడోస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మరి భారత్- పాక్ మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు కదా! జట్లు ఏవైనా దాయాదుల పోరు ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్-2022లో మహిళా జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? లైవ్‌స్ట్రీమింగ్, జట్లు తదితర అంశాలు తెలుసుకుందాం! భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్: ►తేది: జూలై 31, 2022 ►సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆరంభం ►వేదిక: ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్, ఇంగ్లండ్ ►ప్రసారాలు: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా సప్న భాటియా(వికెట్ కీపర్), యస్తిక భాటియా , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక ఠాకూర్, జెమీమా రోడ్రిగెస్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా. స్టాండ్ బై ప్లేయర్లు: సిమ్రన్ దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్ పాకిస్తాన్ జట్టు: బిస్మా మరూఫ్(కెప్టెన్), ముబీనా అలీ(వికెట్ కీపర్), ఆనమ్ అమిన్, ఐమన్ అన్వర్, డయానా బేగ్, నిదా దర్, గుల్ ఫిరోజా(వికెట్ కీపర్), తుబా హసన్, కైనట్ ఇంతియాజ్, సాదియా ఇక్బాల్, ఈరమ్ జావేద్, అయేషా నసీమ్, అలియా రియాజ్, ఫాతిమా సనా, ఒమైమా సొహైల్. కాగా వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 107 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా దాయాది జట్టుపై వరుసగా 11వ సారి గెలుపొంది సత్తా చాటింది. చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్ కెప్టెన్ Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని -
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో వేర్వేరుగా వసతి!
న్యూఢిల్లీ: గత కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య వేదికలకు భిన్నంగా ఈ సారి బర్మింగ్‌హామ్‌లో బస ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఏదైనా మెగా ఈవెంట్ జరిగితే ఒక క్రీడా గ్రామాన్ని నిర్మించి అందులో అందరికి వసతి ఏర్పాట్లు చేసేవారు. కానీ ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో ఒక దేశానికి చెందిన అథ్లెట్ల బృందం ఒకే చోట ఉండటం కుదరదు. కరోనా తదితర కారణాలతో ఆర్గనైజింగ్ కమిటీ మొత్తం 5000 పైచిలుకు అథ్లెట్ల కోసం బర్మింగ్‌హామ్‌లో ఐదు క్రీడా గ్రామాల్ని అందుబాటులోకి తెచ్చింది. 16 క్రీడాంశాల్లో పోటీపడే 215 మంది భారత అథ్లెట్లు ఇప్పుడు ఈ ఐదు వేర్వేరు క్రీడా గ్రామాల్లో బసచేయాల్సి ఉంటుంది. కోచ్‌లు, అధికారులు కలుపుకుంటే భారత్‌నుంచి 325 మంది బర్మింగ్‌హామ్ ఫ్లయిట్ ఎక్కనున్నారు. బస ఏర్పాట్లు, ఇతరత్రా సదుపాయాల వివరాలను ఆర్గనైజింగ్ కమిటీ భారత ఒలింపిక్ సంఘాని (ఐఓఏ)కి సమాచార మిచ్చింది. ఈ నెల 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రతిష్టాత్మక పోటీలు జరుగనున్నాయి. -
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు.. టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్
బర్మింగహమ్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్ సహా ఉపఖండం అభిమానుల కొరకు మ్యాచ్‌ను అరగంట ముందుగా ప్రారంభించనున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి జూలై 1న టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు భారత కాలామాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకి( ఇంగ్లండ్ లోకల్ టైం ఉదయం 11 గంటలు) ప్రారంభం కావాల్సి ఉంది. తాజాగా ఈసీబీ మ్యాచ్ సమయాన్ని అరగంట ముందుకు మార్చింది. దీని ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు(లోకల్ టైం ఉదయం 10:30 గంటలు) ప్రారంభమై రాత్రి 10 లేదా 10:30 గంటల వరకు జరగనుంది. ఐదు రోజుల పాటు జరగనున్న టెస్టు మ్యాచ్‌లో రోజు 90 ఓవర్లు ఆట సాధ్యమయ్యేలా ఈసీబీ ప్రణాళికలు రచించిందిఇక టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జూలై 7, 9,10 తేదీల్లో మూడు టి20లు.. ఆ తర్వాత జూలై 12,14, 17వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. కాగా రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆదివారం ఉదయం బీసీసీఐ ట్విటర్లో తెలిపింది. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన రోహిత్.. ఆర్‌టీపీసీఆర్‌లోనే పాజిటివ్ వస్తే వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి వస్తుంది. దీంతో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పంత్ లేదా కోహ్లి, రహానేలలో ఎవరో ఒకరు తుది జట్టును నడిపించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: రోహిత్ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్ కాదనుకుంటే రహానే? IND vs LEIC: షమీని ఎదుర్కోలేక జట్టు మారిన పుజారా.. -
‘కామన్వెల్త్’కు జ్యోతి
న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 37 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే బృందం వివరాలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరుసగా రెండో సారి కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగుతున్నాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో నీరజ్ స్వర్ణం సాధించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి తొలిసారి సీడబ్ల్యూజీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల వరుసగా మూడు జాతీయ రికార్డులతో జ్యోతి అద్భుత ఫామ్‌లో ఉంది. అన్నింటికి మించి హైజంప్‌లో జాతీయ రికార్డు సాధించడంతో పాటు సులువుగా క్వాలిఫయింగ్ మార్క్‌ను అందుకున్న తేజస్విన్ శం కర్ను ఏఎఫ్ఐ ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గత వారమే అతను యూఎస్‌లో ఎన్సీఏఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో 2.27 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం సాధించాడు. నిబంధనల ప్రకారం ఇటీవల చెన్నైలో జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో తేజస్విన్ పాల్గొని ఉండాల్సి ఉందని... అతను ఈ ఈవెంట్‌కు దూరంగా ఉండేందుకు కనీసం తమనుంచి అనుమతి తీసుకోకపోవడం వల్లే పక్కన పెట్టామని ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సమరివాలా స్పష్టం చేశారు. -
క్వార్టర్ ఫైనల్లో సానియా జంట
రోత్సె క్లాసిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట శుభారంభం చేసింది. బర్మింగ్హమ్లో సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా–లూసీ హర్డెస్కా ద్వయం 7–5, 6–2తో అలీసియా బార్నెట్–ఒలీవియా నికోల్స్ (బ్రిటన్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. చదవండి: World Youth Weightlifting Championship: భళా గురు... -
ఇండియన్ రెస్టారెంట్లో జానీ డెప్ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు
ప్రముఖ హాలీవుడ్ స్టార్ జానీ డెప్ తన మాజీ భార్యపై విజయం సాధించడంతో ఫుల్ ఖుషి ఉన్నాడు. గృహ హింస, పరువు నష్టం దావా కేసు కోర్టు ఆయనకు అనుకులంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తున్న జానీ డేప్ వరుసగా యూకేలోని మ్యూజిక్ కన్సర్ట్స్కు హజరవుతున్నాడు. ఈ క్రమంలో గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో కలిసి బ్రిటన్‌లో బర్మింగ్‌హెమ్‌లో దర్శనమిచ్చాడు. ఆదివారం సాయంత్రం అక్కడి ఇండియన్ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్న జానీ డెప్ రెస్టారెంట్‌కు అయిదు అంకెల బిల్లు కట్టి షాకిచ్చాడు. చదవండి: ఆ ముసలోడి కంటే నేనే నయం: నటికి పెళ్లి ప్రపోజల్ దీంతో జానీ కట్టిన బిల్లు న్యూయార్క్ పత్రికల్లో కథనంగా ప్రచురితమైంది. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. కాగా బర్మింగ్‌హోమ్‌లోని ‘వారణాసి’ రెస్టారెంట్లో జానీ డెప్ ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి కర్రీపార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో భారతీయ వంటకాలు, కాక్టెయిల్స్, రోజీ ‘ఆంపైయిన్ వంటివి ఏర్పాటు చేశారు. అక్కడి ఇండియన్ డిషెస్ టేస్ట్ చేసిన జానీ డెప్ వాటికి ఫిదా అయ్యాడట. దీంతో రెస్టారెంట్ వెయిటర్స్‌ని మెచ్చుకుంటూ వారితో కలిసి ఫొటోలు దిగాడు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించిన జానీ చివరగా 50 వేల పౌండ్ల బిల్లు కట్టాడు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల 49 లక్షల రూపాయలు. చదవండి: రీఎంట్రీకి సిద్ధమవుతున్న కాజల్ అగర్వాల్? దీంతో రెస్టారెంట్ యాజమాన్యం ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని మహమ్మద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం సమయంలో తనకు ఫోన్ వచ్చిందని, జానీ డెప్ తమ రెస్టారెంట్లో డిన్నర్‌కు వస్తున్నట్లు చెప్పారన్నాడు. మొదట జోక్ అనుకున్నానని, ఆ తర్వాత ఆయన భద్రత దృష్ట్యా మొదట సిబ్బంది రెస్టారెంట్ అంతా తనిఖి చేశారని చెప్పాడు. దీంతో నిజమని నమ్మనన్నాడు. ఇక ఈ విందులో శిష్ కబాబ్, చికెన్ టిక్కా, పనీర్ టిక్కా, మసాలా, ట్యాంబ్ కరాహీ, కింగ్ తందూరీ ప్రాన్స్ వంటి వంటకాలు వడ్డించినట్లు తెలిపాడు. కాగా ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో అతిపెద్ద రెస్టారెంట్స్‌లో ఇండియన్ ‘వారణాసి’ రెస్టారెంట్ ఒకటి. -
24 ఏళ్ల తర్వాత క్రికెట్ రీ ఎంట్రీ.. అయితే..?
Cricket Returns To Commonwealth Games: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కామన్వెల్త్ క్రీడల్లోకి క్రికెట్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌లో బర్మింగ్హమ్(ఇంగ్లండ్) వేదికగా జరిగే 22వ ఎడిషన్‌లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం లభించింది. అయితే, ఈ సారికి కేవలం మహిళల క్రికట్‌కు మాత్రమే అనుమతి ఇచ్చింది కామన్వెల్త్ క్రీడల సమాఖ్య(సీజీఎఫ్). టీ20 ఫార్మాట్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో సాగే ఈ గేమ్స్‌లో మొత్తం 8 జట్లు(భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, బార్బడోస్, సౌతాఫ్రికా, శ్రీలంక) పాల్గొనేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. జులై 29న భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో ప్రారంభమయ్యే ఈ క్రీడలు.. ఆగస్ట్ 7న జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్‌తో ముగుస్తాయి. ఈ మేరకు ఐసీసీ, సీజీఎఫ్ మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాగా, 1998(మలేషియా)లో చివరిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు(50 ఓవర్ల ఫార్మాట్) ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. నాడు షాన్ పొలాక్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా పురుషుల జట్టు స్టీవ్ వా సారధ్యంలోని ఆస్ట్రేలియాపై విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. ఇదిలా ఉంటే, 72 దేశాలకు చెందిన 4500 అథ్లెట్లు జులై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటారు. చదవండి: IPL 2022 Auction: వేలంలో పాల్గొనబోయే యువ భారత చిచ్చరపిడుగులు వీళ్లే.. -
Commonwealth Games: తప్పనిసరి క్రీడాంశాలుగా ఆ రెండు!
Commonwealth Games: 2026- 2030 Roadmap(London): భవిష్యత్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) 2026–2030కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను జనరల్ అసెంబ్లీలో అమోదించింది. దీని ప్రకారం 2026 నుంచి జరిగే సీడబ్ల్యూజీలో క్రీడాంశాల సంఖ్య తగ్గనుంది. వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 20 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. 2026 నుంచి క్రీడాంశాల సంఖ్య 15కు తగ్గనుంది. వీటిలో అథ్లెటిక్స్, అక్వాటిక్స్ (స్విమ్మింగ్) మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఇక మిగిలిన క్రీడాంశాలను కొనసాగించే నిర్ణయాన్ని ఆతిథ్య దేశానికి తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఆప్షనల్ గ్రూప్‌లో ఉన్న క్రికెట్, 3x3 బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్‌లను కోర్ గ్రూప్‌లోకి మారుస్తూ సీజీఎఫ్ తీర్మానించింది. కాగా గేమ్స్ నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజీఎఫ్ అధ్యక్షురాలు డెమె లూసీ మార్టిన్ తెలిపారు. తాజా మార్పులతో గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశాలకు లబ్ధి జరగనుంది. తాము ఏ క్రీడాంశాల్లో పతకాలను ఎక్కువగా గెలవగలమో వాటికి ఆ దేశాలు పెద్ద పీట వేస్తాయి. 2026 కామన్వెల్త్ గేమ్స్ వేదిక ఇంకా ఖరారు కాలేదు. చదవండి: Gautam Gambhir: 'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు -
సినీ ఫక్కీలో స్టార్ హీరో కారు చోరీ
హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూజ్‌కు చెందిన ఓ లగ్జరీ కారు సినీ ఫక్కీలో చోరీకి గురైంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కారును పక్కా స్కెచ్‌తో అవలీలగా ఎత్తుకెళ్లిపోయారు. దాదాపు కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఆ బీఎండబ్ల్యూ కారును.. చివరికి ఎలాగోలా ట్రేస్ చేయగలిగిన పోలీసులు. కానీ.. కారులో విలువైన లగేజీ, కొంత డబ్బును మాత్రం ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం బర్మింగ్హమ్(ఇంగ్లండ్)లో మిషన్ ఇంపాజిబుల్ ఏడో పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఓ లగ్జరీ హోటల్లో సినిమా యూనిట్ బస చేసింది. అయితే కారు బయట పార్కింగ్ చేసిన కాస్ట్లీ కారును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. చాలా తెలివిగా.. మోడ్రన్ డే కారులు కీలెస్గా, ఇగ్నిషన్ ఫోబ్స్తో వస్తున్నాయి. ఇది దొంగలకు అనుకూలంగా మారుతోంది. వైర్లెస్ ట్రాన్స్మీటర్లను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇదే తీరులో టామ్ క్రూజ్ కారు చోరీకి గురైంది. కారుకు దగ్గరగా నిలబడ్డ దొంగలు.. ఫ్రీక్వెన్సీ మీటర్ల ద్వారా ఫోబ్ సిగ్నల్‌ను క్యాప్చర్ చేయగలిగారు. అదే టైంలో ఒరిజినల్ ఫోబ్‌ను రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పని చేయకుండా చేశారు. అటుపై దర్జాగా కారును వేసుకుని వెళ్లిపోయారు. కారు చోరీకి గురైందని గుర్తించిన టామ్ క్రూజ్ బాడీగార్డులు.. పోలీసులకు సమాచారం అందించారు. ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా ట్రేస్ చేసి.. స్మెత్విక్ విలేజ్‌లో కారును గుర్తించారు. అయితే కారు దొరికినప్పటికీ.. అందులో లగేజీ, కొంత డబ్బు మాయమైనట్లు తెలుస్తోంది. దాదాపు లక్ష పౌండ్లు విలువ(మన కరెన్సీలో కోటి రూపాయలు) చేసే బీఎండబ్ల్యూ ఎక్స్7.. 4.4 లీటర్ V8 ఇంజిన్, 523 హార్స్ పవర్ ఇంజిన్, నాలుగు సెకన్లలో 96 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకునే సామర్థ్యం ఉంది. టాప్ స్పీడ్ 249 కిలోమీటర్లు. ఇక కరోనా కారణంగా ఆలస్యమవుతూ వస్తున్న.. MI-7 వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. -
బర్మింగ్‌హామ్‌లో ‘బెస్టాఫ్ లక్’
సాక్షి,హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరం 22వ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు ఈ పోటీలు జరుగుతాయి. మెగా ఈవెంట్‌కు మరో సంవత్సరం ఉన్న నేపథ్యంలో ‘కౌంట్‌డౌన్’గా హైదరాబాద్‌లోని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషన్ భారత క్రీడాకారులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ తదితరులతో పాటు వచ్చే క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉన్న వర్ధమాన అథ్లెట్లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ... క్రీడల నిర్వహణ కోసం ఇంగ్లండ్ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు, బరి్మంగ్‌హామ్ నగర విశిష్టతల గురిం చి వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యం లో సీడబ్ల్యూజీ–2022లో పాల్గొని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు అంకితా రైనా పరాజయం సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ప్లేయర్ అంకితా రైనాకు అర్హత పోరులోనే నిరాశ ఎదురైంది. హోరాహోరీగా తన సమ ఉజ్జీలాంటి ప్రత్యర్థితో సాగిన పోరులో చివరకు ప్రపంచ 193వ ర్యాంకర్ అంకితకు ఓటమి తప్పలేదు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ఆమె అమెరికాకు చెందిన ప్రపంచ 194వ ర్యాంకర్ జేమీ లోయబ్ చేతిలో 3–6, 6–2, 4–6 తేడాతో ఓటమిపాలైంది. -
లివింగ్‌స్టోన్ ఊచకోత.. 10 సిక్సర్లు, 3 ఫోర్లతో 92 నాటౌట్
లండన్: ద హండ్రెడ్ లీగ్‌లో భాగంగా నార్తర్న్ సూపర్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కెప్టెన్, ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ పెను విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 92 పరుగులు సాధించి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ క్రమంలో అతను ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అంతకుముందు బంతితోనూ(20 బంతుల్లో 3/25) దుమ్ముదులిపిన ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్.. ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ లిన్(25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కోహ్లర్(44 బంతుల్లో 71; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) శుభారంభాన్ని అందించారు. వీరు మినహా జట్టు సభ్యులంతా విఫలం కావడంతో సూపర్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఫీనిక్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విల్ స్మీడ్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అయితే అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లివింగ్‌స్టోన్ వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి న్యూజిలాండ్ యువ ఓపెనర్ ఫిన్ అలెన్(26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి 51 బంతుల్లో 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఫీనిక్స్ జట్టు కేవలం 74 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని గ్రాండ్‌గా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక, మరో సెమీఫైనల్ మ్యాచ్ ఆగష్టు 19న(గురువారం) సదరన్ బ్రేవ్స్, ట్రెంట్ రాకెట్స్ మధ్య జరగనుంది. చదవండి: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన సిరాజ్, కేఎల్ రాహుల్ -
కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్.. షెడ్యూల్ ప్రకటించిన నిర్వహకులు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో మహిళల టీ20 క్రికెట్ అరంగేట్రం చేయనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను నిర్వహకులు మంగళవారం ప్రకటించారు. ఈ పోటీలను జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తం ఎనిమిది జట్లు గ్రూప్‌లుగా విడిపోయి, ఆగస్టు 4 వరకు మ్యాచ్‌లు ఆడతాయని, ఆగస్టు 6న సెమీస్ పోరు ఉంటుందని తెలిపారు. కాంస్య పతకానికి సంబంధించిన మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌ను ఆగస్టు 7న నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 1 నాటికి ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ఈ పోటీలకు అర్హత సాధిస్తాయని, మిగిలిన రెండు బెర్త్‌ల కోసం అర్హత పోటీలు నిర్వహించనున్నామని నిర్వహకులు వివరించారు. ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత మహిళల జట్టు మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం లభించడం ఇది తొలిసారేమీ కాదు. 1998 కౌలాలంపూర్‌లో జరిగిన క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు తొలిసారిగా పాల్గొంది. అయితే ఆ తర్వాత వివిధ కారణాల చేత సీడబ్యూజీలో క్రికెట్‌కు ప్రాతినిధ్యం దక్కలేదు. తిరిగి 24 ఏళ్ల తర్వాత ఈ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. చదవండి: Cricket History: మూడేళ్ల కిందట ఇవాల్టి రోజున ఏం జరిగిందంటే..? -
ఇంగ్లండ్‌కు షాకిచ్చిన కివీస్.. 21 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం
బర్మింగ్‌హామ్: ఆతిధ్య ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ను అతికష్టం మీద డ్రా చేసుకోగలిగిన ఇంగ్లండ్.. రెండో టెస్ట్‌లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తేడాతో కైవసం చేసుకున్న పర్యాటక జట్టు.. 21 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో రోరీ బర్న్స్(81), లారెన్స్(81 నాటౌట్) రాణించడంతో 303 పరగులు స్కోర్ చేసింది. బౌల్ట్‌కు 4, హెన్రీ 3, అజాజ్ పటేల్ 2, వాగ్నర్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం కాన్వే(80), యంగ్(82), రాస్ టేలర్(80) అర్ధసెంచరీలతో రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు 4 వికెట్లు దక్కాయి. అయితే ఆతర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మ్యాట్ హెన్రీ(3/36), వాగ్నర్ (3/18), బౌల్ట్ (2/34) ధాటికి ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 122కే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్(29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ గెలుపుకు .. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 85 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి 38 పరగులు అవసరమైంది. ఈ లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇంగ్లండ బౌలర్లు బ్రాడ్, స్టోన్‌కు తలో వికెట్ దక్కగా, ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు మ్యాట్ హెన్రీకి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు డెవాన్ కాన్వే, ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్‌కు సంయుక్తంగా దక్కింది. చదవండి: శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్ -
కేన్ విలియమ్సన్ మోచేతికి గాయం.. కివీస్‌లో కలవరం
బర్మింగ్హమ్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు ఆఖరిరోజు అతని ఎడమ మోచేతికి గాయం అయింది. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి గాయం తీవ్రత పెద్దగా లేదని.. రెండ్రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తెలిపాడు. కానీ కేన్ గాయం కివీస్‌ను కలవరానికి గురిచేస్తుంది. గాయం తీవ్రత ఎక్కువగా లేకున్నా.. టీమిండియాతో మరో 9 రోజుల్లో ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో విలియమ్సన్కు గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటని కివీస్ ఆలోచనలో పడింది. ఇదే విషయమై కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పందించాడు.'' కేన్ మోచేతి గాయంలో పెద్దగా తీవ్రత లేదు. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు కేన్ ఆడుతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు. అతని పరిస్థితి గమనించి నిర్ణయం తీసుకుంటాం. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంకా తొమ్మిది రోజులు సమయం ఉండడంతో విలియమ్సన్కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ సమయానికి అతను పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగుతాడు. ఇక తొలి మ్యాచ్‌లో ఆడిన మిచెల్ సాంట్నర్ ఎడమ చూపుడువేలుకు గాయం కావడంతో రెండో టెస్టు ఆడడం లేదు.. అతని స్థానంలో బౌల్ట్ తుది జట్టులోకి రానున్నాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన నమోదు చేసినా.. వర్షం అంతరాయంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కివీస్ ఓపెనర్ డెవన్ కాన్వే సూపర్ సెంచరీ సాధించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు తన సత్తా ఏంటో చూపించాడు. అయితే కేన్ విలియమ్సన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13, రెండో ఇన్నింగ్స్‌లో సింగిల్ రన్‌కే అవుటయ్యాడు. కాగా కేన్ రెండుసార్లు జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరగడం విశేషం. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూన్ 10న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మొదలుకానుంది. ఇక ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా, కివీస్‌ల మధ్య జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. చదవండి: WTC Final : లెజెండ్‌తో నేను సిద్ధంగా ఉన్నా WTC: 13 ఏళ్ల క్రితం సెమీస్‌లో.. ఇప్పుడు ఫైనల్లో -
Shafali Verma: ‘హండ్రెడ్’లో షఫాలీ
న్యూఢిల్లీ: భారత టీనేజ్ బ్యాటర్ షఫాలీ వర్మకు అరుదైన అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో తొలి సారి నిర్వహించనున్న ‘హండ్రెడ్’ టోర్నీలో ఆమె పాల్గొననుంది. బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టుకు షఫాలీ ప్రాతినిధ్యం వహిస్తుంది. న్యూజిలాండ్ దిగ్గజం సోఫీ డివైన్ స్థానంలో చివరి నిమిషంలో ఆమెకు అవకాశం దక్కింది. బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మలకు బీసీసీఐ ఎన్ఓసీ మంజూరు చేసింది. భారత్‌నుంచి నాలుగో ప్లేయర్‌గా షఫాలీ బరిలోకి దిగనుంది. ప్రస్తుతం ఐసీసీ టి20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న ఈ హరియాణా అమ్మాయికి ఆస్ట్రేలియాలో జరిగే ఉమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో కూడా ఆడేందుకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. భారత్ తరఫున 22 టి20లు ఆడిన షఫాలీ...148.31 స్ట్రైక్‌రేట్‌తో 617 పరుగులు చేసింది. -
తొలి రోజు నుంచే మహిళల క్రికెట్
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల టి20 క్రికెట్ తొలి రోజే ప్రేక్షకులను అలరించనుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగే ఈ పోటీల నిర్వాహక కమిటీ తాజాగా ప్రకటించిన షెడ్యూల్లో పోటీల తొలి రోజైన 2022 జూలై 29న మహిళల క్రికెట్ మొదలవుతుంది. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 11 రోజులపాటు ఆగస్టు 8 వరకు జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం 19 అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. పోటీలు గతంలో ప్రకటించినట్లుగా జూలై 28న కాకుండా ఒకరోజు ఆలస్యంగా జూలై 29న ప్రారంభం కానున్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఒకే ఒకసారి క్రికెట్ భాగంగా ఉంది. 1998లో మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన క్రీడల్లో వన్డే ఫార్మాట్లో జట్లు పోటీ పడ్డాయి. దక్షిణాఫ్రికా స్వర్ణం గెలుచుకోగా...ఈ పోటీలకు ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్‌లుగా కాకుండా... దేశవాళీ వన్డే హోదా మాత్రమే ఇచ్చింది. -
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్... ఇలా మళ్లీ మొదలైంది..!
మాంచెస్టర్: కరోనా విరామం తర్వాత ఎట్టకేలకు ఒక ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ మళ్లీ వచ్చింది. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా బుధవారం ఇంగ్లీష్ ప్రీమియర్ పోటీలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, స్టార్ ఆటగాళ్లు ఉన్న లీగ్ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ లీగ్‌లో మార్చి 8న చివరి మ్యాచ్ జరిగింది. పునఃప్రారంభంలో బర్మింగ్‌హామ్‌లో జరిగిన పోరులో ఆస్టన్ విల్లాతో షెఫీల్డ్ యునైటెడ్ తలపడింది. కోవిడ్–19కు సంబంధించిన అన్ని నిబంధనలను మైదానాల్లో పాటిస్తూ మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు ఇంగ్లండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో అడుగడుగునా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా ఇదంతా కొత్తగా కనిపించింది. ఈ స్వీయ నియంత్రణ నిబంధనలు ఐపీఎల్ జరిపేందుకు బీసీసీఐకిదారి చూపిస్తున్నట్లుగానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే... ► ఆటగాళ్లు, సిబ్బంది, సెక్యూరిటీ అంతా కలిపి మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో 300 మందికి మించి ఉండరాదు ► స్టేడియంను రెడ్, అంబర్, గ్రీన్ జోన్లతో విభజించారు. మ్యాచ్ జరిగే చోటు, డ్రెస్సింగ్ రూమ్, టెక్నికల్ ఏరియా రెడ్‌జోన్‌లో ఉంటాయి. మ్యాచ్‌కు కనీసం ఐదు రోజుల ముందు జరిగిన కోవిడ్ టెస్టులో నెగెటివ్‌గా వచ్చినవారినే రెడ్ జోన్లోకి అనుమతిస్తారు. ► మ్యాచ్ ఆడే బంతి, గోల్‌పోస్ట్, డగౌట్లు, కార్నర్ పోల్స్, ఫ్లాగ్స్, సబ్స్టిట్యూషన్ బోర్డులు మొత్తం శానిటైజ్ చేస్తారు. ► 20 క్లబ్‌లకు చెందిన ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి వారంలో రెండు సార్లు కరోనా టెస్టులు చేస్తారు. ఎవరైనా పాజిటివ్‌గా తేలితే సెల్ఫ్ ఐసోలేషన్‌కు పంపిస్తారు. జట్టు మొత్తాన్ని క్వారంటైన్ చేయరు. కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న తరహాలోనే అన్ని ఏర్పాట్లతో ఇద్దరు వైద్యులు మైదానంలో ఉంటారు. ► మైదానంలో ఉమ్మడం, ముక్కు శుభ్రం చేసుకోవడం నిషేధం. గోల్ చేసినప్పుడు కూడా ఆటగాళ్లు దూరం పాటించాలి. షేక్హ్యాండ్లు చేయరాదు. ప్లేయర్లు మాస్క్ ధరించనవసరం లేదు. ► బాల్ బాయ్స్ ఉండరు. మైదానంలోనే అన్ని వైపుల అదనపు బంతులు పెడతారు. ఆటగాళ్లే వెళ్లి తీసుకోవాలి. ముగ్గురికి బదులు ఐదుగురు సబ్స్టిట్యూట్లను అనుమతిస్తారు. ► రెండు అర్ధ భాగాల్లోనూ ఒక్కో నిమిషం చొప్పున మాత్రమే డ్రింక్స్ బ్రేక్ ఇస్తారు. ఆటగాళ్లు ఎవరి బాటిల్లో నీళ్లు వారే తెచ్చుకొనితాగాలి. -
చికెన్‌లో మత్తు పదార్థాలు పెట్టి..
బర్మింగ్హమ్ : మిలియన్ డాలర్ల విలువైన మత్తు పదార్థాలను చికెన్‌లో పెట్టి సరాఫరా చేస్తున్న ఇద్దరు ప్రవాస భారతీయులను బర్మింగ్హమ్ పోలీసులు అరెస్టు చేశారు. మంజిందర్ సింగ్ థాఖర్ , దేవిందర్ సింగ్ థాఖర్‌లు శుక్రవారం నెదర్లాండ్స్ నుంచి వచ్చిన చికెన్ షిప్మెంట్లో మత్తు పదార్థాలు తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి 5 యూరో మిలియన్ డాలర్ల విలువ గల హెరాయిన్, కొకైన్లను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ వివరాల ప్రకారం.. ఈ ముఠాకు వసీమ్ హుస్సేన్, నజరత్ హుస్సేన్‌లు నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. బర్మింగ్హమ్ క్రౌన్ కోర్టు 44 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో ప్రసుత్తం వీరిద్దరు జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. కాగా, వీరు జైలు నుంచే ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు తెలిసింది. జూన్ 2016 లో మొదలైన వీరి వ్యాపారం తర్వాత కొన్ని గ్రూపులుగా విడిపోయి దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, వీరు తమ దందాను కొనసాగించేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకునేవారు. అందుకోసం నమ్మకస్తులైన షిప్పింగ్ కంపెనీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంటారు. చికెన్ వ్యాపారం పేరుతో ఇన్నర్‌గా మత్తు పదార్థాలను సరఫరా చేసేవారు. ప్రధానంగా నెదర్లాండ్స్ లోని రోటర్‌డామ్ షిప్పింగ్ కేంద్రం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లే వాటిని ఎంపిక చేసుకొని అక్కడి నుంచి కావలసిన వారికి డ్రగ్స్‌ను సరఫరా చేసేవారు. అయితే ఈ షిప్మెంట్ ఏర్పాట్లను నజరత్ హుస్సేన్ ఓవైపు చూసుకుంటునే నెదర్లాండ్స్‌లో తనకు సహకరిస్తున్న వారిని గుట్టు చప్పుడు కాకుండా కలిసేవారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చికెన్ షిప్‌మెంట్స్‌ను తరలిస్తున్న మంజిందర్, దేవిందర్‌లపై బర్మింగ్హమ్ ట్యాక్సీ డ్రైవర్ అద్నాన్ మాలిక్‌కు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసుల వీరిద్దరి కదలికలను గమనించి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, థకార్ సోదరులకు జనవరి 20న శిక్షను విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. -
సచిన్, కోహ్లిలను దాటేశాడు..
బర్మింగ్హమ్ : బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమైన ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్టులో స్మిత్(144) భారీ సెంచరీ సాధించడంతో ఆసీస్ 284 పరుగులు చేసింది. ఆసీస్ 122 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్న సమయంలో స్మిత్ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ 118 ఇన్నింగ్స్‌ల్లోనే 24 సెంచరీలు పూర్తి చేశాడు. ఫలితంగా తక్కుjవ ఇన్నింగ్స్‌ల్లో 24 సెంచరీలు పూర్తి చేసుకున్న రెండో క్రికెటర్‌గా స్మిత్ నిలిచాడు. ఈ క్రమంలోనే సచిన్, విరాట్ కోహ్లిలను స్మిత్ అధిగమించాడు. సచిన్ 123 ఇన్నింగ్స్‌ల్లో 24వ టెస్టు సెంచరీ మార్కును చేరగా, దీన్ని అందుకోవడానికి కోహ్లి 125 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కాగా, ఆసీస్ దిగ్గజ బాట్స్మన్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 66 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా టెస్టుల్లో 24 సెంచరీలు పూర్తి చేసి గ్రెయిగ్ చాపెల్, వివ్ రిచర్డ్స్, మహ్మద్ యూసఫ్ సరసన నిలిచాడు. ఓవరాల్ యాషెస్ సిరీస్ వేదికలో ఇప్పటివరకు స్టీవ్ స్మిత్ 42 ఇన్నింగ్స్‌లో 60 సగటుతో 9 సెంచరీలు నమోదు చేశాడు. -
షూటింగ్ లేకుంటే... 2022 కామన్వెల్త్ గేమ్స్‌ను బహిష్కరిద్దాం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో జరుగనున్న కామన్వెల్త్ క్రీడల జాబితా నుంచి షూటింగ్‌ను తప్పిస్తే... తాము ఏకంగా ఈ మెగా ఈవెంట్‌ను బహిష్కరిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) హెచ్చరిక జారీ చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు సత్వరమే సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా శనివారం లేఖ రాశారు. గత నెలలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో రాబోయే కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్‌ను తొలగించి, మరో మూడు కొత్త క్రీడలను చేర్చాలని కామన్వెల్త్ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్) ప్రతిపాదన తెచ్చింది. ఇదే జరిగితే... పతకాల పరంగా భారత్‌కు పెద్ద దెబ్బే అవుతుంది. పట్టికలోనూ కిందకు పడిపోతుంది. ఈ 2018 గోల్డ్‌కోస్ట్ క్రీడల్లో మన దేశం 66 పతకాలు సాధించగా, అందులో 16 షూటింగ్లో వచ్చినవే. నేపథ్యంలో తమ నిరసనగా సెప్టెంబరులో రువాండాలో జరుగనున్న సీజీఎఫ్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేది లేదని ఐఓఏ తేల్చిచెప్పింది. సమాఖ్య రీజనల్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా, స్పోర్ట్స్ కమిటీ సభ్యత్వానికి నామ్‌దేవ్ షిర్గాంకర్ వేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంది. ‘ఇలాంటి అసంబద్ధ ఆలోచనలపై మా నిరసనను తీవ్రంగా వ్యక్తం చేయదల్చుకున్నాం. మేం ఇంకా బ్రిటిష్ పాలనలో లేమని వారు తెలుసుకోవాలి. భారత్ ఏ క్రీడలో పట్టు సాధిస్తే అందులో నిబంధనలు మార్చడమో, మరో అడ్డంకి సృష్టించడమో చేస్తున్నారు. ఈసారి మాత్రం వాటిని ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాం’ అని బాత్రా తెలిపారు. -
‘మరీ ఇంత సింపుల్గానా.. గ్రేట్’
లండన్: మీడియా హడావుడి లేదు. అభిమానుల తాకిడి లేదు. ఒంటరిగా.. ప్రశాంతంగా, ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా సాధారణ రైలు ప్రయాణం చేశాడు ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్. ప్రపంచకప్ సెమీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం బర్మింగ్‌హామ్‌కు మోర్గాన్ సాధారణ వ్యక్తిలా చేరుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఫీవర్ పీక్‌స్థాయిలో ఉండగా అందులోనూ ఇంగ్లండ్‌ను సెమీస్‌కు చేర్చిన సారథి అంత సింపుల్‌గా ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం మోర్గాన్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్ చేస్తున్నారు. ‘మరీ ఇంత సింపుల్గానా.. గ్రేట్’, ‘ఇంగ్లండ్‌కు తొలిసారి కప్ అందించే సారథిని ఎవరూ గుర్తుపట్టలేదా..చిత్రంగా ఉందే?’, ‘మోర్గాన్ సారథ్యంలో ఇంగ్లండ్ తలరాతే మారిపోయింది.. కానీ గుర్తింపే రాలేదు’అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇక గతంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లి కూడా తనకు ప్రైవేట్‌గా బతకడమంటేనే ఇష్టమని పేర్కొన్నాడు. భారత్‌లో సెలబ్రిటీగా జీవించడం చాలా కష్టమని.. ఎక్కువ ఫ్రీడమ్ ఉండదన్నాడు. అందుకే వీలుచిక్కినప్పుడల్లా అనుష్కతో కలిసి విదేశాలకు పయనమవుతానని వివరించాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. ఫైనల్లో ఆతిథ్య జట్టు గెలిస్తే ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ అందించిన తొలి సారథిగా మోర్గాన్ రికార్డు సృష్టిస్తాడు. -
దినేశ్ కార్తీక్ ఇన్.. జాదవ్ ఔట్
బర్మింగ్‌హామ్: ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తొలి ఓటమి.. విజయ్ శంకర్ గాయం.. ఓపెనర్ రాహుల్ ఫిట్‌నెస్‌పై ఆందోళన నేపథ్యంలో భారత జట్టు ఒకరోజు వ్యవధిలోనే మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. సెమీఫైనల్లో ప్రవేశానికి మరో మ్యాచ్ దూరంలో ఉన్న టీమిండియా మంగళవారం బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరోమాట లేకుండా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. భారత్ తుది జట్టులో భువనేశ్వర్ కుమార్ తిరిగి చోటు దక్కించుకోగా, కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఇక దినేశ్ కార్తీక్ కూడా భారత్ ఎలెవన్ జట్టులో చోటు సంపాదించాడు. కేదార్ జాదవ్‌ను తప్పించి దినేశ్ కార్తీక్‌కు అవకాశం కల్పించారు. టీమిండియా ప్రస్తుతం 11 పాయింట్లతో ఉంది. అటు బంగ్లా ఏడు పాయింట్లతో ఉంది. ఈ జట్టు నాకౌట్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌తో పాటు పాక్‌పైనా నెగ్గాలి. కాబట్టి తమ శాయశక్తులా పోరాటానికి సిద్ధమవుతోంది. మరొకవైపు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకోవడంతో పాటు బ్యాట్స్‌మెన్ నుంచి కూడా ఆశించిన ప్రదర్శన కనబడలేదు. దాంతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. సీనియర్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్పైనే బంగ్లా సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతూ 476 పరుగులు, 10 వికెట్లతో అతడు అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. భారత్‌పై అతడి జోరుపైనే జట్టు ఫలితం ఆధారపడి ఉంది. అలాగే ముష్ఫికర్ రహీమ్ కూడా ఓ శతకం, రెండు హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ కూడా రాణించగలిగితే జట్టు భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. ఒక్క బౌలింగ్‌లోనే ఈ జట్టు చాలా వీక్‌గా కనిపిస్తోంది. పేస్‌లో ముస్తాఫిజుర్, స్పిన్‌లో షకీబల్ మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇరు జట్లు ముఖాముఖి పోరులో 35 వన్డేల్లో తలపడగా భారత్ 29 మ్యాచ్‌ల్లో గెలవగా, బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. వరల్డ్‌కప్ ముఖాముఖి పోరులో ఇరు జట్లు ఆడిన మ్యాచ్‌లు మూడు కాగా భారత్ రెండు గెలిచింది. మరొకదాంట్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. భారత్ విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, బుమ్రా, చహల్ బంగ్లాదేశ్ మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, లిటాన్ దాస్, మొసదెక్ హుస్సేన్, షబ్బీర్ రహ్మాన్, మహ్మద్ సైఫుద్దీన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్ -
బర్మింగ్‌హామ్ వన్డేలో ఇంగ్లండ్ హిట్టింగ్
-
దుమ్మురేపుతున్న ఇంగ్లండ్
బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ దుమ్మురేపుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆది నుంచి ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్ స్టోలు బౌండరీలే లక్ష్యంగా చెలరేగి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలను అవలీలగా సాధించారు. ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడుకు ఆ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. ఇదే జోరు కడవరూ కొనసాగితే ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించడం ఖాయం. మరొకవైపు ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని జోడిగా జేసన్ రాయ్-బెయిర్ స్టోలు నిలిచారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు వరకూ ఏ జట్టు కూడా భారత్‌పై వంద పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని సాధించలేదు. ఇప్పటివరకూ ఆసీస్ జోడి డేవిడ్ వార్నర్-అరోన్ ఫించ్‌లు చేసిన 61 పరుగులే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కాగా, దాన్ని ఇంగ్లండ్ సవరించింది. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచ్చుకున్న ఇంగ్లండ్
-
రిషభ్ పంత్ వచ్చేశాడు..
బర్మింగ్‌హామ్: వరల్డ్‌కప్‌లోలో ఓటమనేదే లేకుండా దూసుకెళుతున్న భారత్ మరో విజయంపై కన్నేసింది. ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడుతున్న భారత్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అదే జరిగితే ఈ మ్యాచ్‌తోనే టీమిండియా సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకుంటుంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ఉన్న భారత్ ప్రస్తుతం 11 పాయింట్లతో ఉంది. కివీస్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఆసీస్ ఇప్పటికే 12 పాయింట్లతో సెమీ్‌సకు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈనేపథ్యంలో సూపర్ సండే మ్యాచ్‌లో పటిష్ఠ ఇంగ్లండ్‌ను భారత్ ఎదుర్కొనబోతోంది. జట్టులోని బలహీనతలను సరిచేసుకుంటూ ఈ మ్యాచ్‌లో పంజా విసరాలని చూస్తోంది. అయితే నేటి పోరు ప్రధానంగా ఆతిథ్య జట్టుకే చాలా ముఖ్యమైనది. మిగిలిన ఈ రెండు మ్యాచ్‌ల్లో మోర్గాన్ సేన చావో రేవో తేల్చుకోవాల్సిందే. అందుకే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ జారవిడుచుకోకూడదనే కసితో ఉంది. అటు భారత్ కూడా తమ శక్తిమేరా ఆడాల్సి ఉంటుంది. ఈ ప్రపంచక్‌పలో ఏ జట్టయినా 500 చేయగలదంటే అది ఇంగ్లండ్ మాత్రమే. టోర్నీ ఆరంభానికి ముందు అందరికీ ఉన్న అంచనాలివి. కానీ ఎవరూ ఊహించని విధంగా మూడు ఓటములతో ఇంగ్లండ్‌కు గెలిస్తేనే సెమీస్ రేసులో నిలిచే స్థితి నెలకొంది. తొలి టైటిల్‌ను సాధించే క్రమంలో సొంత గడ్డపై టోర్నీ నల్లేరుపై నడకే అనుకుంటే పాక్, శ్రీలంక, ఆసీస్ ఇచ్చిన షాక్‌లతో దిమ్మతిరిగింది. ఇంత ఒత్తిడిలో బరిలోకి దిగబోతున్న ఆతిథ్య జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక తమ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ జట్టులో చేరడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బలం పెరిగింది. ఇక భారత్ తుది జట్టులో యువ క్రికెటర్ రిషభ్ పంత్‌కు చోటు దక్కింది. విజయ్ శంకర్‌ను తప్పించిన యాజమాన్యం.. రిషభ్ పంత్‌కు అవకాశం కల్పించింది. ఇది రిషభ్‌కు తొలి వరల్డ్‌కప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరో మాట లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. తుది జట్లు ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేసన్ రాయ్, బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, ప్లంకెట్, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్ భారత్ విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, చహల్, బుమ్రా -
విరాట్ కోహ్లి కాచుకో..!
బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌లు అత్యంత కీలకం. దీనిలో భాగంగా ఆదివారం వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్‌తో ఇంగ్లండ్ తలపడుతోంది. ఆ జట్టు సెమీస్ రేసులో ఉండాలంటే భారత్‌తో మ్యాచ్‌లో విజయం చాలా అవసరం. అదే సమయంలో ఇంగ్లండ్‌పై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ఇరు జట్లు వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ప్రధానంగా కోహ్లిని తొందరగా ఔట్ చేస్తే భారత్ జట్టును కట్టడి చేసినట్లేనని ఇంగ్లండ్ యోచిస్తోంది. కోహ్లి ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకుంటే అతన్ని ఆపడం కష్టమనే భావనలో ఇంగ్లండ్ ఉంది. కాగా, కోహ్లిని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్‌కు పంపుతానని ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కోహ్లి కాచుకో అంటూ సవాల్ విసురుతున్నాడు. ‘భారత్‌కు పరుగుల యంత్రంగా మారిపోయాడు కోహ్లి. అతను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో మనకు తెలుసు. అయినప్పటికీ కోహ్లిని త్వరగానే ఔట్ చేస్తా. కోహ్లిని ఔట్ చేయడం కోసమే నేను ఇక్కడ ఉన్నా’ అంటూ మొయిన్ అలీ పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లి ఆరుసార్లు మొయిన్ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దాంతోనే కోహ్లి వికెట్‌ను సాధిస్తానంటూ మొయిన్ అలీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరొకవైపు ఈ మెగా టోర్నీలో కోహ్లి ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలు సాధించి జోరు మీద ఉన్నాడు. ఇక స్వదేశంలో వరల్డ్‌కప్ జరుగుతున్న సందర్భంలో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి ఉంటుందన్నదనే విషయాన్ని తాను అంగీకరించడం లేదన్నాడు. ‘ ఈ వరల్డ్‌కప్‌లో మాపై ఎంత అంచనాలు ఉన్నాయో.. అంతే అంచనాలు భారత్ జట్టుపై కూడా ఉన్నాయి. మనం విజయం సాధించిన సందర్భంలో ప్రశంసలు.. అపజయాలు పాలైనప్పుడు విమర్శలు ఎవరికైనా సహజం’ అని తమపై వచ్చిన విమర్శలపై అలీ తిప్పికొట్టాడు. -
భారత క్రికెటర్ల హోటల్ రూమ్ వద్ద కలకలం!
బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలు సాధిస్తూ మంచి జోరు మీద ఉన్న భారత క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్‌పైనే గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని యోచిస్తోంది. కాగా, మ్యాచ్‌కు ముందు ఓ ఘటన భారత క్రికెటర్లను ఆందోళన పరిచింది. బర్మింగ్‌హామ్‌లో భారత క్రికెటర్లు బస చేసిన హోటల్ రూమ్ వద్ద కలకలం రేగింది. ఆటగాళ్ల రూమ్‌కు అత్యంత సమీపంలోని హ్యాట్ రెజెన్సీలోకి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి అందర్నీ టెన్షన్ పెట్టారు. టెలీగ్రాఫ్ కథన ప్రకారం శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు ప్రైవసీని భగ్నం చేసేలా ఆ ముగ్గురు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారు. ఆటగాళ్ల గదుల దగ్గర తిరుగుతూ, వాళ్ల కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా తీశారు. దీనిపై ఆగ్రహించిన ఆటగాళ్లు మేనేజ్మెంట్కు విషయం తెలపగా.. హోటల్ యాజమాన్యాన్ని మేనేజ్మెంట్ నిలదీసింది. ముగ్గురు అతిథులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని యాజమాన్యం పేర్కొంది. హోటల్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఐసీసీ అదనంగా ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కూడా ఉండగా ఆ ముగ్గరు ఇలా ప్రవర్తించడం ఆందోళన రేకెత్తించింది. -
‘అతడు మరో కోహ్లి అవడం ఖాయం’
బర్మింగ్హమ్ : పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్‌పై ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ ప్రశంసల జల్లు కురిపించాడు. బాబర్ తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే త్వరలోనే టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లిని అధిగమించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ సమిష్టిగా రాణించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే సెంచరీ సాధించి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించిన అజమ్‌ను గ్రాంట్ ఫ్లవర్ ఆకాశానికి ఎత్తాడు. 'బాబర్ మంచి టెక్నిక్‌తో పరుగులు సాధిస్తున్నాడని కొనియాడాడు. అతను ఇప్పుడు తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరిన్ని ఆడితే రాబోయే రోజుల్లో అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. అతడు తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే త్వరలోనే కోహ్లిని మించి పోతాడని' పేర్కొన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 68 ఇన్నింగ్స్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా బాబర్ అజమ్ రికార్డు సాధించాడు. విరాట్‌కు 75 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా అతని కంటే ఏడు తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా(57 ఇన్నింగ్స్‌లు) మొదటి స్థానంలో ఉన్నాడు. -
ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు
బర్మింగ్హమ్ : ప్రపంచకప్‌లో భాగంగా నేడు మరో ఆసక్తికర మ్యాచ్‌కు ఎడ్జ్‌బాస్టన్ వేదిక కానుంది . పాకిస్తాన్‌తో తలపడనున్న న్యూజీలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకుంది. ఇరు జట్లు ఏ మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. నేడు జరిగే మ్యాచ్ పాకిస్తాన్‌కు కీలకంగా మారింది. న్యూజీలాండ్‌పై గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటి దారి పట్టాల్సిందే. ఇక వరుజ విజయాలతో దూసుకెళ్తున్న కివీస్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాలని ఆశిస్తోంది. -
ఐఓఏ ఏకపక్ష నిర్ణయం తీసుకోదు
న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ (2022) నుంచి భారత్ వైదొలగే నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఏకపక్షంగా తీసుకోజాలదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. భారత్‌కు పతకాలు తెచ్చే షూటింగ్ క్రీడను ఈ గేమ్స్ నుంచి తప్పించాలని ఆతిథ్య దేశం నిర్ణయించింది. దీంతో ఐఓఏ తీవ్రంగా స్పందించింది. అదేగనక ఇంగ్లండ్ తుది నిర్ణయమైతే ఆ టోర్నీలో పాల్గొనకుండా బాయ్‌కాట్ చేసే ఆలోచన ఉందని ఐఓఏ ఇటీవల ప్రకటించింది. దీనిపై క్రీడల మంత్రి రిజిజు స్పందిస్తూ ‘ప్రస్తుత పరిణామాలపై నాకేమీ తెలియదు. షూటింగ్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ)తో పాటు, ఐఓఏతో చర్చిస్తాను. బాయ్‌కాట్ చేయాలనుకుంటే ముందుగా ప్రభుత్వ నిర్ణయమేంటో తెలుసుకోవాలి. దేశ ప్రతిష్టకు, ఆటగాళ్ల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి కీలకమైన నిర్ణయాల్ని ఏ ఒక్కరు ఏకపక్షంగా తీసుకోవడానికి వీల్లేదు’ అని అన్నారు. 2032 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం ఐఓఏ గతేడాది ప్రాథమిక ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌ను సమర్పించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్లకు ఆతిథ్యమివ్వాలని ప్రతి దేశానికి ఉంటుందని... అయితే అందుకు అత్యున్నత సదుపాయాలు, సన్నద్ధత, సామర్థ్యంపై బేరీజు వేసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. మహిళల హాకీ జట్టుకు అభినందనలు... ఎఫ్ఐహెచ్ మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో టైటిల్ గెలిచిన భారత జట్టును అభినందించిన క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఒలింపిక్ క్వాలిఫయింగ్ కోసం అన్ని విధాల అండదండలు అందజేస్తామని చెప్పారు. జట్లకు, క్రీడాకారులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ ఏడాది మహిళల జట్టు ఒలింపిక్ క్వాలిఫయింగ్‌లో తలపడనుంది. ఒకటికి మించి సమాఖ్యలు పుట్టుకొచ్చిన క్రీడా సమాఖ్యలు భారత క్రీడాకారుల భవిష్యత్తును కాలరాస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ), జిమ్నాస్టిక్స్ సమాఖ్య (జీఎఫ్ఐ)ల తీరుపై ప్రేక్షకపాత్ర వహించబోమని చెప్పారు. -
వచ్చే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్
బర్మింగ్‌హామ్: మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే దిశగా ఓ అడుగు పడింది. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా నిర్వహించే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌నూ ఓ అంశంగా చేరుస్తూ కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత నవంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్‌ను పరిశీలించి ఆమోదించింది. ‘ఇది మహిళా క్రికెట్ విశ్వవ్యాప్తం కావడానికి, మహిళా సాధికారత సాధనకు లభించిన గొప్ప అవకాశం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌ను ఓ క్రీడాంశంగా చేర్చారు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. తర్వాత మరెప్పుడూ క్రికెట్ ఇందులో భాగం కాలేదు. -
చేదు అనుభవం; ఎయిర్‌లైన్స్ క్షమాపణలు!
బ్రిటన్‌కు చెందిన థామస్ కుక్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించాలనుకున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె వస్త్రధారణపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎయిర్‌లైన్స్ స్టాఫ్.. డ్రెస్ మార్చుకోకపోతే విమానం నుంచి దింపేస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. చివరకు సదరు మహిళ కజిన్ జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే తాను ఎదుర్కొన్న అనుభవం గురించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. థామస్ కుక్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. అసలేం జరిగిందంటే... ఎమిలీ ఓ కన్నార్ అనే మహిళ మార్చి 2న బర్మింగ్‌హామ్ నుంచి కెనరీ ఐలాండ్స్కు వెళ్లేందుకు థామస్ కుక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కింది. అయితే పై ఆమె ధరించిన డ్రెస్‌పై... స్టాఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోయర్ నెక్ ఉన్న క్రాప్టాప్పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని లేదంటే లగేజ్‌తో సహా విమానం దిగాలని పేర్కొన్నారు. అయితే అందుకు ఎమిలీ నిరాకరించడంతో బలవంతంగా విమానం దింపేందుకు యత్నించారు. ఈ క్రమంలో తన డ్రెస్ కారణంగా ఎవరికైనా ఇబ్బందిగా ఉందా అంటూ ఎమిలీ అడగటంతో.. ఓ వ్యక్తి.. ‘నోరు మూసుకుని వాళ్లు చెప్పింది చెయ్యి’ అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె కజిన్ జోక్యం చేసుకుని తన జాకెట్‌ను ఎమిలీకి ఇవ్వడంతో సీట్లో కూర్చుకునేందుకు ఆమెకు అనుమతినిచ్చారు. కాగా తనకు ఎదురైన అనుభవం గురించి ట్విటర్లో రాసుకొచ్చిన ఎమిలీ.. ‘చాలా దారుణంగా వ్యవహరించారు. నా జీవితంలో అత్యంత చెత్త ఘటన ఇది’ అని పేర్కొంది. ‘నన్ను అన్నారు సరే మరి నా వెనుకాల ఉన్న ఓ వ్యక్తి కేవలం షార్ట్ మాత్రమే ధరించి అసభ్యంగా ప్రవరిస్తున్నా అతడిని ఎవరూ ఏమీ అనలేదు’ అని వాపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘ కన్నార్ను క్షమాపణ కోరుతున్నాం. మేము అందరినీ సమానంగా చూస్తాం. లింగ వివక్షకు మా ఎయిర్‌లైన్స్‌లో ఎంతమాత్రం తావులేదు’ అంటూ థామస్ కుక్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా తమ డైరెక్టర్ ఎమిలీని వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పినట్లు పేర్కొంది. అయితే మనోభావాలను దెబ్బతీసే నినాదాలు, ఫొటోలు కలిగి ఉన్న దుస్తులు ధరిస్తే మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. Flying from Bham to Tenerife, Thomas Cook told me that they were going to remove me from the flight if I didn’t “cover up” as I was “causing offence” and was “inappropriate”. They had 4 flight staff around me to get my luggage to take me off the plane. pic.twitter.com/r28nvSYaoY — Emily O'Connor (@emroseoconnor) March 12, 2019 -
దొంగతనం జరిగినట్టు ఫోన్ కాల్ : వెళ్లి చూస్తే అవాక్కు
లండన్ : బ్యాంక్‌లో దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. సిబ్బందిని తీసుకుని హాడావుడిగా వెళ్లిన పోలీసులకు అక్కడ జరుగుతున్న తంతు చూసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. కారణం దొంగతనం జరిగిందని భావించిన పోలీసులకు బ్యాంక్ సిబ్బంది దొంగాపోలీస్(హైడ్ అండ్ సీక్) ఆట ఆడుతూ కనిపించి షాక్ ఇచ్చారు. ఈ సంఘటన బర్మింగ్‌హామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాట్‌వెస్ట్ బ్యాంక్ అధికారులు సిబ్బందిలో ఉత్సాహం పెంచడం కోసం సరదగా దొంగాపోలీస్ ఆట ఆడిపించారు. ఆటలో భాగంగా సిబ్బంది కాస్తా అలారమ్ మోగించారు. ఇది విన్న ఓ స్థానికుడు బ్యాంక్‌లో దొంగతనం జరిగిందని భావించి పోలీసులకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదరబాదరగా బ్యాంక్ వద్దకు వచ్చారు. దొంగతనం గురించి ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన గురించి పోలీసు అధికారి ఒకరు తన ట్విటర్లో తెలియజేశారు. అంతేకాక తమకు ఫోన్ చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. -
బ్యాట్స్‌మన్ మైండ్ బ్లాక్ అయ్యింది.. వైరల్
లండన్ : ఓవైపు భారత్, ఇంగ్లండ్ జాతీయ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్నా మరోవైపు ఇంగ్లండ్ దేశవాలీ ట్వంటీ20 లీగ్ క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచుతోంది. అయితే ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో లంకషైర్ లైట్నింగ్ టీమ్‌పై 7 వికెట్ల తేడాతో బర్మింగ్‌హామ్ బియర్స్ గెలుపొందింది. తద్వారా క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బర్మింగ్‌హామ్ బియర్స్ బౌలర్ జోస్ పోయెస్‌డెన్ వేసిన ఓ బంతి టోర్నమెంట్లో సూపర్ బాల్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 10వ ఓవర్ బౌలింగ్ చేసిన పోయెస్‌డెన్ ఆ ఓవర్ చివరి బంతికి తన లెగ్ స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. గింగిరాలు తిరుగుతూ వికెట్ల వైపు దూసుకెళ్లిన బంతిని లంకషైర్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ క్రాఫ్ట్ అంచనా వేయలేకపోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి ఎలా వికెట్లవైపుగా వెళ్లిందో అర్థంకాక క్రాఫ్ట్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో లంకషైర్ 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. 102 పరుగులకు లంకషైర్ ఆలౌట్ కాగా, ఛేదనలో బర్మింగ్‌హామ్ ఆటగాళ్లు ఇయాన్ బెల్(34), ఎడ్ పొలాక్(36)లు 68 పరుగుల కీలక భాగస్వామ్యంతో 7 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. విజేత బర్మింగ్హామ టీమ్ క్వార్టర్స్ ఆశలు సజీవంగా నిలుపుకోగా, ఈ మ్యాచ్‌లో ఓడిన లంకషైర్ ఇదివరకే క్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే. -
బ్యాట్స్‌మెన్ మైండ్ బ్లాక్ అయ్యింది..
-
బర్మింగ్‌హామ్‌లో కలుద్దాం!
గోల్డ్‌కోస్ట్: లక్షల మంది ప్రేక్షకుల్ని మురిపించిన వేడుక, వేలమంది అథ్లెట్లను మెరిపించిన ఆటల పండుగ ముగిసింది. 12 రోజుల పాటు గోల్డ్ కోస్ట్ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్గేమ్స్ ఆద్యంతం అలరించాయి. ఆసీస్ వాసులు ఆరంభం నుంచి గేమ్స్‌కు బ్రహ్మరథం పట్టారు. విజేతలకు జేజేలు పలికి క్రీడాస్ఫూర్తిని చాటారు. గేమ్స్‌కు ముందు అట్టహాసంగా ప్రారంభమైన వేడుకల్లో ఆసీస్ చరిత్రను, సంప్రదాయాన్ని ఆవిష్కరిస్తే... ముగింపు వేడుకల్లో ఘనమైన పార్టీతో వీడ్కోలు పలికారు. బాణాసంచా వెలుగులు, మిరుమిట్లు గొలిపే కాంతులు స్టేడియాన్ని వర్ణరంజితం చేశాయి. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్ పతాకాన్ని 2022 గేమ్స్‌కు ఆతిథ్యమివ్వనున్న బర్మింగ్‌హామ్ (ఇంగ్లండ్) అధికారులకు అందజేశారు. ముగింపు వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు తమ తమ జాతీయ జెండాలతో, పతకాలు గెలిచిన విజయగర్వంతో మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. భారత బృందానికి బాక్సర్ మేరీకోమ్ నేతృత్వం వహించింది. -
అక్కడికి డైరెక్ట్ విమానం
న్యూఢిల్లీ: అమృత్సర్–బర్మింగ్‌హామ్ మధ్య ఎయిరిండియా నాన్‌స్టాప్ విమాన సర్వీసులు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సేవలు 8 ఏళ్ల క్రితం నిలిచిపోయాయి. తాజాగా సేవల పునరుద్ధరణతో ఇకపై బోయింగ్ 787 విమానం వారానికి రెండుసార్లు(మంగళవారం, గురువారం) ఈ మార్గంలో నడుస్తుంది. పంజాబ్, యూకే మధ్య నేరుగా విమాన సర్వీసులు నిర్వహిస్తోంది తామేనని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. అమృత్సర్ నుంచి తొలి విమానాన్ని విమానయాన మంత్రి విజయ్ సాంప్లా, ఎంపీలు గుర్జీత్ సింగ్, శ్వాయిత్ మాలిక్‌లు ప్రారంభించారు. -
బర్మింగ్‌హామ్‌లో 2022 కామన్వెల్త్ గేమ్స్
లండన్: తదుపరి కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)కు ఆతిథ్యమిచ్చే వేదిక ఖరారైంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరం 2022 ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. ఈ మేరకు సీడబ్ల్యూజీ సమాఖ్య అధ్యక్షుడు లూయిస్ మార్టిన్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. నిజానికి 2022కు సంబంధించి 2015లోనే డర్బన్‌కు ఆతిథ్య హక్కులు కట్టబెట్టారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో మరో వేదికను ఎంపిక చేయాల్సివచ్చింది. 2022 సంవత్సరం జూలై 27 నుంచి 7 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్ బడ్జెట్ 14 వేల కోట్లు (1.845 బిలియన్ యూరోలు)గా నిర్వాహకులు అంచనా వేశారు. దీంతో గ్రేట్ బ్రిటన్‌లో మరో నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా మారనుంది. మాంచెస్టర్ (2002 కామన్వెల్త్), లండన్ (2012 ఒలింపిక్స్), గ్లాస్గో (2014 కామన్వెల్త్) ఇప్పటికే మెగా ఈవెంట్స్‌కు వేదికలుగా నిలిచాయి. -
బర్మింగ్‌హామ్‌లో ఘనంగా జయతే కూచిపూడి
-
యూకేలో ఘనంగా 'జయతే కూచిపూడి 2017'
లండన్ : యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ఆధ్యరంలో 'జయతే కూచిపూడి 2017' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యూకే - ఇండియా కల్చర్ ఆఫ్ ది ఇయర్లో భాగంగా యూకేలోని బర్మింగ్‌హామ్‌లోని ప్రముఖ బాలాజీ దేవస్థానంలో ఈ వేడుకలు జరిగాయి. భారత దేశం నుంచి వచ్చిన డా.జ్వాలా శ్రీకళ బృందం ఇచ్చిన అన్నమాచార్య కీర్తన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. సుమారు 500లకి పైగా భారతీయ ప్రేక్షకులు పాల్గొని భారతదేశ కూచిపూడి నాట్య ప్రదర్శనలను చూసి సంతోషించారు. ఈ బృందం యునైటెడ్ కింగ్డమ్లో మాంచెస్టర్, బ్రాడ్ఫోర్డ్, లండన్ నగరాలలో ఈనెల ప్రదర్శనలు చేయనున్నారు. డా. కనగరత్నం, బాలాజీ దేవస్థాన చైర్మన్ మన భారత దేశ కళలను దేవస్థాన సన్నిధానంలో చేయడాన్ని కొనియాడారు. దేవస్థాన నిర్వాహకులు కామాక్షి, యుక్త కమిటీ సభ్యులు ప్రసాద్ మంత్రాల, అమర్ రెడ్డి, రుద్రా వర్మ బట్ట, కార్తీక్ గంటి, పూర్ణిమ రెడ్డి చల్ల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
భారత్, పాక్ మ్యాచ్‌పై ఐసీసీ ప్రకటన
బర్మింగ్‌హామ్: లండన్‌లో ఉగ్రదాడి అనంతరం బర్మింగ్‌హామ్‌లో భారత క్రికెటర్లు బస చేస్తున్న హోటల్‌ను బ్రిటన్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. హోటల్ మీదుగా వెళ్లే ట్రాఫిక్‌పై కూడా ఆంక్షలు విధించారు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించేందుకు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ భారత్-పాకిస్తాన్ కచ్చితంగా జరుగుతుందని తేల్చి చెప్పడంతో ఛాంపియన్స్ ట్రోఫీ భారత్-పాక్ మ్యాచ్‌పై అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. అభిమానులు ఆందోళన చెందనక్కర్లేదని ఐసీసీ స్పష్టం చేసింది. మ్యాచ్ నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించింది. -
అగ్నికి ఆహుతి అయిన 800 టన్నుల...
బర్మింగ్ హోమ్ : అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి... ఆకాశంలో దట్టంగా పొగ కమ్ముకుంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 17 ఫైరింజన్లు... 100 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వారంతం నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఆ ప్రాంతంలోని ఆకాశమంతా దట్టంగా పొగ ఆవరించి ఉంది. ఇదేదో భారీ భవనంలోనో... మరెక్కడో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందంటే పొరపాటే. బర్మింగ్హమ్లో చెత్తను నిల్వ ఉంచిన యార్డ్‌లో మంగళవారం ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో దాదాపు 800 టన్నుల ప్లాస్టిక్, మెటల్, రబ్బర్ ఆహుతి అయింది. అగ్నిమాపక సిబ్బంది ఎన్నో గంటలు పాటు శ్రమించి ... ఈ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
'చనిపోయేవరకు అమ్మకు నేనెవరో చెప్పలేదు'
లండన్: పసిప్రాయం నుంచే 'మీ అమ్మ చనిపోయింది' అని ఎవరైనా చెబుతుంటే.. అలా అస్సలు జరిగి ఉండకపోవచ్చనే అనుమానం నిత్యం వెంటాడుతుంటే.. మనసు ప్రతిక్షణం అమ్మకోసం వెతికేందుకు పరుగులు తీయిస్తుంటే.. లండన్‌లో పిలీస్ విజెల్ అనే మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మొదట ఓ అనాథ బాలికగా తర్వాత, దత్త పుత్రికగా చిన్నతనంలోనే ఓ ఇంటికి వెళ్లిన ఆమెను తన తల్లి ఇంకా బ్రతికే ఉండొచ్చు.. అయితే ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అనే ప్రశ్నలు వేధిస్తుండేవి. దీంతో, ఆమె మౌనంగా కనిపించినప్పటికీ ఏ చిన్న అవకాశం దొరికినా తన తల్లికోసం ఆరా తీసేది. ఎట్టకేలకు తన తల్లిని గుర్తించేందుకు ఓ సుధీర్ఘ ప్రయాణం ప్రారంభించింది. తొలిసారి తాను ఏ అనాథ ఆశ్రమం నుంచి వచ్చిందో అక్కడికే వెళ్లి తన తల్లి గురించి వెతికింది. దీంతో వారు ఆమె వివరాలు చెప్పారు. ఆమె పేరు బ్రిడ్జెట్ మేరి లాకిన్ అని, మద్యానికి అలవాటైన ఆమె ఓ దుర్వ్యసనపరురాలని, కొంత సమస్యాత్మక ప్రవర్తన కలిగిన స్త్రీ అని చెప్పారు. ఐర్లాండ్‌లో ఉంటున్న ఆమెను దుష్ఫ్రవర్తన కారణంగా సోదరుడు రోజూ కొట్టేవాడని, చివరికి ఆమె భరించలేక ఇళ్లు వదిలి బయటకు వచ్చిందని, ఆ తర్వాత ఐదుగురు వ్యక్తులతో శారీరక సంబంధాలు పెట్టుకొని వారి ద్వారా ఐదుగురు సంతానం పొందిందని వివరించింది. కానీ, ఆ ఐదుగురు వ్యక్తుల్లో ఏ ఒక్కరు కూడా ఆమె బాగోగులు చూసుకోకుండా వదిలేశారని వారు చెప్పారు. అలా జన్మించిన వారిలో రెండో అమ్మాయివే నువ్వు(పిలీస్). అని, 1956లో పిలీస్ జన్మించిందని వివరాలు తెలిపారు. అయితే, పిలీస్ కేవలం ఎనిమిది నెలలు మాత్రమే తల్లి సంరక్షణలో ఉందని, నెలలపాప అని కూడా చూడకుండా పాపగా ఉన్నప్పుడు ఇంట్లో ఒంటరిగా వదిలేసి పబ్బుల్లో గడిపేందుకు వెళ్లేదని వివరించారు. చివరకు పిలీస్ సంరక్షణ తన వల్లకాదని తమ ఆశ్రమంలో చేర్చి వెళ్లిపోయిందని చెప్పారు. అలా, అనాథ ఆశ్రమంలో పెరుగుతున్న పిలీస్ను ఓ కుటుంబం వచ్చి తమకు అప్పటికే ఉన్న కూతురుకి తోడుగా ఉంటుందని చెప్పి దత్త పుత్రికగా తీసుకెళ్లారని బాల్యం నుంచి దత్తత తీసుకెళ్లిన ఘట్టం వరకు ఆశ్రమ అధికారులు పిలీస్ కు వివరించారు. ఈ కథనం విన్న తర్వాత ఎలాగైనా తన తల్లిని కలుసుకోవాలని తాపత్రయపడింది. పోలీసులను ఆశ్రయించింది. ఆమె పేరు చెప్పగానే పోలీసులు శివమెత్తారు. ఆమె ఒక పనికిమాలిన స్త్రీ అని, తాగుబోతు, తిరుగుబోతు అని అనరాని మాటలు అన్నారు. బర్మింగామ్ లోని రెడ్ లైట్ ఏరియాలో ఉంటోందని చెప్పారు. 'ఓ కూతురుగా నువ్వు పడుతున్న ఆవేదన అర్ధం చేసుకోగలం కానీ, ఆమె వల్ల నీ జీవితమే సమస్యల సుడిగుండం అవుతుంది' అని పోలీసులు చెప్పారు. అయినా, వెనక్కి తగ్గని పిలీస్ అప్పటికే గర్భవతి కావడంతో ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డను చంకన వేసుకొని భర్తతో కలిసి కార్లో వెళ్లి బర్మింగామ్ వీధులన్నీ గాలించింది. చివరకు ఓ ఇంట్లో తన తల్లి ఉందని గుర్తించింది. ఆమె కూతురిలా కాకుండా ఓ కొత్త వ్యక్తిలా ఆ ఇంటికి వెళ్లి డోర్ కొట్టి ఎవరూ తీయకపోవడంతో తనే తెరుచుకోని లోపలికి వెళ్లింది. లోపల అంతా చీకటి.. ఓ మూలవైపుగా ఉన్న మెట్లపైన కూర్చుంటు అక్కడ అసహాయ పరిస్థితుల మధ్యన ఉన్న తన తల్లిని చూసి పిలీస్ గుండె చెరువైంది. తన తల్లి ఓ మోడువారిన చెట్టులా దర్శనమిచ్చింది. ఆమె ముఖం వాడిపోయి, జుట్టు రేగిపోయి, చర్మం పెలుసులు తేలి వేరేవరూ కూడా దగ్గరకు వచ్చేందుకు సాహసించని పరిస్థితుల మధ్య ఆమెను చూసింది. బాధను తనలోనే దిగమింగుకుని కుటుంబం కోసం, భవిష్యత్తుకోసం తనే ఆమె కూతురనే విషయాన్ని గొంతులో అదుముకొని తన తల్లితో సంభాషణ సాగించింది. తొలుత బ్రిడ్జెట్కు అసలు ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరనే విషయంలో కొంత ఆందోళనగా అనిపించినా.. తనకు కూడా కాసేపు తోడు దొరికింది కదా అనుకుని తన గతాన్ని పిలీస్కు చెప్పింది. 'నాకు ఒక ముద్దుల కూతురు ఉండేది. కానీ, నేనే పోగొట్టుకున్నాను. ఓ అనాథ ఆశ్రమంలో వదిలివేశాను' అని చెప్పుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది బ్రిడ్జెట్. ఈ మాటలు తలుచుకుంటూ 'ఆ సమయంలో ఆమెకు నా పుట్టిన రోజు తెలుసు.. కానీ, నేను ఆమె పక్కన కూర్చున్నా నేనెవరో ఆమెకు తెలియదు' అని పిలీస్ చెప్పింది. అలా ఎట్టకేలకు తన తల్లిని కలిసి పిలీస్ ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకోని అప్పుడే వృత్తి రీత్యా నర్సు అయిన ఆమె.. తన తల్లికి ఓ నర్సులాగా తొమ్మిదేళ్లపాటు సేవలు చేసి మాతృరుణం తీర్చుకుంది. ఆమె చనిపోయాక అంత్యక్రియలు తానే స్వయంగా జరిపించింది. చనిపోయే చివరి క్షణంలో కూడా ఆమెకు తను ఎవరు అనే విషయం మాత్రం రహస్యంగానే ఉంచిపెట్టింది. -
కళ్లులేని బ్యాట్ బాయ్ చూస్తున్నాడు
లండన్: ‘ప్రాక్టీస్ మేక్స్ ది మేన్ పర్ఫెక్ట్’ అంటారు. చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే అంధులు కూడా చూడగలరని నిరూపిస్తున్నారు బర్మింగమ్కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు రూబెన్ గ్రహమ్ మారిస్. అరుదైన జన్యు లోపం కారణంగా రూబెన్‌కు నెలల వయస్సులోనే రెండు కళ్లు కనిపించకుండా పోయాయి. పిన్న వయస్సులోనే చూపు పోతే జీవితం అంధకారం అవుతుందని ఆందోళన చెందిన రూబెన్ తల్లి ట్రూడీ గ్రాహం, తన కుమారుడికి చూపు తెప్పించడం కోసం పలు ఆస్పత్రులు తిరిగింది. ‘లెబర్స్ కాన్జెనిటల్ అమౌరోసిస్’ అనే జన్యుపరమైన జబ్బు కారణంగా చూపు కోల్పోయాడని, తిరిగి చూపు తెప్పించడం అసాధ్యమని డాక్టర్లు తేల్చారు. కళ్లు కనిపించకున్నా స్వతంత్య్రంగా జీవించడంలో శిక్షణ ఇచ్చే వారెవరైనా ఉన్నారా? అంటూ వెబ్సైట్లన్నీ వెతకడం ప్రారంభించింది సోషల్ కేర్ వర్కర్‌గా పనిచేస్తున్న ట్రూడీ. ఇలాంటి వారికి ‘ఎకోలొకేషన్’ పద్ధతి ద్వారా పరిసరాలను పర్ఫెక్ట్గా గుర్తించడంలో ‘వరల్డ్ యాక్సెస్ ఫర్ ది బ్లైండ్’ అధ్యక్షులు డేనియల్ కిష్ అమెరికాలో శిక్షణ ఇస్తున్నారని ఆమె తెలసుకొంది. నానా ప్రయాసాలుపడి కొడుకును అమెరికా తీసుకెళ్లింది. అందరూ బ్యాట్‌మేన్‌గా పిలిచే డేనియల్ కిష్ వద్ద ‘ఎకోలొకేషన్’ శిక్షణ పొందిన రూమన్ ఏడాదిలోనే ఎవరూ ఊహించని పురోగతి సాధించాడు. ఇప్పుడు ఆ బాలుడు ఎవరి సహాయం లేకుండానే చెట్టూ పుట్ట తిరగగలడు. పరిసర ప్రాంతాలను పక్కాగా గుర్తించగలడు. కళ్ల ముందు కదిలాడే ఆకారం ఏమిటో కళ్లతో చూసినట్టుగానే చెప్పగలడు. తన పనులు తాను చక్కగా చేసుకోగలడు. ఇదంతా సాధ్యమైందీ ‘ఎకోలొకేషన్’ శిక్షణ వల్లనేనని తల్లి ట్రూడీ తెలిపారు. ఎకోలొకేషన్ అంటే ప్రతిధ్వనుల ద్వారా పరిసరాలను గుర్తించడం. నాలుకద్వారా శబ్దాలు చేయడం, చేతికర్రను నేలపై కొట్టడం లేదా రెండు చేతులతో చప్పట్లు కొట్టడం ద్వారా వచ్చే ప్రతిధ్వనులను చెవి ద్వారా పసిగట్టి పరిసరాల్లో ఏ వస్తువుందో, ఏ ఆకారముందో, అది ఏ సైజులో ఉందో గుర్తించడం. ప్రతి ధ్వనుల కోసం శబ్దం చేయడాన్ని వెజ్ఞానిక పరిభాషలో ‘ఫొనాన్స్’ అంటారు. గబ్బిలాలు (బ్యాట్స్) కూడా ప్రతిధ్వనులను గుర్తించే చీకట్లో చక్కగా వేటాడగలవు, తిరగగలవు. రూబెన్‌కు శిక్షణ ఇస్తున్న డేనియల్ కిష్కు కూడా కళ్లు కనిపించవు. క్యాన్సర్ కారణంగా ఆయనకు 13 నెలల వయస్సులోనే కంటి చూపు పూర్తిగా పోయింది. కానీ శిక్షణ ద్వారా ఆయన తన తోటి ప్రపంచానికి వెలుతురు పంచుతున్నారు. అందుకే ఆయన్ని అందరూ బ్యాట్‌మేన్ అని పిలుస్తుండగా, రూబెన్‌ను బ్యాట్ బాయ్ అని పిలుస్తున్నారు. వాస్తవానికి గబ్బిలాలకు కళ్లు ఉన్నట్టే బ్యాట్ మేన్‌కు కళ్లుంటాయి. చాలామంది గబ్బిలాలకు కళ్లుండవని పొరపాటు పడతారు. అయితే వాటి కళ్లు చీకట్లో చూడలేవు. రాత్రిపూట శబ్దాల ప్రతిధ్వనుల ద్వారానే పరిసరాలను పసిగట్టగలవు. గబ్బిలాల తర్వాత ఇలాంటి విద్య డాల్ఫిన్స్‌కు ఉంది. చూపున్న మనం మాత్రం పరిసరాలను ఎలా చూడగలం ? వాటి మీద పడిన కాంతి అక్కడి నుంచి మన కళ్ల రెటీనాపై రిఫ్లెక్ట్ అవడం వల్ల మనం చూడగలుగుతున్నాం. అలాగే ఎకోలొకేసన్ పద్ధతిలో శబ్దాలు పరిసరాలపై బడి ప్రతిధ్వనిగా చెవులకు చేరినప్పుడు వాటిని చూపులేని వాళ్లు మనో ఫలకంపై చూస్తారు. మధ్యలో కంటి చూపు పోయిన వారికైతే మనుషులు, జంతువులు, పరిసరాలు ఎలా ఉంటాయో గుర్తుంటాయి. కానీ పుట్టుకతోనే కంటిచూపు లేనివారికి పరిసరాలపై అవగాహన ఉండదు. అలాంటి వారికి శిక్షణ ద్వారా అవగాహన కల్పిస్తారు. -
బ్రిటన్‌లో సిక్కు యువకుడిపై జాత్యహంకార దాడి
బ్రిటన్ లో జాత్యహంకారం మరోసారి పేట్రేగింది. బర్మింగ్‌హోమ్‌లోని బోర్డ్ స్ట్రీట్‌లో ఒంటరిగా తనదారిన తాను వెళుతోన్న ఓ సిక్కు యువకుణ్ని కొందరు దుండగులు అటకాయించి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానిక సిక్కులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. 'డైలీ సిఖ్ అప్డేట్స్' అనే ఫేస్బుక్ సైట్లో ఉంచిన దాడి తాలుకూ వీడియోల ఆధారంగా బ్రిటన్ పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు. ఆదివారం రాత్రి జరిగినట్లుగా భావిస్తున్న ఈ దుశ్చర్యను జాత్యహంకార దాడిగానే భావిస్తున్నామని, అయితే బాధితుడు ఎవరనేది తెలియరాలేదని, ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తే అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని మంగళవారం బర్మింగ్ హోమ్ పోలీసులు తెలిపారు. -
సూదంటు చిత్రాలు
ఆ చిన్ని కళాకృతులను చూడడానికే కళ్లింత చేసుకుంటాం. మరి తయారు చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందో కదా! అదే మాట విలార్డ్ విగన్(బ్రిటన్)ను అడిగి చూస్తే ఇలా అంటాడు...‘‘కష్టం అనిపించదు. సవాలుగా అనిపిస్తుంది. సవాలును స్వీకరించడం నాకు ఇష్టంగా ఉంటుంది’’. బర్మింగ్‌హామ్‌కు చెందిన 57 సంవత్సరాల విలార్డ్ సూది బెజ్జంలో కళాకృతులను సృష్టించడంలో చేయి తిరిగినవాడు. అయిదు సంవత్సరాల వయసు నుంచే చిన్ని చిన్ని కళాకృతులను తయారు చేయడంలో ప్రతిభ చూపాడు విలార్డ్. మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలిగే విలార్డ్ చిన్ని కళాప్రపంచాన్ని చూసి కళాభిమానులు రెండు పనులు చేస్తున్నారు. ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోవడం ఒకటి, ఆనందంతో విలార్డ్ను ప్రశంసించడం ఒకటి. త్వరలో విలార్డ్ మినీ కళాకృతుల ప్రదర్శన ప్రారంభం కానుంది. -
పనిచేయని ధోని మ్యాజిక్
బర్మింగ్‌హామ్: చివరి బంతివరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఏకైక టి20లో భారత్ పై ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లీషు సేన నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లి అర్థ సెంచరీ చేశాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ తో 66 పరుగులు చేశాడు. ధావన్ 33, రైనా 25, రహానే 8 పరుగులు చేశారు. ధోని 27 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. చివరి ఓవర్ లో 17 పరుగులు అవసరంగా కాగా 13 పరుగులు మాత్రమే వచ్చాయి. లాస్ట్ ఓవర్ లో మ్యాజిక్ చేద్దామనుకున్న ధోని ఆశలు ఫలించలేదు. మొదటి బంతికి సిక్సర్ బాది విజయంపై ధోని ఆశలు రేపాడు. రెండో బంతికి 2, నాలుగో బంతికి 4 పరుగులు వచ్చాయి. మూడు, ఐదు బంతులకు పరుగులు రాలేదు. చివరి బంతికి సింగిల్ మాత్రమే రావడంతో భారత్ మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్, అలీ, గుర్నె, వోక్స్ తలో వికెట్ తీశారు. మోర్గాన్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
సిక్సర్ల వర్షం కురిపించిన మోర్గాన్
బర్మింగ్‌హామ్: టీమిండియాతో జరుగుతున్న టి20 మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ధోని సేనకు 181 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ విజృభించి ఆడాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 26 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. హేల్స్ 40, రూట్ 26, బొపారా 15, బట్లర్ 10 పరుగులు చేశారు. చివరి 5 ఓవర్లలోనే ఇంగ్లండ్ 81 పరుగులు చేయడం విశేషం. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ, కరణ్ శర్మ, జడేజా తలో వికెట్ తీశారు. -
ఎన్నాళ్లకెన్నేళ్లకు..!
24 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్ గెలిచిన భారత్ నాలుగో వన్డేలోనూ ధోనిసేన ఘన విజయం 3-0తో సిరీస్ కైవసం శుక్రవారం ఆఖరి వన్డే టెస్టుల్లో బంతిని ముట్టుకోవడానికి భయపడిన కుర్రాళ్లు.. వన్డేల్లో ఆ బంతినే వెంటాడి వెంటాడి బాదారు.ఘోర పరాభవాన్ని చవి చూసిన గడ్డపై... అదే ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టారు. అవమానంతో మౌనముద్ర దాల్చిన వాళ్లే... రొమ్మువిరిచి బెబ్బులిలా గర్జించారు. నాణ్యమైన ఆటతీరుకు సమష్టి మంత్రాన్ని జోడించి... దిగ్గజాలకూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు.రెండు పుష్కరాలుగా బ్రిటిష్ గడ్డపై ఊరిస్తున్న వన్డే సిరీస్ విజయాన్ని... మరో మ్యాచ్ మిగిలుండగానే సాధించారు.మంచినీళ్ల ప్రాయంగా పరుగులతో హోరెత్తించి... ఏకపక్ష విజయాలతో భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. బర్మింగ్‌హామ్: ధావన్ (81 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మీసం మెలేశాడు... తన బ్యాట్ పవరేంటో చూపడానికి... రహానే (100 బంతుల్లో 106; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో గర్జించాడు... ఇంగ్లండ్ గడ్డపై ధోనిసేనకు ఈ విజయం ఎంత కీలకమో చెప్పడానికి... ఓవరాల్‌గా ఒకే ఒక్క మ్యాచ్... భారత జట్టులో చాలా సమస్యలకు పరిష్కారం చూపింది. ఇంగ్లండ్ టూర్ మొదలైనప్పట్నించీ కనీసం 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయిన ఓపెనర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 183 పరుగులు జోడించారు. అంటే ఓపెనింగ్ సమస్యకు పరిష్కారం చూపారు. ఊరించే వికెట్‌పై ఇంగ్లండ్‌ను కట్టడి చేస్తూ... బౌన్సీ వికెట్లపై రాణించలేరనే అపవాదును తొలగించుకున్నారు బౌలర్లు. రైనా, రాయుడు రాణించడంతో రిజర్వ్ బెంచ్ సత్తా ఏంటో చూపెట్టారు. ఫలితంగా నాలుగో వన్డేలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (50 బంతుల్లో 67; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్ (81 బంతుల్లో 44; 2 ఫోర్లు), మోర్గాన్ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు)లు రాణించారు. ఓ దశలో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కుక్ సేనను రూట్, మోర్గాన్‌లు నాలుగో వికెట్‌కు 80 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే ఈ ఇద్దరు కూడా 11 పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో ఇంగ్లండ్ 114 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది. కానీ చివర్లో అలీ భారీ షాట్లతో రెండు కీలక భాగస్వామ్యాలతో చెలరేగాడు. షమీ 3, భువనేశ్వర్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 30.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 212 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్న ధావన్ నెమ్మదిగా బ్యాట్ ఝుళిపించాడు. అండర్సన్ వేసిన ఐదో ఓవర్లో నాలుగు బౌండరీలు కొట్టి టచ్‌లోకి వచ్చాడు. రెండో ఎండ్‌లో రహానే కూడా చెలరేగాడు. ఈ ఇద్దరు క్రమంగా జోరు పెంచడంతో పరుగుల వరద పారింది. ఈ జోడిని విడదీయడానికి ఇంగ్లండ్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. చివరకు కెరీర్లో తొలి సెంచరీ చేసిన రహానేను గుర్నీ అవుట్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. తర్వాత కోహ్లి (1 నాటౌట్)తో కలిసి ధావన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. రహానేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరి వన్డే లీడ్స్‌లో శుక్రవారం జరుగుతుంది. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 9; హేల్స్ (బి) భువనేశ్వర్ 6; బ్యాలెన్స్ (సి) రహానే (బి) షమీ 7; రూట్ (సి) కులకర్ణీ (బి) రైనా 44; మోర్గాన్ (సి) రైనా (బి) జడేజా 32; బట్లర్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 11; అలీ (బి) అశ్విన్ 67; వోక్స్ రనౌట్ 10; ఫిన్ (బి) జడేజా 2; అండర్సన్ నాటౌట్ 1; గుర్నీ (బి) షమీ 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (49.3 ఓవర్లలో ఆలౌట్) 206. వికెట్ల పతనం: 1-15; 2-16; 3-23; 4-103; 5-114; 6-164; 7-194; 8-201; 9-202; 10-206 బౌలింగ్: భువనేశ్వర్ 8-3-14-2; ధావల్ కులకర్ణీ 7-0-35-0; షమీ 7.3-1-28-3; అశ్విన్ 10-0-48-1; జడేజా 10-0-40-2; రైనా 7-0-36-1. భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) కుక్ (బి) గుర్నీ 106; ధావన్ నాటౌట్ 97; కోహ్లి నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (30.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 212. వికెట్ల పతనం: 1-183 బౌలింగ్: అండర్సన్ 6-1-38-0; గుర్నీ 6.3-0-51-1; ఫిన్ 7-0-38-0; వోక్స్ 4-0-40-0; అలీ 7-0-40-0. 1 వన్డేల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోని (91) అగ్రస్థానంలో నిలిచాడు. అతని నాయకత్వంలో భారత్ 162 వన్డేల్లో 91 గెలిచి 57 ఓడింది. ప్రస్తుత అంతర్జాతీయ కెప్టెన్లలో మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు 27, వన్డే 91, టి20 27) తన జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ ధోని ఒక్కడే. 1 33 వన్డేల్లో రహానేకు ఇది తొలి సెంచరీ 2 ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు, వన్డేల్లో సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడు రహానే. 2002లో సచిన్ మాత్రమే దీనిని సాధించాడు. 50 ఇంగ్లండ్‌పై ఇది భారత్‌కు 50వ వన్డే విజయం 1 200కు పైగా లక్ష్యం ఉన్నప్పుడు 117 బంతుల ముందే ఛేదించడం భారత్‌కు ఇదే తొలిసారి. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఇందులో మా ప్రదర్శన చాలా మెరుగుపడింది. ధావన్ ఫామ్‌లోకి వచ్చాడు. ఓపెనింగ్‌కు రహానే చక్కగా సరిపోతాడు. అయితే రోహిత్లో కూడా అపార నైపుణ్యం ఉంది. - ధోని (భారత కెప్టెన్) -
కరువు తీరే సమయం!
మ. గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, దూరదర్శన్లలో ప్రత్యక్ష ప్రసారం 24 ఏళ్ల తర్వాత సిరీస్ విజయానికి చేరువలో భారత్ నేడు ఇంగ్లండ్‌తో నాలుగో వన్డే జోరు మీదున్న ధోని సేన తీవ్ర ఒత్తిడిలో కుక్ బృందం రెండు పుష్కరాలుగా భారత క్రికెట్ అభిమాని కోరిక... ఎంతోమంది దిగ్గజాలకు అంద ని ఫలితం... గొప్ప సారథులకూ దక్కని ఘనత... వీటన్నింటినీ అందుకునే అవకాశం ధోనిసేనకు లభించింది. 24 ఏళ్లుగా ఇంగ్లండ్ గడ్డపై భారత్ ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే.. 2-0 ఆధిక్యంలో ఉన్న ధోనిసేన... ఇక రెండింట్లో ఒక్కటి గెలిచినా చాలు. అయితే ఆఖరి మ్యాచ్‌లో ఒత్తిడిని ఎదుర్కొనేకంటే... నాలుగో వన్డేలో గెలిచి కల సాకారం చేసుకుంటేనే మేలు. బర్మింగ్‌హామ్: వన్డే ప్రపంచ చాంపియన్ భారత్ ఈ ఫార్మాట్లో తమ సత్తా ఏమిటో ఇప్పటికే ఇంగ్లండ్‌కు రుచి చూపించింది. ఇదే ఉత్సాహంతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ధోని సేన పట్టుదలగా ఉంది. మరో వైపు ఇంకా ఇంగ్లండ్ జట్టు టెస్టు మైకం నుంచి బయటపడినట్లు లేదు. సాంప్రదాయ శైలితోనే ఆడబోతూ గత రెండు మ్యాచ్‌ల్లో ఏ దశలోనూ ఆ జట్టు భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో నేడు (మంగళవారం) ఇక్కడి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. సిరీస్‌లో రెండు వన్డేలు నెగ్గిన భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే మరో వన్డే మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను గెలుచుకుంటుంది. విజయ్‌కి అవకాశం ఇస్తారా! ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్‌వన్‌గా నిలవడం నాలుగో వన్డేకు ముందు భారత్‌కు స్ఫూర్తినిచ్చే మరో అంశం. గత రెండు మ్యాచ్‌ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కూడా మన కుర్రాళ్లు చెలరేగిపోతున్నారు. ఓపెనర్‌గా రహానే గత వన్డేలో ఆకట్టుకున్నాడు. కోహ్లి, రైనా, రాయుడు, ధోనిలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా, ఆ తర్వాత ఆల్‌రౌండర్లు జడేజా, అశ్విన్‌లు ఉన్నారు. బౌలింగ్‌లో కూడా పేసర్లు భువనేశ్వర్, షమీ ప్రధాన పాత్ర పోషిస్తుండగా...మూడో వన్డేలో గాయపడిన మోహిత్ ఫిట్‌గా లేకపోతే ఉమేశ్‌కు అవకాశం ఇవ్వవచ్చు. సాధారణంగా వరుస విజయాల సమయంలో టీమిండియా తుది జట్టులో మార్పులు జరగవు. అయితే గాయపడిన ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో మురళీ విజయ్‌ని హడావిడిగా భారత్‌నుంచి పిలిపించారు. ప్రపంచ కప్‌కు ముందు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. కాబట్టి వరుసగా విఫలమవుతున్న శిఖర్ ధావన్ స్థానంలో విజయ్‌ని ఓపెనర్‌గా పరీక్షించే అవకాశం లేకపోలేదు. అన్నీ కష్టాలే! మరో వైపు ఇంగ్లండ్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. గత 20 వన్డేల్లో ఆ జట్టు 12 ఓడింది. ఆ జట్టు ఆటగాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారెవరూ వన్డే ఫార్మాట్‌కు అనుగుణంగా తమను తాము మలచుకోలేకపోతున్నారు. ఓపెనర్‌గా హేల్స్ సత్తా చాటుతుండగా...మరో ఓపెనర్ కుక్ బ్యాటింగ్ అంతంత మాత్రంగానే ఉంది. టెస్టు సిరీస్‌లో తన నాయకత్వంపై విమర్శలు వచ్చిన సమయంలో 3-1తో సిరీస్ నెగ్గి సమాధానమిచ్చిన కుక్... ఇప్పుడు వన్డే సిరీస్ కోల్పోకూడదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అసలు భారత బ్యాటింగ్‌ను అడ్డుకునే బౌలింగ్ కానీ...భారత స్పిన్‌ను ఎదుర్కొనే సత్తా గానీ ఇంగ్లండ్‌కు లేనట్టే కనిపిస్తోంది. వన్డే స్పెషలిస్ట్ మోర్గాన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోగా...కీపర్ బట్లర్ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఆ జట్టు బౌలింగ్ అయితే మరీ నాసిరకంగా ఉంది. ఒక్కరు కూడా భారత బ్యాట్స్‌మెన్‌కు పగ్గాలు వేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ స్టోక్స్ స్థానంలో మరో స్పిన్నర్‌గా మొయిన్ అలీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సిరీస్ గెలిచే అవకాశం ఎలాగూ లేకపోయినా, ఓడిపోకుండా ఉండాలంటే ఇంగ్లండ్ ఈ మ్యాచ్ నెగ్గడం తప్పనిసరి. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్/విజయ్, రహానే, కోహ్లి, రైనా, రాయుడు, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, మోహిత్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హేల్స్, బెల్/బాలెన్స్, రూట్, మోర్గాన్, బట్లర్, వోక్స్, అలీ, ట్రెడ్‌వెల్, ఫిన్, అండర్సన్. పిచ్ వాతావరణం సాధారణంగా ఇక్కడి వికెట్ స్లోగా ఉండి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇంగ్లండ్‌తో గత సిరీస్‌లో శ్రీలంక దీనిని సమర్థంగా వాడుకుంది. అయితే భారత్ దీనిని అనుకూలంగా మార్చుకోకూడదని భావిస్తున్న ఇంగ్లండ్... పిచ్‌పై కొంత గడ్డి ఉంచాలని కోరుతోంది. వాతావరణం అంతా బాగుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. టికెట్ల అమ్మకం కూడా భారీగా సాగింది. పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. 4 ఇక్కడ ఆడిన 7 మ్యాచుల్లో భారత్ 4 గెలిచింది. 1 మరో మ్యాచ్ గెలిస్తే అజహర్ (90)ను దాటి అత్యధిక వన్డే విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా (91) ధోని నిలుస్తాడు. -
సైనా శుభారంభం
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ఏడో సీడ్ సైనా 21-15, 21-6తో ప్రపంచ 20వ ర్యాంకర్ కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించింది. గిల్మౌర్‌పై సైనాకిది వరుసగా రెండో గెలుపు. గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లో గిల్మౌర్తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లోనూ సైనానే విజయం వరించింది. గురువారం జరిగే రెండో రౌండ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో సైనా ఆడుతుంది. తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ జూలియన్ షెంక్ (జర్మనీ) నుంచి బీవెన్ జాంగ్‌కు ‘వాకోవర్’ లభించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రపంచ 18వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్, ప్రపంచ 21వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. కశ్యప్ 21-14, 19-21, 17-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కెనిచి టాగో (జపాన్) చేతిలో; శ్రీకాంత్ 11-21, 15-21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది ఈ టోర్నీ రెండో రౌండ్లో కెనిచి టాగోను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్న కశ్యప్ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గినా తర్వాతి రెండు గేముల్లో తడబడి మ్యూలం చెల్లించుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన నాలుగు టోర్నీల్లోనూ కశ్యప్ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తరుణ్ కోనా-అశ్విని పొనప్ప (భారత్) జంట 13-21, 16-21తో నాలుగో సీడ్ జోచిమ్ నీల్సన్-క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) జోడి చేతిలో పరాజయం పాలైంది. మంగళవారం జరిగిన పురుషుల క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఆనంద్ పవార్ 21-18, 13-21, 19-21తో ఆండ్రీ కుర్నియావాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం 21-14, 15-21, 17-21తో జిన్ మా-యువాన్‌టింగ్ తంగాస్ (చైనా) జోడి చేతిలో ఓడింది -
సైనా సత్తాకు పరీక్ష
బర్మింగ్‌హామ్: గత ఏడాది ఎదురైన చేదు ఫలితాలను వెనక్కినెట్టి ఈ ఏడాదిని ఇండియన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ విజయంతో మొదలుపెట్టిన భారత స్టార్ సైనా నెహ్వాల్ మరో పరీక్షకు సిద్ధమైంది. మంగళవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఏడో సీడ్‌గా బరిలోకి దిగనుంది. తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. సైనాతోపాటు మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు... పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్లో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సైనా; సున్ యూ (చైనా)తో సింధు; కెంటో మొమొటా (జపాన్)తో శ్రీకాంత్; కెనిచి టాగో (జపాన్)తో కశ్యప్ తలపడతారు. గతేడాది సెమీఫైనల్‌కు చేరుకున్న సైనా ఈసారి మరింత మెరుగైన ఫలితాన్ని సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘నెల రోజులు సాధన చేసి ఈ టోర్నీకి పక్కాగా సిద్ధమయ్యాను. బరువు తగ్గి ఫిట్నెస్ కూడా మెరుగుపర్చుకొని అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాను. ‘డ్రా’ కఠినంగానే ఉన్నా కనీసం క్వార్టర్ ఫైనల్ చేరుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను’ అని ప్రపంచ ఏడో ర్యాంకర్ సైనా వ్యాఖ్యానించింది. తొలి రౌండ్‌ను అధిగమిస్తే సైనాకు రెండో రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ జూలియన్ షెంక్ (జర్మనీ)... క్వార్టర్ ఫైనల్లో నాలుగో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా) ఎదురయ్యే అవకాశాలున్నాయి. మంగళవారం జరిగే క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో కుర్నియావాన్ (ఇండోనేసియా)తో ఆనంద్ పవార్ (భారత్); చోల్ మ్యాగీ (ఐర్లాండ్)తో సైలి రాణే (భారత్) పోటీపడతారు. మహిళల డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడికి బై లభించింది. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో మాథ్యూ నాటింగ్హమ్-లారెన్ స్మిత్ (ఇంగ్లండ్) జోడితో తరుణ్ కోనా-అశ్విని పొన్నప్ప (భారత్) జంట ఆడుతుంది.