'బజ్‌బాల్' అంటూ దూకుడు కనబరుస్తున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా ముకుతాడు వేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆటకు ఇవాళ చివరి రోజు కావడంతో ఇంగ్లండ్ విజయానికి ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ విజయానికి 174 పరుగుల దూరంలో ఉంది.
అయితే చివరి రోజు బౌలర్లకు అనూకూలంగా ఉంటుందన్న అంశం ఇంగ్లండ్ బౌలర్లకు ఊరటనిచ్చే అంశం. అయితే ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచి చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ పోరాడకుండా మాత్రం ఉండదు. చేయాల్సింది 174 పరుగులే కావడం.. క్రీజులో ఉస్మాన్ ఖవాజా ఉండగా.. ట్రెవిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీలు ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని వీలైనంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు క్లిక్ అయినా ఆసీస్ తొలి టెస్టును కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం చూసుకుంటే ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి.
2005 రిపీట్ అవుతుందా?
అయితే 2005లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. అప్పట్లో 282 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ 279 పరుగులకు ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 407 పరుగులు చేయగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు 101 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా ఇంగ్లండ్ 182 పరుగులకే కుప్పకూలింది. దీంతో 281 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ విజయానికి కేవలం రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరిగినప్పటికి చివర్లో షేన్ వార్న్ 42, బ్రెట్ లీ 43 పరుగులు సంచలన ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు.
అయితే ఆండ్రూ ఫ్లింటాఫ్ నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం 2023లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు పరిస్థితి కూడా అచ్చం అదే పరిస్థితిని తలపిస్తుంది. బజ్‌బాల్ మంత్రంతో ఇంగ్లండ్ ఆసీస్ ఆట కట్టిస్తుందా లేక ఆసీస్ ఇంగ్లండ్‌కు షాకిస్తుందా అన్నది చూడాలి.
చదవండి: #Ashes2023: ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు.. ఆసీస్‌కు 174 పరుగులు
Comments
Please login to add a commentAdd a comment