అమెరికాలో కాల్పులు.. నలుగురు దుర్మరణం | USA: Four dead and 18 hurt in Alabama mass shooting | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. నలుగురు దుర్మరణం

Published Mon, Sep 23 2024 5:04 AM | Last Updated on Mon, Sep 23 2024 5:04 AM

USA: Four dead and 18 hurt in Alabama mass shooting

మరో 18 మందికి గాయాలు

బిర్మింగ్‌హమ్‌: అమెరికాలోని అలబామా రాష్ట్రం బిర్మింగ్‌హమ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా, 18 మంది గాయాలపాలయ్యారు. శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని పోలీసులు తెలిపారు.

 నగరంలో రెస్టారెంట్లు, బార్‌లకు నిలయమైన ఫైవ్‌ పాయింట్స్‌ సౌత్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ డిస్ట్రిక్ట్‌ పరిధిలో ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఆ ప్రాంతంలో గుమికూడిన జనం పైకి కొందరు విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్లు గుర్తించామన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement