four killed
-
అమెరికాలో కాల్పులు.. నలుగురు దుర్మరణం
బిర్మింగ్హమ్: అమెరికాలోని అలబామా రాష్ట్రం బిర్మింగ్‌హమ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా, 18 మంది గాయాలపాలయ్యారు. శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. నగరంలో రెస్టారెంట్లు, బార్లకు నిలయమైన ఫైవ్ పాయింట్స్ సౌత్ ఎంటర్టెయిన్మెంట్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఆ ప్రాంతంలో గుమికూడిన జనం పైకి కొందరు విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్లు గుర్తించామన్నారు. -
అమెరికా స్కూల్లో కాల్పుల మోత
విండర్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. జార్జియా రాష్ట్రంలోని విండర్ పట్టణంలో అపలాచీ హైస్కూల్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. అయితే 30 మంది గాయపడినట్లు తొలుత వార్తలొచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు స్కూల్లో కాల్పులు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ప్రాణభయంతో దగ్గర్లోని ఫుట్‌బాల్ స్టేడియంలో తలదాచుకునేందుకు పరుగులుపెట్టారు. కాల్పుల విషయం తెల్సి పోలీసులు నిమిషాల్లో పాఠశాలను చుట్టుముట్టారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారనే వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కాల్పులు జరిపింది 14 ఏళ్ల టీనేజర్ అని మీడియాలో వార్తలొచ్చాయి. అతను ఆ స్కూల్ విద్యార్థేనా అనేది తెలియాల్సి ఉంది. కాల్పులకు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ‘‘ తుపాకీ శబ్దాలు వినిపించినపుడు రసాయనశాస్త్ర తరగతి గదిలో ఉన్నా. ఒక టీచర్ పరుగున వచ్చి కాల్పులు జరుగుతున్నాయి. గడియ పెట్టుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత ఎవరో వచ్చి తలుపు తెరవండని గట్టిగా పలుమార్లు అరిచారు. మేం తీయలేదు. తర్వాత కాల్పుల శబ్దాలు, అరుపులు వినిపించాయి. మేం తర్వాత దగ్గర్లోని ఫుట్‌బాల్ మైదానంలోకి పరుగులు తీశాం’ అని ప్రత్యక్ష సాక్షి, 17 ఏళ్ల విద్యార్థి సెర్గియో కాల్డెరా చెప్పారు. విషయం తెల్సి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఏటా పెద్దసంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్న విషయం విదితమే. ఘటనపై దేశాధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘అమెరికా విద్యార్థులు చదవడం, రాయడం అనే వాటితోపాటు దాక్కోవడం, తమను తాము కాపాడుకోవడం అనేవి నేర్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అమెరికాలో కాల్పులు మామూలే అనే ధోరణిని ఆమోదించబోం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
లిఫ్టు కూలిన ఘటనలో 8కి చేరిన మృతులు
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కూలిన ఘటనలో క్షతగాత్రులైన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్టులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శుక్రవారం ఉదయం 14వ ఫ్లోర్ నుంచి లిఫ్టు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన అయిదుగురిలో నలుగురు శనివారం చనిపోయారు. మరొకరు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలస కార్మికులు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
కెనోషా: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేగింది. ఇండియానా రాష్ట్రంలో జరిగిన దాడిని మరువక ముందే విస్కాన్సిన్లో తాజా ఘటన చోటుచేసుకుంది. కెనోషా కౌంటీలో ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణిం చగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని కౌంటీ షెరిఫ్ డేవిడ్ బెత్ వెల్లడించారు. ఘటనకు ముందుగా నిందితుడు బార్లోనే ఉన్నాడని, అయితే అతన్ని బయటకు పంపడంతో తిరిగి వచ్చి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామన్నారు. ఎవరిని చంపాలో నిందితుడు ముందుగానే నిర్ణయించు కొని వచ్చినట్లు అభిప్రాయపడుతున్నట్లు వెల్లడిం చారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరొకరు కూడా ఉన్నట్లు చెప్పారు. దాడి చేసేందుకు ఒక హ్యాండ్‌గన్‌ను ఉపయోగించారని తెలిపారు. నిందితున్ని పట్టుకోవడానికి స్థానికులు సాయం చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే ప్రధాన రహదారులను మూసేసి తనిఖీలు చేపట్టారు. ఒమహాలోనూ కాల్పులు.. ఒమహాలోని ఓ మాల్లోనూ ఆదివారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఘటనానంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు దాదాపు గంట పాటు మాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలను సేకరించిన అనంతరం తిరిగి మాల్‌లోకి సందర్శకులను అనుమతించారు. నిందితుడు స్పష్టమైన లక్ష్యంతోనే వచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ కాలికి సైతం గాయమైంది. -
బంగ్లా బంద్ హింసాత్మకం
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ సంస్థ హెఫాజత్–ఇ–ఇస్లామ్ పిలుపు మేరకు ఆదివారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. భారత ప్రధాని మోదీ పర్యటనపై హెఫాజత్–ఇ–ఇస్లామ్ తదితర సంస్థలు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో నలుగురు మృతి చెందటాన్ని నిరసిస్తూ ఈ బంద్ జరిగింది. నారాయణ్‌గంజ్ జిల్లా సనర్‌పారాలో పోలీసు కాల్పుల్లో ఒక ఆందోళనకారుడు గాయపడ్డాడని అధికారులు తెలిపారు. నిరసనకారులు రాజధాని ఢాకాతో తీరప్రాంత నగరం చిట్టగాంగ్‌తో కలిపే ప్రధాన రహదారిని దిగ్బంధించారు. పెద్ద సంఖ్యలో బస్సులు, ట్రక్కులకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. బ్రహ్మణ్‌బారియా జిల్లాలో ఆందోళనకారులు రైలుపై దాడికి దిగారు. ఇంజిన్ రూం సహా అన్ని బోగీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పది మంది వరకు గాయాలపాలయ్యారు.ఇదే జిల్లా సరైల్‌లో భద్రతా సిబ్బందిపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. అల్లర్ల అనంతరం ఈ ప్రాంతంలో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బంద్ కారణంగా రాజధాని ఢాకాలో వీధులు నిర్మానుష్యంగా మారాయి. బంద్‌కు ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ నేరుగా మద్దతు ప్రకటించలేదు. కాగా, హెఫాజత్–ఇ–ఇస్లామ్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా మత విద్యాసంస్థలు నడుపుతోంది. -
ప్రధాని మోదీకి నిరసన సెగ: నలుగురి మృతి
ఢాకా: స్వాతంత్ర్యం సిద్ధించి 50 వసంతాలు కావడంతో బంగ్లాదేశ్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం బంగ్లాదేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్‌లో నిరసన సెగ తగిలింది. నరేంద్ర మోదీ పర్యటనకు నిరసనగా కొందరు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు దాడి చేయడంతో నలుగురు మృతిచెందారు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నగరంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్లు వినియోగించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమించి మృతిచెందారు. చిట్టగ్యాంగ్‌లో శుక్రవారం నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారి ఆందోళన హింసాత్మకంగా మారింది. సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకొచ్చారు. దీంతో పోలీసులు విధిలేక బాష్ప వాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ రబ్బర్ బుల్లెట్ల ధాటికి నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢాకాలో పర్యటించగా అక్కడ కూడా కొందరు నిరసన చేపట్టడం గమనార్హం. ఓ మతానికి చెందిన వారు ఈ ఆందోళనలు చేపట్టారు. దీనికి కారణం తెలియాల్సి ఉంది. చదవండి: నా టీనేజ్‌లో బంగ్లాదేశ్ కోసం కొట్లాడాను చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. -
నలుగురు లష్కరే ముష్కరులు హతం
శ్రీనగర్: సోమవారం జమ్ముకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాదళాలు నలుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులను మట్టుబెట్టాయి. జిల్లాలోని మనిహల్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి భద్రతాదళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నాయని, మిలిటెంట్లను గుర్తించిన అనంతరం లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా కాల్పులు జరిపారని, దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపగా నలుగురు తీవ్రవాదులు మరణించారని ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వీరంతా తమను తాము లష్కరే ముస్తఫా వర్గంగా చెప్పుకుంటారని, కానీ పోలీసు రికార్డుల్లో వీరు లష్కరేతోయిబా తీవ్రవాదులనే ఉందని చెప్పారు. ఎన్కౌంటర్ స్థలంలో మూడు పిస్టల్స్, ఒక ఏకే 47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారన్నారు. మృతులను రాయిస్ అహ్మద్ భట్, అమిర్ షఫి మిర్, రఖిబ్ అహ్మద్ మాలిక్, అఫ్తాబ్ అహ్మద్ వనిగా గుర్తించారు. సంఘటనలో ఒక ఆర్మీ జవాను గాయపడగా ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఈ ఏడాది ంతవరకు 9 ఎన్కౌంటర్లు జరిగాయని, వీటిలో 19మంది తీవ్రవాదులు హతమయ్యారని ఐజీ వివరించారు. తిరిగి వచ్చేయండి ఈ సంవత్సరం 18 మంది యువకులు మిలిటెంట్లలో చేరారని, వీరిలో 5గురు ఎన్‌కౌంటరయ్యారని, ముగ్గురు అరెస్టయ్యారని, మిగిలిన వారు లొంగిపోయేలా చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇలా ఏడుగురు యువకులు మిలిటెంట్లనుంచి తిరిగి వచ్చారన్నారు. సెక్యూరిటీ దళాలపై లోయలో తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతోందన్నారు. స్థానిక యువతను తీవ్రవాదంవైపు మరల్చేందుకు పాకిస్థాన్ కుయుక్తులు పన్నుతోందని, సోషల్‌మీడియా ద్వారా రెచ్చగొడుతోందని విమర్శించారు. దీనికితోడు పాక్ డ్రగ్స్‌ను కూడా సరఫరా చేస్తోందని, ఇలా డ్రగ్స్‌కు బానిసైనవారు తమను సంప్రదిస్తే డీఅడిక్షన్ కేంద్రాలకు పంపుతామని చెప్పారు. యువతకు సాయం చేసేందుకు పోలీసులు సదా సిద్ధమన్నారు. లోయలో శాంతిస్థాపన తమ ధ్యేయమన్నారు. దళాలపై రాళ్లురువ్వే సంఘటనలు చాలా తగ్గిపోయాయని, గతంలోలాగా కాకుండా మిలిటెంట్లకు భయపడకుండా ప్రజా జీవనం కొనసాగుతోందని చెప్పారు. నిజానికి మిలిటెన్సీ కన్నా రాళ్లు రువ్వే ఘటనలు చాలా తీవ్రమైనవని, సామాజికంగా సీరియస్ సమస్యని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా పలువురిని ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేస్తున్నామని చెప్పారు. -
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం
సాకక్షి, అనంతపురం : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నంబులపూలకుంట సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి సోలార్ పవర్ ప్రాజెక్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరంతా బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాలో కత్తిపోట్లు..
లాస్ఏంజెలిస్: దోచుకోవడమే లక్ష్యంగా రెచ్చిపోయిన ఓ వ్యక్తి యథేచ్ఛగా కత్తిపోట్లకు పాల్పడటంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం మాన్‌గ్రోవ్ సిటీలో జరిగింది. సిటీకి చెందిన ఓ వ్యక్తి(33) మొదటగా తన అపార్టుమెంట్‌లోని ఓ దుకాణదారును కత్తి చూపి బెదిరించి, దోచుకున్నాడు. ఆపైన ఓ సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి అతని వద్ద ఉన్న తుపాకీని లాక్కున్నాడు. ఈ ఘటనలో ఆ గార్డు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా కత్తి, తుపాకీ చూపి బెదిరిస్తూ సుమారు ఆరు దుకాణాల్లో నగదు దోచుకున్నాడు. మొత్తం ఆరుగురిని గాయపరచగా నలుగురు మృతి చెందారు. రెండు గంటలపాటు చెలరేగి పోయిన అతడిని పక్కనే ఉన్న సాంటాఅనా సిటీలో పోలీసు డిటెక్టివ్లు పట్టుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు రూరల్ మండలానికి చెందిన మోహన్ నాయుడు కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటకలో ధర్మస్థల స్వామివారి దర్శనానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బెంగళూరు జాతీయ రహదారిపై అదుపు తప్పి మరో లారీని ఢీకొంది. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో మోహన్ నాయుడుతో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఆయన తండ్రి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వారిని బెంగళూరుకు తరలించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఔటర్‌పై అంబులెన్స్‌ను ఢీకొన్న కారు
హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని ముగ్గురితోపాటు అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందాడు. అంబులెన్స్‌లోని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన బొల్లిరెడ్డి వెంకటేశ్వరరావు(60) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ ఆస్పత్రిలో కేన్సర్ చికిత్స పొందాడు. చికిత్స పూర్తికావడంతో తన భార్య సుబ్బలక్ష్మి(55), సోదరుడు రామారావు(70), కుమారుడు హేమచందర్‌రావు, అల్లుడు శ్రీనివాసరావుతో కలసి ప్రైవేటు అంబులెన్స్‌లో ఈ నెల 10న రాత్రి హైదరాబాద్ మీదుగా బళ్లారికి బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట నుంచి ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్‌కు వెళ్లే క్రమంలో తెల్లవారుజామున 3 గంటలకు తుక్కుగూడ రావిర్యాల సమీపంలోని ఔటర్ ఎగ్జిట్ 13 వద్దకు వచ్చారు. ఆ సమయంలో శంషాబాద్ నుంచి బొంగుళూరు గేటుకు వస్తున్న హస్తినాపురానికి చెందిన మనోజ్‌తోపాటు ఆరుగురితో ఉన్న కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటుకుని అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి, అంబులెన్స్ డ్రైవర్ శివ అక్కడికక్కడే మృతిచెందారు. హేమచందర్‌రావు, శ్రీనివాసరావు, రామారావు, అంబులెన్స్ మరో డ్రైవర్ మోహిద్ తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు కర్ణాటకకు చెందిన వారు కాగా.. అంబులెన్స్ డ్రైవర్ శివది ఆంధ్రప్రదేశ్. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. ఆదిభట్ల పోలీసులు వచ్చి క్షత్రగాత్రులను, మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన రామారావును వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిభట్ల సీఐ నరేందర్ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో నలుగురు యువకులు మృతి
శామీర్‌పేట్/తొర్రూరు రూరల్ (పాలకుర్తి): తమ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలనుకున్న నలుగురు యువకుల లక్ష్యం నెరవేరకుండానే జీవితాన్ని చాలించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మెదక్ జిల్లాకు వలస వచ్చి తాము లీజుకు తీసుకున్న ఫౌల్ట్రీ ఫామ్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరి హృదయాల్ని కలచివేస్తోంది. స్వయం ఉపాధి ద్వారా నలుగురుకీ ఊరి లో ఆదర్శంగా నిలుస్తారనుకున్న ఆ యువకుల అకాల మరణం గ్రామస్తుల్ని విషాదంలో నింపింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొమ్మరాశిపేట శివారు కేజీఎల్ పౌల్ట్రీఫామ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, వెంకటాపూర్‌కు చెందిన గాదగాని వెంకన్న, అరుణ దంపతుల రెండో కుమారుడు అరవింద్‌గౌడ్(23), మొగుళ్ల వెంకన్న, సోమనర్సమ్మ దంపతుల కుమారుడు శివశంకర్‌గౌడ్(21)లు శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటలో నెల క్రితం సుధాకర్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీఫామ్‌ను లీజుకు తీసుకుని కోళ్ల పెంపకం చేపట్టారు. వీరికి తోడుగా ఉండేందుకు వారి స్వగ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీను, సుభద్ర దంపతుల కుమారుడు మహేశ్ ముదిరాజ్(22)ను వారం రోజుల క్రితం తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నారు. కాగా, ఈ ముగ్గురినీ కలిసేందుకు వీరి స్నేహితుడు పోరెడ్డి మహేందర్‌రెడ్డి(25) వెంకటాపురం నుంచి గురువారం బొమ్మరాశిపేటకు వచ్చాడు. రాత్రి సుమారు 1 గంట వరకు వీరంతా కోడిపిల్లలకు వాక్సిన్ వేశారు. అనంతరం భోజనం చేసి పక్కనే ఉన్న గదిలో పడుకున్నారు. ఉదయం 11 గంటలకు కేజీఎల్(అభ్యుదయ) కంపెనీ సూపర్వైజర్ సతీశ్ కోడిపిల్లల పరిశీలనకు పౌల్ట్రీఫామ్ దగ్గరకు వచ్చాడు. కోడిపిల్లలకు నీరు కూడా పెట్టలేదని గమనించిన సతీశ్ యువకులు నిద్రించిన గది వద్దకు వెళ్ళి వారిని పిలవగా ఎవరూ స్పందించలేదు. దీంతో సతీశ్ తలుపు నెట్టుకుని లోపలికి వెళ్లగా నలుగురు యువకులు మృతిచెందినట్టు కన్పించారు. వెంటనే పోలీసులకు, బంధువులకు సమాచారం అందించాడు. పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు, శామీర్‌పేట సీఐ నవీన్‌రెడ్డిలు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. చలికాచుకునేందుకు ఏర్పాటు చేసుకున్న బొగ్గుల కుంపటే వీరి మృతికి కారణమై ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకులు మరణించడంతో తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు గాంధీ ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. నివేదిక అనంతరమే.. ఈ యువకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొగ్గుల కుంపటి వల్లే ఊపిరాడక చనిపోయి ఉంటారని కొందరు, కోడి పిల్లలకిచ్చే వ్యాక్సిన్ ద్రావణం ఆహారంలో కలవడం వల్లేనని, వీరంటే గిట్టని వారెవరో ఆహారంలో విషం కలిపి ఉంటారన్న మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీరి మృతికి విషాహారమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది పోస్టుమార్టం నివేదిక అనంతరం తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. -
కెనడాలో కాల్పులు.. నలుగురు మృతి
ఒట్టావా: కెనడా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇక్కడి న్యూబ్రున్స్విక్ ప్రావిన్సులోని ఫ్రెడెరిక్టన్ సిటీలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు శుక్రవారం ఉదయం 7 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) బ్రూక్సైడ్ డ్రైవ్‌లో తన అపార్ట్మెంట్ కిటికీ నుంచి కోర్టు ప్రాంగణంపైకి తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు మరో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా దుండగుడు దాక్కున్న అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టారు. బ్రూక్సైడ్ ప్రాంతంలోని ప్రజలెవరూ బయటకు రావొద్దనీ, ఆపరేషన్ కొనసాగుతోందని ట్విట్టర్లో హెచ్చరించారు. గంట తర్వాత ఓ నిందితుడ్ని అరెస్ట్ చేశామని, పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నిందితుడికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
కావేరిలో మునిగి నలుగురు మృతి
సేలం: కావేరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు నీట మునిగి మృతి చెందగా ఒక బాలుడు గల్లంతయ్యాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. మెట్టూరు సమీపంలోని కోల్నాయకన్ పట్టి గ్రామానికి చెందిన వాణిశ్రీ (19), ధనుశ్రీ (16)తోపాటు తిరుప్పూర్ జిల్లా విజయమంగళంనకు చెందిన శరవణన్ (35), ఆయన భార్య మైథిలి (32), కుమారుడు హరిహరన్ (9), రవినా (15) కావేరి నదిలో స్నానానికి దిగి మునిగిపోయారు. స్థానికులు ధనుశ్రీని మాత్రమే కాపాడగలిగారు. గజ ఈతగాళ్ల సాయంతో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. హరిహరన్ కోసం ఆదివారం సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది. -
ప్రచారాన్ని హడలెత్తిస్తున్న ఉగ్రదాడులు
దేరా ఇస్మాయిల్ ఖాన్/పాకిస్తాన్: ఓవైపు ఎన్నికల్లో ఉగ్రనేతలు పోటీకి దిగడంతో పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోవైపు ఎన్నికల ప్రచార ర్యాలీల్లో బాంబు దాడులు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్తానీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) తరపున ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇక్రాముల్లా ఖాన్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఖాన్ వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పంక్త్వా ప్రావిన్సులో గల దేరా ఇస్మాయిల్ ఖాన్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు.ఈ దాడిలో ఇక్రాముల్లాతో జీపు డ్రైవర్, సెక్యూరిటీ గార్డు, మరో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక పోలీస్ అధికారి పలీస్ జరూర్ అఫ్రీదీ తెలిపారు. ఖైబర్ పంక్త్వాలో అతిపెద్ద బాంబు దాడి ఇదిలా ఉండగా పది రోజుల క్రితం కూడా ఖైబర్ పంక్త్వా ప్రావిన్స్‌లో బాంబుల వర్షం కురిసింది. ఎన్నికల ప్రచార ర్యాలీపై విరుచుకుపడిన ఉగ్రవాదులు 149 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ ఎన్నికల ప్రక్రియకు సవాల్ విరిసింది. ఈ నెల 25న పాకిస్తాన్‌లోఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
మధ్యప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజయింది. ఇండోర్-భూపాల్ హైవేపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో కుటుంబం దుర్మరణం
సాక్షి,పెద్దపల్లి/సుల్తానాబాద్: రోడ్డు ప్రమాదం నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి 1.30 ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిచి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారు నడుపుతున్న చదువాల అరుణ్‌కుమార్ (37) భార్య సౌమ్య (30), కుమారుడు అఖిలేశ్ (9), కూతురు శాన్వీ(5) దుర్మరణం చెందారు. కారు ప్రమాదానికి గురికాగానే, సమీపంలోని రైస్‌మిల్లు సిబ్బంది, గ్రామస్థులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే కారు నుజ్జునుజ్జు కావడంతో వారిని బయటకు తీయడం కష్టంగా మారింది. అప్పటికే అరుణ్‌కుమార్, భార్య, కూతురు మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న బాలుడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడు. అరుణ్ మంథనిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. గురువారం హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో తన సోదరు డు సాయికుమార్ బావమరిది ఓం ప్రకాశ్‌ను పాలిటెక్నిక్ కళాశాలలో చేర్చి రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లాలని రాత్రే బయలుదేరినట్లు బంధువులు చెప్పారు. ఈ క్రమంలో కాట్నపల్లి వద్ద వీరి కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు 4 గంటలు శ్రమి ంచారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుల్తానాబాద్ ట్యాం క్ రోడ్‌కు చెందిన అరుణ్ కుటుంబం 6 ఏళ్ల క్రితం మంథనిలో స్థిరపడింది. -
ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తర్‌పూర్‌లో జరిగిన ఈ కాల్పుల్లో పోలీసులు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ రాజేశ్ భారతీ సహా నలుగురు నేరస్తుల్ని కాల్చిచంపారు. గాయపడ్డ మరో నేరస్తుడిని ఆస్పత్రిలో చేర్చారు. ఛత్తర్పూర్ దగ్గర్లోని చందన్‌హోలా గ్రామంలోని ఫామ్‌హౌస్‌లో రాజేశ్ గ్యాంగ్ భేటీకానుందని పక్కా సమాచారం అందిందని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి లొంగిపోవాలని గ్యాంగ్ సభ్యుల్ని హెచ్చరించారు. అయినా, నేరస్తులు పోలీసులపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో రాజేశ్, విద్రోహ్, ఉమేశ్, భీకూ, కపిల్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించగా రాజేశ్‌తో పాటు మరో ముగ్గురు నేరస్తులు మార్గమధ్యంలో చనిపోయారు. రాజేశ్ గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు గాయపడ్డారు. వీరిలో హెడ్‌కానిస్టేబుల్ గిర్ధర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలం నుంచి రెండు .30 బోర్ తుపాకులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో హతమైన రాజేశ్, విద్రోహ్‌లపై రూ.లక్ష, ఉమేశ్‌పై రూ.50 వేల రివార్డు ఉంది. ఈ నేరస్తులపై హత్య, బెదిరింపులు, కార్ల హైజాకింగ్, దోపిడీ వంటి 25 కేసులు ఉన్నాయి. -
అతివేగం.. ప్రాణాలు తీసింది..
హైదరాబాద్: అతివేగం ఐదు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఐదుగురు స్నేహితులు విహార యాత్రకు వెళుతుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతిచెందగా.. మరో యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వీరంతా 19 ఏళ్ల లోపు వారే.. అందివచ్చిన కొడుకులు చేదోడు వాదోడుగా నిలుస్తారన్న ఆ తల్లిదండ్రుల కలలు రోడ్డు ప్రమాదం రూపంలో ఆవిరైపోయాయి. కారు అద్దెకు తీసుకుని.. పోలీసుల కథనం ప్రకారం.. కృషికాలనీకి చెందిన భీంసేన్ తిరుపతమ్మల మూడో కుమారుడు రామారావు(18) పదో తరగతితో చదువు మానేసి క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు కుమారుడు ఉదయ్‌కిరణ్(19) అమలాపురంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పాండుబస్తీకి చెందిన పోలనాయుడు, సరస్వతిల కుమారుడు హేమసుందర్(19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కృషికాలనీకే చెందిన నారాయణ, నిర్మల కుమారుడు కిరణ్(18) జీడిమెట్లలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సాయిబాబా, వాణిల కుమారుడు గణేష్(19). వీరు ఐదుగురు ప్రాణ స్నేహితులు. శుక్రవారం వికారాబాద్‌లోని అనంతగిరి వెళ్లేందుకు వీరంతా ప్లాన్ వేసుకున్నారు. వీరికి కారు లేకపోవడంతో గచ్చిబౌలిలోని జూమ్‌క్యాబ్స్ నుండి హ్యుండయ్ ఐ20(టీఎస్07యూఎఫ్5592) కారును మూడు రోజులకు బుక్ చేసుకున్నారు. గాల్లోకి ఎగిరి.. పల్టీలు కొట్టి.. శుక్రవారం తెల్లవారుజామున 2:40 గంటలకు వికారాబాద్ వెళ్లేందుకు సాయిబాబానగర్ నుండి బాలానగర్ వైపు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జీడిమెట్ల డిపో సమీపంలోని డీపీ కాలనీ వద్ద గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. దాదాపు ఐదు మీటర్ల ఎత్తున గాల్లోకి ఎగిరిన కారు రోడ్డుపై రెండు పల్టీలు కొట్టి 100 మీటర్ల దూరం వరకూ దూసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న రామారావు, పక్కసీట్లో కూర్చున్న ఉదయ్‌కిరణ్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన హేమసుందర్, గణేష్, కిరణ్‌లను స్థానికులు 108లో సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. హేమసుందర్, గణేష్ చికిత్స పొందుతూ కన్నుమూయగా.. కిరణ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కారు వెనక సీట్లో కూర్చున్న కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకేసారి నలుగురు యువకులు మృతిచెందడంతో సాయిబాబానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. హేమసుందర్ తండ్రి పోలనాయుడు మృతిచెందడంతో తల్లి సరస్వతి కుమారుడిని చదివిస్తోంది. చదువు పూర్తి చేసుకుని ప్రయోజకుడవుతాడనుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చిన తీరు కంటతడి పెట్టించింది. -
ఆ తల్లీ బిడ్డలది హత్యే..
భువనేశ్వర్ : డబ్బు కోసం కన్న కూతుర్ని, ఆమె పిల్లల్ని హతమార్చాడో కిరాతకుడు. ఈ విషాద సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన జగత్సింగ్పూర్ జిల్లా కుజంగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జగన్నాథ్‌పూర్ గ్రామం మహానది తీరంలో తల్లీబిడ్డల శవాలు తేలిన సంఘటన రాష్ట్ర ప్రజల హృదయాల్ని కలిచివేసింది. భర్త అకాల మరణంతో చేతికి ముట్టిన మృత్యుపరిహారం నగదు కోసం కన్న కూతురితో పాటు ఆమె బిడ్డల్ని సైతం హతమార్చిన కసాయి కన్నతండ్రి ఈ సంఘటనలో నిందితుడు. జగన్నాథ్‌పూర్ గ్రామస్తుడు అక్షయ శెట్టి కన్న కూతురితో పాటు ఆమె బిడ్డల్ని హతమార్చిన హంతకుడని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనలో కన్నతల్లితో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుని మృతదేహాలు మహానదిలో కనిపించాయి. వీరిని దివంగత విశ్వంబర శెట్టి కుటుంబీకులుగా గుర్తించారు. విశ్వంబర్ శెట్టి గత నెల 4వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన మృతికి పరిహారంగా రూ.3లక్షలు అందింది. ఈ సొమ్ము మీద మృతుని మామ కన్నువేసి కాజేసేందుకు వ్యూహం పన్నాడు. వ్యూహం మేరకు తొలుత మనుమడు, మనుమరాళ్ల అడ్డు తొలగించాడు. బిడ్డల కోసం ఆరాటపడి తండ్రి చెంతకు చేరిన కన్నకూతుర్ని చివరగా నీటిలో తోసి ఖతం చేశాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నిందితుడు అక్షయ శెట్టి మనుమడు మున్నా, ఇద్దరు మనుమరాళ్లు బొర్షా, దిశాలకు బిస్కెట్లు ఇచ్చి మురిపించి మహానది ఒడ్డుకు తీసుకువెళ్లి అక్కడ పిల్లల్ని అకస్మాత్తుగా నదిలోకి నెట్టేసి చల్లగా జారుకున్నాడు. ముగ్గురు బిడ్డలు ఒక్కసారిగా కనుమరుగు కావడంతో తల్లడిల్లిన తల్లి మమినా శెట్టి కన్నతండ్రి చెంతకు చేరి బిడ్డల కోసం ఆరా తీసింది. తల్లడిల్లుతున్న కన్న తల్లి ఆవేదనను ఆసరాగా తీసుకున్న అక్షయ శెట్టి కన్నకూతురన్న మమకారం కూడా లేకుండా బిడ్డల కోసం గాలించే నెపంతో ఆమెను కూడా మహానది ఒడ్డుకు తీసుకువెళ్లాడు. పసి బిడ్డల తరహాలో ఆమెను కూడా నదిలోకి అకస్మాత్తుగా నెట్టేశాడు. తెల్లారేసరికి కన్నతల్లితో పాటు ముగ్గురు బిడ్డల మృతదేహాలు నదిలో తేలాయి. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు ఒడిశా విపత్తు స్పందన దళం(ఒడ్రాఫ్), అగ్నిమాపక దళం, స్థానిక పోలీసుల సహకారంతో నదిలో తేలిన శవాల్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అనుబంధ పరీక్షల్ని నిర్వహించారు. తరువాత సంఘటనపై కేసు నమోదు చేసి, నిర్వహించిన దర్యాప్తులో కథ వెనుక ఖల్నాయక్ మమినా శెట్టి కన్న తండ్రి అక్షయ శెట్టిగా దర్యాప్తు బృందం ఖరారు చేసిందని జగత్సింగ్పూర్ జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మంగళవారం ప్రకటించారు. -
బైక్‌ను ఢీకొట్టిన కారు నలుగురు మృతి
-
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సత్తెనపల్లిలోని వావిలాలనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరో తరగతి విద్యార్థి రాళ్లబండి విశ్వం మృతిచెందాడు. వినుకొండ మండలం గోకనకొండలో జరిగిన ప్రమాదంలో వీరాంజనేయులు మృత్యువాత పడ్డాడు. పొగమంచు కారణంగా ఆగివున్న లారీని ఢీకొన్న సంఘటనలో ఉద్యోగి విఘ్నేశ్వర్ దుర్మరణం చెందాడు. నకరికల్లులో బంధువుల ఇంటి వెళ్లి వస్తూ యువకుడు మృతిచెందాడు. సత్తెనపల్లి: పట్టణంలోని వావిలాలనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందాడు. 30 వ వార్డు వావిలాలనగర్కు చెందిన రాళ్లబండి విశ్వం (12) ఆరో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో అంబేడ్కర్ నగర్ 2వ లైను నుంచి సైకిల్‌పై ఎడమవైపు ప్రయాణిస్తూ వావిలాలనగర్లోని ఇంటి వద్దకు వస్తున్నాడు. అదే సమయంలో సత్తెనపల్లినుంచి పాకాలపాడువెళ్తున్న యనబర్ల యాకోబు ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో విశ్వంకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ రూ.లక్ష ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తిరిగి జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ విశ్వం బుధవారం మృతిచెందాడు. మృతుని తల్లిదండ్రులు రాళ్లబండి వీరబ్రహ్మం, సుజాత వడ్రంగి పని చేస్తు జీవనం వెళ్లదీస్తారు. కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పండుగ పూట బిడ్డ మృత్యువాతను తట్టుకోలేక కుటుంబ సభ్యులు గుండెలుబాదుకుంటూ రోదిస్తున్నారు. వారి రోదన చూపరులను సైతం కంటతడి పెట్టించింది. విశ్వం మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. సత్తెనపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని 30వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఆకుల స్వరూపా హనుమంతరావు సందర్శించి నివాళులర్పించారు. గోకనకొండ యువకుడు మృతి వినుకొండ రూరల్,దాచేపల్లి: సంక్రాంతి సెలవులు ముగించుకొని ఉద్యోగానికి వెళ్లూ రోడ్డు ప్రమాదంలో గోకనకొండ గ్రామానికి చెందిన వేల్పుల వీరాంజనేయులు (28) మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు భార్య హైమావతికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడైన వీరాంజనేయులు కొంతకాలంగా హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతిని పురస్కరించుకొని సెలవులపై ఈనెల 13న ఇంటికి చేరుకున్నారు. సెలవులు ముగించుకొని తిరిగి ఉద్యోగంలో చేరేందుకు బుధవారం ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలు దేరాడు. దాచేపల్లి వద్ద లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఈసంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. అలుముకున్నాయి. కలగా మిగిలిన జీవితం జీవితంలో స్థిరపడి, వివాహం చేసుకుని తనకాళ్లపై తాను స్థిరపడి తల్లి దండ్రులను పోషించాలని కలలు కన్నాడు. ముందుగా తమ్ముడికి విహహిం జరిపించాడు. తల్లి దండ్రులను సుఖపెట్టాలనే కోరిక తీరక ముందే ప్రమాదంలో ఆయన మృతి చెందడంపై గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ... నకరికల్లు : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన నకరికల్లు మండలం అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి జరిగింది. క్రోసూరుకు చెందిన గుత్తి గంగయ్య(40), క్రాంతికుమార్, ఝాన్సీలు రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో అడ్డరోడ్డు సమీపంలోని గోడౌన్స్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో గంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, క్రాంతికుమార్, ఝాన్సీలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ జి.అనీల్‌కుమార్ బాధితుల బంధువులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పొగమంచుకు ఇంజినీరింగ్ విద్యార్థి బలి పిడుగురాళ్లరూరల్: తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండటంతో ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. దాచేపల్లి నుంచి ద్విచక్రవాహనంపై నలుగురు యువకులు పిడుగురాళ్ల వైపు వస్తున్నారు. మార్గం మధ్యలో టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రగాయాలపాలు కాగా క్షతగాత్రులను టోల్‌ప్లాజా అంబులెన్సు ద్వారా పిడుగురాళ్లలోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో రాగిడి విఘ్నేశ్వర్(20) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టి చిన్న, గొట్టిముక్కల ప్రేమ్‌చంద్, ఇట్టె బాలాజీలు చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన విఘ్నేశ్వర్ నర్సరావుపేట ఎన్ఈసీ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
టేకులపల్లి (ఇల్లెందు): ఆగి ఉన్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెం పంతులునాయక్ తండాకు చెందిన మాలోతు మోతీలాల్, ఆయన భార్య లత, కుమారుడు చరణ్, మేనల్లుడు వంశీ (ఆటో డ్రైవర్).. ఆదివారం పాల్వంచ సమీపంలోని పెద్దమ్మ గుడికెళ్లారు. సాయంత్రం అక్కడి నుంచి తిరిగొస్తుండగా కొత్తగూడెం క్రాస్‌రోడ్డు వద్ద మరో ముగ్గురు ప్యాసింజర్లు ఆటో ఎక్కారు. అయితే టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ తంగెల్లతండా సమీపంలోకి రాగానే చరణ్, అతడి తల్లి లత కాలకృత్యాలు తీర్చుకోడానికి ఆటో దిగారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ముందు నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఆటో లారీ కింద ఇరుక్కుపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. జేసీబీల సాయంతో 3 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో ఒకరిని ఎర్రనాగు రమేశ్(25)గా గుర్తించారు. మరో ఇద్దరు మహిళల వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కొత్తగూడెం తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాలోతు మోతీలాల్ (40) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి
-
భీకరి
► గజరాజు బీభత్సం ► నలుగురి మృతి ► శోకసంద్రంలో కోవై ► మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా గజరాజు అంటూ ప్రజలచే గౌరవంగా పిలిపించుకునే ఏనుగు ఆ ప్రజల ప్రాణాలనే హరించి వేసింది. ప్రజలను వెంటపడి తరిమింది. పదిగంటలకు పైగా గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ముక్కుపచ్చలారని 12 ఏళ్ల చిన్నారిని కాలితో చిదిమేసింది. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వృద్ధులను చంపేసింది. అటవీ, పోలీసు శాఖల వందలాది మంది అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. మదంపట్టిన గజరాజు మారణకాండ వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: కోయంబత్తూరు నగరానికి ఆనుకునే పోత్తనూరు, వెల్లలూరు, కోవైపుత్తూరు, మధుకరై ప్రాంతాల్లో అడవి ఏనుగులు ఊళ్లోకి చొరబడి ప్రజలపై దాడులు చేయడం పరిపాటిగా మారింది. అటవీ అధికారులపై ఆశలు పెట్టుకోకుండా ప్రజలు ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే శుక్రవారం నాడు జరిగిన గజరాజు బీభత్సాన్ని మాత్రం జనం మరువలేకున్నారు. పోత్తనూర్ సమీపం గణేశపురం మురనండమ్మాళ్ ఆలయం వీధిలో నివసించే విజయకుమార్ (30) హస్తసాముద్రిక జోస్యం నిపుణుడు. ఇతని కుమార్తె గాయత్రి (12). ఎండకాలం కావడంతో ఇద్దరూ ఇంటి వసారాలో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజాము 3.15 గంటల సమయంలో మదం పట్టిన ఒక అడవి ఏనుగు ఆలయ వీధిలోకి ,చొరబడింది. ఇష్టం వచ్చినట్లుగా విహరిస్తూ ఇంటి వసారాలో గాయత్రిపై విరుచుకుపడి కాలితోతొక్కి నలిపేయడంతో సంఘటన స్థలంలోనే చిన్నారి మృతి చెందింది. కుమార్తెను కాపాడేందుకు విజయకుమార్ ముందుకు వెళ్లడంతో ఏనుగు తన తొండతో అతన్ని చుట్టి దూరంగా గిరాటు వేసింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఏనుగు విలయతాండవానికి భయభ్రాంతులకు గురైన ప్రజలు దాన్ని అడవుల్లోకి తరిమివేసేందుకు ప్రయత్నించారు. కర్రలు చేతపట్టుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు తరుముకోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలోని పంట పొలాల్లోకి ప్రవేశించింది. సరిగ్గా అదే సమయంలో పొలాల్లో బహిర్భూమికి వెళుతున్న జ్యోతిమణి (60), నాగరత్నం (50) అనే ఇద్దరు మహిళలపై దాడి చేయగా వారిద్దరూ దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆ పరిసరాల ప్రజలు త్రిశూలాలు, కమ్ములు, కత్తులు పట్టుకుని ఏనుగు వెంటపడ్డారు. దీంతో మరింత ఆవేశానికి లోనైన గజరాజు వారికి ఎదురుతిరగడంతో భయపడిన ప్రజలు తలోదిక్కుగా పారిపోయారు. ఊరి శివార్లలోని తన తోటకు నీళ్లుపట్టేందుకు బయలుదేరిన పళనిస్వామి (73) ఏనుగు బీభత్సాన్ని చూసేందుకు అగిపోయాడు. దీంతో ఒక్క ఉదుటన అక్కడి చేరుకున్న ఏనుగు పళనిస్వామిపైనా దాడి చేసింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే పళనిస్వామి (73) ప్రాణాలు కోల్లోయారు. మరో నలుగురిని గాయపర్చిన ఏనుగును అడవుల్లోకి తరిమేందుకు అటవీఅధికారులు బాణసంచా కాల్చారు. అయితే టపాసుల చప్పుళ్లకు ఏమాత్రం జంకని ఏనుగు ఆ పరిసరాల్లోనే తచ్చాడుతూ గడిపింది. ఇంతలో తెల్లారిపోయి ప్రజలంతా రోడ్లపైకి రావడంతో ఏనుగు మరింత విజృంభించి ఊళ్లోకి ప్రవేశిస్తే మరింత ప్రమాదమని భావించిన అధికారులు బాణసంచా కాల్చడం నిలిపివేశారు. దీంతో ఏనుగును అటవీవైపు మళ్లించడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఇక లాభం లేదనుకుని మదపుటేనుగును తమవైపు ఆకర్షించుకుని అడవిదారి పట్టించే సామర్థ్యం కలిగిన కలీమ్, మారియప్పన్, పారీ, సుజయ్ అనే నాలుగు గుమ్కీ ఏనుగులను రప్పించారు. అలాగే మరోవైపు మత్తు ఇంజక్షన్లను ఇచ్చేందుకు పశువైద్యులు, ఆయుధాలతో కోయంబత్తూరు నగర పోలీసులు సైతం సిద్ధమయ్యారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో పశు వైద్యులు మనోహరన్ ఆ ఏనుగుకు రెండు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి అదుపులోకి తెచ్చుకున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు ఎవ్వరూ రాకుండా 150 మంది పోలీసులు బందోబస్తులో నిలిచారు. ఈ సమయంలో ప్రజల సహాయాన్ని తీసుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పశువైద్యులు జీపులో 25 అడుగుల దూరం నుంచి తుపాకీల ద్వారా మదపుటేనుగుపై మత్తు ఇంజక్షన్లను ఇచ్చారు. కొద్దిసేపటికి ఏనుగు స్పృహతప్పడంతో బలమైన తాళ్లు కట్టి అదుపులోకి తీసుకున్నారు. స్పృహ వచ్చిన తరువాత లారీలో తరలించారు. ఏనుగులు సంచరించే భూములను ప్రజలు ఆక్రమించి నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవడం వల్లనే గజరాజులు దాడులు చేస్తున్నాయని అధికారులు అంటున్నారు.సీఎం రూ.4లక్షల నష్టపరిహారం: ఏనుగు దాడిలో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నష్టపరిహారాన్ని ప్రకటించారు.