మెదక్ జిల్లాలో గుడిసె దగ్ధం.. నలుగురి సజీవ దహనం | four were killed in fire accident | Sakshi
Sakshi News home page

మెదక్ జిల్లాలో గుడిసె దగ్ధం.. నలుగురి సజీవ దహనం

Published Fri, Jan 24 2014 2:07 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

four were killed in fire accident

అల్లాదుర్గం, న్యూస్‌లైన్: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మర్వెల్లి గ్రామానికి పెంటయ్య కుటుంబం కూలీ పనులు చేసుకోవడానికి బతుకుదెరువు కోసం వచ్చారు. గురువారం అర్ధరాత్రి వారు నివసిస్తున్న గుడిసెకు ఒక్కసారిగా నిప్పంటుకొని దహనమైంది. దీంతో అందులో నిద్రిస్తున్న పెంటయ్య భార్య లక్ష్మి (35), కూతురు పోచమ్మ (3), కొడుకు మొగులయ్య (2), అక్క చంద్రమ్మ (45) సజీవ దహనమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement