ఏనుగుల దాడిలో నలుగురి మృతి
బర్ధమాన్ (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్‌లో వేర్వేరు చోట్ల ఏనుగుల మంద చేసిన దాడిలో ఒక మహిళ సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి గాయాలయ్యాయి. బర్ధమాన్ జిల్లాలోని నశిగ్రామ్ గ్రామానికి చెందిన ఆనందమయి రాయ్ (60), నారాయణ్ చంద్ర మాఝి(60) శనివారం వేకువజామున బహిర్భూమికి వెళ్లగా అక్కడ సంచరిస్తున్న రెండు అడవి ఏనుగులు దాడిచేసి చంపేశాయి.
మరో ఘటనలో, కత్వాలో ఉండే ప్రకాశ్ బోయ్‌రా(40) బఘాసొలే గ్రామానికి శనివారం వచ్చి గ్రామంలోని తన స్థలాన్ని చూసుకునేందుకు అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడికొచ్చిన అడవి ఏనుగు ప్రకాశ్‌ను తొక్కిచంపేసింది. మంతేశ్వర్ బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్ గ్రామంలో తన పొలంలో పనిచేస్తున్న సిరాజ్ షేక్(45)ను సైతం అడవి ఏనుగు వెంటాడి తొక్కి చంపేసింది. బంకురా జిల్లాలోని దల్మా అటవీ ప్రాంతంలోని ఐదు ఏనుగుల మంద దామోదర నదిని దాటి శనివారం బర్ధమాన్ జిల్లాలోకి ప్రవేశించి ఇలా బీభత్సం సృష్టించిందని జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు.