elephants attack
-
భక్తుల మృతి అత్యంత బాధాకరం: వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గుంటూరు, సాక్షి: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో భక్తులు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మృతి అత్యంత బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. ‘‘శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడి చేయడం అత్యంత బాధాకరం. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి’’ అని వైఎస్ జగన్ కోరారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను వంకాయల దినేష్, తుపాకుల మణమ్మ, చంగల్ రాయుడుగా గుర్తించారు. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి నడుచుకుని వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయి. -
భక్తులపై ఏనుగులు దాడి .. ముగ్గుర్ని తొక్కి..!
-
ఫోటో సరదా ప్రాణం తీసింది : కాబోయే భార్య కళ్లముందే విషాదం!
దక్షిణాఫ్రికాలోని ఒక నేషనల్ పార్క్‌లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. స్పానిష్ పర్యాటకుడు ఒకరు ఏనుగుల గుంపు దాడిలో దుర్మరణం పాలయ్యాడు. పిలాన్స్‌బర్గ్ జాతీయ ఉద్యానవనానికి సఫారీకి వెళ్లిన సందర్భంగా ఆదివారం ఈ ఘటన జరిగింది.అధికారుల సమాచారం ప్రకారం 43 ఏళ్ల స్పానిష్ టూరిస్ట్ తన కాబోయే భార్య, మరో ఇద్దరితో కలిసి జాతీయ ఉద్యానవనంలో విహరి స్తున్నాడు. ఇంతలో ఏనుగుల గుంపును చూసిన అతడు వాహనం నుంచి బయటికి వచ్చి మరీ ఫోటోలు తీయాలని సరదా పడ్డాడు. అంతే ఒక్కసారిగా మూడు పెద్ద ఏనుగులు దాడికి దిగాయి. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన పిల్ల ఏనుగులకు హాని చేస్తున్నాడనే ఆగ్రహంతోనే పెద్ద ఏనుగు దాడికి దిగిందని, దీంతో మిగతావి కూడా ఎటాక్ చేశాయని పర్యాటక శాఖ ప్రతినిధి పీటర్ నెల్ మీడియాకు తెలిపారు. రెండు ఇతర వాహనాలలో ఉన్నతోటి పర్యాటకులు హెచ్చరించినప్పటికీ , పట్టించు కోలేదని, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిందని నార్త్ వెస్ట్ పార్క్స్, టూరిజం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఉండే అడవి జంతువుల దగ్గరకు వెళ్లకూడదనీ, వాహనం నుండి దిగి ఫోటోలు తీసే ప్రయత్నం చేసినా, సెల్ఫీలు తీసుకున్నా, ప్రమాదానికి దారితీస్తాయని స్థానికులు వెల్లడించారు. -
వీడియో వైరల్.. దెబ్బకు దేవుడు కనిపించడమంటే ఇదే..
లక్నో: మనుషులు చేసే కొన్ని చేష్టలు అప్పుడప్పుడు వారి ప్రాణాల మీదకు వస్తాయి. ముఖ్యంగా జంతువుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. జంతువుల విషయంతో ఓవర్‌గా బిహేవ్ చేస్తే అవి ఇచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు మరి.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ముగ్గురు వ్యక్తులు ఏనుగులతో సెల్ఫీలు దిగుదామని డేర్ చేసి అతి చేశారు. దీంతో, గజరాజులకు మండిపోయి.. వాటి వెంటపడ్డాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు రోడ్డు మీద పరిగెత్తుకుంటూ.. లేస్తూ.. పడుతూ.. ఏనుగుల దాడి నుంచి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. యూపీలోని లఖింపూర్ ఖేరీ జిల్లా నుంచి ముగ్గురు వ్యక్తులు నేపాల్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో దుద్వా టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తుండగా అక్కడ ఏనుగుల గుంపు వారికి కనిపించింది. ఇంకేముంది.. వారి చేతిలో సెల్‌ఫోన్స్ తీసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో, వారి చేష్టలకు ఏనుగులకు చిర్రెత్తుకొచ్చింది. అనంతరం.. ఏనుగులు ఒక్కసారిగా వారి పైకి దూసుకొచ్చాయి. వెంటనే వణికిపోయి భయంతో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పరుగులు తీశారు. ఈ క్రమంలో పరుగులో అదుపుతప్పి ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. ఎలాగోలా ఏనుగుల బారినుంచి వారు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. लखीमपुर खीरी के दुधवा नेशनल पार्क में कुछ लोग हाथी के साथ सेल्फी ले रहे थे, अचानक हाथियों ने सभी को दौड़ा लिया।#LakhimpurKheri #DudhwaNationalPark #UttarPradesh #elephant #elephantattack #ViralVideos #lakhimpur #kheri #kheriviralvideo pic.twitter.com/4IH2Rkpj5c — Daily Insider (@dailyinsiderup) July 5, 2023 ఇది కూడా చదవండి: వీడియో: ఫారినర్‌ను అసభ్యంగా తాకుతూ ఆ ఆటోడ్రైవర్ వేధింపులు.. వైరల్ -
ఆర్మీ ఆస్పత్రిలో ఏనుగుల కలకలం
-
అయ్యబాబోయ్ ఏనుగులు.. పరుగో పరుగు!
యశవంతపుర: రహదారిపై ఏనుగుల మంద తిష్ట వేసి, వాహనాలను ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా సరిహద్దులో జరిగింది. హాసనూరు వద్ద తమిళనాడు దిండిగల్ హైవే–209లో ఆదివారం ఉదయం ఏనుగుల మంద చొరబడింది. ఇది మా అడ్డా, మీకేం పని అన్నట్లు రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడి ఆపేశాయి. వాహనాలలోని ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఒక కారు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించగా ఏనుగులు కారుపై కాళ్లు పెట్టి మరీ అడ్డుకున్నాయి. వెనుక కార్లలో ఉన్నవారు ఏనుగుల రుబాబును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ఈ మార్గంలో అప్పుడప్పుడు ఏనుగులు చొరబడి వాహనాలపై దాడులు చేస్తుంటాయి. తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం తిరుమల: తిరుమల మొదటిఘాట్ రోడ్డులో ఆదివారం ఏనుగుల గుంపు మరోమారు కలకలం సృష్టించాయి. మొదటిఘాట్ రోడ్డులోని ఎలిఫెంట్ ఆర్క్ సమీపంలో పది ఏనుగుల గుంపు రోడ్డుకు సమీపంలోని అటవీప్రాంతంలో చెట్లను విరుస్తూ శబ్దాలు చేశాయి. దీంతో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తోన్న వాహనచోదకులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న టీటీడీ అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి తరిమారు. ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారించడం ఇది రెండోసారి. (క్లిక్: రోడ్డు రోలర్‌తో తొక్కించి సైలెన్సర్ల ధ్వంసం) -
ఏనుగుల గుంపు బీభత్సం.. రైతులు గగ్గోలు
పిచ్చాటూరు: చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. బుధవారం అర్థరాత్రి పిచ్చాటూరు పట్టణంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు మండలంలోని వేలూరు వెంగాలత్తూరు, రామాపురం మీదుగా పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. రామాపురంలో వరి పంటను ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏనుగుల గుంపు సంచారం ఉండటంతో ప్రజలు, రైతులు ఎప్పుడు దాడి చేస్తాయోమోనని భయంతో వణికిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏనుగులను అడవిలోకి తరిమివేయాలని విజ్ఞప్తి చేశారు. -
చిత్తూరు : పలమనేరు ప్రాంతంలో ఏనుగుల సంచారం
-
యువకుడిని తొక్కి చంపిన ఏనుగుల గుంపు
సాక్షి, ఛత్తీస్‌గఢ్: దంతరి జిల్లాలో దారుణం జరిగింది. విశ్రామ్‌పూర్ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు దాడిలో యువకుడు మృతిచెందాడు. విండోటోలా అటవీ ప్రాంతంలో కూలి పనులు చేసేందుకు వెళ్లిన యువకుడిపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల కాళ్ల మధ్యలో నలిగిపోయిన యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చదవండి: ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి -
గజరాజుల బీభత్సం: నలుగురు మృత్యువాత
కోయంబత్తూరు: తమిళనాడులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. నిద్రిస్తున్న వారిపై ఏనుగుల దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెల్లలూరు పట్టణ శివారులో శుక్రవారం వేకువజామున చోటు చేసుకుంది. మృతుల్లో 12 ఏళ్ల బాలిక ఉంది. వరండాలో నిద్రిస్తున్న బాలికపై దాడి చేసిన ఏనుగులు అనంతరం పక్కనే ఉన్న మరో ముగ్గురిని తొక్కి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు అప్రమత్తమై ముగ్గురినీ స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖాధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని ఏనుగులను దగ్గరలో ఉన్న మాడుక్కురై అడవిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగులను శాంతింపజేసేందుకు మరో ఏనుగుల గుంపును సంఘటనాస్థలానికి తీసుకువచ్చారు. అప్పటి వరకు ప్రజలు బయటప్రదేశాల్లో నిద్రించవద్దని హెచ్చరించారు. -
పలమనేరులో ఏనుగుల బీభత్సం
చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు పంట పొలాలను నాశనం చేసింది. వరి, రాగి, బీన్స్ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని రామసముద్రం నుంచి ఏనుగు వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఏనుగుల దాడిపై గ్రామస్థులు అటవీ శాఖ అధికారలకు సమాచారం అందించారు. -
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.
-
ఏనుగుల దాడిలో నలుగురి మృతి
బర్ధమాన్ (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్లో వేర్వేరు చోట్ల ఏనుగుల మంద చేసిన దాడిలో ఒక మహిళ సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి గాయాలయ్యాయి. బర్ధమాన్ జిల్లాలోని నశిగ్రామ్ గ్రామానికి చెందిన ఆనందమయి రాయ్ (60), నారాయణ్ చంద్ర మాఝి(60) శనివారం వేకువజామున బహిర్భూమికి వెళ్లగా అక్కడ సంచరిస్తున్న రెండు అడవి ఏనుగులు దాడిచేసి చంపేశాయి. మరో ఘటనలో, కత్వాలో ఉండే ప్రకాశ్ బోయ్రా(40) బఘాసొలే గ్రామానికి శనివారం వచ్చి గ్రామంలోని తన స్థలాన్ని చూసుకునేందుకు అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడికొచ్చిన అడవి ఏనుగు ప్రకాశ్‌ను తొక్కిచంపేసింది. మంతేశ్వర్ బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్ గ్రామంలో తన పొలంలో పనిచేస్తున్న సిరాజ్ షేక్(45)ను సైతం అడవి ఏనుగు వెంటాడి తొక్కి చంపేసింది. బంకురా జిల్లాలోని దల్మా అటవీ ప్రాంతంలోని ఐదు ఏనుగుల మంద దామోదర నదిని దాటి శనివారం బర్ధమాన్ జిల్లాలోకి ప్రవేశించి ఇలా బీభత్సం సృష్టించిందని జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు. -
పొలాలపై ఏనుగుల మంద దాడి
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పెద్దదిమిలి గ్రామ శివార్లలోని పంటలపై నాలుగు ఏనుగుల మంద మంగళవారం ఉదయం దాడికి దిగింది. పొలాల్లో నిల్వ ఉంచిన ధాన్యం రాసులను చెల్లాచెదురు చేశాయి. గ్రామస్తులు భయంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామానికి చేరుకుని ఏనుగులను అటవీ ప్రాంతంలోకి వెళ్లగొట్టేందుకు చర్యలు చేపట్టారు. -
చీకటి పడితే ఏనుగుల బీభత్సం
ఎల్లందపేట (శ్రీకాకుళం): రాత్రి అయ్యిందంటే చాలు.. గజరాజులు గ్రామంలోకి చొరబడుతున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లా ఎల్లందపేట మండలం జంబాడ గిరిజన గ్రామం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ గిరిజన గ్రామంలోకి రాత్రి అయ్యిందంటే చాలు ఏనుగులు చొరబడుతూనే ఉన్నాయి. తిరిగి తెల్లవారగానే కొండపై ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతున్నాయి. గ్రామంలో పలు పంటలను నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటవీ అధికారులు వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పొలాలపై ఏనుగుల దాడి
వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కంటిపై కునుకు లేకుండా పోయింది. రాత్రి అయితే సరి ఏనుగుల గుంపు పొలాలపై పడి విధ్వంసం సృషిస్తుండడంతో వారు భయంతో వణికిపోతున్నారు. మంగళవారం రాత్రి 15 ఏనుగులు బోయ చిన్ననాగులపల్లె, చింతమాకుల పల్లె గ్రామాల్లోని పంటలపై దాడులు చేశాయి. బీట్రూట్, ఇతర కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. వాటిని అడవిలోకి పారదోలేందుకు గ్రామస్తులు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ రెండు గ్రామాలు అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉండడంతో ప్రతీ రోజు ఇవి పొలాలపై దాడులకు దిగుతున్నాయి. అటవీ అధికారులు ఏనుగులను కట్టడి చేయడానికి గట్టి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
రామకుప్పంలో ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లా: చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా శనివారం తెల్లవారుజామున జిల్లా పరిధిలోని రామకుప్పం మండలంలోని రామాపురం తండాలో బీభత్సం సృష్టించాయి. ఏనుగులు జరిపిన ఈ దాడిలో టమోట, బీన్స్, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు అటవీ సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి ఏనుగులను అడవిలోకి తరలించారు. బాధిత రైతులు పంట నష్టం చెల్లించాలని కోరుతున్నారు. అటవీ అధికారులు ఏనుగుల బారినుంచి పంటలను రక్షించాలని రైతులు కోరుతున్నారు. (రామకుప్పం) -
ఏనుగుల దాడి.. పంట నష్టం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి వ్యవసాయ క్షేత్రాలపై విధ్వంసం సృష్టించాయి. శుక్రవారం రాత్రి రామకుప్పం మండలంలోని రామాపురం తండాలో బీన్స్, టమాటా, పశుగ్రాసం పంటలకు నష్టం కలిగించాయి. సమీప అటవీ ప్రాంతాల్లోంచి 10 ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించి సుమారు ఐదు ఎకరాల్లోని బీన్స్, పశుగ్రాసంను తినేశాయి. వాటి దాడిలో ఆరుగురు రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని సమాచారం. ఏనుగుల గుంపు రోజూ పంటలపై దాడులకు దిగుతుండడంతో ఇక్కడి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. (రామకుప్పం) -
అటవీ ఉద్యోగిని తొక్కి చంపిన ఏనుగులు
చిత్తూరు: చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ అటవీ ఉద్యోగిని తొక్కి చంపాయి. రామకుప్పం మండలం ననియాల గ్రామంలో అటవీశాఖ ఉద్యోగి మునియప్పపై ఏనుగులు దాడి చేశాయి. మునియప్ప అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మండలంలోని పంటపొలాలపై ఏనుగులు తరచూ దాడులు చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. లక్షల రూపాయల విలువైన పంటలు ధ్వంసం చేశాయి. ఈ రోజు చేసిన దాడిలో అటవీ ఉద్యోగి దుర్మరణం చెందారు. ** -
మారపల్లిలో ఏనుగులు బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లా రైతులను ఇటీవల కాలంలో ఏనుగులు ముప్ప తిప్పలు పెడుతున్నాయి. తాజాగా కుప్పం మండలం మారపల్లి గ్రామంలోని పంట పొలాలపై ఏనుగులు మంగళవారం అర్థరాత్రి దాడి చేసి... పంటలను పూర్తిగా నాశనం చేశాయి. ఏనుగుల దాడిలో వరి, బీన్స్ పంట పొలాలు పూర్తిగా ధ్వంసమైనాయి. అప్పు చేసి సాగు చేసిన పంటలను ఏనుగులు పొట్టనపెట్టుకుంటున్నాయని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. సోలార్ కంచెలను ఏర్పాటు చేసినా ఏనుగులు లెక్క చేయటం లేదని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రైతులు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏనుగులు ఎటువైపు నుంచి వచ్చి దాడులు చేస్తాయోనని రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు హడలిపోతున్నారు. -
కుప్పంలో గజరాజుల బీభత్సం
కుప్పం, న్యూస్‌లైన్: కుప్పం ప్రాంతంలో వరుసగా నాలుగో రోజూ ఏనుగులు పంట పొలాలపై దాడులు చేశాయి. సోవువారం అర్ధరాత్రి 2.30గంటలకు మండల పరిధిలోని ఉర్ల ఓబనపల్లె పంచాయుతీ కూర్మారుునపల్లె గ్రావు సమీపంలో ఏనుగులు దాడులు చేశాయి. సువూరు 40 ఏనుగులు రెండు గుంపులుగా విడిపోయి పంట పొలాలపై దాడులు చేశాయి. బేటరాయుస్వామి కొండ సమీపంలో ఉన్న సువూరు 10 ఎకరాల పంటలను ధ్వంసం చేశాయి. చెరుకు, టమాట, కంది, వరి పంటలను ధ్వంసం చేశాయి. రెండు గంటలపాటు ఏనుగులు పంటపొలాపై దాడులు చేశా యి. తెల్లవారు జాము 4 గంటలకు గ్రామస్తులంతా ఏకమై ఏనుగులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఏనుగుల గుం పు బేటరాయుస్వామి దేవాలయుం సమీపంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వుహరాజకడ అటవీ ప్రాంతంలోకి తరలివెళ్లారుు. దాడుల్లో గ్రావూనికి చెందిన క్రిష్ణప్ప, కన్నయ్యుప్ప, వుునిరత్నం, నాగరాజు, శీనప్ప, రాజప్ప, రత్నప్ప, ఇతర రైతులకు చెందిన పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఏనుగులు దాడిచేసిన ప్రాంతాలను సీసీఎఫ్ ఇబ్రహీం, డీఎఫ్‌వో శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. పరిహారం అందజేస్తాం ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని సీసీఎఫ్ ఇబ్రహీం తెలిపారు. వుంగళవారం స్థానిక ఎమ్మార్సీ భువనంలో ఏనుగులు దాడి చేస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన ఈ ప్రాంత రైతులకు సుమారు రూ. 7 లక్షలు పరిహారం అందించామని జిల్లా పశ్చివు విభాగ అటవీశాఖ అధికారి నీలకంఠనాథ్రెడ్డి తెలిపారు. కుప్పం, గుడుపల్లె వుండలంలోని అటవీ సరిహద్దు ప్రాం తాల్లో 40 కిలోమీటర్లు వరకు సొలార్ కంచెను నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన తెలిపారు. గుడుపల్లె వుండలంలోని గుడివంక, పెద్దపర్తికుంట గ్రావూల నుంచి కుప్పం వుండలంలోని గుడ్లనాయునపల్లె మీదుగా నడివుూరు ప్రాంతం నుంచి మొట్లచేను అటవీ ప్రాం తం వరకూ సొలార్ కంచెను నిర్మిస్తావున్నారు.