వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కంటిపై కునుకు లేకుండా పోయింది. రాత్రి అయితే సరి ఏనుగుల గుంపు పొలాలపై పడి విధ్వంసం సృషిస్తుండడంతో వారు భయంతో వణికిపోతున్నారు. మంగళవారం రాత్రి 15 ఏనుగులు బోయ చిన్ననాగులపల్లె, చింతమాకుల పల్లె గ్రామాల్లోని పంటలపై దాడులు చేశాయి. బీట్‌రూట్, ఇతర కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. వాటిని అడవిలోకి పారదోలేందుకు గ్రామస్తులు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఈ రెండు గ్రామాలు అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉండడంతో ప్రతీ రోజు ఇవి పొలాలపై దాడులకు దిగుతున్నాయి. అటవీ అధికారులు ఏనుగులను కట్టడి చేయడానికి గట్టి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.