కాకులను వేటాడిన దంపతులకు జరిమానా
–19 కాకులు స్వాధీనం
తిరువళ్లూరు: పూండి కాపు అటవీ ప్రాంతంలోని కాకులను వేటాడి తరలిస్తున్న ఇద్దరికి రూ.5వేల జరిమానాను తిరువళ్లూరు అటవీశాఖ అధికారులు విధించారు. తిరువళ్లూరు జిల్లా పూండి–నయపాక్కం ప్రాంతంలో కాపు అటవీ ప్రాంతం వుంది. ఈ ప్రాంతానికి చెందిన రమేష్ అతడి భార్య పూచ్చియమ్మాల్ ఇద్దరు పూండి కాపు అటవీ ప్రాంతానికి వెళ్లి కాకులను వేటాడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఫారెస్టు రేంజర్ అరుల్‌నాథన్ నేతృత్వంలోని అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో ఇద్దరు నయపాక్కం గ్రామానికి చెందిన వారు. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు వున్నట్టు గుర్తించారు. వీరు నిత్యం కాకులను వేటాడి తింటున్నారని విక్రయించడం లేదని రమేష్ అటవీశాఖ అధికారులకు వివరించారు. దీంతో అటవీ శాఖ అధికారులు రమేష్ వద్ద వున్న 19 కాకులను స్వాఽఽధీనం చేసుకుని వాటిని అక్కడే పూడ్చివేశారు. అనంతరం నిషేదిత అటవీప్రాంతంలో ప్రవేశించారన్న నెపానికి ఐదువేల రూపాయలను జరిమాన విధించి వారిని పంపించారు. ఈ సంఘటనపై రేంజర్ స్పందిస్తూ పూండిలో కాకులను వేటాడి చైన్నెలోని రోడ్డు సైడ్ బిరియానీ సెంటర్‌లకు విక్రయించారన్న విషయంపై విచారణ తమ పరిధిలోకి రాధన్నారు. కాకులను వేటాడిన దంపతులు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారన్న నెపంతో రూ.5వేలు జరిమానా విధించి వదిలేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment