
యువతి బలవన్మరణం
అన్నానగర్: గుజరాత్‌కు చెందిన అబిషా వర్మ (24). ఈమె తండ్రి చిన్నప్పుడే చనిపోయిన నేపథ్యంలో తల్లి మరో పెళ్లి చేసుకుని దుబాయ్‌లో ఉంటోంది. అబిషా వర్మ 22 ఏళ్ల వయస్సు వరకు తన తల్లితో కలిసి దుబాయ్‌లో నివసించింది, ఆమెకు చెన్నైలోని విమానాశ్రయంలో ఫ్లైట్ అటెండెంట్‌గా ఉద్యోగం వచ్చింది. దీంతో కుండ్రత్తూరు పక్కనే ఉన్న తిరుముడివాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ అపార్ట్ మెంట్‌లో తన స్నేహితులతో కలిసి ఉంటూ రోజూ పని నిమిత్తం చెన్నై విమానాశ్రయానికి వెళ్లేది.
ఈ స్థితిలో గత కొన్ని రోజులుగా దుబాయ్ నుంచి వచ్చిన అభిషావర్మతో తన తల్లి ఫోన్‌లో మాట్లాడడం లేదని తెలుస్తుంది. దీంతో అబిషావర్మ తీవ్ర మనస్థాపానికి లోనై శనివారం తన తల్లి అబిషా వర్మకు పలుమార్లు ఫోన్ చేసేందుకు ప్రయతి్నంచింది. ఆమె నంబరు స్విచ్ ఆఫ్ రావడంతో అబిషా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించింది. ఆమె స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుండ్రత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.