చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి వ్యవసాయ క్షేత్రాలపై విధ్వంసం సృష్టించాయి. శుక్రవారం రాత్రి రామకుప్పం మండలంలోని రామాపురం తండాలో బీన్స్, టమాటా, పశుగ్రాసం పంటలకు నష్టం కలిగించాయి. సమీప అటవీ ప్రాంతాల్లోంచి 10 ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించి సుమారు ఐదు ఎకరాల్లోని బీన్స్, పశుగ్రాసంను తినేశాయి. వాటి దాడిలో ఆరుగురు రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని సమాచారం. ఏనుగుల గుంపు రోజూ పంటలపై దాడులకు దిగుతుండడంతో ఇక్కడి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
(రామకుప్పం)