దక్షిణాఫ్రికాలోని ఒక నేషనల్ పార్క్‌లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. స్పానిష్ పర్యాటకుడు ఒకరు ఏనుగుల గుంపు దాడిలో దుర్మరణం పాలయ్యాడు. పిలాన్స్‌బర్గ్ జాతీయ ఉద్యానవనానికి సఫారీకి వెళ్లిన సందర్భంగా ఆదివారం ఈ ఘటన జరిగింది.
అధికారుల సమాచారం ప్రకారం 43 ఏళ్ల స్పానిష్ టూరిస్ట్ తన కాబోయే భార్య, మరో ఇద్దరితో కలిసి జాతీయ ఉద్యానవనంలో విహరి స్తున్నాడు. ఇంతలో ఏనుగుల గుంపును చూసిన అతడు వాహనం నుంచి బయటికి వచ్చి మరీ ఫోటోలు తీయాలని సరదా పడ్డాడు. అంతే ఒక్కసారిగా మూడు పెద్ద ఏనుగులు దాడికి దిగాయి. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన పిల్ల ఏనుగులకు హాని చేస్తున్నాడనే ఆగ్రహంతోనే పెద్ద ఏనుగు దాడికి దిగిందని, దీంతో మిగతావి కూడా ఎటాక్ చేశాయని పర్యాటక శాఖ ప్రతినిధి పీటర్ నెల్ మీడియాకు తెలిపారు.
రెండు ఇతర వాహనాలలో ఉన్నతోటి పర్యాటకులు హెచ్చరించినప్పటికీ , పట్టించు కోలేదని, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిందని నార్త్ వెస్ట్ పార్క్స్, టూరిజం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఉండే అడవి జంతువుల దగ్గరకు వెళ్లకూడదనీ, వాహనం నుండి దిగి ఫోటోలు తీసే ప్రయత్నం చేసినా, సెల్ఫీలు తీసుకున్నా, ప్రమాదానికి దారితీస్తాయని స్థానికులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment