succumbs
-
స్నానం చేస్తుండగా పేలిన గీజర్..నవ వధువు దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లో గీజర్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పసుపు పారాణి ఆరకముందే నవ వధువు తన అత్తమామల ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ పేలుడులో ఓ నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. బరేలీలోని మీర్గంజ్ ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది.బులంద్‌షహర్‌లోని కలే క నగ్లా గ్రామానికి చెందిన యువతికి ఈ నెల 22న పిపల్సనా గ్రామానికి చెందిన దీపక్ యాదవ్‌తో వివాహం జరిగింది. పెళ్లి తరువాత అత్తారింటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం అత్తగారింట్లో స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం స్నానం చేసేందుకు బాత్రూమ్కు వెళ్లిన అమ్మాయి ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భర్త, కుటుంబ సభ్యులు పలుమార్లు పిలిచినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి, బాత్రూమ్ తలుపు పగులగొట్టి చూశారు. ఆ సమయంలో ఆమె నేలపై అపస్మారక స్థితిలో పడి ఉంది. గీజర్ పేలిపోయింది.వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు -
పని.. ప్రాణం మీదకు, ‘అన్నా’ మృతిపై ఎవరేమన్నారంటే!
‘ల్యాప్‌టాప్ అనేది నా శరీరంలో ఒక భాగం అయింది’ ఇచట, అచట అనే తేడా లేకుండా ఎప్పుడూ ఆఫీసు పనిలో తలమునకలయ్యే ఉద్యోగి మాట ఇది. ‘మాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు’ అని కవి అన్నట్లు పనిభారంతో ఒత్తిడికి గురవుతున్న చాలామంది ఉద్యోగులకు జీవితం లేకుండాపోతోంది. పని కోసం జీవితాన్నే పణంగా పెట్టాల్సి వస్తోంది.26 ఏళ్ల తన కుమార్తె మరణానికి ‘అధిక పనిభారం’ కారణం అని ఆరోపిస్తూ ఆమె తల్లి ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ చైర్మన్‌కు రాసిన లేఖ ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది. విషపూరిత పని సంస్కృతిని ఎత్తి చూపేలా ఉన్న ఈ లేఖపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది...కొచ్చికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ కొన్ని నెలల క్రితం పుణెలోని ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ కంపెనీలో చేరింది. అధిక పనిభారం కారణంగా అన్నా సెబాస్టియన్ ఆరోగ్యం త్వరగా క్షీణించిందని ఆమె తల్లి అనితా అగస్టీన్ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ హెడ్ రాజీవ్ మెమానికి రాసిన లేఖలో ఆరోపించింది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో అన్నా సెబాస్టియన్ చాలా సంతోషించింది. అయితే ఆ సంతోషం కొద్ది నెలల్లోనే ఆవిరై΄ోయింది. ‘అధిక పని వల్ల రాత్రి ΄÷ద్దు΄ోయే వరకు, వారాంతాల్లో కూడా పనిచేసేది. ఎప్పుడూ అలిసి΄ోయి కనిపించేది’ అని కుమార్తె గురించి రాసింది అనిత అగస్టీన్.‘నా బిడ్డ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లిస్తుందని అనుకోలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అయింది అనిత. ‘ఎక్స్’లో ఆమె రాసిన లేఖకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.అనిత అగస్టీన్ లేఖ నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో, అన్నా మృతికి సంతాపం తెలుపుతూ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చింది.అయితే వారి హామీ నెటిజనుల ఆగ్రహాన్ని తగ్గించలేదు.‘కంపెనీ నుండి ఎవరూ నా కుమార్తె అంత్యక్రియలకు హాజరు కాలేదు’ అంటూ అనిత వెల్లడించిన తరువాత నెటిజనుల కోపం మరింత ఎక్కువ అయింది. ‘కంటి తుడుపు మాటలు కాదు కార్యాచరణ ముఖ్యం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అనితా అగస్టీన్ లేఖపై కళాకారులు, రచయితలు స్పందించారు. ‘చిన్న వయసులోనే కూతురుని కోల్పోయిన అనితను చూస్తుంటే, ఆమె రాసిన లేఖ చదువుతుంటే కన్నీళ్లు ఆపుకోవడం కష్టంగా మారింది. ఆమె అంత్యక్రియలకు హాజరు కావాలనే కనీస మర్యాద లేని యజమానులు ఉండడం సిగ్గు చేటు. కార్పొరేటు శక్తుల కోసం మీ ఆరోగ్యాన్ని, మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు’ అని స్పందించింది రచయిత్రి నందితా అయ్యర్. ఒకానొక సమయంలో రోజుకు 14 గంటలకు పైగా పనిచేసిన సింగర్ పౌశాలి సాహు తన గతాన్ని గుర్తు తెచ్చుకుంది.‘అన్నా సెబాస్టియన్ గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు భారం అవుతోంది. నా గత కాలం గుర్తుకు వస్తుంది. తీరిగ్గా కూర్చోలేని పని ఒత్తిడి... చివరికి వీకెండ్స్‌లో కూడా పనిచేయాల్సి వచ్చేది. అప్పటి పనిభారం ఇప్పటికీ ఏదో రూపంలో నాపై ప్రభావం చూపుతూనే ఉంది’ అంటూ స్పందించింది పౌశాలి సాహు.‘మన దేశంలో పని భారం భయంకరంగా ఉంది. వేతనం నిరాశాజనకంగా ఉంది. నిత్యం కార్మికులను వేధిస్తున్న యజమానులలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అని ఒక యూజర్ స్పందించాడు. అన్నా సెబాస్టియన్ మరణం హాస్టల్ కల్చర్, విషపూరిత పని ప్రదేశాల ప్రమాదాల గురించి కూడా చర్చను రేకెత్తించింది. -
ఫోటో సరదా ప్రాణం తీసింది : కాబోయే భార్య కళ్లముందే విషాదం!
దక్షిణాఫ్రికాలోని ఒక నేషనల్ పార్క్‌లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. స్పానిష్ పర్యాటకుడు ఒకరు ఏనుగుల గుంపు దాడిలో దుర్మరణం పాలయ్యాడు. పిలాన్స్‌బర్గ్ జాతీయ ఉద్యానవనానికి సఫారీకి వెళ్లిన సందర్భంగా ఆదివారం ఈ ఘటన జరిగింది.అధికారుల సమాచారం ప్రకారం 43 ఏళ్ల స్పానిష్ టూరిస్ట్ తన కాబోయే భార్య, మరో ఇద్దరితో కలిసి జాతీయ ఉద్యానవనంలో విహరి స్తున్నాడు. ఇంతలో ఏనుగుల గుంపును చూసిన అతడు వాహనం నుంచి బయటికి వచ్చి మరీ ఫోటోలు తీయాలని సరదా పడ్డాడు. అంతే ఒక్కసారిగా మూడు పెద్ద ఏనుగులు దాడికి దిగాయి. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన పిల్ల ఏనుగులకు హాని చేస్తున్నాడనే ఆగ్రహంతోనే పెద్ద ఏనుగు దాడికి దిగిందని, దీంతో మిగతావి కూడా ఎటాక్ చేశాయని పర్యాటక శాఖ ప్రతినిధి పీటర్ నెల్ మీడియాకు తెలిపారు. రెండు ఇతర వాహనాలలో ఉన్నతోటి పర్యాటకులు హెచ్చరించినప్పటికీ , పట్టించు కోలేదని, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిందని నార్త్ వెస్ట్ పార్క్స్, టూరిజం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఉండే అడవి జంతువుల దగ్గరకు వెళ్లకూడదనీ, వాహనం నుండి దిగి ఫోటోలు తీసే ప్రయత్నం చేసినా, సెల్ఫీలు తీసుకున్నా, ప్రమాదానికి దారితీస్తాయని స్థానికులు వెల్లడించారు. -
పోల్ పైనే ప్రాణం పోయింది
మల్కాజిగిరి: కాంట్రాక్టర్ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్‌తో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన సంఘటన గురువారం మౌలాలి సబ్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒరిస్సాకు చెందిన సంతోష్, తేజేశ్వర్(22) అన్నదమ్ములు. మూసాపేట జనతానగర్‌లో ఉంటూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు. రెండు రోజులుగా మౌలాలి సబ్‌స్టేషన్ పరిధిలో సుధాకర్ అనే కాంట్రాక్టర్ నేతృత్వంలో విద్యుత్ పోల్స్ , వైర్లు బిగించే పనులు చేస్తున్నారు. గురువారం ఉదయం విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లు బిగిస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో తేజేశ్వర్ స్తంభంపైనే మృతి చెందాడు. సంతోష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాంట్రాక్టర్ సుధాకర్, డీఈ సుభాష్, ఏడీఈ శ్రీనివాసరెడ్డి, ఏఈ నాగశేఖర్‌రెడ్డి, లైన్మెన్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యం కారణంగానే తన తమ్ముడు మృతి చెందాడని ఆరోపిస్తూ సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్ధానిక కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. తేజేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
భారత్‌లో ఇండోనేసియా రాయబారి కోవిడ్‌తో మృతి
న్యూఢిల్లీ: భారత్‌లో ఇండోనేసియా రాయబారి ఫెర్డీ నికో యోహానెస్ పయ్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత నెలలో కరోనా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 27న ఇండోనేసియాలోని జకార్తా సిటీకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. -
ఆక్సిజన్ కొరత: డాక్టర్ సహా, ఎనిమిది మంది మృతి
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత తీవ్రం వేధిస్తోంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రులు ఆక్సిజన్ సప్లయ్ లేక అల్లాడి పోతున్నాయి. తాజాగా డిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ లేకపోవడంవల్ల ఎనిమిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఆర్.కె. హిమాథని ఉండటం మరింత విషాదాన్ని నింపింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో 5గురి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. దేశ రాజధానిలో ఆక్సిజన్ సంక్షోభంపై వరుసగా 11వ రోజు ఢిల్లీ హైకోర్టుకులో విచారణ జరిగింది. తమ వద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వలు అయిపోతున్నాయని తక్షణమే స్పందించాలని వివిధ ఆసుపత్రుల యాజమాన్యాలు వేడు కుంటున్నాయి. అంతకుముందు బాత్రా హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుధాన్షు తాము ఆక్సిజన్ సంక్షోభంలో ఉన్నామనీ, రాబోయే 10 నిమిషాల్లో పూర్తిగా అయిపోతుందని, ఆదుకోవాలంటూ ఒక వీడియోను విడుదల చేయడం గమనార్హం. కానీ అధికారులు తేరుకుని ఆక్సిజన్ రీ సప్లై ట్యాంకర్ చేరుకునేసరికే అనర్థం జరిగిపోయింది. రోగుల ప్రాణాలను రక్షించడంలో కీలకమైన ఆక్సిజన్ అందక ఊపిరి ఆగి పోతున్న వైనాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. అంతా అయిపోయిన 45 నిమిషాల తరువాత ట్యాంకర్ చేరుకుందని, అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి అధికారులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. చదవండి: విషాదం: టాలీవుడ్ యువ దర్శకుడు కరోనాతో మృతి -
విషాదం: టాలీవుడ్ యువ దర్శకుడు కరోనాతో మృతి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి తెలుగు సినీ పరిశ్రమను అతలాకుతలం చేస్తోంది. తాజాగా.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి(39) కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన శ్రీకాకుళంలోని గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. విరాట పర్వం డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేశారు.ఈ సందర్భంగా కుమార్ వట్టి కుటుంబానికి ప్రగాఢసానుభూతి ప్రకటించారు. నరసన్నపేటకు చెందిన కుమార్ వట్టి 2017లో ‘మా అబ్బాయి’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. శ్రీవిష్ణు హీరోగా, ప్రఖ్యాత ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీతోనే కుమార్ వట్టి దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు పరుశురాం దగ్గర ‘యువత’ సినిమా అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ తర్వాత సోలో, అంజనేయులు, సారొచ్చారు సినిమాలకు కూడా పనిచేశారు. 30 కి పైగా చిత్రాలలో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే డైరెక్టర్‌గా రెండో సినిమాకు కథను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే కుమార్ వట్టి అకాలమృతితో పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు, వట్టి కుమార్‌తో కలిసి పనిచేసిన పరిశ్రమకు చెందిన పలువురు కూడా సంతాపం తెలిపారు. అమానవీయ రాజకీయ సందర్బాన , ఈ నేలనేలంతా వల్లకాడై ,వలపోత చరిత్రని మిగిలుస్తోంది. మన పుణ్య భూమి ముఖ చిత్రం పై ఒక్కో మరణం ఒక్కో విషాద వాఖ్యముగా పరివ్యాప్తమవుతుంది . కరోనతో దూరమైన ఆత్మీయుడు ,దర్శకుడు కుమార్ వట్టి కి దు:ఖ విచలిత నేత్రాలతో ఆల్విదా! @vatti_kumar pic.twitter.com/Zz6C2MSYgr — v e n u u d u g u l a (@venuudugulafilm) April 30, 2021 చదవండి: ఆక్సిజన్ లెవల్స్: ప్రోనింగ్ టెక్నిక్ అంటే తెలుసా? -
మెరిసే కళ్లు.. ఆ చిరునవ్వు మాయం..రేణూ మిస్ యూ
సాక్షి, న్యూఢిల్లీ : ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ది ప్రింట్ హిందీ ఎడిటర్ , సీనియర్ మహిళా జర్నలిస్టు రేణు అగల్ ఇకలేరు. డిల్లీకి చెందిన రేణు అగల్ దాదాపు నెల రోజుల పాటు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. దీంతో పాత్రికేయ మితృలందరూ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా తనదైన ముద్ర వేసుకుని, మంచి మనిషిగా ఎపుడూ నవ్వుతూ, నలుగురికి సాయపడుతూ ఉండే రేణు అకాలమరణం పత్రికా ప్రపంచానికి తీరని లోటంటూ విచారం వ్యక్తం చేశారు. ఆ నవ్వులిక మాయమంటూ రేణు సన్నిహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీబీసీ ఆన్లైన్ ఎడిటర్ గీతా పాండే రేణు మృతిపై సంతాపం ప్రకటించారు. మార్చి 25 న రేణు అగల్ విధులను ముగించుకొని రిక్షాలో ఇంటికి వెళుతుండగా డీఆర్డీఓ అధికారి తప్పతాగి మద్యం మత్తులో అతివేగంగాకారుతో ఢీకొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కానిస్టేబుల్ అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, తరువాత బెయిల్‌పై విడుదల చేశారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన ఏడు రోజుల తరువాత రిక్షా డ్రైవర్ చాంద్ కూడా చనిపోయాడు. వాహనంపై నియంత్రణ కోల్పోయిన జిగ్ జాగ్గా ప్రయాణిస్తూ మొదట ఒక వ్యక్తిని కొట్టాడు. అనంతరం సైకిల్-రిక్షాపైకి దూసుకెళ్లాడని కానిస్టేబుల్ తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీంతో రిక్షాలో కూర్చున్న మహిళ కింద పడిపోయారనీ, స్థానికుల సాయంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతను పారిపోయాడని తెలిపారు. నిందిత డ్రైవర్‌ను కాళి బారి మార్గ్ నివాసి గౌరవ్ బాత్రాగా గుర్తించినట్లు డీసీపీ (ఉత్తర) అల్ఫోన్స్ తెలిపారు. అతనిపైకేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా రేణు అగల్ 1996 లో బీబీసీ లండన్‌లో పనిచేశారు. ప్రత్యేక కరస్పాండెంట్‌గా సుదీర్ఘకాలం15 ఏళ్లు పని చేశారు. 2011 లో పెంగ్విన్ బుక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో కమిషనింగ్ ఎడిటర్‌గా చేరారు. ఆ తరువాత 2018 లో సీనియర్ ఎడిటర్‌గా ది ప్రింట్ హిందీ టీం చేరడానికి ముందు 2015 లో జగ్గర్నాట్ బుక్స్‌కు పనిచేశారు. So shocking. RIP. Deepest condolences to family, friends — Shantanu Nandan Sharma (@shantanunandan2) April 22, 2021 -
నడుం, కాళ్లు విరిచి.. వరుస అఘాయిత్యాలు
సాక్షి, లక్నో : హత్రాస్ ఘటనపై ఒకవైపు దేశం అట్టుడుకుతూండగానే ఉత్తర ప్రదేశ్‌లో వరుస అకృత్యాలు కలకలం రేపుతున్నాయి. హత్రాస్ నుండి 500 కిలోమీటర్ల దూరంలోని బల్రామ్పూర్ జిల్లాలో మరో దళిత యువతి (22) సామూహిక హత్యాచారానికి బలైపోయింది. మత్తు మందు ఇచ్చి, నడుము, రెండు కాళ్లు విరిచేసి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. మరో ఘటనలో అజమ్‌గర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యచారాం చేశాడో యువకుడు. దీంతో రాష్ట్రంలో నేరస్థుల ఆగడాలు, మహిళల భద్రతపై విమర్శలు చెలరేగుతున్నాయి. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) బల్‌రామ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా ఆమె నుంచి స్పందనలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో వెదకడం ప్రారంభించారు. ఇంతలో రాత్రికి అసాధారణ పరిస్థితిలో ఓ ఆటో రిక్షాలో అపస్మారక స్థితిలో యువతి ఇంటికి చేరింది. చేతికి గ్లూకోజ్ డ్రిప్ ఇంజెక్షన్, ఒంటి నిండా గాయాలు చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆమెను లక్నోకు తీసుకెళ్లమని వైద్యులు సలహా ఇచ్చారు. కానీ మార్గమధ్యలోనే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. వీరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు బలరాంపూర్ ఎస్పీ దేవ్ రంజన్ వర్మ తెలిపారు. అత్యాచారానికి ముందు తమ కూతురికి మత్తు ఇంజెక్షన్‌కు ఇచ్చి మరీ ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని బాధితురాలు తల్లి కన్నీటి పర్యంతమైంది. రెండు కాళ్లను విరిచేసి, శవంలాంటి తన బిడ్డను పంపారని వాపోయింది. ఐతే పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను తోసి పుచ్చారు. పోస్ట్ మార్టం నివేదికలో ఈ విషయాలేవీ తేలలేదని బలరాంపూర్ పోలీసులు గత రాత్రి ట్వీట్ చేశారు. అజమ్‌గర్ ఘటనలో జియాన్పూర్ ప్రాంతంనుంచి ఎనిమిదేళ్ల బాలికను తీసుకువెళ్లిన యువకుడు అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తీవ్ర రక్తస్రావంతో, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. నిందితుడు దినేశ్‌ను అరెస్టు చేశామని అజమ్‌గర్ ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ తెలిపారు -
లిఫ్ట్ కింద పడి కంపెనీ డైరెక్టర్ దుర్మరణం
సాక్షి, ముంబై: ముంబైలో ఒక వ్యాపారవేత్త అనూహ్యంగా లిఫ్ట్ గుంతలో పడి చనిపోవడం కలకలం రేపింది. కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మేవానీ(46)వర్లి ప్రాంతంలో తన స్నేహితుడిని కలవడానికి వెళ్లి దుర్మరణం పాలయ్యారు. వర్లిలోని, బ్యూనా విస్టా భవనంలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సోమవారం అందించిన సమాచారం ప్రకారం విశాల్ బ్యూనా విస్టా భవనంలోని రెండో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్టు స్విచ్ నొక్కగా ఛానల్ తెరుచుకోవడంతో లిఫ్టు వచ్చిందని భావించి పొరపాటున అడుగుపెట్టాడు. ఇంతలో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నలిఫ్ట్ డోర్ మూయడంతో అది కిందికి వచ్చింది. దీంతో గుంతలో పడి నుజు నుజ్జు అయిపోయాడు. పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అధికారులు తీవ్రంగా గాయపడిన అతడిని బయటికి లాగి బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు అరగంట ముందు భార్యతో మాట్లాడిన విశాల్, తన స్నేహితుడిని కలవబోతున్నానని చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే పంటినొప్పితో బాధపడుతున్నవిశాల్ తన స్నేహితుడి ఫ్లాట్ పక్కన ఉండే డాక్టర్ ను కలిసేందుకు వెళ్లాలనుకున్నారు. ఈయనతో పాటు ఆమె కుమార్తె రేషం కూడా వెంట ఉన్నారు. ఆమె ఏదో కారణంతో కొంచెం వెనక ఉండటంతో విశాల్ అన్యమనస్కంగా లిఫ్ట్ ఎక్కి ప్రాణాలు కోల్పోయాడని మరో నివేదిక తెలిపింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వర్లి పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి సుఖ్లాల్ వర్పే తెలిపారు. సాంకేతిక లోపం ప్రమాదానికి కారణమైందని తెలుస్తోందనీ, లిఫ్ట్ మెయింటెనెన్స్ చివరిసారిగా ఎపుడు నిర్వహించిందీ విచారిస్తున్నామన్నారు -
కరోనా: సీనియర్ వీడియో జర్నలిస్టు మృతి
సాక్షి, చెన్నై: కరోనా మహమ్మారి తమిళనాడులో సీనియర్ వీడియో జర్నలిస్టును బలితీసుకుంది. 15 రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో వేల్ మురుగన్(41) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (ఆర్జీజీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం కన్నుమూశారు. దీంతో తోటి జర్నలిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రారంభ రోజుల్లో ఫ్రెషర్లుగా మీడియా రంగంలోకి ప్రవేశించిన మిత్రులకు మురుగన్ ఎంతో సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. మురుగన్ అకాలమరణంపై స్పందించిన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయకుమార్ 50 వేల రూపాయల సాయం ప్రకటించారు. మురుగన్ భార్య షణ్ముగ సుందరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మీడియా మిత్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. (బజాజ్ ఆటో ప్లాంట్‌లో కరోనా కలకలం ) అటు డీఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ ట్విటర్ ద్వారా జర్నలిస్టు మరణంపై విచారాన్ని ప్రకటించారు. మీడియా జర్నలిస్టులు సేఫ్టీపై ప్రధానంగా దృష్టిపెట్టాలని కోరారు. మీడియాలో పనిచేసేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో మురుగన్ ఉదంతం తెలియజెప్పిందని ఎండిఎంకె నాయకుడు వైకో వ్యాఖ్యానించారు. మురుగన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతిని ప్రకటించారు. మీడియాలోని కామ్రేడ్లందరూ తీసుకోవలసిన భద్రతా చర్యలపై మీడియా సంస్థలు, ప్రభుత్వం మార్గ నిర్దేశనం చేయాలన్నారు. గత 20 సంవత్సరాలుగా వివిధ తమిళ టెలివిజన్ ఛానెళ్లలోవెల్ మురుగన్ కెమెరాపర్సన్‌గా పనిచేశారు. మురుగన్ కు భార్య, ఒక కుమారుడు ఉండగా, భార్య షణ్ముగ సుందరి ఆర్‌జీజీజీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తున్నారు. -
కారు ప్రమాదంలో గాయని మృతి, భర్తకు గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ పాప్ సింగర్ శివానీ భాటియా (24) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆగ్రాలో ఒక ఫంక్షన్ హాజరయ్యేందుకు వెళుతుండగా ఢిల్లీలోని యమునా ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన ప్రమాదంలో శివానీ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చిక్సిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం భర్త నిఖిల్‌తో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో వీరి కారు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో శివానీ కూర్చున్న వైపు కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే శివానీ, నిఖిల్‌ను దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం మధురలోని నియాస్ ఆసుపత్రికి తరలించారు. కానీ తీవ్రగాయాలతో శివానీ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారని పోలీసు అధికారి వీర్ సింగ్ ప్రకటించారు. భర్తకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. కాగా బీహార్‌కి చెందిన శివానీ స్థానిక 2016లో టీవీ చానల్ నిర్వహించిన పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్వల్పకాలంలోనే రీమిక్స్, పాప్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమె మృతి పట్ల పలువురు గాయకులు, ఇతర సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగొద్దు
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల) : ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగొద్దని, రాజ్యాంగపరంగా వచ్చిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ స్వచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని మెట్పల్లి జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ తెలిపారు. మెట్పల్లి అర్బన్‌కాలనీలో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. కులమతాలకు అతీతంగా అందరు సమైక్యం గా ఉండాలని, తద్వారా సమస్యల పరి ష్కారం సులువు అవుతుందని పేర్కొన్నారు. అర్హుందరికీ ఉచిత న్యాయ సహాయం కోర్టుల్లో తప్పకుండా అందుతుందన్నారు. మండల లీగల్ సెల్ ఎళ్లవేళలా తోడుంటుందన్నారు. అధికారులు ప్రజలకు అవసరమైన సమస్యలు పరిష్కరించకుంటే కేసు వేయొచ్చన్నారు. ఈ సందర్భంగా స్థానికులు స్థానిక సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. ఎలాంటి విషయంలోనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యాశకు పోయి మోసపోవద్దని న్యాయమూర్తి సూచించారు. చట్టాలను చేతిలోకి తీసుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. తహసీల్దార్ సుగుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అప్పులుఇస్తే తప్పకుండా పత్రాలు రాయించుకోవాలని సూచించారు. సదస్సులో వెంకట్రావుపేట సర్పంచ్, న్యాయవాది కొమిరెడ్డి లింగరెడ్డి, మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం శంకర్‌రెడ్డి, ఏజీపీ ఎల్లాల మధుసూదన్‌రెడ్డి, ఎస్సై శంకర్రావు, ఆర్ఐ కృష్ణ, న్యాయవాదులు కోటగిరి వెంకటస్వామి, మగ్గిడి వెంకటనర్సయ్య,ఓగులపు శేఖర్, తెడ్డు ఆనంద్, సురక్ష పాల్గొన్నారు. -
అక్కడ అడుగు పెడితే క్షణాల్లో మాడిమసి...
మైసూరు : కర్ణాటక మైసూరు నగర శివార్లలో భూమి అగ్నిగుండంలా కుతకుత ఉడుకుతున్న వింత ఘటన వెలుగు చూసింది. ఇలా నిప్పు కణికలా మారిన భూమిపై అడుగు పెట్టిన ఓ బాలుడు మాడి మసైన ఘటనతో కలకలం రేపింది. ఇలాంటి విచిత్ర, వింతైన, అరుదైన, భయానకమైన ఘటన మైసూరు నగర శివార్లలోని బెలవత్త గ్రామంలో జరిగింది. ఓ బాలుడు చికిత్స పొందుతూ మరణించగా, మరో బాలుడు మనోజ్ తీవ్రం గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. అతడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యలు వెల్లడించారు. కాగా మైసూరు క్యాతనహళ్లికి చెందిన మూర్తి, జానకి దంపతుల కుమారుడు హర్షల్(14) తన నలుగురు స్నేహితులతో కలిసి ఈ నెల 14న కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అక్కడ నేల కుతకుత ఉడుకుతుండటంతో ఆశ్చర్యపోయి అక్కడ అడుగు పెట్టి చూద్దామని అడుగు ముందుకేశాడు. బిగ్గరగా అరుస్తూ కుప్పకూలిపోవడంతో అతడిని రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించగా, అప్పటికే హర్షల్ భూమిలోకి చిక్కుకు పోయి కాలిపోయాడు. తీవ్రంగా కాలిన గాయాలైన అతనిని వెంటనే స్నేహితులు ఇతరుల సాయంతో వెలికితీశారు. సమాచారం అందిన వెంటనే అతని కుటుంబసభ్యులు హర్షల్‌తో పాటు మనోజ్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ హర్షల్ ఆదివారం సాయంత్రం మరణించాడు. దీంతో హర్షల్ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం అందించేంతవరకూ మృతదేహానికి అంత్యక్రియలు జరపమంటూ నిరసన వ్యక్తం చేశారు. మైసూరు కుంబార కొప్పలు నివాసి సోమణ్ణకు క్యాతనహళ్లి పరిధిలో నాలుగు ఎకరాల పొలం ఉంది. అయితే అందులో ఎలాంటి వ్యవసాయం చేయడం లేదు. ఆ పొలంలోని కొంత భాగం భూమి నిప్పు కణికలా మారి కుతకుత ఉడుకుతోంది. అక్కడ కాలు పెడితే చాలు కాలిపోయి భూగర్భంలోకి చేరక తప్పని భయానక వాతావరణం నెలకొంది. భూమి అలా మారటానికి రసాయనిక వస్తువులు, ఘన వ్యర్థపదార్థాలు అక్కడ చేరుతుండటమే కారణమని తెలుస్తోంది. గత వారం రోజులుగా సోమణ్ణ పొలంలో భూమి కుతకుత ఉడుకుతూ పొగలు కక్కుతోంది. రాత్రివేళ ఆ భూమిని చూస్తే అగ్నిగుండంలో కనిపిస్తోందని, నిప్పు సెగ కూడా చాలా దూరం వరకు ఉంటోంది. వారం రోజులుగా నిప్పులు కక్కుతున్న ఆ పొలంలోకి వెళ్లిన గొర్రెలు, కుక్కలు చనిపోయాయని, ఈ విషయంపై అధికారులు ఎలాంటి అప్రమత్తంగా వ్యవహరించ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఓ బాలుడు బలి కావడంతో ఆ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా పోలీసులు ప్రకటించారు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న మెటగల్లి పోలీసులు అక్కడ నిషేధిత ప్రాంతంగా బోర్డు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న గనులు, భూగర్భ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలన జరుపుతున్నారు. రసాయనిక వస్తువులు ఎక్కువగా అక్కడకు చేరుతుండటం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని భూగర్భ శాస్త్రవేత్త ప్రభాకర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు రమేష్ బాబు తెలిపారు. సమీపంలోని కర్మాగారాలు, ఆస్పత్రుల నుంచి తెచ్చిన రసాయనిక ఘనవ్యర్థాలను అక్కడ పారవేసినందునే రసాయనిక క్రియ జరిగి భూమి ఇలా కుతకుత ఉడుకుతోందని అన్నారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
విశాఖలో మరో మహిళకు స్వైన్‌ఫ్లూ
విశాఖపట్నం: విశాఖనగరం పరిధిలోని ఆరిలోవలో ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకటో వార్డు పరిధి గణేష్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల గృహణి జ్వరంతో బాధపడుతూ ఆరు రోజులుగా ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు అక్కడి వైద్యులు గుర్తించి జీవీఎంసీ ఆరోగ్యం విభాగం అధికారులకు తెలిపారు. జీవీఎంసీ వైద్యులు ఆమె నివాసముంటున్న పరిసరాలను శనివారం సాయంత్రం శానిటరీ సిబ్బందిచే శుభ్రం చేయించారు. చుట్టుపక్కల ఇళ్ల ముందు బ్లీచింగ్ చల్లి చెత్త తొలగించారు. అందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాగా, ఇటీవల విశాఖకు చెందిన ఓ మహిళ స్వైన్‌ఫ్లూబారిన పడిన విషయం విదితమే. ఆ మహిళ కోలుకుంటున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.