
న్యూఢిల్లీ: భారత్‌లో ఇండోనేసియా రాయబారి ఫెర్డీ నికో యోహానెస్ పయ్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత నెలలో కరోనా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 27న ఇండోనేసియాలోని జకార్తా సిటీకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.