Indonesian
-
గుండ్రాంపల్లి అబ్బాయి.. ఇండోనేషియా అమ్మాయి
చిట్యాల (నల్గొండ): చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన యువకుడు నాగరాజు ఇండోనేషియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం శుక్రవారం గుండ్రాంపల్లి గ్రామంలో జరిగింది. సీమ సాలయ్య–యాదమ్మ ప్రథమ కుమారుడు నాగరాజు హైదరాబాద్‌లో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజు పనిచేస్తున్న కంపెనీలోనే ఇండోనేషియాలో రిజ్కి నన్డా సఫిట్రి అనే యువతి కూడా పనిచేస్తోంది. వీరిద్దరికి ఫోన్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని రిజ్కి నన్డా సఫిట్రిని నాగరాజుకు ఇండియాకు పిలిపించాడు. నాగరాజు స్వగ్రామం గుండ్రాంపల్లిలో శుక్రవారం వేద మంత్రాల సాక్షిగా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
మహేష్ బాబు కోసం రంగంలోకి హాలీవుడ్ నటి
-
మహేశ్ సరసన ఇండోనేషియా బ్యూటీ
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఓ హీరోయిన్గా నటిస్తారనే వార్త కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని ఫాలో అవుతున్నారు చెల్సియా. అలాగే మహేశ్‌బాబు– రాజమౌళి సినిమాల అప్డేట్స్ను ఇన్‌స్టాలో చెల్సియా ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో మహేశ్‌కు జోడీగా చెల్సియా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అంటున్నారు ఫిల్మ్‌నగర్ వాసులు. కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభం కానుందట. -
Israel-Hamas war: మరో ఆసుపత్రిపై దాడి
ఖాన్ యూనిస్: గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిని దిగ్బంధించి, రోజుల తరబడి తనిఖీలు చేస్తూ హమాస్ ఆయుధాలు, సొరంగాల ఫొటోలు విడుదల చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు ఉత్తర గాజాలోని ఇండోనేసియన్ హాస్పిటల్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో రోగులు, క్షతగాత్రులు, వేలాది మంది సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. సోమవారం క్షిపణులు ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా ఇండోనేసియన్ ఆసుపత్రిపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఆసుపత్రి రెండో అంతస్తు ధ్వంసమైంది. కనీసం 12 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇండోనేíసియన్ హాస్పిటల్‌కు 200 మీటర్ల దూరంలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. సమీపంలోని భవనాలపై ఇజ్రాయెల్ షార్ప్ షూటర్లు మాటు వేశారు. ఆసుపత్రులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఉధృతం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రుల్లో హమాస్ స్థావరాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ తేలి్చచెబుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో మృతుల సంఖ్య 13,000కు చేరిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈజిప్టుకు 28 మంది శిశువులు అల్–షిఫా నుంచి దక్షిణ గాజాలోని అల్–అహ్లీ ఎమిరేట్స్ హాస్పిటల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తరలించిన 31 మంది శిశువుల్లో 28 మందిని సోమవారం అంబులెన్స్‌ల్లో ఈజిప్టుకు చేర్చారు. వారికి ఈజిప్టు వైద్యులు సాదర స్వాగతం పలికారు. శిశువుల కోసం ఇంక్యుబేటర్లు సిద్ధంగా ఉంచారు. ఈజిప్టులో వారికి మెరుగైన చికిత్స అందించనున్నారు. శిశువుల్లో కొందరిని గాజా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని అల్–అరిష్ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మరికొందరిని కైరోకు తరలించారు. వీరంతా అల్–షిఫాలోనెలలు నిండక ముందు జని్మంచి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నవారే. 31 మందిలో 28 మందిని ఈజిప్టుకు తరలించారు. మిగతా ముగ్గురు గాజాలోనే ఉండిపోయారు. అల్–షిఫాలో బందీలను దాచిపెట్టిన హమాస్! అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వారిలో చాలామందిని అల్–షిఫా ఆసుపత్రి కింది భాగంలోని సొరంగాల్లో మిలిటెంట్లు దాచిపెట్టారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారలను తాజాగా బయటపెట్టింది. అల్–షిఫాలో అక్టోబర్ 7న నిఘా కెమెరా చిత్రీకరించిన ఒక వీడియోను ఇజ్రాయెల్ తాజాగా బహిర్గతం చేసింది. ఇందులో ఇద్దరు బందీలను అల్–షిఫాలోకి మిలిటెంట్లు బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిద్దరూ థాయ్‌లాండ్, నేపాల్ జాతీయులు. ప్రస్తుతం వారు ఎక్కడున్నారన్నది తెలియరాలేదు. ఇదిలా ఉండగా, బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. వారిని విడుదల చేసేలా హమాస్‌ను ఒప్పించేందుకు అమెరికా అభ్యర్థన మేరకు అరబ్ దేశాలు రంగంలోకి దిగాయి. మిలిటెంట్ నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. -
ముగిసిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల మధ్య తొలిసారిగా జరిగిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు శుక్రవారంతో ముగిశాయి. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో ఈ నెల 20న మారిటైమ్ విన్యాసాలు మొదలయ్యాయి. భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌక భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా.. రాయల్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. మూడు దేశాల మధ్య భాగస్వామ్యం బలోపేతం చేయడం, సామర్థ్యాల్ని మెరుగుపరిచేందుకు పరస్పర సహకారంతోపాటు ఇండో– పసిఫిక్ సముద్ర జలాల్లో స్థిరమైన శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఈ త్రైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజున వ్యూహాత్మక విన్యాసాలు, క్రాస్‌డెక్ ఆపరేషన్స్, హెలికాప్టర్ల క్రాస్‌డెక్ ల్యాండింగ్ తదితర విన్యాసాలు నిర్వహించారు. -
ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు!
ఇప్పటి వరకు 'దినార్, రియాల్, ఫౌండ్, యూరో, డాలర్' వంటి ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీలను గురించి తెలుసుకుని ఉంటారు. అయితే ఈ కథనంలో ప్రపంచంలో టాప్ చీపెస్ట్ కరెన్సీలు ఏవి? ఇండియన్ కరెన్సీతో వాటికున్న వ్యత్యాసం ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. చీపెస్ట్ కరెన్సీ కలిగిన టాప్ 5 దేశాలు.. 👉ఇరానియన్ రియాల్ (IRR) 👉వియత్నామీస్ డాంగ్ (VND) 👉సియెర్రా లియోనియన్ లియోన్ (SLL) 👉లావో/లావోషియన్ కిప్ (LAK) 👉ఇండోనేషియా రుపియా (IDR) ఇరానియన్ రియాల్ (IRR) ఇరాన్ కరెన్సీ ఇరానియల్ రియాల్ అనేది ప్రపంచంలో చీపెస్ట్ కరెన్సీలలో ఒకటి. అయితే ఇదే పేరుతో ఉన్న ఒమాని రియాల్ అనేది ప్రపంచంలో ఖరీదైన కరెన్సీలలో ఒకటిగా ఉంది. ఇండియన్ ఒక్క రూపాయి 511 ఇరానియల్ రియాల్స్‌కి సమానం. కాగా ఒక అమెరికన్ డాలర్ 42,275 ఇరానియల్ రియాల్స్‌కి సమానం అని తెలుస్తోంది. ఈ దేశంలో రాజకీయ అశాంతి, వ్యాపారం, తలసరి జీడీపీ కారణంగా ఈ దేశ కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంది. వియత్నామీస్ డాంగ్ (VND) వియత్నాం చారిత్రాత్మకంగా కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ కింద పనిచేస్తోంది, అయితే ఆర్థిక వ్యవస్థను స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాగా ప్రస్తుతం తక్కువ విలువ గల కరెన్సీ కలిగిన దేశాల్లో ఇది కూడా ఒకటి. 291 వియత్నామీస్ డాంగ్స్ భారతీయ కరెన్సీ రూపాయికి సమానం. ఒక అమెరికన్ డాలర్ 24,085 వియత్నామీస్ డాంగ్స్కి సమానం. వియాత్నం ఆర్ధిక వ్యవస్థ 2024కి వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. సియెర్రా లియోనియన్ లియోన్ (SLL) ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్ తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటోంది. వినాశకరమైన అంతర్యుద్ధంతో సహా పశ్చిమ ఆఫ్రికాలో కుంభకోణాలు, అవినీతి కారణంగానే ఆ దేశ కరెన్సీకి విలువ తగ్గినట్లు సమాచారం. భారత రూపాయి 238 సియెర్రా లియోనియన్ లియోన్లకి సమానం, కాగా అమెరికన్ డాలర్ 19,750 సియెర్రా లియోనియన్ లియోన్లకి సమానం. ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే? లావో/లావోషియన్ కిప్ (LAK) 1952 నుంచి కూడా లావోషియన్ కిప్ కరెన్సీకి విలువ చాలా తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఒక ఇండియన్ రూపీ 239 లావోషియన్ క్లిప్‌లలో సమానం, ఒక అమెరికన్ డాలర్ 19,773 లావోషియన్ క్లిప్లకి సమానం కావడం విశేషం. కాగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో ఇది ఒకటిగా ఉంది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఊరుకున్నా.. ఈ రెండు బ్యాంకులు తగ్గలే.. వడ్డీ రేట్లు ఇలా! ఇండోనేషియా రుపియా (IDR) గత ఏడు సంవత్సరాలుగా ఇండోనేషియా రూపాయి విలువలో ఎలాంటి మెరుగుదల లేదు. విదేశీ మారక నిల్వలు క్షీణించడం, కరెన్సీని కాపాడుకోవడంలో సెంట్రల్ బ్యాంక్ వైఫల్యం కారణమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. అయితే భారతీయ కరెన్సీ రూపాయికి 184 ఇండోనేషియా రూపాయలకు సమానం. అదే విధంగా ఒక అమెరికన్ డాలర్ 15,225 ఇండోనేషియా రూపాయలకు సమానం. ప్రస్తుతం పారిశ్రామిక కార్యకలాపాలలో ఇండోనేషియా కొంత వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది. -
13 మంది విద్యార్థినులపై అత్యాచారం.. టీచర్‌కు..
బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేవాలయం లాంటి స్కూళ్లు, కళాశాలల్లో కూడా విద్యార్థులకు రక్షణ కరువవుతోంది. విద్యాబుద్ధులు నేర్పి సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు కీచకులుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సద్బుద్ధి నేర్పాల్సిన గురువులే.. బుద్ధి లేకుండా రాక్షసులుగా మారి విద్యార్థులపై కామవాంఛ తీర్చుకుంటున్నారు. Indonesian Teacher Molested 13 Female Students: పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా, కేర్‌టేకర్‌గా ఉండాల్సిన వ్యక్తి.. విద్యార్థినులపై అత్యాచారం చేసినందుకు గానూ కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకెళ్తే.. ఇండోనేషియాకు చెందిన బోర్డింగ్ స్కూల్ యజమాని హెర్రీ విరావన్ (36) పదమూడు మంది విద్యార్థులనులపై అత్యాచారం చేశాడు. వారిలో ఎనిమిది మంది గర్భం దాల్చారు. 2006 నుంచి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. వీరికి స్కాలర్షిప్లను ఆశ చూపి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితులందరూ కూడా మైనర్లు కాగా, వీరిలో చాలా మంది పేద కుటుంబాల నుంచి వచ్చారు.ఈ కేసులో నిందితుడు హెరీ విరావాన్‌ను ఇండోనేషియా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో విరావాన్‌కు మరణశిక్ష విధించాలని, లేదంటే రసాయనాలతో శిక్షించాలని ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. అయితే న్యాయమూర్తులు నిందితుడికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు. చదవండి: (భారత్‌పై అమెరికా ప్రశంసలు) -
భారత్‌లో ఇండోనేసియా రాయబారి కోవిడ్‌తో మృతి
న్యూఢిల్లీ: భారత్‌లో ఇండోనేసియా రాయబారి ఫెర్డీ నికో యోహానెస్ పయ్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత నెలలో కరోనా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 27న ఇండోనేసియాలోని జకార్తా సిటీకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. -
ఇండోనేసియన్ల కదలికలపై పోలీసుల నజర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కలకలానికి కారణమైన ఇండోనేసియా బృందం కరీంనగర్లో ఎవరెవరిని కలిసిందనే విషయమై పోలీసులు దృష్టి పెట్టారు. ఆ బృందంలోని పది మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వీరిని కలసిన వారి ద్వారా ఎం త మందికి విస్తరిస్తుందోనన్న ఆందోళన ఎక్కువైంది. మత ప్రచారం కోసం వచ్చినట్లు చెబుతున్న ఇండోనేసియన్లను కరీంనగర్లో ఓ అతివాద సంస్థ నేత కలసినట్లు తేలడం కలవర పెడుతోంది. ఆ నేత ఇండోనేసియన్లను కలసిన రెండో రోజు వందలాది మంది విద్యార్థులతో తన ఇన్స్టిట్యూట్లో సమావేశం కాగా.. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫి ర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి సమావేశమయ్యారని కేసు పెట్టి అదేరోజుస్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. అప్పటికే ఇండోనేసియన్లను సదరు వ్యక్తి కలసినట్లు పోలీసులకు తెలియదు. రెండు నెలల్లో మూడు బృందాల రాక జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, బోధన్‌తో పాటు కరీంనగర్, రామగుండం ప్రాంతాలకు ఇండోనేసియన్లు 4 నెలలుగా తరచూ వచ్చి పోతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.2 నెలల వ్యవధిలో 3 ఇండోనేసియా బృందాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించినట్లు స్పష్టమవుతోంది. కరోనా సోకిన బ్యాచ్ కాకుండా నాలుగు జంటల బృందం ఫిబ్రవరి 8న రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిసింది. గత నెల 17న జగిత్యాలలో అతివాద సంస్థ ఆవిర్భావ దినోత్సవంలో వీరు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇస్లాం ధర్మ బోధనకే ఇండోనేసియా బృందాలు కరీంనగర్‌కు ఇండోనేసియా బృందాల రాకపై అసత్య ప్రచారం జరుగుతోంది. 70–80 సంవత్సరాల నుంచి దివ్యగ్రంథాల (ఖురాన్, హదీస్) వెలుగులో ఇస్లాం ధర్మం గొప్పతనాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి బోధకులు వస్తూ ఉంటారు. సమాజహితం, శాంతి స్థాపనకు బోధకులు అల్లాహ్‌తో ప్రార్థిస్తారు. భారత్ నుంచి సైతం ఇస్లాం బోధకులు విదేశాలకు వెళ్తుంటారు. వీరికి ఉగ్రవాదులతో ఎలాం టి సంబంధం లేదు. కరీంనగర్లో ట్రైనింగ్ విద్యా సంస్థ నడుపుతున్న వ్యక్తితో ఇండోనేసియన్లకు ఎలాంటి సంబంధం లేదు. –సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, ఎంఐఎం కరీంనగర్ నగర అధ్యక్షుడు కరీంనగర్లో విస్తరణకు పోలీసుల అడ్డు నిజామాబాద్‌లో ఆగస్టు 21న పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు అతివాద సంస్థ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు నిజామాబాద్, జగిత్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జగిత్యాలలో ఈ సంస్థకు ఓ కార్యాలయం ఉండగా, నాయకులపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. వందలాది మంది సానుభూతి పరులు ఉన్న ఈ సంస్థను కరీంనగర్లో విస్తరించే ప్రయత్నాలను పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇప్పటికే 40 మంది కార్యకర్తలను గుర్తించి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి సంస్థలను, వ్యక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని కమిషనర్ ‘సాక్షి’కి చెప్పారు. ఇండోనేసియా బృందాన్ని అతివాద సంస్థ నేత కలసిన అంశం విచారణ చేస్తున్నామన్నారు. -
సముద్రంలో కుప్పకూలిన విమానం
-
ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ క్వార్టర్స్‌లో సింధు, సైనా
జకార్తా: ఈ ఏడాది తాము ఆడుతోన్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. ఇండోనేసియా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈ ఇద్దరు హైదరాబాద్ అమ్మాయిలు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–12, 21–9తో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ గో జిన్ వె (మలేసియా)ను ఓడించగా... ప్రపంచ 12వ ర్యాంకర్ సైనా 21–12, 21–18తో ప్రపంచ 20వ ర్యాంకర్ చెన్ జియోజిన్ (చైనా)పై గెలుపొందింది. అంతర్జాతీయ స్థాయిలో సైనా, సింధు ముఖాముఖిగా రెండుసార్లు తలపడగా... చెరో మ్యాచ్‌లో గెలిచి సమఉజ్జీగా ఉన్నారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
రద్దీ రైల్లో పాము.. వీడియో వైరల్
జకర్తా : రద్దీగా ఉన్న రైలులో ఒక్కసారిగా పాము కనిపించింది. ఇంకేముంది ప్రయాణికుల అరుపులతో రైల్లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీంతో అత్యవసరంగా ట్రైన్‌ను ఆపివేశారు. సెక్యురిటీ సిబ్బంది వచ్చి ప్రయాణికులు బ్యాగులు పెట్టే స్థలంలో పాము ఎక్కడుందో నిధానంగా స్టిక్‌తో తనిఖీ చేయసాగారు. ఇదంతా గమనిస్తున్న పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు ఇలాకాదని క్షణాల్లో సీటుపై కాలుపెట్టి, పైభాగంలో ఉన్న పామును ఒంటి చేత్తో పట్టుకున్నాడు. అంతేనా పామును లాగి బయటకు తీసి ఒక్క రౌండ్ గాల్లో తిప్పి గట్టిగా ట్రైన్లో కింద కొట్టేశాడు. ఈ హఠాత్పరిణామానికి ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. సదరు యువకుడు తర్వాత పాము ఇంకా బతికుందా లేదా అని చూసి మరీ రైల్లో నుంచి కింద పడేశాడు. ఇండోనేషియాలోని ఓ అర్బన్ ట్రైన్లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైలు బోగోర్ నుంచి జకర్తా వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పామును చాకచక్యంగా పట్టుకొని ప్రయాణికులను కాపాడినందుకు సదరు యువకున్ని కొందరు హీరో అంటూ కొనియాడితుంటే, జంతు ప్రేమికులు మాత్రం పామును మరీ అంత క్రూరంగా చంపాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇండోనేషియాలో అర్బన్ ప్రాంతాల్లో జంతువులను రైల్లో తీసుకువెళ్లడం నిషేధం. అయినా ట్రైన్‌లోకి పాము రావడంపై రైల్వే సిబ్బంది ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఎవరైనా ప్రయాణికులు బ్యాగులో పామును తీసుకువచ్చి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. -
రద్దీ రైల్లో పాము.. వీడియో వైరల్
-
నడిరోడ్డులో యువతికి బెత్తం దెబ్బలు
-
గతి తప్పిన విమానాలు.. ఘోరప్రమాదాలు
- ఇండోనేసియాలో ఇంట్లోకి దూసుకెళ్లిన సైనిక విమానం.. ముగ్గురి మృతి - సైనిక విమానం కూలి నలుగురు సైనికుల దుర్మరణం మలాంగ్/ నైపిడా: ఆగ్నేయ ఆసియా దేశాలైనా ఇండోనేసియా, మయన్మార్ లలో బుధవారం చోటుచేసుకున్న విమాన ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇరు దేశాల్లోనూ కుప్పకూలినవి సైనిక విమానాలే కావడం గమనార్హం. రెండు దేశాల్లో కలిపి ఐదుగురు సైనికులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. ఇండోనేసియా జావా దీవిలోని అబ్దుల్ రాచ్మన్ సలేహ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బుధవారం ఉదయం ఓ శిక్షణ విమానం గాలిలోకి ఎగిరింది. దాదాపు 40 నిమిషాల ప్రాక్టీస్ అనంతరం విమానానికి ఎయిర్ బేస్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం ఎక్కడున్నదీ గుర్తించలేకపోయామని, అర గంట తర్వాత నగరంలో అత్యంత రద్దీగా ఉండే నివాస ప్రాంతంలో అది కూలిపోయినట్లు గుర్తించామని వైమానిక అధికారులు చెప్పారు. అదుపు తప్పిన విమానం నేరుగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఆ ఇంటి యజమాని, యజమానురాలు సహా పైలట్ కూడా మృత్యువాతపడ్డాడు. మయన్మార్ ప్రమాదం: సాధారణ పరీక్షల నిమిత్తం ఐదుగురు సైనికులు ఒక చిన్న తరహా విమానంలో రాజధాని నైపిడాలోని ఎయిర్ బేస్ నుంచి గాలిలోకి ఎగిరారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానంలో మంటలు చెలరేగి ఎయిర్ బేస్ కు సమీపంలోని పంటపొలాల్లో కూలిపోయింది. విమానంలో ఉన్న ఐదుగురు సైనికుల్లో నలుగురు మంటలల్లో కాలిపోగా, ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డట్టు అధికారులు చెప్పారు. మయన్మార్ పూర్తిగా కొండప్రాంతం కావడంతో భూతర రవాణా సౌకర్యాలు తక్కువ. దీంతో సాధారణ ప్రయాణికులు కూడా విమాన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. ఈ కారణంగా అక్కడ తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి. -
వీడెవడండీ బాబూ!
ఫేమస్ టూన్ ఇండోనేషియన్లకు ఏదైనా కార్టూన్ నచ్చితే చాలు... నవ్వడమే కాదు, గుండెలో గుడి కట్టేసి ఆ కార్టూన్‌ను అందులో పెట్టుకుంటారు. అయిదు సంవత్సరాల క్రితం ఈ దేశంలో కార్టూన్ మ్యూజియం ఏర్పడటమే అందుకు సాక్ష్యం. ఈ మ్యూజియమ్‌లో ఇండోనేషియాకు చెందిన ప్రసిద్ధ కార్టూన్లన్నీ కొలువుతీరి ఉన్నాయి. ‘బాలి’లోని ఈ మ్యూజియానికి ప్రారంభోత్సవం చేసిన ఇండోనేషియాకు చెందిన సీనియర్ కార్టూనిస్ట్ ప్రియంటో... ‘‘ఇదో నవ్వుల ఖజానా’’ అని వ్యాఖ్యానించారు. ఇండోనేషియన్ కార్టూనిస్ట్ డిడియై సా కార్టూన్లను టోకుగా ఒక దగ్గర చూసినప్పుడు కూడా ‘నవ్వుల ఖాజానా’ అన్న మాట మన నోటి వరకు వస్తుంది. డిడిైయెు సా మంచి ఇలస్ట్రేటర్, కార్టూనిస్ట్, డిజైనర్‌గా రకరకాల పత్రికలు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలలో తన ప్రతిభను చాటుకున్నాడు. కాలుష్య భూతం, మహానగరాల్లోని ఇరుకు జీవితం, డిజిటల్ జీవితంలోని గందరగోళం... ఇలా ఎన్నో సామాజిక సమస్యలను ఆయన కుంచె ప్రపంచం ముందు పెట్టింది. ఆయన వేసిన ‘డ్రైల్యాండ్’ కార్టూన్ అయితే ఒక మౌన కావ్యం అనిపిస్తుంది. అయితే అంత వేడి వేడి కార్టూన్లు మనకు ఎందుకు అనుకుంటే... ఆయన వేసిన ఈ కార్టూన్ని చూసి కాసేపు చల్లగా నవ్వుకుందాం రండి! -
ఇదో 'చెత్త' వాచీ
జకార్త : చెత్తే కదా అని తీసి పారేస్తే.. దాంతో వాచీలు చేసేసుకుంటాం అంటున్నారు.. ఇండోనేసియాలోని మటోవా కంపెనీ ఉద్యోగులు. అవును.. కాలుష్యం బారి నుంచి భూమాతను కాపాడేందుకు ఈ కంపెనీ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. చెత్తను రీసైక్లింగ్ చేసి, దాంతో వాచీలు తయారు చేసి అమ్ముతున్నారు. చూడగానే ఇట్టే ఆకర్షిస్తున్న ఈ వాచీలతో కంపెనీ ఉద్యోగులు.సంచలనం సృష్టించారు. మకావా కంపెనీ ఒకప్పుడు ఫర్నీచర్ తయారు చేసేది. తమ వద్ద మిగిలిన చెక్కలు, ముక్కలతో ఈ ఎట్రాక్టివ్ వాచీలు తయారుచేస్తున్నారు. రోజుకు 25 రకాల వాచీలు తయారు చేస్తూ ఈ కంపెనీ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా, సింగపూర్, చైనా, జపాన్, దక్షిణాఫ్రికాల నుంచి ఈ 'చెత్త వాచీ'లకు విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. మటోవా కంపెనీలో పనిచేసే సిబ్బంది 25 మంది మాత్రమే. అక్కడ తయారయ్యేది వారానికి 25 వాచీలు మాత్రమే. -
బ్లాక్ బాక్స్ కోసం మరో వారం అగవలసిందే!
జకార్తా/సింగపూర్: సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ కోసం మరో వారం రోజులు ఆగవలసిందేనని ఇండోనేషియా అధికారులు చెప్పారు. ఆ బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం క్యుజడ్ 8501 కూలిపోయిన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవని అధికారులు తెలిపారు. విమాన ప్రయాణికుల మృతదేహాల కోసం ఐదో రోజు గురువారం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్ సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. విమానంలో 162 మంది ఉండగా, ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు సాధ్యం కావడంలేదు. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బలమైన అలల వల్ల విమాన శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి.