బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేవాలయం లాంటి స్కూళ్లు, కళాశాలల్లో కూడా విద్యార్థులకు రక్షణ కరువవుతోంది. విద్యాబుద్ధులు నేర్పి సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు కీచకులుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సద్బుద్ధి నేర్పాల్సిన గురువులే.. బుద్ధి లేకుండా రాక్షసులుగా మారి విద్యార్థులపై కామవాంఛ తీర్చుకుంటున్నారు.
Indonesian Teacher Molested 13 Female Students: పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా, కేర్‌టేకర్‌గా ఉండాల్సిన వ్యక్తి.. విద్యార్థినులపై అత్యాచారం చేసినందుకు గానూ కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకెళ్తే.. ఇండోనేషియాకు చెందిన బోర్డింగ్ స్కూల్ యజమాని హెర్రీ విరావన్ (36) పదమూడు మంది విద్యార్థులనులపై అత్యాచారం చేశాడు. వారిలో ఎనిమిది మంది గర్భం దాల్చారు. 2006 నుంచి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. వీరికి స్కాలర్‌షిప్‌లను ఆశ చూపి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాధితులందరూ కూడా మైనర్లు కాగా, వీరిలో చాలా మంది పేద కుటుంబాల నుంచి వచ్చారు.ఈ కేసులో నిందితుడు హెరీ విరావాన్‌ను ఇండోనేషియా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో విరావాన్‌కు మరణశిక్ష విధించాలని, లేదంటే రసాయనాలతో శిక్షించాలని ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. అయితే న్యాయమూర్తులు నిందితుడికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు.
చదవండి: (భారత్‌పై అమెరికా ప్రశంసలు)
Comments
Please login to add a commentAdd a comment