చిట్యాల (నల్గొండ): చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన యువకుడు నాగరాజు ఇండోనేషియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం శుక్రవారం గుండ్రాంపల్లి గ్రామంలో జరిగింది. సీమ సాలయ్య–యాదమ్మ ప్రథమ కుమారుడు నాగరాజు హైదరాబాద్‌లో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజు పనిచేస్తున్న కంపెనీలోనే ఇండోనేషియాలో రిజ్కి నన్‌డా సఫిట్రి అనే యువతి కూడా పనిచేస్తోంది.
వీరిద్దరికి ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని రిజ్కి నన్‌డా సఫిట్రిని నాగరాజుకు ఇండియాకు పిలిపించాడు. నాగరాజు స్వగ్రామం గుండ్రాంపల్లిలో శుక్రవారం వేద మంత్రాల సాక్షిగా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment