
సాక్షి, విశాఖపట్నం: భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల మధ్య తొలిసారిగా జరిగిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు శుక్రవారంతో ముగిశాయి. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో ఈ నెల 20న మారిటైమ్ విన్యాసాలు మొదలయ్యాయి. భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఐఎన్‌ఎస్ సహ్యాద్రి యుద్ధనౌక భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా.. రాయల్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.
మూడు దేశాల మధ్య భాగస్వామ్యం బలోపేతం చేయడం, సామర్థ్యాల్ని మెరుగుపరిచేందుకు పరస్పర సహకారంతోపాటు ఇండో– పసిఫిక్ సముద్ర జలాల్లో స్థిరమైన శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఈ త్రైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజున వ్యూహాత్మక విన్యాసాలు, క్రాస్‌డెక్ ఆపరేషన్స్, హెలికాప్టర్ల క్రాస్‌డెక్ ల్యాండింగ్ తదితర విన్యాసాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment