acrobatics
-
ముగిసిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల మధ్య తొలిసారిగా జరిగిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు శుక్రవారంతో ముగిశాయి. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో ఈ నెల 20న మారిటైమ్ విన్యాసాలు మొదలయ్యాయి. భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌక భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా.. రాయల్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. మూడు దేశాల మధ్య భాగస్వామ్యం బలోపేతం చేయడం, సామర్థ్యాల్ని మెరుగుపరిచేందుకు పరస్పర సహకారంతోపాటు ఇండో– పసిఫిక్ సముద్ర జలాల్లో స్థిరమైన శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఈ త్రైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజున వ్యూహాత్మక విన్యాసాలు, క్రాస్‌డెక్ ఆపరేషన్స్, హెలికాప్టర్ల క్రాస్‌డెక్ ల్యాండింగ్ తదితర విన్యాసాలు నిర్వహించారు. -
కబడ్డీ నింపిన విషాదం.. వారం రోజులు మృత్యువుతో పోరాడి
కబడ్డీ ఆట ఒక నిండుప్రాణం తీసింది. దాదాపు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసి చివరికి ఆగస్టు 15న ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని అరని టౌన్లో మరియమ్మన్ గుడి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇదే వేడుకల్లో కబడ్డీ పోటీలు నిర్వహించారు. కాగా 34 ఏళ్ల వినోద్ కుమార్ మురట్టు కాలై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కూతకు వెళ్లే సమయంలో దొమ్మరిగడ్డ(Somersualt) వేసే ప్రయత్నంలో తప్పుడుగా ల్యాండ్ అయ్యాడు. దీంతో అతని తల భాగం నేలకు బలంగా తాకడంతో అక్కడే సృహ తప్పాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిగతా ఆటగాళ్లు, సిబ్బంది వచ్చి లేపినప్పటికి లాభం లేకుండా పోయింది. దీంతో వెంటనే ఆంబులెన్స్‌లో అరానీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వినోద్ కుమార్ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వేలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వినోద్ కుమార్ తాజాగా భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ(ఆగస్టు 15న) ప్రాణాలు విడిచాడు. కాగా వినోద్ కుమార్‌కు భార్య శివగామి, సంతోష్, కలైరాసన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వినోద్ కుమార్ మృతితో అరనీలో విషాదచాయలు అలుముకున్నాయి. கரணம் அடித்த போது திடிரென மயங்கி விழுந்த கபடி வீரர் உயிரிழப்பு#Aarani | #Kabaddi pic.twitter.com/Qx49VeJz4j — News18 Tamil Nadu (@News18TamilNadu) August 16, 2022 చదవండి: ప్రజ్ఞానంద సంచలనం Anderson Peters: అథ్లెట్‌పై అమానుష దాడి.. వీడియో వైరల్ -
క్వార్టర్ ఫైనల్స్కే ఇంత రచ్చ.. మరి కప్ గెలిస్తే!
మ్యాచ్ గెలిచినప్పుడు ఆటగాళ్ల సంతోషం పట్టలేనంతగా ఉంటుంది. కొందరు విజయం తాలుకా భావోద్వేగాలను తమలోనే అణుచుకుంటే.. మరికొందరు మాత్రం మాటల్లోనూ.. తమ చేష్టలతోనో బయటపెడుతుంటారు. తాజాగా బుర్కినా ఫాసో గోల్ కీపర్ హార్వే కోఫీ తన సంతోషాన్ని ఎవరు ఊహించని విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో గాబన్, బుర్కినా ఫాసోల మధ్య రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్లో బుర్కినా ఫోసో ఆటగాడు ఇస్మాహిలా ఔడ్రాగో గోల్ కొట్టడంతో ఆ జట్టు విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరింది. చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి గోల్ కొట్టిన ఆనందంలో ఔడ్రాగో షర్ట్ తీసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. అయితే ఇదంతా గమనించిన గోల్‌కీపర్ హార్వే కోఫీ మైదానంలోనే ఎరోబిక్ విన్యాసాలు(దొమ్మరిగడ్డలు) వేశాడు. ఇది చూసిన ఆటగాళ్లు గోల్ కీపర్ ఇలా చేయడం చూసి ఆశ్చర్యపోయినప్పటికి అతని సెలబ్రేషన్స్‌లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ.. క్వార్టర్ ఫైనల్ల్లో గెలిస్తేనే ఎనర్జీ లెవెల్స్ ఇలా ఉన్నాయి.. మరి ఫైనల్లో గెలిచి కప్ అందుకుంటే ఇంకేం చూడాల్సి వస్తుందో అని ఫన్నీగా క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్‌లో రిఫరీ రెడ్యూనే జియేద్ ఇరు జట్లకు కలిపి దాదాపు 14సార్లు ఎల్లోకార్డులు జారీ చేశారు. చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం When you reach the #TotalEnergiesAFCON2021 quarter finals! #TeamBurkinaFaso edition! 😆#AFCON2021 | #TeamBurkinaFaso pic.twitter.com/QVotLloBt3 — #TotalEnergiesAFCON2021 🏆 (@CAF_Online) January 24, 2022 -
'రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం'
సాక్షి, విశాఖపట్నం : భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అమెరికా రాయభారి కెన్నత్ జస్టర్ పేర్కొన్నారు.ఇండియా - అమెరికా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెన్నత్ జస్టర్‌కు భారత్ తరఫున నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ గోర్మడే స్వాగతం పలికారు. కెన్నత్ మాట్లాడుతూ.. డిసెంబర్ 18,19 తేదిలలో హైదరాబాద్ లో, ఫిబ్రవరిలో లక్నోలో రెండు దేశాల మధ్య వాణిజ్య సదస్సులు ఉన్నాయని తెలిపారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఇండియా-అమెరికా భాగస్వామ్యంతో హైదరాబాద్ లో అపాచి హెలికాఫ్టర్లు, ఎఫ్ 16 యుద్ధ విమానాల విడిభాగాలు, సి1 30 విమానాల విడిభాగాల తయారీలు పురోగతిలో ఉన్నాయన్నారు. కాగా, భారత - అమెరికా సంయుక్త విన్యాసాలు టైగర్ ట్రంప్ 2019 ఉభయచర విన్యాసాలలో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వపై ఉభయ దళాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఈనెల 21 వరకు విశాఖ, కాకినాడలలో ఇండో-అమెరికన్ త్రివిధ దళాలు విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విశాఖ తీరానికి అమెరికా యుద్ద నౌక జర్మన్ టౌన్ చేరుకుంది. ఈ సందర్భంగా ఇండియా, అమెరికా నేవీ అధికారులు యుద్ద విమానాలు, మిస్సైల్ ను ప్రదర్సించారు. భారత - అమెరికా మిలటరీ సహకారానికి ఈ విన్యాసాలు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాయని ఇండియా, అమెరికా నేవీ అధికారులు పేర్కొన్నారు.ఇరు దేశాల మధ్య త్రివిధ దళాల మధ్య మెరుగైన సంబంధాలు, మానవీయ సాయం, విపత్తుల వంటి అంశాలలో నైపుణ్యాల అభివృద్ది , పరస్పర సహకారాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సంయుక్త విన్యాసాలలో భాగంగా ఇరుదేశాల త్రివిధ దళాల సైనికులు పరస్పర సందర్శనలు, సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే లైవ్ ఫైర్ డ్రిల్లులు, భారత హెలీకాప్టర్లు అమెరికా నౌక జర్మన్ టౌన్ పై లాండింగ్ వంటివి రాబోయే తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు. -
యుద్ధ నౌకలో విజ్ఞాన యాత్ర
నడిసంద్రంలో విన్యాసాల హోరు నావికాదళ సత్తా చాటేలా ప్రదర్శనలు విద్యార్థులకు విజ్ఞానం.. వినోదం ఘనంగా సముద్రంలో ఒక రోజు ఒకటి కాదు.. రెండు కాదు.. శత్రుభీకరమైన ఆరు యుద్ధనౌకలు.. వాటికి తోడుగా ఓ సబ్‌మెరైన్.. హెలికాప్టర్లు.. యుద్ధ విమానాలు.. అవి చేసిన విన్యాసాలు.. సమర సన్నద్ధత ప్రదర్శనలు.. రెస్క్యూ ఆపరేషన్లు.. వెరసి నడిసంద్రంలో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించారుు. వేలాది విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు విజ్ఞానం.. వినోదం అందించారుు. నేవీడే ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన డే ఎట్ సీ(సముద్రంలో ఒక రోజు) కార్యక్రమం గగుర్పాటు కలిగించింది. ప్రతినిధి, విశాఖపట్నం: యుద్ధ నౌకల బారులు.. ఆరుుల్ ట్యాంకర్ కమ్ వార్‌షిప్ ఐఎన్ఎస్ శక్తి నౌక, సబ్‌మెరైన్ సింధువీర్.. అదనంగా హైస్పీడ్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌లు టి 36, టి 37, టి38, టి39.. నడిసంద్రంలో వేగంగా వెళ్తుండగా.. గగనతలంలో రెండు యుద్ధ విమానాలు. మూడు సెర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్లు. మరో రెండు రెండు హాక్ ఫైటర్ ఎరుుర్క్రాఫ్ట్లు... ప్రదర్శించిన అద్భుతమైన విన్యాసాలకు నడిసంద్రమే వేదికై ంది. నగరంలోని వివిధ పాఠశాలలతోపాటు, కోరుకొండ సైనిక్ స్కూల్, భువనేశ్వర్‌లోని సైనిక్ స్కూళ్లకు చెందిన సుమారు రెండున్నర వేలమంది విద్యార్థులు, నగరంలోని సీనియర్ సిటిజన్లు, మీడియా ప్రతినిధులను నేవీ అధికారులు నౌకల్లో విశాఖ తీరం నుంచి 20 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలోకి తీసుకువెళ్లారు. ఉదయం 9 గంటలకు మొదలైన ప్రయాణం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మధ్యలో సుమారు ఐదుగంటల పాటు ఏకబిగిన సాగిన విన్యాసాలు విద్యార్ధులు, చూపరులను సంద్రమాశ్చర్యాల్లో ముంచెత్తారుు. ►యుద్ధనౌకలు వరుసగా ఒకదాని వెంట ఒకటి.. కొంత దూరం తర్వాత ఐదు యుద్ధ నౌకలు పక్క పక్కనే ఒకే వేగంతో ప్రయాణించడం, ఎడమ వైపు సత్పుర.. కుడి వైపు శివాలిక్ .. మధ్యలో శక్తి యుద్ధనౌక స్థిరవేగంతో ప్రయాణిస్తూ ఒకదాని నుంచి మరొకటి డీజిల్ నింపుకోవడం, సత్పుర, శివాలిక్‌ల నుంచి కేవలం తాడు సాయంతో నావికులు శక్తి నౌకలోకి ప్రవేశించడం, పై నుంచి వేగంగా వచ్చిన హెలికాప్టర్ నుంచి ఓ వ్యక్తి సముద్రంలో ఉన్న హైస్పీడ్ బోటులోకి దిగడం.. వంటి అరుదైన విన్యాసాలు విద్యార్థులు, చూపరులను అబ్బురుపరిచారుు. నేవీ సత్తా, విపత్కర, యుద్ధ సమయాల్లో అది స్పందించే తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. ►విపత్తులు, యుద్ధాల సమయంలో నావికాదళం ఏవిధంగా స్పందిస్తుంది.. వేగవంతమైన మోటారు పడవలు(ఫాస్ట్ ఎటాక్ క్రాఫ్ట్‌లు ) సముద్రంలో ఎలా వెళ్తారుు, యుద్ధ నౌకలు ప్రయాణిస్తుండగానే వాటిలో ఇంధనాన్ని ఎలా నింపుకుంటారు, శత్రు సైనికులు, ఉగ్రవాదులపై యుద్ధనౌకల్లో నుంచి అత్యాధునిక మెషిన్గన్లతో దాడి జరిపే తీరు.. నౌకాదళ హెలికాప్టర్లు సముద్రంలో జలాంతర్గాముల్ని ఏ విధంగా గుర్తిస్తారుు, యుద్ధ నౌకల్లో నావికులు ఒకదాని నుంచి మరో నౌకలోకి తాడు సాయంతో ఎలా వెళ్తారు. సముద్రంలో చిక్కుకుపోరుున వారిని హెలికాప్టర్ల ద్వారా ఏవిధంగా రక్షిస్తారు.. జలాంతర్గాముల రాకపోకలు ఎలా ఉంటాయన్న అంశాలు ప్రదర్శించారు. యుద్ధ నౌకలివే.. సముద్రంలోకి తీసుకువెళ్లేందుకు, యుద్ధ విన్యాసాలు చూపించేందుకు ఐఎన్ఎస్ శక్తి, శివాలిక్, సత్పుర, రణ్విజయ్, సుకన్య, కోరా, కాట్మా, కుంజర్ యుద్ధ నౌకలను వినియోగించారు. వీటితో పాటు సింధువీర్ జలాంతర్గామి పాల్గొంది. చేతక్, కమావ్-28, సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ అండ్ రెస్క్యూ విధానాన్ని ప్రదర్శించారు. అనంతరం రెండు హాక్ ఫైటర్ (అడ్వాన్స జెట్ ట్రైనర్) ఎరుుర్క్రాఫ్ట్లు, రెండు యుద్ధ విమానాలు డార్నియర్, పి8ఐ విన్యాసాలను ప్రదర్శించారు. పి8ఐ విమానాన్ని ఇటీవలే అమెరికా నుంచి కొనుగోలు చేసి బహుళార్ధ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నట్టు ఫ్లీట్ కమాండర్ బి.దాస్ గుప్తా వెల్లడించారు . -
బైక్ రేసుల జోరు
మంగళగిరి మండలంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీసు రోడ్లు, చినకాకాని హాయ్‌ల్యాండ్ రోడ్డు బైక్ రేసులకు అడ్డాగా మారాయి. శని,ఆదివారాల్లో కొందరు యువకులు ఖరీదైన బైకులతో ఈ ప్రాంతాల్లో ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ అతివేగంగా తిరుగుతూ స్థానికులను హడలెత్తిస్తున్నారు. రేసుల్లో విజయవాడకు చెందిన బడాబాబుల, రాజకీయ పార్టీల నేతల కుమారులు పాల్గొంటున్నారు. రేసుల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన బైకులను వినియోగిస్తున్నారు. ్ధ బైక్ రేసులను కేవలం సరదా కోసమే కాకుండా డబ్బు సంపాదనకు మార్గంగా ఎంచుకోవటం విస్మయం కలిగిస్తోంది. రేసులపై లక్షలాది రూపాయల మేర పందాలు సాగుతున్నారుు. వీటిని పోలీసులు సీరియస్‌గా తీసుకోవటం లేదు. సమాచారం అందినపుడు తూతూమంత్రంగా స్పందించి చేతులు దులుపుకుంటున్నారు. రేసులకు పాల్పడుతున్నది బడాబాబుల పిల్లలు కావటంతో ఒత్తిళ్లకు తలొగ్గి హెచ్చరికలతో వదిలేస్తున్నారు. ఎలాంటి కేసులూ నమోదు చేయటం లేదు. ్ధ మంగళగిరి పరిసరాల్లో బైక్ రేస్‌లు నిర్వహిస్తూ యువకులు ఈ నెలలో ఇప్పటివరకు మూడుసార్లు పోలీసులకు పట్టుబడ్డారు. అరుుతే అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారిని వదిలేశారు. తాజాగా ఆదివారం ఉదయం కాజ టోల్గేట్ వద్ద బైక్ రేసులో పాల్గొనేందుకు వచ్చి రూరల్ పోలీసులకు పట్టుబడినవారిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్ధ ఉన్నారు. అరుుతే ఎమ్మెల్యే ఒత్తిడితో రేసు కోసం వచ్చిన మరో ఏడుగురు యువకులను, ఐదు బైకులను పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలివేయడం గమనార్హం. ్ధ రేస్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవటం ఖాయం. దీనివల్ల ఆయూ కుటుంబాలవారికి తీరని విషాదమే మిగులుతుంది. అలాంటిదేదైనా జరిగితే తామే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిసినా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రేసుల్లో పాల్గొంటున్న యువకులు ఇంజినీరింగ్‌లాంటి ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్నవారే కావడం విశేషం. వేగం, ఫీట్లపై పందాలు.. బైక్ రేసుల్లో పాల్గొనే యువకులు వేగం, ఫీట్లపై పందాలు కాస్తుంటారు. ఉదాహరణకు జాతీయ రహదారిపై కాజ టోల్గేట్ నుంచి మంగళగిరి-తెనాలి జంక్షన్ వరకు గమ్యమని నిర్ణయించుకుంటే సుమారు ఐదు కిలోమీటర్లు ఉండే ఈ దూరాన్ని ఎవరు ముందు దాటితే వారు విజయం సాధించినట్లు పరిగణిస్తారు. అత్యాధునిక బైకులు కావడంతో స్టార్ట్ చేసిన కొద్ది సెకన్లలోనే గంటకు 150 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంటాయి. = ఇక పందెం కోసం బైకులపై యువకులు చేసే ఫీట్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇలాంటి ఫీట్లను పెద్దగా జనసంచారం లేని రోడ్లపై చేస్తుంటారు. ప్రధానంగా చినకాకాని హాయ్‌ల్యాండ్ రోడ్డును వినియోగిస్తుంటారు. అతివేగంగా దూసుకువచ్చి సడన్ బ్రేక్ వేసి ముందు చక్రంపై బైక్‌ను నిలబెట్టడం, అతివేగంగా రింగ్‌లు తిరగడం, బైక్‌ను పడుకోబెట్టినట్టు ఉంచి ఎంతసేపు నడుపుతారనే విషయాలపై పందాలు జరుగుతుంటాయి. చర్యలు తీసుకుంటాం.. ఈ విషయమై రూరల్ సీఐ హరికృష్ణ వివరణ కోరగా బైక్ రేసులు జరుగుతున్న విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఎవరైనా బైక్ రేసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేసులు జరిగే ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేస్తామని, రేసులు జరుగకుండా అడ్డుకోవడంతోపాటు యువకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. -
విన్యాసాలు అదుర్స్
-
మిస్టర్ మంచు మనిషి!
20 గిన్నిస్ బుక్ రికార్డులు బ్రేక్ చేశాడు... రక్తం గడ్ట కట్టే అతి శీతల వాతావరణంలో కూడా అతడు అపూర్వ విన్యాసాలు చేయగలడు. అందుకే హాలండ్‌కు చెందిన విమ్ హాప్‌ను ‘ఐస్‌మ్యాన్’ అని పిలుస్తారు. అత్యధిక సమయం పాటు ఐస్‌బాత్‌తో సహా మొత్తం 20 గిన్నిస్ వరల్డ్ రికార్డ్లను బ్రేక్ చేసిన ఘనత ఆయనకు దక్కింది. మంచుముక్కలపై 52 నినిషాల 42 సెకండ్ల పాటు అతను కదలకుండా నిలుచున్నాడు. అలాగే, సబ్-జీరో టెంపరేచర్లో ధ్యానం చేశాడు. కేవలం ఒక జత బట్టలతో ఎవరెస్ట్ అధిరోహించడం ద్వారా ఛాలెంజింగ్ రికార్డ్‌ను సృష్టించాడు. ‘‘మంచుగడ్డలకు నేను ఎప్పుడూ భయపడలేదు. నా శరీరం ఎక్కడ తట్టుకోగలదు. ఎక్కడ తట్టుకోలేదు అనే విషయంపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది’’ అంటున్నాడు హాప్. ‘‘వేడిగా ఉండండి... అంటూ నా మెదడు శరీరంలోని ఇతర బాగాలకు సందేశాలను పంపగలదు’’ అని సరదాగా అంటాడు హాప్. సరదా సంగతి ఎలా ఉన్నా మంచుకొండల్లో ఆయన విన్యానాలు చూస్తే...‘అయ్య బాబోయ్’ అనిపించక మానదు. -
కుర్రకారు జోరు... బుడతల హుషారు
-
యువశక్తి దేశానికి ఉపయోగపడాలి
విశాఖపట్నం, న్యూస్‌లైన్: గుడిలోవ విజ్ఞా న విహార్ 34వ వార్షికోత్సవం సందర్భం గా ఆదివారం విద్యార్థులు ప్రదర్శించిన క్రీడా విన్యాసాలివి. విద్యార్థుల మానసిక శక్తికి, శారీరక దారుఢ్యానికి అద్దం పట్టా యి. పిల్లలు కాదు పిడుగులు అనిపించేలా మోటారు సైకిల్‌పై విద్యార్థులు చేసిన వి న్యాసాలు చూపరులను ఆశ్చర్యపరిచి వారి ధైర్య సాహాసాలకు ప్రతీకగా నిలిచాయి. మోటారు సైకిల్‌తో ట్యూబ్ లైట్లను పగలు గొట్టడం, నిప్పు చక్రాల నుంచి గాలిలో ఎగురుతూ చేసిన విన్యాసాలు గగుర్భాటు కలిగించాయి. సైకిల్ పై వివిధ రకాల భం గిమలతో చేసిన అంశాలు వారి శారీరక దారుఢ్యానికి అద్దం పట్టాయి. వందమంది విద్యార్ధులు ఒకేసారి రెప్పపాటు కాలంలో నిర్మించిన పిరమిడ్ వారిలో సమైక్యతకు నిదర్శనగా నిలిచింది. పేర్లబార్, మల్లకంబలపై చేసిన వివిధ విన్యాసాలు అలరించాయి. వ్యాయామం ద్వారా ప్రదర్శించిన ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్స్ అంశం ఆహూతులతో నవ్వులు రువ్వించింది. ఈ సందర్భం గా జరిగిన సభకు రాయపూ ర్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విశ్వవిద్యాలయం ఉపకుల పతి సచ్చిదానంద జోషి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే యువతను వి ద్యాలయాలు తయారు చేయాలని పేర్కొన్నారు. విద్య వ్యాపారంగా మారిన ఈ రో జుల్లో విజ్ఞాన్ విహార్ వంటి కొన్ని సంస్థలే విలువులకు కట్టుబడి బోధన సాగిస్తున్నాయని కొనియాడారు. విశాఖ రామకృష్ణ మి షన్ ఆశ్రమం స్వామి గుణేశానందజీ మ హరాజ్ మాట్లాడుతూ ఉక్కునరాలు, ఇనుప కండరాలు గల యువతను తయారు చేయడం లో శారీరక శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో విద్యాభార తి అఖిల భారత కార్యదర్శి ప్రకాష్ చంద్ర జీ, ఎస్ఆర్కే ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరుక్టర్ సత్యన్నారాయణ రాజు ప్రసంగిం చారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వాక్పతి రాజు, కార్యదర్శి డి.వి.వి కృష్ణంరాజు, విశా ఖ భారతీయ విద్యా కేంద్రం అధ్యక్షుడు నరసింహం, దూసి రామకృష్ణారావు, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అవధాని, రవిప్రకాష్ పాల్గొన్నారు.