మ్యాచ్ గెలిచినప్పుడు ఆటగాళ్ల సంతోషం పట్టలేనంతగా ఉంటుంది. కొందరు విజయం తాలుకా భావోద్వేగాలను తమలోనే అణుచుకుంటే.. మరికొందరు మాత్రం మాటల్లోనూ.. తమ చేష్టలతోనో బయటపెడుతుంటారు. తాజాగా బుర్కినా ఫాసో గోల్ కీపర్ హార్వే కోఫీ తన సంతోషాన్ని ఎవరు ఊహించని విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో గాబన్, బుర్కినా ఫాసోల మధ్య రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్‌లో బుర్కినా ఫోసో ఆటగాడు ఇస్మాహిలా ఔడ్రాగో గోల్ కొట్టడంతో ఆ జట్టు విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరింది.
చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి
గోల్ కొట్టిన ఆనందంలో ఔడ్రాగో షర్ట్ తీసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. అయితే ఇదంతా గమనించిన గోల్‌కీపర్ హార్వే కోఫీ మైదానంలోనే ఎరోబిక్ విన్యాసాలు(దొమ్మరిగడ్డలు) వేశాడు. ఇది చూసిన ఆటగాళ్లు గోల్ కీపర్ ఇలా చేయడం చూసి ఆశ్చర్యపోయినప్పటికి అతని సెలబ్రేషన్స్‌లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. క్వార్టర్ ఫైనల్‌ల్లో గెలిస్తేనే ఎనర్జీ లెవెల్స్ ఇలా ఉన్నాయి.. మరి ఫైనల్లో గెలిచి కప్ అందుకుంటే ఇంకేం చూడాల్సి వస్తుందో అని ఫన్నీగా క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్‌లో రిఫరీ రెడ్యూనే జియేద్ ఇరు జట్లకు కలిపి దాదాపు 14సార్లు ఎల్లోకార్డులు జారీ చేశారు.
చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం
When you reach the #TotalEnergiesAFCON2021 quarter finals! #TeamBurkinaFaso edition! 😆#AFCON2021 | #TeamBurkinaFaso pic.twitter.com/QVotLloBt3
— #TotalEnergiesAFCON2021 🏆 (@CAF_Online) January 24, 2022
Comments
Please login to add a commentAdd a comment