Penalty shootout
-
SAFF ఫుట్‌బాల్ ఛాంపియన్ భారత్.. 9వ సారి టైటిల్ కైవసం (ఫోటోలు)
-
చాంపియన్ భారత్
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్‌గా నిలి చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో కువైట్ జట్టును ఓడించింది. కువైట్ పశి్చమ ఆసియా దేశమైనా పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో దక్షిణాసియా టోరీ్నకి ఆ జట్టును ప్రత్యేకంగా ఆహా్వనించారు. లీగ్ దశలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్ తుది పోరులో మాత్రం పైచేయి సాధించింది. ఆట 14వ నిమిషంలో అల్‌బలూషి గోల్‌తో కువైట్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో లాలియన్జులా చాంగ్టే గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగానే ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ‘షూటౌట్’లో నిరీ్ణత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. ఆరో షాట్లో భారత ప్లేయర్ మహేశ్ సింగ్ గోల్ చేయగా... కువైట్ ప్లేయర్ హజిహా కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), రన్నరప్ కువైట్ జట్టుకు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 50 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 9: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ ఇప్పటివరకు 13 సార్లు జరిగింది. భారత్ తొమ్మిదిసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023) టైటిల్ సాధించింది. 24: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 23 గోల్స్‌తో అలీ అష్ఫాక్ (మాల్దీవులు) పేరిట ఉన్న రికార్డును 24 గోల్స్‌తో సునీల్ ఛెత్రి అధిగమించాడు. ‘షూటౌట్’ సాగిందిలా... భారత్ స్కోరు కువైట్ సునీల్ ఛెత్రి 4 10 అబ్దుల్లా 8 సందేశ్ జింగాన్ 4 21 అలోతైబి 4 లాలియన్జులా 4 32 ఆల్దెఫీరి 4 ఉదాంత సింగ్ 8 33 మహ్రాన్ 4 సుభాశ్ బోస్ 4 44 అల్ఖాల్ది 4 మహేశ్ సింగ్ 4 54 హజిహా 8 -
FIFA: క్రొయేషియా గోల్‌కీపర్ సంచలనం.. చరిత్రలోనే తొలిసారి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా సెమీస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా.. బ్రెజిల్‌ను పెనాల్టీ షూటౌట్లో 4-2తో మట్టికరిపించి సెమీస్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్‌లో క్రొయేషియా గోల్ కీపర్ డొమినిక్ లివాకోవిచ్ హీరోగా నిలిచాడు. పెనాల్టీ షూటౌట్లో పటిష్టమైన బ్రెజిల్ ఆటగాళ్లు నాలుగుసార్లు గోల్ చేయడానికి ప్రయత్నించగా సమర్థంగా అడ్డుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలోనే నాలుగు పెనాల్టీ షూటౌట్ అడ్డుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదివరకు ఏ గోల్ కీపర్ ఈ ఘనత సాధించలేదు. ఇక పెనాల్టీ షూటౌట్లో వినిసియస్జూనియర్, నెయ్మర్, లుకాస్ పెక్వెటా కొట్టడానికి యత్నించిన గోల్స్‌ను సమర్థంగా అడ్డుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. దీంతో డొమినిక్ లివాకొవిచ్ ఇప్పుడు క్రొయేషియాలో హీరోగా మారిపోయాడు. ఇక నవంబర్ 14న జరగనున్న తొలి సెమీఫైనల్లో అర్జెంటీనాతో క్రొయేషియా అమితుమీ తేల్చుకోనుంది. Livakovic the hero again as Croatia oust Brazil on penalties 🤯 Watch how Zlatko Dalic's side beat the 5-time #FIFAWorldCup champions 🙌 Presented by @Mahindra_Auto Stay tuned to #JioCinema & #Sports18 for more 📺📲#CROBRA #Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/gRydVtRRsC — JioCinema (@JioCinema) December 10, 2022 Croatia's hero... again! 🇭🇷🧤#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/w8QroYs2aJ — FIFA World Cup (@FIFAWorldCup) December 9, 2022 చదవండి: Lionel Messi: 'ఏంటి చూస్తున్నావ్.. నీ పని చూసుకో స్టుపిడ్' -
FIFA WC: బ్రెజిల్ గుండె పగిలింది
పెనాల్టీ షూటౌట్... అప్పటికే బ్రెజిల్ 2–4తో వెనుకబడి ఉంది. నాలుగు ప్రయత్నాల్లోనూ క్రొయేషియా స్కోరు చేయగా, బ్రెజిల్ రెండు సార్లే సఫలమైంది. ఇలాంటి సమయంలో మార్కినోస్ పెనాల్టీ తీసుకున్నాడు. స్టేడియం మొత్తం ఉత్కంఠ, ఈ షాట్ సరిగా పడకపోతే... ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు... గోల్‌పోస్ట్ కుడి వైపు గురి పెడుతూ మార్కినోస్ కిక్ కొట్టాడు. క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్ ఎడమ వైపు దూకాడు... దాంతో బంతి లక్ష్యం చేరినట్లే అనిపించింది. కానీ నేరుగా గోల్ పోస్ట్‌కు తాకి వెనక్కి వచ్చింది ! అంతే...మార్కినోస్ కుప్పకూలిపోగా, బ్రెజిల్ ఆటగాళ్లంతా అచేతనంగా ఉండిపోయారు. మరోసారి హీరోగా మారిన లివకోవిచ్ను చుట్టుముట్టి క్రొయేషియా సంబరాల్లో మునిగిపోగా, స్టేడియంలో బ్రెజిల్ అభిమానుల గుండె పగిలింది. విషాదంతో నిండిపోయిన ‘సాంబా’ బృందం కన్నీళ్లపర్యంతమైంది. ఐదుసార్లు విజేత, టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. వరుసగా ఐదో వరల్డ్ కప్‌లో రిక్త హస్తాలకే పరిమితమైన తమ జట్టు పరిస్థితిపై ఫ్యాన్స్ వేదన చూసి సగటు ఫుట్‌బాల్ అభిమానీ అయ్యో అంటూ బాధపడిపోయాడు! దోహా: వరల్డ్‌కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు బ్రెజిల్ మరోసారి టైటిల్‌కు బహు దూరంలో నిలిచిపోయింది. గెలుపు అవకాశాలు సృష్టించుకున్నా, చివర్లో తడబాటుకు లోనై ఆపై షూటౌట్లో నిష్క్రమించింది. అవును...ఫిఫా వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ఆట క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా పెనాల్టీలతో బ్రెజిల్‌ను మట్టికరిపించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం కలిపిన తర్వాత ఇరు జట్టు ఒక్కో గోల్ చేసి 1–1తో సమంగా నిలిచాయి. దాంతో షూటౌట్ అనివార్యమైంది. ఇందులో 4–2 తేడాతో నెగ్గిన క్రొయేషియా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్రెజిల్ తరఫున నెమార్ (105+1వ నిమిషంలో) గోల్ కొట్టగా, క్రొయేషియా ఆటగాడు బ్రూనో పెట్కోవిచ్ (117వ నిమిషం)లో స్కోరు సమం చేశాడు. హోరాహోరీగా... తొలి అర్ధభాగంలో ఇరు జట్లు బంతిపై పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. బ్రెజిల్ కొంత దూకుడు కనబర్చినా, క్రొయేషియా పదునైన డిఫెన్స్‌తో నిలువరించగలిగింది. ముఖ్యంగా బ్రెజిల్ ప్లేయర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రత్యర్థి తలవంచలేదు. మిడ్‌ఫీల్డర్లు బ్రొజోవిచ్, కొవాసిచ్, మోడ్రిచ్ అద్భుత ఆటతో బ్రెజిల్‌కు అవకాశం ఇవ్వకుండా వ్యూహాన్ని సమర్థంగా అమలు చేశారు. కీపర్ లివకోవిచ్ కూడా కీలక పాత్ర పోషించాడు. వినిసియస్ కొట్టిన షాట్‌ను అతను సమర్థంగా ఆపగలిగాడు. నెమార్ కూడా చురుగ్గా కదల్లేకపోవడం బ్రెజిల్‌కు ప్రతికూలంగా మారింది. రెండో అర్ధభాగంలో మాత్రం పరిస్థితి మారింది. నెమార్ కూడా లయ అందుకోగా రిచార్లీసన్ కూడా జత కలిశాడు. అయితే 55వ నిమిషంలో రిచార్లీసన్ చేసిన ప్రయత్నాన్ని, 66వ నిమిషంలో పక్వెటా సృష్టించిన అవకాశంతో పాటు 76వ నిమిషంలో నెమార్ కొట్టిన కిక్‌ను కూడా లివకోవిచ్ నిర్వీర్యం చేయడం విశేషం. 90 నిమిషాల ఆటలో స్కోరు నమోదు కాకపోగా, ఆట అదనపు సమయానికి చేరింది. ఇందులో నెమార్ అద్భుత గోల్ బ్రెజిల్‌ను ముందంజలో నిలిపింది. క్రొయేషియా డిఫెన్స్‌ను ఛేదించి దూసుకుపోయిన అతను గోల్ కీపర్ తప్పించడంలో సఫలం కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. కెరీర్లో 77వ గోల్‌తో అతను పీలే రికార్డును సమం చేయడం విశేషం. అయితే క్రొయేషియా వెంటనే కోలుకుంది. మరో నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా మోర్సిచ్ అందించిన పాస్‌ను సూపర్ కిక్‌తో గోల్‌గా మలచడంలో పెట్కోవిచ్ విజయం సాధించాడు. ఈ ఆసక్తికర సమరం తుది ఫలితం మాత్రం చివరకు షూటౌట్తోనే తేలింది. వరుసగా రెండో వరల్డ్‌కప్‌లోనూ బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోనే ని్రష్కమించింది. -
‘షూటౌట్’లో భారత్ ఓటమి
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా జర్మనీ మహిళల జట్టుతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్’లో 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ‘షూటౌట్’లో నెగ్గిన జర్మనీకి రెండు పాయింట్లు, భారత్‌కు ఒక పాయింట్ లభించాయి. సాకేత్ ఖాతాలో 26వ డబుల్స్ టైటిల్ సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో 26వ అంతర్జాతీయ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. శనివారం భోపాల్‌లో ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట విజేతగా నిలిచింది. 56 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 6–1తో లోహితాక్ష–అభినవ్ సంజీవ్ (భారత్) జోడీపై గెలిచింది. చదవండి: IND vs SL: అశ్విన్ ఏం చేస్తున్నావు.. ఏంటి ఆ పని..! -
క్వార్టర్ ఫైనల్స్కే ఇంత రచ్చ.. మరి కప్ గెలిస్తే!
మ్యాచ్ గెలిచినప్పుడు ఆటగాళ్ల సంతోషం పట్టలేనంతగా ఉంటుంది. కొందరు విజయం తాలుకా భావోద్వేగాలను తమలోనే అణుచుకుంటే.. మరికొందరు మాత్రం మాటల్లోనూ.. తమ చేష్టలతోనో బయటపెడుతుంటారు. తాజాగా బుర్కినా ఫాసో గోల్ కీపర్ హార్వే కోఫీ తన సంతోషాన్ని ఎవరు ఊహించని విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో గాబన్, బుర్కినా ఫాసోల మధ్య రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్లో బుర్కినా ఫోసో ఆటగాడు ఇస్మాహిలా ఔడ్రాగో గోల్ కొట్టడంతో ఆ జట్టు విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరింది. చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి గోల్ కొట్టిన ఆనందంలో ఔడ్రాగో షర్ట్ తీసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. అయితే ఇదంతా గమనించిన గోల్‌కీపర్ హార్వే కోఫీ మైదానంలోనే ఎరోబిక్ విన్యాసాలు(దొమ్మరిగడ్డలు) వేశాడు. ఇది చూసిన ఆటగాళ్లు గోల్ కీపర్ ఇలా చేయడం చూసి ఆశ్చర్యపోయినప్పటికి అతని సెలబ్రేషన్స్‌లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ.. క్వార్టర్ ఫైనల్ల్లో గెలిస్తేనే ఎనర్జీ లెవెల్స్ ఇలా ఉన్నాయి.. మరి ఫైనల్లో గెలిచి కప్ అందుకుంటే ఇంకేం చూడాల్సి వస్తుందో అని ఫన్నీగా క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్‌లో రిఫరీ రెడ్యూనే జియేద్ ఇరు జట్లకు కలిపి దాదాపు 14సార్లు ఎల్లోకార్డులు జారీ చేశారు. చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రాకు విశిష్ట పురస్కారం When you reach the #TotalEnergiesAFCON2021 quarter finals! #TeamBurkinaFaso edition! 😆#AFCON2021 | #TeamBurkinaFaso pic.twitter.com/QVotLloBt3 — #TotalEnergiesAFCON2021 🏆 (@CAF_Online) January 24, 2022 -
EURO CUP 2020: ఫైనల్ చేరిన ఇటలీ
లండన్: యూఈఎఫ్ఏ చాంపియన్‌షిప్ యూరోకప్ 2020 కప్‌లో ఇటలీ ఫైనల్లో అడుగుపెట్టింది. స్పెయిన్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఫెనాల్టీ షూటౌట్ ద్వారా ఇటలీ విజయం సాధించింది. మ్యాచ్‌లో భాగంగా ఇటలీ తరపున 60వ నిమిషంలో ఫెడెరికో చిసా గోల్ చేయగా.. స్పెయిన్ తరపున అల్వారో మొరాటా 80వ నిమిషంలో గోల్ చేశాడు. మ్యాచ్ ముగిసే సమయానికి 1-1తో సమంగా నిలిచిన ఇటలీ, స్పెయిన్లు తమకు కేటాయించిన ఎక్స్ట్రా టైమ్‌లోనూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ఫెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేల్చాల్సి వచ్చింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫెనాల్టీ షూట్ట్లో ఇటలీ 4-2 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. ఇక రెండో సెమీస్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 12.30 గంటలకు ఇంగ్లండ్, డెన్మార్క్ మధ్య జరగనుంది. బ్రెజిల్ 21వసారి ఫైనల్లోకి... రియో డి జనీరో: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బ్రెజిల్ జట్టు 21వసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. పెరూ జట్టుతో జరిగిన తొలి సెమీఫైనల్లో బ్రెజిల్ 1–0తో నెగ్గింది. ఆట 34వ నిమిషంలో నేమార్ అందించిన పాస్‌ను లుకాస్ పక్వెటా గోల్ పోస్ట్‌లోనికి పంపించాడు. అర్జెంటీనా, కొలంబియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బ్రెజిల్ తలపడుతుంది. వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఈ టోర్నీలో బ్రెజిల్ తొమ్మిదిసార్లు విజేతగా, 11 సార్లు రన్నరప్‌గా నిలిచింది. -
భారత్ షూటౌట్
ఇపో (మలేసియా): చివరి నిమిషాల్లో గోల్ ఇచ్చుకోవడం...ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్లో విఫలం కావడం...ఇటీవల భారత హాకీ జట్టు పరాజయాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. శనివారం అజ్లాన్ షా టోర్నీ ఫైనల్లో కూడా ఇదే తరహాలో భారత్ ఓడింది. తుది పోరులో కొరియా 4–2 తేడాతో (షూటౌట్లో) ఐదు సార్లు చాంపియన్ భారత్‌పై విజయం సాధించి సగర్వంగా టైటిల్ సొంతం చేసుకుంది. 9వ నిమిషంలోనే సిమ్రన్‌జిత్ సింగ్ చేసిన ఫీల్డ్ గోల్‌తో భారత్ 1–0తో ముందంజ వేసింది. మూడు క్వార్టర్ల పాటు మన జట్టు ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. అయితే నాలుగో క్వార్టర్ ప్రారంభం కాగానే (47వ నిమిషంలో) కొరియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. భారత్ వీడియో రిఫరల్‌కు వెళ్లినా ఫలితం దక్కలేదు. జంగ్ జోంగ్ హ్యూన్ దీనిని గోల్‌గా మలచి స్కోరు సమం చేశాడు. చివర్లో పెనాల్టీ అవకాశం దక్కినా భారత్ దానిని ఉపయోగించుకోలేకపోయింది. షూటౌట్లో భారత్ తరఫున బీరేంద్ర లక్డా, వరుణ్ కుమార్ గోల్స్ నమోదు చేయగా... మన్దీప్ సింగ్, సుమీత్, సుమీర్ కుమార్ జూనియర్ గోల్ చేయడంలో విఫలమయ్యారు. వర్గీకరణ మ్యాచ్‌లో కెనడాను 4–2తో ఓడించి ఆతిథ్య మలేసియా మూడో స్థానంలో నిలిచింది. -
భారత్... చేజేతులా
బ్రెడా (నెదర్లాండ్స్): వరుసగా రెండోసారి చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్లో 1–3తో పరాజయం పాలైంది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా ఉండటంతో విజేతను షూటౌట్ ద్వారా నిర్ణయించారు. 2016 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ భారత్ షూటౌట్లోనే 1–3 స్కోరుతో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. నిర్ణీత సమయంలో 24వ నిమిషంలో బ్లేక్ గోవర్స్ గోల్‌తో ఆసీస్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది, అనంతరం వివేక్ ప్రసాద్ (42వ నిమిషంలో) గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. -
రష్యా షూట్... స్పెయిన్ ఔట్
78 వేల మంది ప్రేక్షకులు దిక్కులు పిక్కటిల్లేలా ఇచ్చిన మద్దతుతో సొంతగడ్డపై రష్యా గర్జించింది. ఎలాంటి అంచనాలు లేని నేపథ్యంలో బరిలోకి దిగి ఏకంగా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పెనాల్టీ షూటౌట్లో మాజీ చాంపియన్ స్పెయిన్‌ను చిత్తు చేసి సగర్వంగా ముందంజ వేసింది. అద్భుత ఆటతో స్పెయిన్‌కు అడ్డు గోడలా నిలిచిన కెప్టెన్, గోల్ కీపర్ అకిన్‌ఫీవ్... ఆఖర్లో రెండు స్పాట్ కిక్‌లను ఆపి రష్యా దేశం చిరకాలం గుర్తుంచుకునే కొత్త హీరోగా అవతరించాడు.120 నిమిషాల ఆటలో రికార్డు స్థాయిలో ఏకంగా 1006 పాస్‌లు...ఆటలో 74 శాతం పాటు బంతి తమ ఆధీనంలోనే... అయినా సరే షూటౌట్ వరకు వెళ్లకుండా గెలుపు అందుకోవడం స్పెయిన్ వల్ల కాలేదు. అతి రక్షణాత్మక ధోరణి ఆడి... గోల్ చేసేందుకు ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని వృథా చేసుకొని మూల్యం చెల్లించుకుంది. మాస్కో: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో సంచలన ఫలితం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న రష్యా షూటౌట్లో చెలరేగి వరల్డ్ నంబర్ 10 స్పెయిన్ జట్టును ఇంటిదారి పట్టించింది. ఆదివారం ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రష్యా 4–3 స్కోరు (పెనాల్టీ షూటౌట్)తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. నిర్ణీత సమయంతో పాటు మరో అర గంట అదనపు సమయం ముగిసేసరికి కూడా ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం షూటౌట్ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. మ్యాచ్ 12వ నిమిషంలో రష్యా ఆటగాడు సెర్గీ ఇగ్నాషెవిచ్ చేసిన సెల్ఫ్‌గోల్‌తో స్పెయిన్‌కు ఆధిక్యం లభించగా... 41వ నిమిషంలో జ్యూబా గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ కొట్టడంలో సఫలం కాలేకపోయాయి. ఈ టోర్నీలో తొలిసారి ఫలితం షూటౌట్ ద్వారా తేలగా, రష్యా 48 ఏళ్ల తర్వాత క్వార్టర్స్ చేరింది. మ్యాచ్‌లో స్పెయిన్ కొట్టిన 24 షాట్లను గోల్ కాకుండా నిరోధించిన కీపర్ అకిన్‌ఫీవ్ షూటౌట్లోనూ అదే జోరు కొనసాగించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. వరుసగా ఐదో వరల్డ్ కప్‌లో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టే నెగ్గడం విశేషం. డిఫెన్స్...డిఫెన్స్... రష్యా జట్టు తమ ఫుట్‌బాల్ చరిత్రలోనే ‘అతి పెద్ద’ మ్యాచ్‌లో అభిమానుల ఆశలను మోస్తూ బరిలోకి దిగింది. అయితే ఆరంభంలో 38 ఏళ్ల సీనియర్ ఆటగాడు సెర్గీ ఇగ్నాషెవిచ్ చేసిన తప్పుతో తొలి గోల్ స్పెయిన్ ఖాతాలో పడింది. రష్యా గోల్ పోస్ట్ ఎడమ వైపు నాచోను జిర్కోవ్ అడ్డుకోవడంతో స్పెయిన్‌కు ఫ్రీ కిక్ లభించింది. దీనిని అడ్డుకునే ప్రయత్నంలో ఇగ్నాషెవిచ్ తన వైపు దూసుకొస్తున్న బంతిపై దృష్టి పెట్టకుండా స్పెయిన్ స్టార్ సెర్గియో రామోస్‌ను మార్కింగ్ చేసే ప్రయత్నం చేస్తూ అతడిని పడేశాడు. ఈ క్రమంలో ఇగ్నాషెవిచ్ కాలికి తగిలిన బంతి రష్యా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిపోయింది. ఈ టోర్నీలో రష్యాకు ఇది రెండో సెల్ఫ్ గోల్. 1966లో బల్గేరియా తర్వాత ఒకే జట్టు రెండు సెల్ఫ్ గోల్స్ ఇవ్వడం ఇదే మొదటి సారి. అయితే స్పెయిన్ తమదైన శైలిలో ‘టికీ టకా’ పాస్‌లకే కట్టుబడగా... రష్యా మాత్రం ఆ తర్వాత ధాటిని పెంచింది. 41వ నిమిషంలో రష్యా శ్రమ ఫలించింది. ఫ్రీ కిక్‌ను హెడర్ ద్వారా జ్యూబా గోల్‌గా మలిచే ప్రయత్నంలో ఉండగా, బాక్స్ ఏరియాలో గెరార్డ్ పికే చేతితో దానిని అడ్డుకున్నాడు. పికేకు ఎల్లో కార్డు ఇవ్వడంతో పాటు రిఫరీ రష్యాకు పెనాల్టీ కిక్ అవకాశం కల్పించాడు. దీనిని జ్యూబా సునాయాసంగా గోల్‌గా మలచడంతో స్టేడియంలో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 1986 తర్వాత నాకౌట్ దశలో రష్యా చేసిన తొలి గోల్ ఇదే కావడం విశేషం. రెండో అర్ధ భాగంలో రష్యాకు కొన్ని మంచి అవకాశాలు వచ్చినా, అది చేజార్చుకుంది. కొద్దిసేపు గడిచే సరికి ఇరు జట్లు బాగా అలసిపోయినట్లు కనిపించాయి. దాంతో అంతా డిఫెన్స్ తరహా ఆటను ప్రదర్శించారు. ఒక దశలో పరిస్థితి ‘వాకింగ్ ఫుట్‌బాల్’లా కనిపించింది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత మరో అర గంట అదనపు సమయంలో కూడా పరిస్థితి ఏమీ మారలేదు. -
భారత్‌కు ఆరో స్థానం
హాస్టింగ్స్(న్యూజిలాండ్): హాక్స్‌బే కప్ అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 5-6 స్థానాల కోసం ఆదివారం జరిగిన వర్గీకరణ పోరులో భారత్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3-4 గోల్స్ తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. తుదివరకు పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 2-2 తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులోనూ భారత క్రీడాకారిణులు విఫలమయ్యారు. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ 3-2తో జపాన్‌పై గెలిచింది. -
నెదర్లాండ్ పై అర్జెంటినా విజయం!
-
పెనాల్టీ షూట్ అవుట్ లో నెదర్లాండ్ పై అర్జెంటినా విజయం!
ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నిలో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాపై నెదర్లాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఏజట్టు కూడా నిర్ణీత సమయంలో గోల్ చేయకపోవడంతో అదనపు సమయాన్ని కేటాయించారు. అదనపు సమయంలో కూడా గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ధేశించేందుకు సీన్ పెనాల్టీ షూట్ వుట్ కు మారింది. పెనాల్టీ షూటవుట్ లో అర్జెంటీనా 4-2 తేడాతో నెదర్లాండ్ పై విజయం సాధించింది. -
అతడే ఒక ‘సైన్యం’
మధ్య అమెరికాలో కేవలం 45 లక్షల జనాభా ఉన్న దేశం కోస్టారికా. రక్షణ కోసం సైన్యం లేకపోవడం ఈ దేశం ప్రత్యేకత. ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఆ దేశ గోల్‌కీపర్ నవాస్ చూపించిన తెగువ చూస్తే... ఈ దేశానికి సైన్యం అవసరం లేదేమో అనిపిస్తుంది. మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా గ్రీస్ స్ట్రయికర్స్‌ను అడ్డుకున్న నవాస్... పెనాల్టీ షూటౌట్లోనూ ప్రత్యర్థి కిక్‌ను అడ్డుకుని కోస్టారికాను తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చాడు. - కోస్టారికాను క్వార్టర్స్‌కు చేర్చిన నవాస్ - పెనాల్టీ షూటౌట్లో గ్రీస్‌పై గెలుపు రెసిఫె: ఫుట్‌బాల్ ప్రపంచకప్ నాకౌట్ దశలో మరో ఫలితం పెనాల్టీ షూటౌట్ ద్వారానే తేలింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో 5-3 తేడాతో కోస్టారికా జట్టు గ్రీస్‌ను ఓడించింది. తద్వారా ఈ మెగా టోర్నీలో తొలిసారిగా ఈ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. అలాగే ప్రి క్వార్టర్స్ దశలో రెండు మ్యాచ్ ల్లో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం రావడం ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి. బ్రెజిల్, చిలీ జట్ల మధ్య ఫలితం కూడా ఇలాగే రావడం తెలిసిందే. అంతకుముందు మ్యాచ్ నిర్ణీత సమయంలో రెండు జట్లు 1-1 స్కోరుతో సమంగా నిలిచాయి. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోస్టారికా ఇంజ్యూరీ సమయం (90+1)లో గ్రీస్‌కు గోల్‌ను సమర్పించుకుంది. దీంతో ఎక్స్ట్రా సమయం అనివార్యమైంది. ఇక్కడా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది. ఇందులో కోస్టారికా తరఫున బోర్జెస్, రూయిజ్, గోంజలెజ్, క్యాంప్‌బెల్, ఉమానా గురి తప్పకుండా గోల్స్ సాధించారు. ఇక గ్రీస్ తరఫున మిట్రోగ్లూ, లేజరస్, కోలెవస్ వరుసగా గోల్స్ చేయగా కీలకమైన తరుణంలో గేకాస్ షాట్‌ను గోల్ కీపర్ నవాస్ అడ్డుకున్నాడు. దీంతో పరాజయం ఖాయమైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోస్టారికా గోల్ కీపర్ నవాస్‌కు దక్కింది. క్వార్టర్స్‌లో ఈనెల 5న కోస్టారికా.. నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. - తొలిసారిగా నాకౌట్ దశలో ఆడిన గ్రీస్ ప్రారంభంలో కాస్త పైచేయి సాధించింది. 37వ నిమిషంలో స్ట్రయికర్ దిమిత్రియోస్ సల్పింగిడి అతి సమీపం నుంచి కొట్టిన షాట్‌ను కోస్టారికా గోల్ కీపర్ కీలర్ నవాస్ గాల్లో రెండు కాళ్లు చాపుతూ అద్భుతంగా అడ్డుకున్నాడు. - ఇప్పటిదాకా ప్రపంచకప్‌లో కోస్టారికా సాధించిన 16 గోల్స్‌లో 12 ద్వితీయార్ధంలోనే వచ్చాయి. ఈ ఆనవాయితీ కొనసాగింపుగా అన్నట్టు 52వ నిమిషంలో కోస్టారికా తమ గోల్ ఖాతాను తె రిచింది. - డిఫెన్స్‌ను ఛేదిస్తూ క్రిస్టియన్ బొలనాస్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న స్ట్రయికర్ బ్రియాన్ రూయిజ్ ఎడమ కాలితో నేర్పుగా గోల్ పోస్టు కుడివైపు చివరకు నెట్టి జట్టును ఆనందంలో నింపాడు. - 66వ నిమిషంలో కోస్టారికా ఆటగాడు ఆస్కార్ డుయర్టెకు రెండో సారి ఎల్లో కార్డు చూపడంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో ఈ జట్టు పది మందితోనే ఆడాల్సి వచ్చింది. - చివర్లో గ్రీస్ తమ గోల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఇంజ్యూరీ సమయం ప్రారంభమైన నిమిషానికే కోస్టారికాకు షాక్ తగిలింది. ముందుగా గెకాస్ కొట్టిన షాట్ కీపర్ నవాస్‌కు తగిలి వెనక్కి వచ్చింది. గోల్ పోస్టుకు ఎదురుగా ఉన్న సోక్రటీస్ దీన్ని మెరుపు వేగంతో అందుకుని నెట్లోకి పంపాడు. దీంతో అప్పటిదాకా సంబరాల్లో మునిగిన కోస్టారికా అభిమానులు ఒక్కసారిగా నిరాశ కు గురయ్యారు. - ఎక్స్ట్రా సమయంలోనూ గ్రీస్ ప్రయత్నాలను కీపర్ నవాస్ వమ్ము చేసి మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. షూటౌట్లో తమ జట్టే గెలవడంతో ఆటగాళ్లతో పాటు కోస్టారికా అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. -
జూనియర్ ప్రపంచకప్ హాకీలో భారత్‌కు కాంస్యం
అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు అద్భుతం సృష్టించారు. జూనియర్ మహిళల ప్రపంచకప్‌లో తొలిసారి కాంస్య పతకం సాధించారు. ‘షూటౌట్’దాకా పోటాపోటీగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఓడించింది. మొన్చెన్గ్లాడ్బాచ్ (జర్మనీ): తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న భారత హాకీ నుంచి ఆదివారం శుభవార్త వినిపించింది. జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఈ పోటీల చరిత్రలో తొలిసారి భారత్ కాంస్య పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3-2తో ఇంగ్లండ్‌ను ఓడించింది. మ్యాచ్‌తో పాటు షూటౌట్లో రాణి కళ్లు చెదిరే ప్రదర్శనతో ఆకట్టుకుంది. నిర్ణీత సమయానికి ఇరుజట్ల స్కోరు 1-1తో సమం కావడంతో పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. ఇందులో లభించిన ఐదు అవకాశాల్లో భారత్ తరఫున రాణి మాత్రమే లక్ష్యాన్ని సాధించింది. ఇంగ్లండ్ క్రీడాకారిణిల్లో ఎమిలి డెఫ్రోండ్ మినహా మిగతా వారు విఫలమయ్యారు. దీంతో మళ్లీ ఇరుజట్ల స్కోరు 1-1తో సమమైంది. ‘సడన్‌డెత్’లో తొలి ప్రయత్నంలో రాణి, డెఫ్రోండ్లు తమ జట్లకు గోల్స్ అందించారు. రెండో ప్రయత్నంలో పూనమ్ రాణి విఫలం కాగా, షోనా (ఇంగ్లండ్) కూడా అవకాశాన్ని వృథా చేసుకుంది. ఇక మూడో ప్రయత్నంలో 17 ఏళ్ల నవనీత్ కౌర్ గోల్ సాధించగా... అనా తోమా (ఇంగ్లండ్) నిరాశపర్చింది. దీంతో భారత్ 3-2తో విజయాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు జరిగిన నిర్ణీత సమయంలో రాణి (13వ ని.) భారత్‌కు ఏకైక గోల్ అందించగా... అనా తోమా (55వ ని.) ఇంగ్లండ్ తరఫున గోల్ చేసి స్కోరును సమం చేసింది. ఫైనల్లో నెదర్లాండ్స్ 4-2తో అర్జెంటీనాపై నెగ్గి స్వర్ణం సాధించింది. ఒక్కొక్కరికి రూ.లక్ష కాంస్య పతకం గెలిచిన భారత జూనియర్ జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు పురస్కారాన్ని హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. కోచ్ నీల్ హావ్గుడ్కు రూ.లక్ష, సహాయ సిబ్బందికి రూ. 50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు హెచ్ఐ కార్యదర్శి బాత్రా తెలిపారు.