
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ షూటౌట్‌లో టీమిండియా విఫలం
బ్రెడా (నెదర్లాండ్స్): వరుసగా రెండోసారి చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్‌లో 1–3తో పరాజయం పాలైంది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా ఉండటంతో విజేతను షూటౌట్ ద్వారా నిర్ణయించారు. 2016 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ భారత్ షూటౌట్‌లోనే 1–3 స్కోరుతో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. నిర్ణీత సమయంలో 24వ నిమిషంలో బ్లేక్ గోవర్స్ గోల్‌తో ఆసీస్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది, అనంతరం వివేక్ ప్రసాద్ (42వ నిమిషంలో) గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment