mens hockey team
-
భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విజయం: ప్రధాని మోదీ
ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో నాలుగో పతకం వచ్చి చేరింది. భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. గురువారం స్పెయిన్‌పై జరిగిన ఈ పోరులో భారత్ 2-1తో గెలుపొందింది. కాగా ఒలింపిక్స్‌లో భారత జట్టు వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గత ఒలింపిక్స్‌లోనూ ఇండియా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.హాకీ జట్టు విజయంపై ప్రధాని మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా భారత్‌కు మరో ఘనత సాధించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో.. ‘భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇది మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఒలింపిక్స్‌లో హాకీకి వరుసగా రెండో పతకం.క్రీడాకారుల నైపుణ్యం, పట్టుదలకు స్ఫూర్తి ఈ విజయం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ప్రదర్శన చేశారు. భారత హాకీ బృందం స్ఫూర్తిని చాటింది. ప్రతి భారతీయుడికి హాకీతో మంచి అనుబంధం ఉంది. ఈ విజయానికి మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది. క్రీడాకారులందరికీ అభినందనలు’ అని తెలిపారు.A feat that will be cherished for generations to come! The Indian Hockey team shines bright at the Olympics, bringing home the Bronze Medal! This is even more special because it is their second consecutive Medal at the Olympics. Their success is a triumph of skill,…— Narendra Modi (@narendramodi) August 8, 2024 -
నాలుగో ర్యాంక్‌లో భారత పురుషుల హాకీ జట్టు
అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఒక స్థానం పడిపోయింది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా మూడు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గి భారత జట్టు నేరుగా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. మరోవైపు భారత మహిళల జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ఇటీవల జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు విఫలమై పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోలేకపోయింది. -
‘ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్ సింగ్
భారత పురుషుల హాకీ జట్టు స్టార్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) 2021–2022 ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. హర్మన్‌తోపాటు ఆర్థర్ డి స్లూవర్, టామ్ బూన్ (బెల్జియం), బ్రింక్‌మన్ (నెదర్లాండ్స్), నిక్లాస్ వెలెన్ (జర్మనీ) కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు. భారత్‌కే చెందిన పీఆర్ శ్రీజేష్, సవిత పూనియా ‘బెస్ట్ గోల్‌కీపర్’ అవార్డు బరిలో ఉన్నారు. ఈనెల 30 వరకు ఆన్లైన్ ఓటింగ్ కొనసాగుతుంది. వచ్చే నెలలో విజేతలను ప్రకటిస్తారు. చదవండి: Asia Cup 2022: ఏం చేస్తున్నావు రోహిత్.. ఇదేనా నీ కెప్టెన్సీ? నిజంగా సిగ్గు చేటు! -
జపాన్ చేతిలో భారత్‌కు షాక్
జకార్తా: ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు తొలి ఓటమి చవిచూసింది. 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ జట్టుతో మంగళవారం జరిగిన పూల్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున పవన్ (45వ ని.లో), ఉత్తమ్ సింగ్ (50వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ 13–0తో ఇండోనేసియాపై గెలిచింది. భారత్ సెమీఫైనల్ చేరాలంటే గురువారం జరిగే మ్యాచ్‌లో జపాన్ చేతిలో పాకిస్తాన్ తప్పనిసరిగా ఓడిపోయి... ఇండోనేసియాపై భారత్ భారీ విజయం సాధించాలి. ఒకవేళ జపాన్–పాక్ మ్యాచ్ ‘డ్రా’ అయితే భారత్ సెమీఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయి. జపాన్–పాకిస్తాన్ మ్యాచ్ ముగిశాక భారత్ మ్యాచ్ ఉంది కాబట్టి సెమీఫైనల్ చేరాలంటే ఎన్ని గోల్స్ తేడాతో గెలవాలన్న సంగతి టీమిండియాకు తెలుస్తుంది. -
కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకున్న భారత జట్లు
న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్ క్రీడల బరి నుంచి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తప్పుకున్నాయి. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానంద్రో నింగోంబం మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కామన్వెల్త్ గేమ్స్ బరి నుంచి తప్పుకున్న భారత జట్లు.. ఆసియా క్రీడలపై దృష్టిసారించనున్నాయని నింగోంబం తెలిపారు. ఆసియా క్రీడల్లో చక్కని ప్రదర్శన కనబరిస్తే 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు కానుందని, అందుకే కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, 2022 జులైలో కామన్వెల్త్ క్రీడలు, ఆగస్టులో ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రాంక్ చేసి భార్యను బెదరగొట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. -
కాంస్య పోరు: భారత్ వీరవిహార విజయం, 41 ఏళ్ల తర్వాత..
Tokyo Olympics 2020 Men Hockey Bronze Match: టగ్ ఆఫ్ వార్‌గా భావించిన పోరులో భారత్ జయకేతనం ఎగరేసింది. ఒలింపిక్స్ కాంస్యపు పోరులో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ పురుషుల హాకీ టీం విజయం సాధించింది. ఆఖర్లో ఉత్కంఠను పెంచి 5-4 తేడాతో జర్మనీని ఓడించింది. తద్వారా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్ పతకాన్ని ఖాతాలో వేసుకుంది ఇండియన్ మెన్స్ హాకీ టీం. ఇక పెనాల్టీ కార్నర్లు ఈ మ్యాచ్‌ను శాసించడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో జర్మనీ-భారత్ మధ్య కాంస్యం కోసం పోరు జరిగింది. ఆరంభంలో రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ కట్టబెట్టిన భారత్.. మొదట్లో తడబడినట్లు కనిపించింది. ఇక రెండో క్వార్టర్లో సిమ్రాన్‌జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమంగా ముగిసింది. మూడో క్వార్టర్లో మాత్రం నువ్వా నేనా అన్నట్లు సాగింది మ్యాచ్. జర్మనీ రెండు గోల్స్ కొట్టగా.. ఆ వెంటనే భారత్ మరో గోల్ కొట్టింది. ఆపై పెనాల్టీ కార్నర్‌ను అందిపుచ్చుకుని హాఫ్ టైం ముగిసేసరికి 3-3తో సమం చేసింది భారత్. పూర్తి పైచేయి మూడో క్వార్టర్లో పూర్తిగా భారత్ డామినేషన్ కొనసాగింది. ఆరంభంలోనే ఓ గోల్ సాధించి.. 4-3తో ఆధిక్యం కనబరిచింది భారత్. ఆ వెంటనే మరో గోల్‌తో 5-3 ఆధిక్యంలో నిలిచి.. జర్మనీపై ఒత్తిడి పెంచింది. ఆపై ప్రత్యర్థికి మరో గోల్ దక్కకుండా డిఫెండింగ్ గేమ్ ఆడింది. మధ్యలో గోల్ అవకాశం దక్కినా.. ఇరు జట్లు తడబడడంతో మూడు క్వార్టర్ భారత్ వైపే ఆధిక్యంతో ముగిసింది. చివర్లో.. జర్మనీ గోల్‌తో స్కోర్ 4-5 అయ్యింది. ఇక అక్కడి నుంచి మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. మరో గోల్ దక్కకుండా చాలా ప్రయత్నించింది భారత్. ఆఖర్లో జర్మనీకి దక్కిన పెనాల్టీ కార్నర్ విఫలం కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఆఖర్లో సెకన్ల వ్యవధిలో దక్కిన జర్మనీ షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకోవడంతో.. భారత్ విక్టరీ ఖాయమైంది. రియల్ హీరో.. హాకీ టీం గోల్ కీపర్ శ్రీజేష్.. చివర్లో షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకుని హీరో అనిపించుకున్నాడు. మన్‌ప్రీత్ సారథ్యంలో ఒలింపిక్ పతాక కలను సార్థకం చేశాడు. హాకీలో డిఫెండింగ్ దిగ్గజంగా కోచ్ గ్రాహం రెయిడ్.. సూచనలు భారత జట్టుకు ఎంతో ఉపకరించాయి. 17, 27, 29, 31, 34 నిమిషాల్లో గోల్స్ చేసిన భారత్జట్టులో 2 గోల్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు సిమ్రన్జీత్సింగ్. -
హాకీ సెమీస్‌లో నిరాశ.. భారత్ ఓటమి
-
వెల్డన్ బాయ్స్.. ఫోటో హైలెట్స్
టోక్యో: గత కొంతకాలంగా హాకీలో మెరుగైన ప్రదర్శన కనబరస్తున్న భారత పురుషుల హాకీ జట్టు.. టోక్యో ఒలిపింక్స్‌లో సెమీస్ దాకా వెళ్లి ఒక్కసారిగా అంచనాలు పెంచింది. అయితే బెల్జియం చేతిలో ఓటమితో ఫైనల్ చేరనప్పటికీ.. కాంస్యం ఆశలు మాత్రం సజీవంగా ఉంచుకోగలిగింది. ►టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం ఉదయం జరిగిన హాకీ మొదటి సెమీఫైనల్లో బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడింది భారత్. ►మొదట్లో ప్రపంచ ఛాంపియన్‌కు గట్టి పోటీ ఇచ్చిన భారత్.. ఆ తర్వాత ప్రత్యర్థి డిఫెండింగ్ ముందు తడబడింది. ►ఏ దశలోనూ భారత్ మరో గోల్ చేయకుండా అడ్డుకుంది బెల్జియం. ►చివర్లో రెండు గోల్స్‌తో పట్టుసాధించిన బెల్జియం.. ఆఖర్లో మరో గోల్‌తో 5-2 తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ►ఇక రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో భారత్ కాంస్యం కోసం పోరాడనుంది. ►సెమీస్ దాకా చేరుకున్న భారత హాకీ జట్టు ప్రయత్నాన్ని యావత్ దేశం ‘వెల్డన్ బాయ్స్’ అంటూ అభినందిస్తోంది. -
టోక్యో ఒలింపిక్స్ 2020: సెమీస్‌లో భారత్ ఓటమి
భారత పురుషుల హాకీ టీం ఆశలు తప్పాయి. టోక్యో ఒలింపిక్స్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఓడింది. 5-2 ఓటమితో ఫైనల్ ఆశల్ని దూరం చేసుకుంది భారత్. మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని హాకీ జట్టు మొదట్లో రెండు గోల్స్‌తో మెరిపించినా.. ఆపై బెల్జియం డిఫెండింగ్ ముందు తలవంచక తప్పలేదు. ఈ ఓటమితో కాంస్యం కోసం రెండో సెమీస్‌లో ఓడిన జట్టుతో ఎల్లుండి భారత పురుషుల హాకీ జట్టు తలపడాల్సి ఉంటుంది. ఓయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో మంగళవారం ఉదయం తొలి సెమీస్ మ్యాచ్ జరిగింది. మొదటి నుంచి దూకుడు ప్రదర్శించిన భారత హాకీ టీం. తొలి క్వార్టర్ ఏడో నిమిషంలోనే గోల్ కొట్టింది. ఆపై ఫస్టాఫ్ ముగిసేసరికి 2-1తో లీడ్‌లో ఆశలు చిగురింపజేసింది. అయితే ఆ తర్వాత బెల్జియం దూకుడు ప్రదర్శించింది. మరో గోల్‌తో 2-2తో స్కోర్ సమం చేయడంతో పాటు డిఫెండింగ్ గేమ్ ఆడింది ప్రత్యర్థి టీం. ఇక మూడో క్వార్టర్ నుంచి ఆట ఉత్కంఠభరితంగా కొనసాగింది. పెనాల్టీలను సద్వినియోగం చేసుకోవడంలో భారత్ విఫలమైంది. ఒకానొక దశలో బెల్జియం అదిరిపోయే డిఫెన్స్ ప్రదర్శించింది. నాలుగో క్వార్టర్లో మరో గోల్‌తో స్కోర్ 3-2 అయ్యింది. ఆపై కాసేపటికే పెనాల్టీ కార్నర్‌తో మరో గోల్ సాధించి 4-2తో ఆధిక్యం కనబరిచింది. ఇక మిగిలిన టైంలో డిఫెండింగ్ ప్రదర్శించిన బెల్జియం.. అదను చూసి మరో గోల్ చేయడంతో స్కోర్ 5-2గా మారింది. దీంతో టాప్ ర్యాంకర్ బెల్జియం భారత్ ఓటమిని శాసించింది. బెల్జియం తరపున అలెగ్జాండర్ హెన్డ్రిక్స్ రెండు, బలూయిపరట్, డోహ్మెన్ చెరో గోల్ సాధించారు. భారత్ తరపున మన్దీప్, హర్మన్‌ప్రీత్ సింగ్‌లు చెరో గోల్ కొట్టారు. ఇక టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో ఓడిన భారత హాకీ జట్టు.. కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది. రెండో సెమీఫైనల్లో జర్మనీ-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. -
టోక్యో ఒలింపిక్స్ అప్డేట్స్: షాట్‌పుట్‌లో నిరాశపరిచిన తేజిందర్‌పాల్
షార్ట్పుట్లో తేజిందర్‌పాల్ నిరాశ ► టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా షాట్‌పుట్ విభాగంలో భారత అథ్లెట్ తేజిందర్‌పాల్ సింగ్ నిరాశపరిచాడు. మొత్తం మూడు ప్రయత్నాల్లో ఒకసారి మాత్రమే సఫలమైన తేజిందర్ 19.99 మీ దూరం విసిరాడు. మిగతా రెండుసార్లు ఫౌల్ చేసి ఫెయిల్యూర్ అయ్యాడు. Tokyo Olympics Day 12 Live Updates: ఒలింపిక్స్‌లో భారత్ వరుస ఓటములు చవిచూస్తోంది. మంగళవారం జరిగిన ఈవెంట్స్‌లో ప్రతికూల ఫలితం వచ్చింది. ఓవైపు హాకీ, మరోవైపు జావెలిన్ థ్రో, ఇంకోవైపు రెజ్లింగ్‌లో ఓటములే ఎదురయ్యాయి. మహిళల రెజ్లింగ్ 62 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సోనమ్ మాలిక్, మంగోలియాకు చెందిన బోలోర్టుయా ఖురెల్ఖూతో తలపడి ఓడింది. Tokyo Olympics Wrestling: ► 2-2తో స్కోర్ సమమైనప్పటికీ.. ఖురెల్ఖూ పాయింట్ మూవ్ ఆధారంగా ఆమెను విజేతగా ప్రకటించారు. దీంతో సోనమ్ మాలిక్ ఓటమి పాలైంది. ► ఆరంభంలో దూకుడు చూపించినప్పటికీ.. ఫస్ట్ రౌండ్ బౌట్‌ను ఓడింది సోనమ్. ► తొలి పాయింట్ సాధించిన సోనమ్ ►మహిళల రెజ్లింగ్ 62 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సోనమ్ మాలిక్ బరిలోకి దిగింది. ఆసియన్ సిల్వర్ మెడలిస్ట్, మంగోలియాకు చెందిన బోలోర్టుయా ఖురెల్ఖూతో పోరాడుతోంది. India-Belgium Men's Hockey Semi-Final Live Updates: ►చివర్లో మరో పాయింట్‌తో 5-2 తేడాతో బెల్జియం భారత్‌పై ఘన విజయం సాధించింది. ►మొదలైన నాలుగో క్వార్టర్. 2-2తో కొనసాగింది మ్యాచ్. ఈ తరుణంలో బెల్జియం మరో గోల్‌తో 3-2 ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ తరుణంలో మరో పెనాల్టీ కార్నర్ దక్కింది బెల్జియంకు. ఆ వెంటనే మరో గోల్‌తో బెల్జియం 4-2తో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ►మూడో క్వార్టర్ ముగిసేందుకు ఏడు నిమిషాలుండగా.. భారత్‌కు పెనాల్టీ కార్నర్ దక్కింది. కానీ, ఎటాకింగ్ గేమ్‌తో బెల్జియం భారత్‌ను ఇరకాటంలో పెడుతోంది. మూడో క్వార్టర్ ముగిసేసరికి.. స్కోర్ 2-2తో సమంగానే కొనసాగుతోంది. ►సెకండ్ క్వార్టర్ ముగిసేసరికి 2-2 తేడాతో స్కోర్ సమం అయ్యింది. బెల్జియం తరపున లూయిపరట్, అలెగ్జాండర్ హెన్డ్రిక్స్ చెరో గోల్ కొట్టారు. బెల్జియం డిఫెండింగ్ గేమ్ ఆడుతుండడంతో టీమిండియాపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో మూడో క్వార్టర్లో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ► భారత పురుషుల హాకీ సెమీస్‌లో బెల్జియంతో తలపడుతోంది భారత పురుషుల హాకీ జట్టు. తొలి క్వార్టర్‌లోనే బెల్జియంపై గోల్ చేసిన భారత్.. ఆపై బెల్జియంకు ఓ గోల్ అప్పజెప్పింది. ఆపై మరో గోల్‌తో 2-1తో నిలిచింది. మన్దీప్, హర్మన్‌ప్రీత్ చెరో గోల్ కొట్టారు. తొలి క్వార్టర్ ముగిసేసరికి.. భారత్ అత్యద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇక రెండో క్వార్టర్ మొదలైన కాసేపటికే.. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెన్డ్రిక్స్ గోల్ కొట్టడంతో స్కోర్ 2-2 అయ్యింది. క్లిక్ చేయండి: పతకాలు గెస్ చేయండి.. క్యాష్ ప్రైజ్ గెల్వండి టోక్యో వేదికగా ఒలింపిక్స్ 2020లో పురుషుల హాకీ సెమీస్‌లో బెల్జియంతో భారత హాకీ జట్టు తలపడిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం ఓయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో మ్యాచ్ ప్రారంభం కాగా.. మ్యాచ్ మూడో క్వార్టర్ దాకా హోరాహోరీగా నడిచింది. అయితే నాలుగో క్వార్టర్ నుంచి బెల్జియం డామినేషన్ కొనసాగింది. చివర్లో బెల్జియం మూడు గోల్స్ సాధించడంతో 5-2 తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది బెల్జియం. I’m watching the India vs Belgium Hockey Men’s Semi Final at #Tokyo2020. Proud of our team and their skills. Wishing them the very best! — Narendra Modi (@narendramodi) August 3, 2021 #WATCH | CRPF jawans cheer for Indian men's hockey team in Jammu, chant 'Jeetega bhai jeetega, India jeetega' & 'Bharat Mata ki Jai'. India is playing against Belgium in the semi-final at #TokyoOlympics. pic.twitter.com/ohEneoSOtx — ANI (@ANI) August 3, 2021 Tokyo Olympics Women's Javelin Throw: భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ అన్ను రాణి తీవ్రంగా నిరాశ పరిచింది. మహిళల జావెలిన్ థ్రో విభాగంలో Annu Rani సత్తా చాటలేకపోయింది. మహిళల జావెలిన్ థ్రో విభాగంలో 54.4 మీటర్ల దూరం విసిరి 14వ పొజిషన్‌తో సరిపెట్టుకుని.. ఫైనల్ ఈవెంట్‌కు క్వాలిఫై కాలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో నేటి(ఆగష్టు 3) భారత్ షెడ్యూల్ ఉ.7గం.లకు బెల్జియంతో తలపడనున్న భారత్ పురుషుల హాకీ జట్టు (సెమీస్) ఉదయం 7:20 నుంచి అథ్లెటిక్స్ మహిళల లాంగ్‌జంప్ ఫైనల్ ఉదయం 8:30కు మహిళల రెజ్లింగ్ 62 కిలోల విభాగం ( సోనమ్ మాలిక్) ఉదయం 8:50 నుంచి అథ్లెటిక్స్ పురుషుల 400 మీ. హార్డిల్స్ ఫైనల్ మధ్యాహ్నం 2:20 నుంచి జిమ్నాస్టిక్స్ మహిళల బ్యాలెన్స్ బీమ్ ఫైనల్ మధ్యాహ్నం 2:45కు మహిళల రెజ్లింగ్ 62 కిలోల విభాగం సెమీస్ మధ్యాహ్నం 3:45కు పురుషుల షాట్‌బాల్ (తజిందర్ పాల్) క్వాలిఫికేషన్ మధ్యాహ్నం 3:50కి అథ్లెటిక్స్ పురుషుల పోల్‌వాల్ట్ ఫైనల్ సాయంత్రం 5:05 నుంచి అథ్లెటిక్స్ మహిళల హ్యామర్ త్రో ఫైనల్ సాయంత్రం 5:55 నుంచి అథ్లెటిక్స్ మహిళల 800 మీ. పరుగు ఫైనల్ సాయంత్రం 6:20 నుంచి అథ్లెటిక్స్ మహిళల 200 మీ. పరుగు ఫైనల్ -
‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా మన్‌ప్రీత్ సింగ్
లుసానే: భారత పురుషుల హాకీ జట్టు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించిన సారథి మన్‌ప్రీత్ సింగ్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.పురుషుల విభాగంలో 2019 ఏడాదికి గానూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెల్చుకున్నాడు. దాంతో ఈ అవార్డును గెల్చుకున్న తొలి భారత హాకీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ అవార్డు కోసం బెల్జియం ప్లేయర్ ఆర్థర్ వాన్ డోరెన్, అర్జెంటీనా ఆటగాడు లుకాస్ విల్లాలు పోటీ పడగా... పోలైన మొత్తం ఓట్లలో 35.2 శాతం ఓట్లను దక్కించుకున్న మన్‌ప్రీత్ విజేతగా నిలిచాడు. ఆర్థర్ 19.7 శాతం, లుకాస్ 16.5 శాతం ఓట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ అవార్డును తన జట్టు సభ్యులకు అంకితమిస్తున్నట్లు మన్‌ప్రీత్ తెలిపాడు. 2019లో తమ ప్రధాన లక్ష్యం ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే అని... రష్యాతో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా ఒలింపిక్ కల నెరవేరిందని ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. 2011లో భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన మన్‌ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు 263 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడాడు. అంతే కాకుండా 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ల్లో భారత్‌కు ఆడాడు. 2017లో సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇక వెనుదిరిగి చూడలేదు. ముఖ్యంగా 2019లో భారత హాకీ జట్టుకు అద్వితీయమైన విజయాలను అందించాడు. భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ చాంపియన్‌గా భారత్‌ను నిలబెట్టడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ బెర్తును ఖాయం చేశాడు. వీటితో పాటు టోక్యోలో జరిగిన ఒలింపిక్ టెస్టు ఈవెంట్ విజేతగా... సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఫైనల్స్‌కు భారత్‌ను చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే మన్‌ప్రీత్‌తో పాటు భారత యువ మిడ్‌ఫీల్డర్ వివేక్ సాగర్ ప్రసాద్ ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెల్చుకున్నాడు. మహిళల విభాగంలో ఇదే అవార్డును భారత ప్లేయర్ లాల్రెమ్సియామి గెల్చుకుంది. -
న్యూజీలాండ్‌తో తలపడనున్న భారత్
టోక్యో : 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తమ మొదటి మ్యాచ్‌ను న్యూజీలాండ్, నెదర్లాండ్స్‌తో ఆడనున్నాయి. ఈ మేరకు ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఆడే షెడ్యూల్‌ను అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) ప్రకటించింది. ఇందులో భాగంగా పురుషుల జట్టు గ్రూప్-ఏలో భాగంగా న్యూజీలాండ్‌తో(జూలై 25న), ఎనిమిది సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో (జూలై 26న), స్పెయిన్‌తో(జూలై 28న), డిపెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో(జూలై 30న), ఇక చివరి లీగ్ మ్యాచ్‌గా జపాన్‌తో జూలై 31 న తలపడనుంది. మరోవైపు మహిళల జట్టు గ్రూప్-ఏ లో తమ మొదటి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో జూలై 25 న తలపడనుంది. తర్వాత వరుసగా జర్మనీ (జూలై 27న), బ్రిటన్(జూలై 29న), ఐర్లాండ్ (జూలై 31న), దక్షిణాఫ్రికా(ఆగస్టు 1న) ఆడనుంది. అయితే ఒలింపిక్ గోల్డ్ మెడల్ కోసం ఆగస్టు 6న పురుషుల జట్టు, ఆగస్టు 7న మహిళల జట్టు ఆడనున్నట్లు అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ వెల్లడించింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌కు భారత పురుషుల జట్టు అర్హత సాధించేందుకు భువనేశ్వర్‌లో ఒలింపిక్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో రష్యాను 11-3 తేడాతో చిత్తుగా ఓడించింది. మరోవైపు ఒలింపిక్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో మహిళల జట్టు అమెరికాను 6-5 తేడాతో ఓడించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. -
భారత్ గర్జన
భువనేశ్వర్: తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు గర్జించింది. ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ను 7–2 గోల్స్ తేడాతో ఓడించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా... హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, వివేక్ ప్రసాద్, గురుసాహిబ్జిత్ సింగ్ ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టు తరఫున కెంజి కిటజాటో, కొటా వతనాబె గోల్స్ చేశారు. జపాన్‌పై విజయంతో భారత్ ఈ ఏడాది చివర్లో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 2–1తో అమెరికాను ఓడించి ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా కూడా టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీకి బెర్త్‌ను దక్కించుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ అదే దూకుడును సెమీఫైనల్లోనూ కొనసాగించింది. తొలి క్వార్టర్లో జపాన్ నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించింది. ఆట రెండో నిమిషంలోనే కెంజి కిటజాటో గోల్‌తో జపాన్ ఖాతా తెరిచింది. ఈ షాక్ నుంచి భారత్ వెంటనే తేరుకుంది. ఏడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. 14వ నిమిషంలో వరుణ్ కుమార్ మరో పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో కొటా వతనాబె గోల్‌తో జపాన్ స్కోరును 2–2తో సమం చేసింది. కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. భారత్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 4–2తో ముందంజ వేసింది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి పది నిమిషాల వ్యవధిలో మరో మూడు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 7–2కు పెంచుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. -
భారత హాకీ కోచ్‌గా గ్రాహం రీడ్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా దిగ్గజం గ్రాహం రీడ్ భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా ఎంపికయ్యారు. ఆయన 2020 ముగిసే వరకు కోచ్ పదవిలో ఉంటారని హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం అనంతరం హరేంద్ర సింగ్‌ను అనూహ్యంగా తప్పించిన తర్వాత కోచ్ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు రీడ్ ఆ స్థానంలో బాధ్యతలు చేపడతారు. గత నెలలోనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) భారత కోచ్‌గా ఆయన పేరును సిఫారసు చేసింది. రీడ్‌కు నెలకు 15 వేల డాలర్లు (సుమారు రూ. 10 లక్షలు) వేతనంగా లభిస్తుంది. కుటుంబంతో సహా స్థిరపడిపోయి బెంగళూరు ‘సాయ్’ సెంటర్ కేంద్రంగా ఆయన పని చేయనున్నారు. ప్రత్యేక శిక్షణా శిబిరం కోసం 60 మంది ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. భారత జట్టు మంచి ఫలితాలు సాధిస్తే రీడ్ కాంట్రాక్ట్‌ను 2022 ప్రపంచ కప్ వరకు పెంచే అవకాశం కూడా ఉంది. ఘనమైన రికార్డు... క్వీన్స్‌లాండ్‌కు చెందిన 54 ఏళ్ల గ్రాహం రీడ్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడు. నాలుగు సార్లు చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమ్‌లో కూడా ఆయన భాగంగా ఉన్నారు. డిఫెండర్, మిడ్‌ఫీల్డర్‌గా 130 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రీడ్ 36 గోల్స్ చేశారు. 2009లో కోచింగ్‌లో అడుగు పెట్టిన ఆయన 2014లో ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ నంబర్‌వన్ కావడంలో కీలక పాత్ర పోషించారు. గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ టీమ్‌కు కూడా రీడ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. ‘భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. హాకీలో భారత్‌కు ఉన్నంత గొప్ప చరిత్ర మరే దేశానికి లేదు. చాలా కాలంగా భారత హాకీని దగ్గరినుంచి చూశాను. నాతో పాటు ఆటగాళ్లకు కూడా సానుకూల వాతావరణం ఉండేలా చేయడం నా పని. చాలా దూరంలో ఉన్న ఒలింపిక్స్, వరల్డ్ కప్లకంటే కూడా త్వరలో జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెడతా. భారత హాకీ కోచ్ బాధ్యత చాలా ఒత్తిడితో కూడుకున్నదని నేనూ విన్నా. కానీ దానిని పట్టించుకోను’ –గ్రాహం రీడ్ -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
బ్యాడ్మింటన్ (క్వార్టర్ ఫైనల్స్) మహిళల టీమ్ ఈవెంట్ (ఉ.గం.8 నుంచి భారత్(vs)జపాన్), పురుషుల టీమ్ విభాగం (మ.1 గం. నుంచి భారత్ vsఇండోనేసియా) పురుషుల హాకీ భారత్(vs)ఇండోనేసియా (సా.గం.7 నుంచి) కబడ్డీ భారత్(vs)థాయ్‌లాండ్ (మహిళల లీగ్ మ్యాచ్ ఉ.గం.8.40 నుంచి), భారత్(vs)దక్షిణ కొరియా (పురుషుల లీగ్ మ్యాచ్ మ.గం.3 నుంచి) షూటింగ్ మహిళల ట్రాప్ క్వాలిఫయింగ్ (ఉ.గం.7 నుంచి; శ్రేయసి సింగ్, సీమ తోమర్), పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్ (ఉ.గం.6.30 నుంచి; రవి కుమార్, దీపక్ కుమార్), పురుషుల ట్రాప్ క్వాలిఫయింగ్ (ఉ.గం.8 నుంచి; మానవ్‌జీత్ సింగ్ సంధు), మహిళల 10 మీటర్ల రైఫిల్ క్వాలిఫయింగ్ (ఉ.గం.8.30 నుంచి; అపూర్వీ చండీలా, ఎలవేనీల్ వలరివన్) రెజ్లింగ్ (మ.గం.12 నుంచి) పురుషుల విభాగం (సుమిత్ 125 కేజీలు) మహిళల విభాగం (వినేశ్ 50 కేజీలు; పింకీ 53 కేజీలు, పూజ 57 కేజీలు, సాక్షి 62 కేజీలు). సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
భారత్... చేజేతులా
బ్రెడా (నెదర్లాండ్స్): వరుసగా రెండోసారి చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్లో 1–3తో పరాజయం పాలైంది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా ఉండటంతో విజేతను షూటౌట్ ద్వారా నిర్ణయించారు. 2016 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ భారత్ షూటౌట్లోనే 1–3 స్కోరుతో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. నిర్ణీత సమయంలో 24వ నిమిషంలో బ్లేక్ గోవర్స్ గోల్‌తో ఆసీస్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది, అనంతరం వివేక్ ప్రసాద్ (42వ నిమిషంలో) గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. -
హాకీ ఆసియాకప్: బంగ్లాదేశ్‌పై భారత్ గెలుపు
ఢాకా: హకీ ఆసియాకప్ పూల్-ఏలో బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు రెండో విజయం సాధించింది. జపాన్‌పై గెలిచి శుభారంభాన్ని అందుకున్న భారత్ తన జైత్రయాత్రను కొనసాగించింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 7-0తో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. మ్యాచ్ ఆధ్యంతం భారత ఆటగాళ్లు ఆధిపత్యం కనబర్చారు. మ్యాచ్ ఏడో నిమిషంలో గుర్జాంత్ సింగ్ తొలి గోల్ సాధించగా.. ఆకాశ్ దీప్ (11వ నిమిషం), లలీత్ ఉపాధ్యాయ(14వ), అమిత్ రోహిదాస్(21వ), రమణ్‌దీప్ సింగ్(46వ)లు గోల్స్ సాధించారు. ఇక మరోసారి పెనాల్టీ కార్నర్లు సద్వినియోగం చేసుకుంటూ హర్మన్ ప్రీత్ సింగ్ 27వ నిమిషం, 57 వనిమిషంలో రెండు గోల్స్ సాధించాడు. దీంతో భారత్ 7-0తో బంగ్లాదేశ్‌పై సునాయసంగా విజయం సాధించింది. పూల్-ఏలో భారత్ మూడో లీగ్ మ్యాచ్‌ను ఆదివారం పాకిస్థాన్‌తో ఆడనుంది. -
భారత్ శుభారంభం
ఢాకా: కొత్త కోచ్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఆసియా కప్ టోర్నమెంట్లో టైటిల్ ఫేవరెట్ హోదాకు తగ్గట్టు ఆడుతూ భారత్ శుభారంభం చేసింది. జపాన్‌తో బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన భారత్ నాలుగు క్వార్టర్స్‌లోనూ గోల్స్ చేయడం విశేషం. ఆట మూడో నిమిషంలో ఎస్వీ సునీల్ చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్‌కు 22వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్ రెండో గోల్‌ను అందించాడు. 33వ నిమిషంలో రమణ్‌దీప్ సింగ్ ఒక గోల్ చేయగా... 35వ, 48వ నిమిషాల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించాడు. జపాన్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను నాలుగో నిమిషంలో కెంజీ కిటజాటో చేశాడు. చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్‌పై అనూహ్యంగా వేటు వేయడంతో గత నెలలో మారిన్ జోయెర్డ్ భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మూడో నిమిషంలో ఆకాశ్‌దీప్ అందించిన పాస్‌ను సునీల్ లక్ష్యానికి చేర్చడంతో భారత్ బోణీ చేసింది. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఐదు పెనాల్టీ కార్నర్లు రాగా రెండింటిని హర్మన్‌ప్రీత్ సద్వినియోగం చేసుకున్నాడు. శుక్రవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. తొలి రోజు జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 7–0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. -
భారత హాకీ జట్టు సగర్వంగా...
-
భారత హాకీ జట్టు సగర్వంగా...
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ముందుకు దూసుకెళ్తోంది. అర్జెంటీనాతో మంగళవారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో 2-1తో భారత హాకీ పురుషుల జట్టు విజయం సాధించింది. అయితే 2009 తర్వాత అర్జెంటీనాను భారత్ ఓడించడం ఇదే తొలిసారి. తనకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను చింగల్‌సేన(7వ నిమిషం) గోల్ చేయగా, 34వ నిమిషంలో కోఠాజిత్ ఖడంగ్బం గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. మ్యాచ్ ఆరంభం నుంచీ భారత్ ఆధిపత్యం ప్రదర్శించినా మధ్యలో గొంజాల్ పిలేట్ గోల్ చేయడంతో అర్జంటీనా ఖాతా తెరిచింది. దీంతో భారత్ తమ దాడులను మరింత పెంచి ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచింది. భారత గోల్‌కీపర్, కెప్టెన్ శ్రీజేశ్ అర్జెంటీనా గోల్ అవకాశాలను నెట్ వద్ద సమర్థంగా అడ్డుకున్నాడు. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అయితే అర్జెంటీనాకు మరో అవకాశం ఇవ్వకుండా 2-1తో భారత్ మ్యాచ్ సొంతం చేసుకుంది. భారత్ తమ తొలి మ్యాచ్ లో 3-2 గోల్స్ తేడాతో ఐర్లాండ్ పురుషుల జట్టుపై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అర్జెంటీనాపై విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. గురువారం హాలెండ్ తో భారత్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. -
రియోలో భారత హాకీ జట్టు శుభారంభం
రియో ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది. రియోలో శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్ లో 3-2 గోల్స్ తేడాతో ఐర్లాండ్ పురుషుల జట్టుపై భారత్ విజయం సాధించింది. భారత్ తరఫున రుపేందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించగా, మరో ఆటగాడు రఘునాత్ ఒక గోల్ చేశాడు. దీంతో ఐర్లాండ్ తమ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైంది.