అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఒక స్థానం పడిపోయింది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా మూడు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది.
గత ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గి భారత జట్టు నేరుగా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. మరోవైపు భారత మహిళల జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ఇటీవల జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు విఫలమై పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment