హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో... | India in the FIH Pro League | Sakshi
Sakshi News home page

హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో...

Jan 31 2025 2:53 AM | Updated on Jan 31 2025 2:53 AM

India in the FIH Pro League

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ బరిలో భారత్‌

ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు భువనేశ్వర్‌లో మ్యాచ్‌లు  

న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) పురుషుల ప్రొ లీగ్‌లో పాల్గొనే భారత ప్రాబబుల్స్‌ను ప్రకటించారు. ప్రస్తుత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోనే భారత బృందం తొలి అంచె పోటీల్లో బరిలోకి దిగనుంది. హాకీ ఇండియా లీగ్, జూనియర్‌ టోర్నీలలో ఆయా ఆటగాళ్లు కనబరిచిన ప్రదర్శన ఆధారంగా మొత్తం 32 మందిని ఈ టోర్నీ కోసం ఎంపిక చేశారు. 

ఫిబ్రవరి 15 నుంచి 25వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌ల్లో స్పెయిన్, జర్మనీ, ఐర్లాండ్, ఇంగ్లండ్‌ జట్లతో భారత జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. 2023–2024 ప్రొ లీగ్‌ సీజన్‌లో భారత జట్టు ఏడో స్థానంలో నిలిచింది.  

భారత హాకీ ప్రాబబుల్స్‌: కృషన్‌ బహదూర్‌ పాఠక్, సూరజ్‌ కర్కెరా, ప్రిన్స్‌దీప్‌ సింగ్‌ (గోల్‌కీపర్లు). 
డిఫెండర్లు: హర్మన్‌ప్రీత్‌ సింగ్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, అమిత్‌ రోహిదాస్, సుమిత్, సంజయ్, జుగ్‌రాజ్‌ సింగ్, నీలం సంజీప్‌ జెస్, వరుణ్‌ కుమార్, యశ్‌దీప్‌ సివాచ్‌. 
మిడ్‌ఫీల్డర్లు: రాజ్‌కుమార్‌ పాల్, షంషేర్‌ సింగ్, మన్‌ప్రీత్‌ సింగ్, హార్దిక్‌ సింగ్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్, నీలకంఠ శర్మ, రబిచంద్ర సింగ్, రాజిందర్‌ సింగ్‌. 
ఫార్వర్డ్స్‌: అభిషేక్, సుఖ్‌జీత్‌ సింగ్, లలిత్‌ కుమార్‌ ఉపాధ్యాయ్, మన్‌దీప్‌ సింగ్, గుర్జంత్‌ సింగ్, అంగద్‌బీర్‌ సింగ్, బాబా సింగ్‌ ధామి, శిలానంద్‌ లాక్రా, దిల్‌ప్రీత్‌ సింగ్, అరిజిత్‌ సింగ్‌ హుండల్, ఉత్తమ్‌ సింగ్, అర్ష్ దీప్‌ సింగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement