probables
-
రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి.. ప్రకటించిన డీడీసీఏ
టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల వీరుడు విరాట్ కోహ్లి దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడా? సొంత జట్టు ఢిల్లీ తరఫున తాజా రంజీ సీజన్ బరిలో దిగనున్నాడా? అంటే.. ఇందుకు అవకాశం ఉందంటోంది ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ). రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో పాల్గొనబోయే ఢిల్లీ ప్రాబబుల్ టీమ్‌లో విరాట్ కోహ్లి పేరును చేర్చింది.ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌తో పాటు.. మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌కు కూడా ఈ జాబితాలో చోటిచ్చింది. అదే విధంగా.. జాతీయ జట్టుకు దూరమైన పేసర్ నవదీప్ సైనీకి స్థానం కల్పించిన డీడీసీఏ.. వెటరన్ పేస్ బౌలర్, గత సీజన్లో ఢిల్లీకి ఆడిన ఇషాంత్ శర్మను మాత్రం పక్కనపెట్టింది.చివరగా 2012-13 ఎడిషన్‌లో ఢిల్లీ తరఫునకాగా కోహ్లి చివరగా 2012-13 ఎడిషన్‌లో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడాడు. ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత మళ్లీ 2019లో ప్రాబబుల్ జట్టులో కోహ్లి పేరున్నా... టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా అతడు ఢిల్లీకి ఆడలేకపోయాడు. అయితే, జాతీయ జట్టు విధుల్లో లేనపుడు ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిబంధన విధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవలి దులిప్ ట్రోఫీ-2024లో కోహ్లి భాగమవుతాడని అభిమానులు ఆశించినా.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రిస్క్ ఎందుకని బోర్డు అతడికి విశ్రాంతినిచ్చింది. ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాతో సిరీస్‌తో కోహ్లి బిజీగా ఉన్నప్పటికీ.. తాజాగా డీడీసీఏ ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం విశేషం.84 మంది సభ్యులతో ప్రాబబుల్ జట్టుకాగా రంజీ 2024-25 ఎడిషన్ అక్టోబరు 11 నుంచి ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో ఛండీఘర్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో 84 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్ జట్టును డీడీసీఏ ప్రకటించింది. అదే విధంగా.. సెప్టెంబరు 26 నుంచి వీరికి ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. అయితే టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్‌లకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది.కోహ్లి అందుబాటులో ఉండే అవకాశమే లేదుకాగా కోహ్లి, పంత్ రంజీ తొలి దఫా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో అక్టోబరు 16 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కావడమే ఇందుకు కారణం. ఆ తర్వాత టీమిండియా బోర్డర్-గావస్కర్ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. కాబట్టి రంజీ సీజన్ మొత్తానికి కోహ్లి అందుబాటులో ఉండే అవకాశమే లేదు. కానీ ఫామ్‌లేమితో సతమతమైతే.. దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశిస్తే మాత్రం ఢిల్లీ తరఫున అతడు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం నుంచి బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో కోహ్లి, పంత్ టీమిండియాతో కలిసి ఇప్పటికే కాన్పూర్ చేరుకున్నారు. చదవండి: IND Vs BAN 2nd Test: గంభీర్ మరో మాస్టర్ ప్లాన్.. ఇక బంగ్లాకు చుక్కలే? DDCA announced their Ranji Trophy Probables Today. The U23 teams will be selected from the below mentioned players only. Indian Test team members Virat Kohli and Rishabh Pant have been included in the list of players as well, first time since 2019. pic.twitter.com/oiQ0ZGYCf3— CricDomestic (@CricDomestic_) September 24, 2024 -
అంగన్వాడీలకు భయోమెట్రిక్!
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ఉద్యోగుల్లో సమయ పాలన కోసం అంటూ సర్కారు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం భయోమెట్రిక్‌గా మారింది. తోచిందే తడువుగా నిర్ణయాలు ప్రకటించడంతో పలుశాఖ ఉద్యోగులకు తలనొప్పిగా మారుతోంది. సిగ్నల్స్ సరిగా లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులే హాజరు నమోదుకు ఇక్కట్లు పడుతుంటే... తాజాగా అంగన్వాడీలు కూడా బయోమెట్రిక్ వేయాలని ఉత్తర్వులు జారీ చేయడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలకు అవస్థలు టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ సిబ్బందికి కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే బండెడు చాకిరీ చేయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు రూపంలో కొత్త కష్టాలు తీసుకొచ్చింది. అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో గల జీవీఎంసీ పాఠశాలలకు వెళ్లి కార్యకర్తలు, ఆయాలు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు పల్స్‌పోలియో, స్మార్ట్ఫోన్లలో వివరాల నమోదు, ప్రీ–స్కూలు నిర్వహణ, పౌష్టికాహారం పంపిణీ, మధ్యాహ్నభోజన పథకాలతో తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. అంగన్వాడీ టీచర్లలో చాలామంది బీఎల్ఓలుగా ఓటర్లనమోదు డ్యూటీలు సైతం నిర్వహిస్తున్నారు. బయోమెట్రిక్‌తో అవస్థలు ఇప్పటికే జీవీఎంసీ పాఠశాలల్లో బయోమెట్రిక్‌మిషన్లు సిగ్నల్స్ లేక హాజరు నమోదు విషయంలో ఉపాధ్యాయులే అష్టకష్టాలు పడుతున్నారు. చాలదన్నట్టు అంగన్వాడీ సిబ్బంది కూడా వీరి వెనుక క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడ ఎప్పుడు హాజరు వేస్తారు, ఎప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు చేరుకుంటారో అధికారులే సెలవివ్వాలి. స్మార్ట్ఫోన్లు ఉన్నా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది నుంచి స్మార్ట్ఫోన్లు వినియోగంలోకి తెచ్చారు. దీనితో టీచర్లంతా పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనాలు, బాలింతలు, గర్భిణులు, పౌష్టికాహారం పంపిణీ వంటి సమస్త వివరాలన్నీ ఏ రోజుకారోజు స్మార్ట్ఫోన్లలో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలన్నీ ఉన్నతాధికారులకు సైతం ఆన్లైన్లో అందుబాటులో వుంటాయి. ఈ నేపథ్యంలో టీచర్ల హాజరు కూడా స్మార్ట్ఫోన్లలో నమోదు చేసే అవకాశం కల్పిస్తే సరిపోతుంది కదా అని పలువురు సూచిస్తున్నారు. నగరంలోని రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 232 అంగన్వాడీ కేంద్రాలు వున్నాయి. భీమిలి, పెందుర్తి ప్రాజెక్టుల పరిధిలో కూడా అంగన్వాడీ కేంద్రాలు వున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నాం అంగన్వాడీ సిబ్బంది సైతం బయోమెట్రిక్ విధానం ద్వారానే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సిబ్బంది అంతా సమీపంలో గల పాఠశాలల్లో హాజరు నమోదు చేసుకుని కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే కిలో మీటర్పరిధిలో పాఠశాలలు లేకుంటే మాత్రం సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. – జి.ఉషారాణి, సీడీపీఓ, ఐసీడీఎస్–అర్బన్–2,విశాఖపట్నం. -
ప్రాబబుల్స్‌కు క్రీడాకారుల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంతపురం జిల్లా అండర్–16 బాలుర క్రికెట్ జట్టు సెలెక్షన్స్‌లో ప్రతిభ కనబరచిన 56 మంది క్రీడాకారులను జిల్లా జట్టు ప్రాబబుల్స్‌కు ఎంపిక చేశామని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా గ్రామంలో నిర్వహించిన సెలెక్షన్స్‌కు జిల్లా వ్యాప్తంగా 135 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 56 మంది క్రీడాకారులను ప్రాబబుల్స్‌కు ఎంపిక చేశామని, ఈనెల 20 నుంచి వారికి సెలక్షన్ మ్యాచ్‌లను నిర్వహించి ప్రతిభ కనబరచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని షాబుద్దీన్ చెప్పారు. -
ముగిసిన క్రికెట్ ప్రాబబుల్స్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే అండర్–19 అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ప్రాబబుల్స్ మ్యాచ్ పోటీలు ఆదివారం ముగిశాయి. స్థానిక అనంత క్రీడా మైదానంలోని బీ మైదానంలో చివరి మ్యాచ్‌ను నిర్వహించారు. సెక్రెటరీ జట్టు 263–8తో ప్రారంభించి 266 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అధ్యక్ష జట్టు కూడా 266 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ పోటీల్లో రాణించిన క్రీడాకారులను గుర్తించి సెలెక్టర్లు ఏజేపీ తీర్థా, టీవీ చంద్రమోహన్‌రెడ్డిలు జిల్లా జట్టును ఎంపిక చేయనున్నారు. -
సపక్‌తక్ర రాష్ట్ర ప్రాబబుల్ జట్టుకు ఇద్దరు ఎంపిక
తారక్, ప్రశాంతి ఎంపిక కర్నూలులో నేటి నుంచి జరిగే శిక్షణ శిబిరాలకు హాజరు శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ సపక్‌తక్ర రాష్ట్ర ప్రాబబుల్స్ జట్టుకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సపక్‌తక్ర అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు నుంచి జిల్లా సంఘానికి వర్తమానం అందింది. ఎంపికైన వారిలో బాలుర విభాగంలో ఎస్.తారకేశ్వరరావు, బాలికల విభాగంలో జి.దుర్గాప్రశాంతిలు ఉన్నారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంగా గతనెల 18, 19 తేదీల్లో జరిగిన 2వ రాష్ట్రస్థాయి సపక్‌తక్ర బాలబాలికల జూనియర్ (అండర్–19)చాంపియన్‌షిప్ పోటీల్లో మెరుగైన ఆటతీరుతో రాణించడంతో ఈ అవకాశం లభించినట్లు తెలిసింది. శిక్షణా శిబిరాలకు హాజరు.. ఆదివారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు కర్నూలు కేంద్రంగా శిక్షణ శిబిరాలు జరగనున్నాయి. ఈ శిబిరాల్లో పాల్గొనేందుకు తారక్, ప్రశాంతిలు శనివారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లారు. శిక్షణ శిబిరాల్లో పాల్గొనేందుకు అవసరమైన సహాయాన్ని సపక్‌తక్ర సంఘ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి అందించారు. క్రీడాకారుల ఎంపికపై జిల్లా సపక్‌తక్ర సంఘ ఉపాధ్యక్షులు పి.హరిబాబు, పి.నర్సింగరావు, పి.రామస్వామి, పి.రమేష్‌నాయుడు, కె.వి.సత్యనారాయణ, పి.బాలమురళీకృష్ణ, సంతోష్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి పి.సుందరరావు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు.