తారకేశ్వరరావు
తారక్, ప్రశాంతి ఎంపిక
కర్నూలులో నేటి నుంచి జరిగే శిక్షణ శిబిరాలకు హాజరు
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ సపక్‌తక్ర రాష్ట్ర ప్రాబబుల్స్ జట్టుకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సపక్‌తక్ర అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు నుంచి జిల్లా సంఘానికి వర్తమానం అందింది. ఎంపికైన వారిలో బాలుర విభాగంలో ఎస్.తారకేశ్వరరావు, బాలికల విభాగంలో జి.దుర్గాప్రశాంతిలు ఉన్నారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంగా గతనెల 18, 19 తేదీల్లో జరిగిన 2వ రాష్ట్రస్థాయి సపక్‌తక్ర బాలబాలికల జూనియర్ (అండర్–19)చాంపియన్‌షిప్ పోటీల్లో మెరుగైన ఆటతీరుతో రాణించడంతో ఈ అవకాశం లభించినట్లు తెలిసింది.
శిక్షణా శిబిరాలకు హాజరు..
ఆదివారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు కర్నూలు కేంద్రంగా శిక్షణ శిబిరాలు జరగనున్నాయి. ఈ శిబిరాల్లో పాల్గొనేందుకు తారక్, ప్రశాంతిలు శనివారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లారు. శిక్షణ శిబిరాల్లో పాల్గొనేందుకు అవసరమైన సహాయాన్ని సపక్‌తక్ర సంఘ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి అందించారు. క్రీడాకారుల ఎంపికపై జిల్లా సపక్‌తక్ర సంఘ ఉపాధ్యక్షులు పి.హరిబాబు, పి.నర్సింగరావు, పి.రామస్వామి, పి.రమేష్‌నాయుడు, కె.వి.సత్యనారాయణ, పి.బాలమురళీకృష్ణ, సంతోష్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి పి.సుందరరావు, డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు.