sepak takraw championship
-
సెపక్తక్రా జట్లకు కెప్టెన్లుగా దినేశ్, తరంగిణి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను బుధవారం ప్రకటించారు. మహిళల జట్టుకు ఎ. తరంగిణి, పురుషుల జట్టుకు డి. దినేశ్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా ఈనెల 28 నుంచి జనవరి 2 వరకు జాతీయ సెపక్తక్రా చాంపియన్‌షిప్ జరుగుతుంది. జట్ల వివరాలు పురుషులు: డి. దినేశ్ (కెప్టెన్), కె. ప్రవీణ్, జి. శ్రీనాథ్, ఎ. హరినాథ్, డి. శశాంక్, ఎం. వికేశ్ కుమార్ (కోచ్), కె. నిఖిల్ (మేనేజర్). మహిళలు: ఎ. తరంగిణి (కెప్టెన్), ఆర్. నవత, కోమల్, బి. శైలజ, ఠాకూర్ యోగేశ్వరి, మానసి అవస్థి, ఎస్. ఆకాంక్ష, కె. ధనశ్రీ, పి. మాళవిక, నందిని, డి. దివ్య, సాయి ప్రణతి, ఆర్తి, శస్ర, పూజిత, అహ్మద్ (కోచ్), కపిల్ ఆనంద్ (కోచ్), షబ్రీశ్ వర్మ (మేనేజర్). -
క్వార్టర్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు నిలకడగా రాణిస్తున్నాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ రెగు ఈవెంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బాలుర జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన రెగు ఈవెంట్ తొలి లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 21–16, 21–8తో గోవాపై, రెండో లీగ్ మ్యాచ్‌లో 21–8, 21–8తో పాండిచ్చేరిపై, మూడో లీగ్ మ్యాచ్‌లో 22–20, 21–17తో ఉత్తరాఖండ్‌పై గెలుపొంది క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ జట్టు తమ తొలి లీగ్ మ్యాచ్‌లో 21–10, 21–11తో గుజరాత్‌పై, రెండో లీగ్ మ్యాచ్‌లో 21–13, 21–17తో మధ్యప్రదేశ్‌పై విజయాలు నమోదు చేసింది. బాలికల విభాగంలో తెలంగాణ జట్టు విఫలమైంది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ 21–17, 13–21, 18–21తో ఒడిశా చేతిలో, రెండో మ్యాచ్‌లో 8–21, 21–17, 15–21తో రాజస్తాన్ చేతిలో ఓటమి చవిచూసింది. ఆంధ్రప్రదేశ్ జట్టు 21–9, 21–13తో తమిళనాడుపై నెగ్గింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు బాలురు: ఢిల్లీ 21–6, 21–6తో పాండిచ్చేరిపై, బిహార్ 21–11, 21–8తో జార్ఖండ్‌పై, హరియాణా 21–11, 21–18తో హిమాచల్ ప్రదేశ్‌పై, మహారాష్ట్ర 21–4, 21–8తో జమ్ము కశ్మీర్‌పై, కర్ణాటక 21–12, 21–19తో రాజస్తాన్‌పై, ఉత్తరాఖండ్ 21–14, 21–6తో పంజాబ్‌పై, ఒడిశా 21–13, 21–9తో చండీగఢ్‌పై, మణిపూర్ 21–7, 21–10తో అస్సాంపై, కేరళ 21–14, 21–11తో తమిళనాడుపై, ఢిల్లీ 21–8, 21–9తో బెంగాల్‌పై, బిహార్ 21–18, 21–15తో నాగాలాండ్‌పై, కర్ణాటక 21–13, 21–10తో హిమాచల్‌ప్రదేశ్‌పై, మహారాష్ట్ర 21–8, 21–6తో జార్ఖండ్‌పై, అస్సాం 21–16, 12–21, 21–19తో రాజస్తాన్‌పై గెలుపొందాయి. బాలికలు: అస్సాం 21–11, 18–21, 21–7తో హరియాణాపై, నాగాలాండ్ 21–11, 21–4తో జార్ఖండ్‌పై, గోవా 21–10, 21–19తో కేరళపై, బిహార్ 21–10, 21–15తో బెంగాల్‌పై, ఉత్తర్‌ప్రదేశ్ 21–9, 21–11తో తమిళనాడుపై, ఢిల్లీ 21–12, 21–10తో గుజరాత్‌పై, అస్సాం 21–4, 21–11తో బెంగాల్‌పై, నాగాలాండ్ 21–7, 21–6తో తమిళనాడుపై, హరియాణా 21–17, 21–8తో బిహార్‌పై, ఉత్తర్‌ప్రదేశ్ 21–7, 21–4తో జార్ఖండ్‌పై, కేరళ 21–15, 21–16తో కర్ణాటకపై, అస్సాం 21–15, 21–17తో మహారాష్ట్రపై, ఒడిశా 21–4, 21–2తో గుజరాత్‌పై, రాజస్తాన్ 21–15, 21–12తో ఢిల్లీపై, మణిపూర్ 21–5, 21–7తో కర్ణాటకపై, హరియాణా 21–14, 21–11తో మహారాష్ట్రపై నెగ్గాయి. -
రన్నరప్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు ఆకట్టుకుంది. జోధ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీలో మహిళల రేగు ఈవెంట్లో తెలంగాణ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 11–21, 16–21తో మణిపూర్ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ 11–21, 21–17, 26–24తో సీమ సురక్షాబల్ (ఎస్ఎస్బీ)పై, క్వార్టర్స్‌లో 21–16, 21–18తో ఒడిశాపై గెలుపొందింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత సెపక్తక్రా సమాఖ్య కార్యదర్శి యోగేందర్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత సెపక్తక్రా సమాఖ్య అధ్యక్షుడు ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ జట్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో హైదరాబాద్ 21–16, 24–22తో ఆదిలాబాద్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో హైదరాబాద్ 17–21, 21–19, 21–19తో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్ 21–16, 21–19తో మెదక్‌పై గెలుపొందాయి. మహిళల టైటిల్‌పోరులో హైదరాబాద్ 21–15, 21–17తో మెదక్‌ను ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో కార్పొరేటర్ మమత గుప్తా, భారత సెపక్తక్రా సమాఖ్య అధ్యక్షుడు ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
విజేతలు రంగారెడ్డి, హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి జూనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగంలో హైదరాబాద్, బాలికల కేటగిరీలో రంగారెడ్డి విజేతలుగా నిలిచాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో హైదరాబాద్ 21–14, 21–15తో ఆదిలాబాద్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో హైద రాబాద్ 21–10, 21–14తో ఖమ్మంపై, ఆదిలాబాద్ 18–21, 21–18, 21–16తో రంగారెడ్డిపై గెలుపొందాయి. బాలికల టైటిల్‌పోరులో రంగారెడ్డి 19–21, 21–12, 21–12తో హైదరాబాద్‌ను ఓడించింది. సెమీస్ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 21–16, 21–15తో నిజామాబాద్‌పై, హైదరాబాద్ 22– 24, 21–9, 21–12తో మెదక్‌పై నెగ్గాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమత గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సెపక్తక్రా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి ఎస్.ఆర్ ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రంగారెడ్డి జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి 16–21, 21–19, 22–20తో నల్లగొండపై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలికల విభాగంలో హైదరాబాద్ 17–21, 19–21తో నిజామాబాద్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బాలుర విభాగంలో ఖమ్మం, బాలికల విభాగంలో రంగారెడ్డి జట్లు మూడోస్థానంలో నిలిచాయి. రంగారెడ్డి జట్టు సభ్యుడు మెహమ్మద్ ముబషిర్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా సెపక్తక్రా సంఘం అధ్యక్షుడు రవి చక్రవర్తి, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు కె. రంగారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సెపక్తక్రా సంఘం కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓయూ మహిళల జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు సత్తా చాటింది. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మహిళల రెగూ, డబుల్స్ ఈవెంట్లలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన టైటిల్‌పోరులో ఉస్మానియా యూనివర్సిటీ 21–17, 21–13తో పంజాబ్ యూనివర్సిటీపై విజయం సాధించింది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో మణిపూర్ యూనివర్సిటీ 21–14, 21–4తో ఎంజేపీ రోహిల్‌ఖండ్ యూనివర్సిటీపై గెలిచింది. మరోవైపు మహిళల డబుల్స్ ఫైనల్లో ఉస్మానియా జట్టు 17–21, 21–14, 21–18తో మణిపూర్ యూనివర్సిటీపై గెలుపొందింది. పాటియాలా పంజాబీ యూనివర్సిటీ 21–17, 21–17తో కుమాయున్ యూనివర్సిటీపై నెగ్గి కాంస్యాన్ని గెలుచుకుంది. పురుషుల విభాగంలో ఉస్మానియా జట్టు త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. కాంస్య పతక పోరులో ఓయూ 22–20, 17–21, 3–21తో ఎంజేపీ రోహిల్‌ఖండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఈ విభాగంలో అన్నా యూనివర్సిటీ విజేతగా నిలవగా, పాటియాలా పంజాబీ యూనివర్సిటీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పురుషుల రెగూ ఈవెంట్ తుదిపోరులో పంజాబీ యూనివర్సిటీ 21–12, 21–13తో అన్నా యూనివర్సిటీపై గెలుపొందింది. కాలికట్ యూనివర్సిటీ 21–13, 21–6తో ఎంజేపీ రోహిల్‌ఖండ్ యూనివర్సిటీపై గెలిచి మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఉస్మానియా జట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్లు జోరు కనబరుస్తున్నాయి. ఓయూ ఆధ్వర్యంలోనే జరుగుతోన్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఉస్మానియా జట్లు విజయం సాధించాయి. పురుషుల కేటగిరీలో ఉస్మానియా యూనివర్సిటీ 21–14, 18–21 తో ఆర్టీఎం నాగ్‌పూర్ యూనివర్సిటీపై గెలుపొందింది. మహిళల విభాగంలో తొలి మ్యాచ్‌లో ఉస్మానియా 17–21, 21–13, 21–18 తో మణిపూర్ యూనివర్సిటీని, రెండో మ్యాచ్‌లో 21–11, 21–3తో ఆర్టీఎం నాగ్‌పూర్ జట్టును ఓడించింది. మరోవైపు పురుషుల విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ 17–21, 21–11, 21–9తో కాలికట్ యూనివర్సిటీపై, రెండో మ్యాచ్‌లో 21–16, 21–16తో కుమాయున్ యూనివర్సిటీపై గెలిచింది. -
నేటి నుంచి సెపక్తక్రా చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ సెపక్తక్రా చాంపియన్‌షిప్ నేటి నుంచి జరుగనుంది. ఎల్బీ ఇండోర్ స్టేడియం వేదికగా మహిళలు, పురుషుల విభాగాల్లో సోమవారం వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు చెందిన 38 పురుషుల జట్లు, 32 మహిళల జట్లు పాల్గొంటున్నాయి. ఈ మేరకు శుక్రవారం టోర్నీకి సంబంధించిన బ్రోచర్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ ఈ పోటీలను ప్రారంభిస్తారని వారు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం, ఓయూ వైస్ చాన్స్‌లర్ తదితరులు పాల్గొంటారు. -
నగరంలో సెపక్తక్రా సందడి
సాక్షి, హైదరాబాద్: సెపక్తక్రా ప్రపంచకప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నవంబర్ 2 నుంచి 5 వరకు ఈ మెగా టోర్నీ జరగనున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ చెప్పారు. శుక్రవారం ఫతే మైదాన్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ టోర్నీకి సంబంధించిన విశేషాలను ఆయన వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో 16 అంతర్జాతీయ పురుషుల జట్లు, 12 మహిళల జట్లు తలపడనున్నట్లు పేర్కొన్నారు. భారత్‌తో పాటు బ్రెజిల్, బ్రూనై, బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేసియా, ఇరాన్, జపాన్, మలేసియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలకు చెందిన జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. భారత్‌లో సెపక్తక్రా ప్రపంచకప్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోటీలు జరుగుతాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులకు ఉచితంగా ఎంట్రీ ఉంటుందని మంత్రి తెలిపారు. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరై టోర్నీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్‌లు దూరదర్శన్‌లో ప్రత్యక్షప్రసారం అవుతాయి. ఈ కార్యక్రమంలో క్రీడా సెక్రటరీ బి. వెంకటేశం, ‘శాట్స్’ ఎండీ ఎ. దినకర్‌బాబు, సెపక్తక్రా సమాఖ్య కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విజేతలు హైదరాబాద్, రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ మహిళల, పురుషుల సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు విజేతలుగా నిలిచాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో హైదరాబాద్ జట్టు 21–15తో ఆదిలాబాద్‌పై గెలుపొందింది. ఈ విభాగంలో నిజామాబాద్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. మహిళల టైటిల్ పోరులో రంగారెడ్డి 21–16తో హైదరాబాద్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఆదిలాబాద్‌కు మూడో స్థానం దక్కింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు ప్రేమ్‌రాజ్, కోశాధికారి మహేశ్, సెపక్తక్రా క్రీడాకారుడు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
సపక్‌తక్ర రాష్ట్ర ప్రాబబుల్ జట్టుకు ఇద్దరు ఎంపిక
తారక్, ప్రశాంతి ఎంపిక కర్నూలులో నేటి నుంచి జరిగే శిక్షణ శిబిరాలకు హాజరు శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ సపక్‌తక్ర రాష్ట్ర ప్రాబబుల్స్ జట్టుకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సపక్‌తక్ర అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు నుంచి జిల్లా సంఘానికి వర్తమానం అందింది. ఎంపికైన వారిలో బాలుర విభాగంలో ఎస్.తారకేశ్వరరావు, బాలికల విభాగంలో జి.దుర్గాప్రశాంతిలు ఉన్నారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంగా గతనెల 18, 19 తేదీల్లో జరిగిన 2వ రాష్ట్రస్థాయి సపక్‌తక్ర బాలబాలికల జూనియర్ (అండర్–19)చాంపియన్‌షిప్ పోటీల్లో మెరుగైన ఆటతీరుతో రాణించడంతో ఈ అవకాశం లభించినట్లు తెలిసింది. శిక్షణా శిబిరాలకు హాజరు.. ఆదివారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు కర్నూలు కేంద్రంగా శిక్షణ శిబిరాలు జరగనున్నాయి. ఈ శిబిరాల్లో పాల్గొనేందుకు తారక్, ప్రశాంతిలు శనివారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లారు. శిక్షణ శిబిరాల్లో పాల్గొనేందుకు అవసరమైన సహాయాన్ని సపక్‌తక్ర సంఘ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి అందించారు. క్రీడాకారుల ఎంపికపై జిల్లా సపక్‌తక్ర సంఘ ఉపాధ్యక్షులు పి.హరిబాబు, పి.నర్సింగరావు, పి.రామస్వామి, పి.రమేష్‌నాయుడు, కె.వి.సత్యనారాయణ, పి.బాలమురళీకృష్ణ, సంతోష్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి పి.సుందరరావు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు. -
క్వార్టర్స్‌లో ఓడిన తెలంగాణ, ఏపీ జట్లు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్-జూనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాయి. విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో శనివారం జరిగిన బాలుర రెగు ఈవెంట్ క్వార్టర్స్‌లో తెలంగాణ 1-2 (18-21, 21-13, 17-21)తో నాగాలాండ్ చేతిలో పరాజయం చవిచూడగా... ఆంధ్రప్రదేశ్ 0-2 (14-21, 5-21)తో మిజోరం ధాటికి చిత్తుగా ఓడింది. ఇందులో మిజోరం, ఢిల్లీ జట్లు తుదిపోరుకు అర్హత సాధించాయి. బాలికల క్వార్టర్స్‌లో ఆంధ్రప్రదేశ్ 1-2 (21-18, 20-22, 14-21)తో బీహార్ చేతిలో కంగుతింది. ఈ విభాగంలో నాగాలాండ్, అస్సాం టైటిల్ పోరుకు అర్హత పొందాయి. బాలుర డబుల్ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ 1-2 (21-18, 9-21, 11-21)తో బీహార్ చేతిలో ఓడింది. -
రేపటి నుంచి సెపక్తక్రా చాంపియన్‌షిప్
హైదరాబాద్: తెలంగాణ సెపక్తక్రా సంఘం ఆధ్వర్యంలో జరిగే ‘సబ్ జూనియర్ జాతీయ సెపక్తక్రా చాంపియన్‌షిప్’కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. విక్టరీ ప్లేగ్రౌండ్ ఇండోర్ స్టేడియం వేదికగా బుధవారం ఉదయం 10 గంటలకు ఈ టోర్నీని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పద్మారావు ప్రారంభిస్తారు. జూలై 31 వరకు జరిగే చాంపియన్‌షిప్‌లో దాదాపు 650 మంది బాలబాలికలు పాల్గొననున్నారు. టీమ్ విభాగంతో పాటు, రెగు ఈవెంట్, డబుల్స్ ఈవెంట్లలో పోటీలు నిర్వహించనున్నారు.