సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు ఆకట్టుకుంది. జోధ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీలో మహిళల రేగు ఈవెంట్‌లో తెలంగాణ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 11–21, 16–21తో మణిపూర్ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ 11–21, 21–17, 26–24తో సీమ సురక్షాబల్ (ఎస్‌ఎస్‌బీ)పై, క్వార్టర్స్‌లో 21–16, 21–18తో ఒడిశాపై గెలుపొందింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత సెపక్‌తక్రా సమాఖ్య కార్యదర్శి యోగేందర్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత సెపక్‌తక్రా సమాఖ్య అధ్యక్షుడు ఎస్‌ఆర్ ప్రేమ్‌రాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment