
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో హైదరాబాద్ 21–16, 24–22తో ఆదిలాబాద్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో హైదరాబాద్ 17–21, 21–19, 21–19తో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్ 21–16, 21–19తో మెదక్‌పై గెలుపొందాయి. మహిళల టైటిల్‌పోరులో హైదరాబాద్ 21–15, 21–17తో మెదక్‌ను ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో కార్పొరేటర్ మమత గుప్తా, భారత సెపక్‌తక్రా సమాఖ్య అధ్యక్షుడు ఎస్‌ఆర్ ప్రేమ్‌రాజ్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment