సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి 16–21, 21–19, 22–20తో నల్లగొండపై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలికల విభాగంలో హైదరాబాద్ 17–21, 19–21తో నిజామాబాద్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బాలుర విభాగంలో ఖమ్మం, బాలికల విభాగంలో రంగారెడ్డి జట్లు మూడోస్థానంలో నిలిచాయి. రంగారెడ్డి జట్టు సభ్యుడు మెహమ్మద్ ముబషిర్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా సెపక్‌తక్రా సంఘం అధ్యక్షుడు రవి చక్రవర్తి, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు కె. రంగారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సెపక్‌తక్రా సంఘం కార్యదర్శి ఎస్‌ఆర్ ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment