క్వార్టర్స్‌లో ఓడిన తెలంగాణ, ఏపీ జట్లు | telangana and ap lose at sepak takraw championship | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో ఓడిన తెలంగాణ, ఏపీ జట్లు

Published Sun, Jul 31 2016 9:42 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

telangana and ap lose at sepak takraw championship

సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్-జూనియర్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాయి. విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో శనివారం జరిగిన బాలుర రెగు ఈవెంట్ క్వార్టర్స్‌లో తెలంగాణ 1-2 (18-21, 21-13, 17-21)తో నాగాలాండ్ చేతిలో పరాజయం చవిచూడగా... ఆంధ్రప్రదేశ్ 0-2 (14-21, 5-21)తో మిజోరం ధాటికి చిత్తుగా ఓడింది.

ఇందులో మిజోరం, ఢిల్లీ జట్లు తుదిపోరుకు అర్హత సాధించాయి. బాలికల క్వార్టర్స్‌లో ఆంధ్రప్రదేశ్ 1-2 (21-18, 20-22, 14-21)తో బీహార్ చేతిలో కంగుతింది. ఈ విభాగంలో నాగాలాండ్, అస్సాం టైటిల్ పోరుకు అర్హత పొందాయి. బాలుర డబుల్ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ 1-2 (21-18, 9-21, 11-21)తో బీహార్ చేతిలో ఓడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement