నేటి నుంచి సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌ | sepak takraw championship starts today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌

Published Sat, Feb 17 2018 10:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

sepak takraw championship starts today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌ నేటి నుంచి జరుగనుంది. ఎల్బీ ఇండోర్‌ స్టేడియం వేదికగా మహిళలు, పురుషుల విభాగాల్లో సోమవారం వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు చెందిన 38 పురుషుల జట్లు, 32 మహిళల జట్లు పాల్గొంటున్నాయి. ఈ మేరకు శుక్రవారం టోర్నీకి సంబంధించిన బ్రోచర్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్‌ ఈ పోటీలను ప్రారంభిస్తారని వారు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ ఎస్‌. రామచంద్రం, ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ తదితరులు పాల్గొంటారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement