fourth rank
-
నాలుగో ర్యాంక్‌లో భారత పురుషుల హాకీ జట్టు
అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఒక స్థానం పడిపోయింది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా మూడు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గి భారత జట్టు నేరుగా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. మరోవైపు భారత మహిళల జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ఇటీవల జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు విఫలమై పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోలేకపోయింది. -
నాలుగో ర్యాంక్‌లోనే మహిళల క్రికెట్ జట్టు
దుబాయ్: ఐసీసీ మహిళల వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తమ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఐసీసీ తాజాగా వెల్లడించిన వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ మూడు పాయింట్లను మెరుగుపర్చుకుని 116 పాయింట్లకు చేరింది. రెండు పాయింట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టు ఆసీస్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. టాప్–3లో ఉండటమే తమ లక్ష్యమని కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. కివీస్‌కు తమకు చాలా స్వల్ప తేడా ఉందని, రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగైన ఆటతీరును కనబరుస్తామని చెప్పింది. 2014–15, 2015–16 సీజన్లో ప్రదర్శన నుంచి 50 శాతం... 2016–17 సీజన్లో పూర్తి ఆటతీరును పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్‌ను వెలువరించారు. -
మళ్లీ దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంక్
ముంబై: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ దిగజారుతోంది. తాజా ర్యాంకింగ్స్ జాబితాలో కోహ్లీ ఓ స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. విరాట్ ఇటీవలే రెండో ర్యాంక్ నుంచి మూడో ర్యాంకుకు దిగజారిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లీ రాణించలేకపోవడంతో ర్యాంక్ పడిపోయింది. ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో విరాట్ వరుసగా 0, 13, 12, 15 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో వైఫల్యం ర్యాంక్‌పై ప్రభావం చూపింది. తాజా జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో ర్యాంకుకు దూసుకెళ్లాడు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా ఆల్‌రౌండర్ల జాబితాలో భారత స్పిన్నర్ అశ్విన్ నెంబర్ ర్యాంక్‌ను మళ్లీ కైవసం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబల్ హసన్ రెండో స్థానానికి దిగజారాడు.