టోక్యో: గత కొంతకాలంగా హాకీలో మెరుగైన ప్రదర్శన కనబరస్తున్న భారత పురుషుల హాకీ జట్టు.. టోక్యో ఒలిపింక్స్‌లో సెమీస్ దాకా వెళ్లి ఒక్కసారిగా అంచనాలు పెంచింది. అయితే బెల్జియం చేతిలో ఓటమితో ఫైనల్ చేరనప్పటికీ.. కాంస్యం ఆశలు మాత్రం సజీవంగా ఉంచుకోగలిగింది.
►టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం ఉదయం జరిగిన హాకీ మొదటి సెమీఫైనల్‌లో బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడింది భారత్.
►మొదట్లో ప్రపంచ ఛాంపియన్‌కు గట్టి పోటీ ఇచ్చిన భారత్.. ఆ తర్వాత ప్రత్యర్థి డిఫెండింగ్ ముందు తడబడింది.
►ఏ దశలోనూ భారత్ మరో గోల్ చేయకుండా అడ్డుకుంది బెల్జియం.
►చివర్లో రెండు గోల్స్‌తో పట్టుసాధించిన బెల్జియం.. ఆఖర్లో మరో గోల్‌తో 5-2 తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది.
►ఇక రెండో సెమీఫైనల్‌లో ఓడిన జట్టుతో భారత్ కాంస్యం కోసం పోరాడనుంది.
►సెమీస్ దాకా చేరుకున్న భారత హాకీ జట్టు ప్రయత్నాన్ని యావత్ దేశం ‘వెల్‌డన్ బాయ్స్’ అంటూ అభినందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment