men hockey
-
CWG: బాల్‌రాజ్ ఏంటిది? చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న ఆటగాళ్లు.. వైరల్
కామన్వెల్త్ గేమ్స్-2022లో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పోటీ పడుతున్నామనే విషయం మరిచి ఇద్దరు హాకీ ఆటగాళ్లు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకున్నారు. సహచర ఆటగాళ్లు వచ్చి వారిని విడదీయకపోతే అలాగే కొట్టుకునేవాళ్లేమో! ఇంతకీ ఏం జరిగిందంటే.. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్... గురువారం కెనడాతో తలపడింది. పూల్ బీలో జరిగిన ఈ మ్యాచ్‌లో హాఫ్‌టైమ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు కెనడా ప్లేయర్ బాల్‌రాజ్ పనేసర్, ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ గ్రిఫిత్స్ మధ్య వివాదం తలెత్తింది. అప్పటికే ఇంగ్లండ్ 4-1తో ఆధిక్యంలో ఉంది. ఆట కొనసాగుతుండగా గ్రిఫిత్స్ బంతిని తీసుకునే ప్రయత్నం చేయగా.. పనేసర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం.. ఒకరినొకరు చొక్కాలు పట్టుకునే స్థాయికి వెళ్లింది. ఒకానొక సమయంలో పనేసర్.. గ్రిఫిత్స్ గొంతు కూడా పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. దీంతో సహచర ఆటగాళ్లు వచ్చి ఇద్దరినీ విడదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాకీలో రెజ్లింగ్.. ఒకే టికెట్‌పై రెండు ఆటలు అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఈ ఘటనలో బాల్‌రాజ్‌కు అంపైర్ రెడ్ కార్డ్ చూపడంతో మైదానాన్ని వీడగా.. గ్రిఫిత్స్‌కు యెల్డో కార్డ్ జారీ అయింది. మ్యాచ్ విషయానికొస్తే.. 11-2తో కెనడాను ఓడించిన ఇంగ్లండ్ సెమీస్ చేరింది. ఆస్ట్రేలియాతో సెమీస్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. భారత్ సైతం వేల్స్‌పై 4-1తో గెలుపొంది సెమీ ఫైనల్ చేరుకుంది. వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో రాణించడంతో అద్భుత విజయం అందుకుంది. చదవండి: WC 2022: ఓపెనర్‌గా పంత్, ఇషాన్.. సూర్య కాదు! అతడే సరైనోడు! జట్టులో చోటే లేదే! SreeShankar Won Silver CWG 2022: మేజర్ సర్జరీ.. లాంగ్ జంప్ చేయొద్దన్నారు; ఎవరీ మురళీ శ్రీశంకర్? Thanks to @JaspreetSSahni for showing me a new sport that combines Hockey and Wrestling pic.twitter.com/UiRopSLNfQ — Digvijay Singh Deo (@DiggySinghDeo) August 4, 2022 -
ఒలింపిక్స్ విజేతల సందడి: వందనా కటారియా భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చూపించిన సొంతగడ్డపై అడుగిడిన క్రీడాకారులను ఘన స్వాగతం లభించింది. నగదు పురస్కారాలు, సత్కారాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి గౌరవించాయి. ముఖ్యంగా ఒడిశా ముఖ్యమంత్ర నవీన్ పట్నాయక్ రాష్ట్రానికి చెందిన పురుషులు, మహిళా హాకీ క్రీడాకారులను సన్మానించారు. బీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌కు 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని, అలాగే దీప్ గ్రేస్ ఎక్కా నమితా టోపోలకు ఒక్కొక్కరికి రూ .50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. మరోవైపు టోక్యో 2020 లో పాల్గొన్న మహిళల హాకీ జట్టు సభ్యులు సలీమా టేట్, నిక్కీ ప్రధాన్ తమ సొంత రాష్ట్రానికి చేరుకున్న రాంచీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన పురుషులు మహిళల హాకీ క్రీడాకారుల లుకూడాఅమృత్సర్ చేరుకున్నారు. కామన్వెల్త్ ఆసియన్ గేమ్స్ వచ్చే నెల నుండి శిక్షణను ప్రారంభిస్తామని, హాకీ జట్టు ఆటగాడు గుర్జంత్ సింగ్ వెల్లడించారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్‌కు వందన కటారియాకు డెహ్రాడూన్ విమానాశ్రయంలోనూ, గ్రామంలోనూ వాయిద్యాలతో గ్రామస్తులు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల తండ్రిని కోల్పోయిన వందనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంటికి చేరినపుడు తనను తాను ఎలా నిభాయించుకోవాలో అర్థంకాలేదని పేర్కొన్నారు. అటు ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న మీరా బాయి చాను టెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిసారు. Amid 'dhols', Indian Women Hockey team's Vandana Katariya receives a warm welcome at Dehradun Airport, Uttarakhand. "We were broken after losing the bronze medal match, didn't win a medal but have won hearts. The team performed well at #Tokyo2020, " she says pic.twitter.com/VEa5jv8mLs — ANI (@ANI) August 11, 2021 Odisha CM Naveen Patnaik felicitated Men and Women hockey players from the state- Deep Grace Ekka, Namita Toppo, Birendra Lakra and Amit Rohidas for their performance at #Tokyo2020; handed over a cash award of Rs 2.5 crores to Birendra Lakra & Amit Rohidas. pic.twitter.com/Wt6ks6gYsC — ANI (@ANI) August 11, 2021 Family members of Indian men and women hockey players from Punjab receive them at Amritsar "We'll start training from next month. We have a busy year ahead due to Commonwealth & Asian Games. Confidence of team is high," says men's hockey team player Gurjant Singh pic.twitter.com/CpZDqXmSPr — ANI (@ANI) August 11, 2021 -
Men's Hockey: ‘మా ఇంటిని.. నా కొడుకు చేతిలోని హాకీ స్టిక్ నిలబెట్టింది’
కొడుకు ఫీల్డ్‌లో పరిగెడుతుంటే అమ్మ గుండెలు పరిగెడతాయి. కొడుకు చెమటలు కక్కుతుంటే అమ్మ కళ్లు కన్నీరు చిందుతాయి. అమ్మ రెండు చేతులు ఎప్పుడూ కొడుకు విజయం కోసమే కదా ప్రార్థిస్తాయి. 41 సంవత్సరాల తర్వాత హాకీలో విజయం సాధించిన భారత జట్టు వెనుక ఉన్నది ఈ దేశమే కావచ్చు. కాని వారి తల్లులు కూడా. దేశం కోసం గెలిచిన కొడుకులను చూసి చూపుడు వేలికి కాటుక రాసుకుని దిష్టి చుక్క పెట్టడానికి ఎదురు చూస్తున్నారా తల్లులు. సంతోషంతో తబ్బిబ్బవుతున్నారని వేరే చెప్పాలా? పంజాబ్ క్రీడా శాఖామంత్రి గుర్మిత్ సింగ్ సోధి తమ రాష్ట్రం నుంచి హాకీ టీమ్‌లో ఉండి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ప్రతి ఒక్క సభ్యుడికి కోటి రూపాయలు అనౌన్స్ చేసి వారు రావడంతోటే చెక్ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.కాని ఆ కోటి రూపాయల సంగతి తర్వాత. జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ మాత్రం తన తల్లి మంజిత్ కౌర్ చేసే ఆలూ పరాఠాల కోసం కాచుకుని ఉన్నాడు. భారతదేశం చేరుకుని ఇంటికి వచ్చిన వెంటనే అతడు తినాలనుకుంటున్నది తల్లి చేతి ఆలూ పరాఠానే. ‘నా కొడుకు కోసం స్వహస్తాలతో ఆలూ పరాఠాలు చేస్తా. ఆలుగడ్డ కూర కూడా చేస్తా’ అని ఆమె అంది. మన్‌ప్రీత్ ఇంటి బయట కోలాహలం జలంధర్ జిల్లాలోని మిథాపూర్ అనే చిన్న ఊరు ఇప్పుడు సంతోషంతో కేరింతలు కొడుతోంది. మన్‌ప్రీత్ సింగ్‌ది ఆ ఊరే. అతనిదే కాదు... ప్రస్తుతం హాకీ టీమ్‌లో ఉన్న మరో ఇద్దరు కూడా ఆ ఊరివారే. అందుకే దానిని ‘ఒలింపిక్ గ్రామం’ అని అంటారు. కాంస్యం కోసం జర్మనీతో హోరాహోరి పోరు గురువారం జరుగుతున్నప్పుడు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తల్లి చేత హాకీ బ్యాట్ పట్టుకుని ఇరుగుపొరుగు వారితో కలిసి ఇంట్లో ఉత్కంఠగా మేచ్ చూసింది. కుటుంబసభ్యులతో కెప్టెన్ మన్‌ప్రీత్‌సింగ్, గ్రౌండ్లోమన్ప్రీత్సింగ్ ‘ఈ బ్యాటే నా కొడుకును అంత దూరం తీసుకెళ్లింది’ అందామె మేచ్ గెలిచాక ఉద్వేగపడుతూ. మేచ్ మొదలయ్యే ముందు మన్‌ప్రీత్ తల్లికి వీడియో కాల్ చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ‘బాగా ఆడు నాన్నా... కాని జర్మనీని తక్కువ తీస్కోవద్దు’ అని హెచ్చరించింది ఆమె. ‘వాహె గురు నా ప్రార్థనలు ఆలకించాడు. గురుద్వార్ వెళ్లి ఇవాళ ప్రత్యేక ప్రార్థనలు చేస్తాను’ అని చెప్పిందామె. 2016లో మన్‌ప్రీత్ తండ్రి మరణించాడు. అప్పటి నుంచి తల్లే మన్‌ప్రీత్ ఆటకు వెన్నుదన్నుగా ఉంది. అతణ్ణి ముందుకు తీసుకెళ్లింది. తన శ్రమ ఫలించిన సంతృప్తి ఆమె కళ్లల్లో కనిపించింది. ఉంగరం కానుక ఇక మరో ఆటగాడు హార్దిక్ సింగ్ తల్లి కన్వల్జిత్ కౌర్ కొడుకు కోసం ఒలింపిక్ రింగ్స్‌ను పోలిన బంగారు ఉంగరం చేయించి సిద్ధంగా ఉంది. ‘నా కొడుకు విజయానికి నేనిచ్చే కానుక ఇది’ అని ఆ తల్లి చెప్పింది. 22 ఏళ్ల మిడ్‌ఫీల్డ్ ఆటగాడు హార్దిక్ సింగ్ ఒలింపిక్స్ జట్టులో ఎంపికైయ్యాక అతని తమ్ముడు ‘అన్నయ్యా... మన కారు మీద ఒలింపిక్స్ లోగో వేయించేదా’ అని అడిగాడు. దానికి హార్దిక్ ‘ఇప్పుడే వద్దురా. టైమ్ వచ్చినప్పుడు చెప్తాను’ అని జవాబు ఇచ్చాడు. ‘ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. నా కొడుకు కారు మీద ఒలింపిక్స్ లోగో ఉంటుంది’ అని కన్వల్జిత్ కౌర్ తన చుట్టుపక్కల వారికి ఒకటి రెండు స్వీట్లు పంచుతోంది. తల్లి ఉషతో గోల్‌కీపర్ శ్రీజేష్, ఆనందంలో శ్రీజేష్ గోడ కట్టిన కొడుకు ఇక కొచ్చిలో హాకీ టీమ్ గోల్ కీపర్ శ్రీజేష్ ఇంటి దగ్గర హడావిడి అంతా ఇంతా లేదు. టపాకాయలు మోగిపోతున్నాయి. ‘కాంస్యమైతే ఏంటి... బంగారంతో సమానం’ అని శ్రీజేష్ తల్లి ఉషా అంది. వచ్చిపోయే వారిని, కొడుకు గొప్పతనం గురించి పొగుడుతున్నవాళ్లను ఎక్కడ దిష్టి తగులుతుందో అని కంగారుగానే వింటూ తబ్బిబ్బవుతోంది ఆమె. ‘నా కొడుకు శత్రువులకు అడ్డంగా గోడలా నిలబడ్డాడు’ అని ఆమె అంది. నిజంగానే జర్మనీతో సాగిన మేచ్‌లో గోల్ కీపర్‌గా శ్రీజేష్ ఎదుర్కొన్న వొత్తిడి తక్కువది కాదు. శ్రీజేష్ భార్య అనీషా ఆయుర్వేద డాక్టర్. ‘ఆయన రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను’ అంది సంబరంగా. ఒరిస్సా వీరుడు ఐదు మంది సంతానంలో చివరివాడుగా పుట్టిన ఒరిస్సా ఆటగాడు అమిత్ రోహిదాస్ ఇంటికే కాదు దేశానికి కూడా కీలకంగా మారడం అతడి తల్లిని గర్వపడేలా చేస్తోంది. ‘మేము పేదరైతులం. నా కొడుకే మా ఇంటిని నిలబెట్టాడు. నా కొడుకు చేతిలోని హాకీ స్టిక్ నిలబెట్టింది’ అని అతని తల్లి అంది. వాళ్ల గ్రామం సౌనామోరా (రూర్కెలా నుంచి 120 కి.మీ) ఇప్పుడు అమిత్ తల్లిని ప్రశంసలతో ముంచెత్తుతోంది. కేవలం ప్లాస్టిక్ కుర్చీలు ఉన్న ఇంటిలో ఊపిరి బిగపట్టి మేచ్ చూసిన అమిత్ తల్లి గెలిచాక మురిసిపోయింది. మరి కాసేపటికి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెతో మాట్లాడటం కూడా చిన్న అనుభవం కాదు. అన్నట్టు ఒరిస్సా ముఖ్యమంత్రి తమ రాష్ట్రం నుంచి కాంస్యం తెచ్చిన ప్రతి ఆటగాడికి రెండున్నర కోట్లు ప్రకటించారు. అమిత్‌కు కూడా ఆ నగదు కాచుకుని ఉంది. దానికంటే ముందు ఆ తల్లి ఆలింగనం కూడా. తల్లిదండ్రులు తమ సంతానం కోసం జీవితాలను త్యాగం చేస్తారు. వాటిలో చాలామటుకు పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పడతారు. పిల్లలు విజయం సాధించినప్పుడు ఆ త్యాగాలకు ఒక అర్థం దొరికి సంతృప్తిపడతారు. ఇవాళ భారత హాకీటీమ్లోని ప్రతి సభ్యుని తల్లిదండ్రులు ఈ అద్భుత సంతృప్తితో తల ఎత్తుకు తిరుగుతారు. -
జర్మనీకి చుక్కలు చూపించిన స్టార్ ఆటగాడెవరో తెలుసా?
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత విజయంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన హోరా హోరీ పోరులో చివరికి జర్మనీపై మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో టీమిండియా హాకీ జట్టు ఆధిపత్యాన్ని చాటుకుంది. 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగ రాసింది. ముఖ్యంగా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టఫ్ ఫైట్ లో అనుభవజ్ఞుడైన భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ జర్మనీ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. జర్మనీకి 13 పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ, అడ్డుగోడగా నిలబడి, అద్భతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి గోల్స్‌ను అడ్డుకొని 5-4 తో విజయాన్ని భారత్‌కు అందించారు. మరోవైపు ఈ విజయంపై టీమిండియా కోచ్ , ఆస్ట్రేలియన్, గ్రాహం రీడ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందన్నారు. అలాగే మ్యాచ్ మొత్తానికి హీరోగా నిలిచిన స్టార్ గోల్ కీపర్ శ్రీజేష్ విజయానందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. దీనిపై తన కుటుంబం గర్వంగా ఫీలవుతోందన్నారు. ఈ ఆనందంలో అమ్మ కన్నీరు పెట్టుకుందని తనతో సరిగ్గా మాట్లాడలేకపోయిందని పేర్కొన్నాడు. తనకు ఇది పునర్జన్మ అని ఈ ఘనత కొత్త తరం ఆటగాళ్లను తయారు చేయడంలో సహాయపడుతుందనే విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే.. అపూర్వ విజయం విజిల్ వినిపించగానే నార్త్ పిచ్‌లో శ్రీజేష్ గోల్‌పోస్ట్ పైకి ఎక్కిన ఫోటో వైరల్‌గా మారింది. ‘జీవితమంతా పోస్ట్‌తోనే గడిపాను. అది నా ప్లేస్. నా కష్టం, నష్టం...సంతోషం...దుఃఖం అన్నీ పోస్ట్‌తోనే.. అందుకే అలా ఎక్కి వేడుక చేసుకున్నా’ అని శ్రీజేష్ భావోద్వేగంతో వెల్లడించాడు. మరోవైపు లాంగ్ హాలిడే ప్లాన్ చేస్తున్నామని శ్రీజేష్ భార్య అనీషా మీడియాతో పేర్కొనడం విశేషం. కాగా భారత జట్టులోని సిమ్రంజీత్ సింగ్ (17, 34 వ నిమిషాలు) తొలి బ్రేస్ సాధించగా, హార్దిక్ సింగ్ (27 వ), హర్మన్‌ప్రీత్ సింగ్ (29 వ) రూపిందర్ పాల్ సింగ్ (31 వ) గోల్ సాధించారు. జర్మనీ తరఫున తైమూర్ ఒరుజ్ (2 వ), నిక్లాస్ వెల్లెన్ (24 వ), బెనెడిక్ట్ ఫుర్క్ (25 వ) లుకాస్ విండ్‌ఫెడర్ (48 వ) గోల్స్ సాధించిన సంగతి తెలిసిందే. -
పంజాబ్ ఆటగాళ్లకు భారీ నజరానా
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో విజయ దుందుభి మోగించిన టీమిండియా హాకీ జట్టులో తమ ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జర్మనీతో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్‌లో విజయంతో కాంస్య పతకం సాధించిన జట్టులో రాష్ట్రానికి చెందిన హాకీ జట్టు ఆటగాళ్లకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు సర్కార్ వెల్లడించింది. పంజాబ్ క్రీడా మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధి ఈ ప్రకటన చేశారు. ఇండియన్ హాకికి ఇదొక చారిత్రాత్మక రోజని ఆయన ట్వీట్ చేశారు. మరింత ఉన్నతమైన గోల్డ్ మెడల్‌తో తిరిగి రావాలని ఎదురుచూస్తున్నామన్నారు. మరోవైపు భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, కోచ్ గ్రాహం రీడ్, సహాయక కోచ్ పియూష్ దుబేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్బంగా జట్టులోని సభ్యులందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు మోదీ. కాగా టోక్యో ఒలింపక్స్ జర్మనీతో గురువారం జరిగిన మ్యాచ్ భారత్ టీం 5-4 తేడాతో విజయం సాదించింది. తద్వారా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు, 41 ఏళ్ల తరువాత తొలిసారి ఒలింపిక్ పతకాన్ని సాధించిన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. On this historic day for #IndianHockey I am delighted to announce a cash award of Rs 1crore each to players 4m #Punjab We await ur return to celebrate the much deserving medal in #Olympics #Cheer4India #Tokyo2020 #IndvsGer #Hockey #IndianHockeyTeam@capt_amarinder @Media_SAI https://t.co/VJ8eiMu1up — Rana Gurmit S Sodhi (@iranasodhi) August 5, 2021 #WATCH | PM Narendra Modi speaks to the India Hockey team Captain Manpreet Singh, coach Graham Reid and assistant coach Piyush Dubey after the team won #Bronze medal in men's hockey match against Germany#TokyoOlympics pic.twitter.com/NguuwSISsV — ANI (@ANI) August 5, 2021 -
మురిసిపోతున్న సెలబ్రిటీలు: సంబరాలు మామూలుగా లేవుగా!
టోక్యో ఒలింపిక్స్ వేదికగా భారత కీర్తి పతాకం మరోసారి సగర్వంగా రెపరెపలాడింది. గురువారం జర్మనీతో జరిగిన పోరులో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయం సాధించి యావత్‌దేశాన్ని ఎనలేని ఆనందంలో ఓలలాడించింది. ఈ చారిత్రక విజయంపై భారత రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఆనంద్ మహీంద్ర, కిరణ మజుందార్ షా లాంటి వ్యాపారవేత్తలు సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు భారత హాకీ జట్టు ఘనతను పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లకు కల నిజమైందంటూ మురిసిపోతున్నారు. మెన్ ఇన్ బ్లూ.. చక్ దే ఇండియా అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ స్పందిస్తూ వావ్ !! భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన మ్యాచ్ అంటూ షారూఖ్ పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే విజయం! అద్భుత ప్రదర్శన 41 సంవత్సరాల తర్వాత ఇండియాకు ఒలింపిక్ పతకం.. అంటూ టీమిండియాకు అభినందనలు తెలిపారు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా. మరోవైపు పురుషుల హాకీలో టీమిండియా విజయం సాధించిన సందర్భంగా మణిపూర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇంపాల్‌లో హాకీ ఆటగాడు నీలకంఠ శర్మ కుటుంబం సంతోషానికి హద్దే లేకుండా పోయింది. బంధువులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులంతాచేరి నృత్యాలతో సందడి చేశారు. అటు పంజాబ్‌లో అమృత సర్‌లో కూడా పండగ వాతావరణం నెలకొంది. గుర్జంత్ సింగ్ కుటుంబ సభ్యులు డాన్స్‌లతో భారత జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒలింపిక్స్‌లో పురుషుల హాకీలో టీం కాంస్య పతకం ఖాయం కావడంతో పంజాబ్‌కు భారత హాకీ ఆటగాడు మన్ దీప్ సింగ్ కుటుంబం సంబరాలు చేసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత భారతదేశం పతకం సాధించింది. ఈ విజయంపై తనకు మాటలురావడం లేదంటూ మన్ దీప్ తండ్రి రవీందర్ సింగ్ ఆనందాన్ని ప్రకటించారు. Yeaaa! What a win for our men in blue - after 41 years we get to stand on the podium for Olympic Hockey! Jai Hind! 👏👏👍 — Kiran Mazumdar-Shaw (@kiranshaw) August 5, 2021 -
నాకు బంగారంలా కనిపిస్తోంది: ఆనంద్ మహీంద్ర
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పురుషుల హాకీ జట్టు సాధించిన ఘన విజయంపై పారిశ్రామిక వేత్త మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో స్పందించారు. ఒక్కసారిగా తనకు కలర్ బ్లైండ్నెస్ ఆవరించిదంటూ హాకీ టీం విజయంపై సంతోషాన్ని ప్రకటించారు.. మనవాళ్లు గెల్చుకున్న కాంస్య పతకం కాస్తా స్వర్ణ పతకంలా కనిపింస్తోందంటూ కితాబిస్తూ ట్వీట్ చేశారు. కాగా జర్మనీతో గురువారం జరిగిన పురుషుల హాకీ పోరులో భారత్ అద్భుత విజయాన్ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో చివరకు మన్‌ప్రీత్ సింగ్ సారధ్యంలోని జట్టు 5-4 తేడాతో జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా భారత ఖాతాలో మరో ఒలింపిక్ పతకం చేరింది. అంతేకాదు. 41 ఏళ్ల తరువాత హాకీలో తొలిసారి ఒలింపిక్ పతకాన్ని సాధించడం విశేషం. భారత జట్టు సాధించిన విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువ కురుస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) I have suddenly become colour-blind. That Bronze looks Golden to me… #ChakDeIndia #TokyoOlympics2020 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽 https://t.co/0FHbNrtnA1 — anand mahindra (@anandmahindra) August 5, 2021 -
వెల్డన్ బాయ్స్.. ఫోటో హైలెట్స్
టోక్యో: గత కొంతకాలంగా హాకీలో మెరుగైన ప్రదర్శన కనబరస్తున్న భారత పురుషుల హాకీ జట్టు.. టోక్యో ఒలిపింక్స్‌లో సెమీస్ దాకా వెళ్లి ఒక్కసారిగా అంచనాలు పెంచింది. అయితే బెల్జియం చేతిలో ఓటమితో ఫైనల్ చేరనప్పటికీ.. కాంస్యం ఆశలు మాత్రం సజీవంగా ఉంచుకోగలిగింది. ►టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం ఉదయం జరిగిన హాకీ మొదటి సెమీఫైనల్లో బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడింది భారత్. ►మొదట్లో ప్రపంచ ఛాంపియన్‌కు గట్టి పోటీ ఇచ్చిన భారత్.. ఆ తర్వాత ప్రత్యర్థి డిఫెండింగ్ ముందు తడబడింది. ►ఏ దశలోనూ భారత్ మరో గోల్ చేయకుండా అడ్డుకుంది బెల్జియం. ►చివర్లో రెండు గోల్స్‌తో పట్టుసాధించిన బెల్జియం.. ఆఖర్లో మరో గోల్‌తో 5-2 తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ►ఇక రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో భారత్ కాంస్యం కోసం పోరాడనుంది. ►సెమీస్ దాకా చేరుకున్న భారత హాకీ జట్టు ప్రయత్నాన్ని యావత్ దేశం ‘వెల్డన్ బాయ్స్’ అంటూ అభినందిస్తోంది. -
హృదయం ముక్కలైంది; పర్లేదు.. బాధ పడకండి బాయ్స్!
టోక్యో: 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత పురుషుల హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. వరల్డ్, యూరోపియన్ చాంపియన్ బెల్జియం చేతిలో ఓడిపోయింది. మొదట్లో బాగానే ఆడినా, బెల్జియం డిఫెన్స్ ముందు తలవంచకతప్పలేదు. ఫలితంగా 5-2 తేడాతో పరాజయం పాలుకావడంతో ఫైనల్ చేరే అవకాశం చేజారింది. అయితే, కాంస్యం కోసం జరిగే మరో మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం పతకంతో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్ ఫలితం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మ్యాచ్‌ను వీక్షిస్తున్నానంటూ.. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, గెలిచినపుడు మాత్రమే కాదు, ఓటమిలోనూ మీ వెన్నంటే ఉంటామంటూ భారతీయులు పురుషుల హాకీ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. తదుపరి మ్యాచ్ కోసం సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ‘‘41 ఏళ్ల తర్వాత సెమీస్ వరకు వెళ్లారు. ప్రత్యర్థి జట్టు కూడా తక్కువదేమీ కాదు కదా. పర్లేదు. మీరు కాంస్యంతో తిరిగి వస్తారనే నమ్మకం ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి గర్విస్తూనే ఉంటాం: ప్రధాని మోదీ ‘‘మన పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలిపింక్స్‌లో వారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే, జీవితంలో గెలుపోటములు సహజం. తదుపరి ఆడనున్న మ్యాచ్, భవిష్యత్ విజయాల కోసం ఆల్ ది బెస్ట్. తమ ఆటగాళ్లను చూసి భారత్ ఎల్లప్పుడూ గర్విస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. బాధ పడకండి బాయ్స్: కిరణ్ రిజిజు ఇక కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు.. ‘‘బాధ పడకండి బాయ్స్, మీరు ఇప్పటికే భారత్‌ను ఎంతో గర్వపడేలా చేశారు. ఇప్పటికీ ఒలింపిక్ మెడల్‌తో తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాంస్యం కోసం జరిగే పోరులో మీ అత్యుత్తమ ప్రదర్శన కనబరచండి’’ అని ట్విటర్ వేదిగకా తన స్పందన తెలియజేశారు. హృదయం ముక్కలైంది హాకీ ఇండియా సైతం.. ‘‘మనసు పెట్టి ఆడాం. కానీ ఇది మన రోజు కాదు’’ అంటూ బ్రేకింగ్ హార్ట్ ఎమోజీని జతచేసింది. అదే విధంగా.. ‘‘కొన్నింటిలో గెలుస్తారు. మరికొన్నింటిలో ఓడతారు. అయినా మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు’’ అని మద్దతుగా నిలబడింది, We played our heart out against Belgium, but it just wasn't our day. 💔#INDvBEL #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/I5AzuayqOq — Hockey India (@TheHockeyIndia) August 3, 2021 Don't feel bad boys, you have already made India proud. You can still come back with Olympic medal. Give your best for the bronze medal match 👍#Cheer4India 🇮🇳 https://t.co/NiBChp0NZD — Kiren Rijiju (@KirenRijiju) August 3, 2021 Wins and losses are a part of life. Our Men’s Hockey Team at #Tokyo2020 gave their best and that is what counts. Wishing the Team the very best for the next match and their future endeavours. India is proud of our players. — Narendra Modi (@narendramodi) August 3, 2021 You win some, you lose some. You have done us proud. 🇮🇳#HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/eYNz0VBaAs — Hockey India (@TheHockeyIndia) August 3, 2021 -
హాకీ ఇండియా...చలో టోక్యో...
భువనేశ్వర్: ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత పురుషుల, మహిళల హాకీ జట్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన రెండో అంచె మ్యాచ్‌ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌లో 5–1తో అమెరికాపై భారత మహిళల జట్టు విజయం సాధించగా... రెండో అంచె మ్యాచ్‌లో టీమిండియాకు 1–4తో ఓటమి ఎదురైంది. భారత్, అమెరికా చెరో మ్యాచ్‌లో నెగ్గడంతో... నిబంధనల ప్రకారం రెండు మ్యాచ్‌ల్లో సాధించిన మొత్తం గోల్స్ ఆధారంగా బెర్త్ ఎవరికి దక్కాలో నిర్ణయించారు. ఇక్కడ భారత్ 6–5 గోల్స్ తేడాతో అమెరికాపై పైచేయి సాధించి ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు తొలి అంచె మ్యాచ్‌లో రష్యాపై 4–2తో నెగ్గిన భారత పురుషుల జట్టు రెండో అంచె మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. ఏకంగా 7–1 గోల్స్ తేడాతో రష్యాను చిత్తు చేసి ‘టోక్యో’ బెర్త్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం గోల్స్‌లోనూ భారత్‌దే 11–3తో పైచేయిగా నిలిచింది. ఆదుకున్న రాణి రాంపాల్... తొలి అంచె మ్యాచ్‌లో అమెరికాను వణికించిన భారత మహిళల జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. కనీసం నాలుగు గోల్స్ తేడాతో గెలిస్తేనే ‘టోక్యో’ బెర్త్ ఆశలు సజీవంగా ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఆరంభం నుంచే ఎదురుదాడులు చేసింది. వారి దూకుడు ఫలితాన్నిచ్చింది. తొలి క్వార్టర్లో రెండు గోల్స్... రెండో క్వార్టర్లో మరో రెండు గోల్స్ చేసి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లో అమెరికాను నిలువరించిన భారత్ ఇంకో గోల్‌ను సమర్పించుకోలేదు. అప్పటికి మొత్తం గోల్స్ సంఖ్య (రెండు మ్యాచ్‌లవి కలిపి) 5–5తో సమఉజ్జీగా ఉంది. నాలుగో క్వార్టర్ మొదలైన మూడో నిమిషంలో అమెరికా ‘డి’ రక్షణ వలయంలో లభించిన సువర్ణావకాశాన్ని భారత కెప్టెన్ రాణి రాంపాల్ వదులుకోలేదు. కళ్లు చెదిరే షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చిన రాణి రాంపాల్ భారత్ ఖాతాలో గోల్ చేర్చింది. దాంతో మొత్తం గోల్స్ సంఖ్యలో భారత్ 6–5తో ఆధిక్యంలోకి వచ్చింది. చివరి 12 నిమిషాల్లో అమెరికా దాడులను సమర్థంగా నిలువరించిన భారత మహిళల బృందం మ్యాచ్‌లో ఓడిపోయినా ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఒలింపిక్స్ క్రీడలకు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడం ఇది మూడోసారి (1980, 2016) మాత్రమే. మహిళల విభాగం భారత్ 1 ►రాణి రాంపాల్ (48వ ని.లో) అమెరికా 4 ►అమండా మగాడాన్ (5వ ని.లో) ►కాథ్లీన్ షార్కీ (14వ ని.లో) ►అలీసా పార్కర్ (20వ ని.లో) ►అమండా మగాడాన్ (28వ ని.లో) పురుషుల విభాగం భారత్ 7 ►లలిత్ ఉపాధ్యాయ్(17వ ని.లో) ►ఆకాశ్‌దీప్ సింగ్ (23వ ని.లో) ►ఆకాశ్‌దీప్ సింగ్ (27వ ని.లో) ►నీలకంఠ శర్మ (47వ ని.లో) ►రూపిందర్ సింగ్ (48వ ని.లో) ►రూపిందర్ సింగ్ (59వ ని.లో) ►అమిత్ రోహిదాస్ (60వ ని.లో) రష్యా 1 ►సబోలెవ్స్కీ (1వ ని.లో) -
భారత్ గర్జన
భువనేశ్వర్: తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు గర్జించింది. ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ను 7–2 గోల్స్ తేడాతో ఓడించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా... హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, వివేక్ ప్రసాద్, గురుసాహిబ్జిత్ సింగ్ ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టు తరఫున కెంజి కిటజాటో, కొటా వతనాబె గోల్స్ చేశారు. జపాన్‌పై విజయంతో భారత్ ఈ ఏడాది చివర్లో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 2–1తో అమెరికాను ఓడించి ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా కూడా టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీకి బెర్త్‌ను దక్కించుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ అదే దూకుడును సెమీఫైనల్లోనూ కొనసాగించింది. తొలి క్వార్టర్లో జపాన్ నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించింది. ఆట రెండో నిమిషంలోనే కెంజి కిటజాటో గోల్‌తో జపాన్ ఖాతా తెరిచింది. ఈ షాక్ నుంచి భారత్ వెంటనే తేరుకుంది. ఏడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. 14వ నిమిషంలో వరుణ్ కుమార్ మరో పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో కొటా వతనాబె గోల్‌తో జపాన్ స్కోరును 2–2తో సమం చేసింది. కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. భారత్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 4–2తో ముందంజ వేసింది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి పది నిమిషాల వ్యవధిలో మరో మూడు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 7–2కు పెంచుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
అర్జెంటీనాపై 2-1తో విజయం రియో డీ జనీరో : రియో ఒలింపిక్స్ పురుషుల హాకీ లో భారత జట్టు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలుండగానే క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో భారత జట్టు అర్జెంటీనాపై 2-1తేడాతో గెలుపొందింది. భారత్ తరపున చింగ్లెన్సానా సింగ్, కోథాజిత్ సింగ్ చెరో గోల్ చేయగా.. గోల్ కీపర్ శ్రీజేశ్ అర్జెంటీనా పెనాల్టీ కార్నర్లకు అడ్డుగోడగా నిలిచాడు. ఈ విజయం తర్వాత భారత జట్టు ఆరు పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు చాలా దూకుడును ప్రదర్శించింది. ఆట ఏడో నిమిషంలోనే తొలి పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చింది. అయితే.. రూపిందర్ సింగ్ ఫ్లిక్‌ను అర్జెంటీనా గోల్ కీపర్ అడ్డుకున్నాడు. అయితే తర్వాత నిమిషంలోనే చెంగ్లెన్సానా వేగంగా స్పందించటంతో భారత్‌కు తొలిగోల్ దక్కింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. మూడో క్వార్టర్ ముగిసే సమయంలో కోథాజిత్ రెండో గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని పెంచాడు. అయితే ఆట నాలుగో క్వార్టర్లో ప్రత్యర్థికి నాలుగు పెనాల్టీ కార్నర్ అవకాశాలొచ్చాయి. అర్జెంటీనా డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ గంజాలో పీల్లెట్ మొదటి కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అయితే.. మిగిలిన మూడింటినీ భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ విజయవంతంగా అడ్డుకున్నాడు. తదుపరి మ్యాచులలో నెదర్లాండ్స్, కెనడాలతో భారత్ తలపడనుంది. బ్రిటన్ చేతిలో ఓడిన మహిళలు మహిళల హాకీలో భారత జట్టు బ్రిటన్ చేతిలో 0-3 తేడాతో ఓటమిపాలైంది. బ్రిటన్ తరఫున జిష్లే అంస్లీ, నికోలా వైట్, అలెక్సా డాన్సర్ ఒక్కో గోల్ చేశారు. రోయింగ్: భోకనాళ్ ఔట్ పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో భారత రోయర్ దత్త బబన్ భోకనాళ్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. హీట్స్‌లో 7.21.67 టైమింగ్‌తో 2వేల మీటర్ల రేసును పూర్తి చేసిన భోకనాళ్.. క్వార్టర్స్‌లో 6.53.52 టైమింగ్ సాధించినా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. షూటింగ్: హీనా సిద్ధు అవుట్ రియోలో భారత షూటర్ల వైఫల్యం కొనసాగుతోంది. మహిళల 25మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హీనా సిద్ధు క్వాలిఫయింగ్ దశలోనే నిష్ర్కమించింది. 600కు గానూ 576 పాయింట్లు సాధించి.. మొత్తం 40 మంది పోటీదారుల్లో 20వ స్థానంలో నిలిచింది. ఆర్చరీ: ప్రి క్వార్టర్స్‌లో అతాను పురుషుల వ్యక్తిగత ఆర్చరీలో అతాను దాస్ ప్రి క్వార్టర్స్‌కు చేరాడు. క్యూబా ఆర్చర్ పెరేజ్తో జరిగిన రెండోరౌండ్లో అతాను 6-4తో గెలుపొందాడు. తొలి రౌండ్లో 6-0తో నేపాల్‌కు చెందిన జీత్బహదూర్పై నెగ్గాడు. శుక్రవారం జరిగే ప్రి క్వార్టర్ ఫైనల్లో కొరియన్ ఆర్చర్ లీ సుంగ్యున్తో అతాను తలపడనున్నాడు. షూటింగ్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ప్రకాశ్ నంజప్ప, జీతూరాయ్ సాయంత్రం 5.30 నుంచి (ఫైనల్ రాత్రి 8.30కు) ఆర్చరీ మహిళల వ్యక్తిగత ఈవెంట్ (రౌండ్ 64) బొంబేలా దేవ x లారెన్స్ బాల్డఫ్ (ఆస్ట్రేలియా) సాయంత్రం 6.10 నుంచి దీపికా కుమార x క్రిస్టిన్ సెబువా (జార్జియా) గురువారం తెల్లవారుజామున 1.30 నుంచి జూడో పురుషుల 90 కేజీల విభాగం అవతార్ సింగ x పొపోల్ రెసెంగా (శరణార్థుల బృందం) రాత్రి 7.20 నుంచి మహిళల హాకీ భారత x ఆస్ట్రేలియా రాత్రి 7.30 నుంచి బాక్సింగ్ పురుషుల లైట్‌వెయిట్ (64 కేజీల విభాగం) మనోజ్ కుమార్ x ఎవల్దస్ పెట్రాస్కస్ (లిథువేనియా) గురువారం తెల్లవారుజామున 3గంటలకు -
'రియో' సమరానికి సన్నాహకం!
ఇఫో(మలేషియా): రియో ఒలింపిక్స్ సన్నాహకాలకు భారత పురుషుల హాకీ జట్టు సన్నద్ధమైంది. మలేషియాలో బుధవారం నుంచి ఆరంభం కానున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్ లో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్ లో పటిష్టమైన జపాన్ తో తలపడనుంది. ఎనిమిది సార్లు ఒలింపిక్ స్వర్ణపతకం సాధించిన భారత్.. మరో నాలుగు నెలల్లో ఆరంభమయ్యే రియోకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఈ టోర్నీని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. గతేడాది మూడో స్థానం సాధించి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న భారత్ ఈసారి మాత్రం మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని యోచిస్తోంది. మరోవైపు యువకులతో జట్టును కూడా పరీక్షించేందుకు సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు సమాయత్తమైంది. రియో ఒలింపిక్స్‌కు ముందు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు హాకీ ఇండియా వారికి దశలవారీగా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా ఈటోర్నీకి ఏకంగా ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. ఆగస్టులో రియో ఒలింపిక్స్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఎక్కువశాతం మంది యువకులనే ఈ టోర్నీకి ఎంపిక చేసినట్లు భారత హాకీ కోచ్ రియోలాంట్ వాల్ట్ మాన్స్ స్పష్టం చేశాడు. ఇక్కడ తమ ప్రతిభను నిరూపించుకుని ప్రధాన టోర్నీలకు అర్హత సాధించేందకు వారికి ఇదొక సువర్ణావకాశమన్నాడు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోను కావొద్దని యువ హాకీ ఆటగాళ్లకు వాల్ట్ మాన్స్ సూచించాడు. ఈసారి కప్ ను సాధించి భారత అభిమానుల ఆశలను నిజం చేస్తామన్నాడు. ఇప్పటివరకూ సుల్తాన్ అజ్లాన్ షా కప్ ను ఆస్ట్రేలియా ఎనిమిది సార్లు గెలిచి తొలి స్థానంలో ఉండగా, భారత జట్టు ఐదు సార్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. గతేడాది ఆస్ట్రేలియాను ఓడించిన న్యూజిలాండ్ కప్ ను సాధించింది. దీంతో ఆస్ట్రేలియా రన్నరప్ గా సరిపెట్టుకోగా, భారత్ కు మూడో స్థానం దక్కింది. అజ్లాన్ షా కప్‌లో భారత్‌తోపాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, జపాన్, కెనడా, మలేసియా జట్లు బరిలో ఉన్నాయి.