
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పురుషుల హాకీ జట్టు సాధించిన ఘన విజయంపై పారిశ్రామిక వేత్త మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో స్పందించారు. ఒక్కసారిగా తనకు కలర్ బ్లైండ్నెస్ ఆవరించిదంటూ హాకీ టీం విజయంపై సంతోషాన్ని ప్రకటించారు.. మనవాళ్లు గెల్చుకున్న కాంస్య పతకం కాస్తా స్వర్ణ పతకంలా కనిపింస్తోందంటూ కితాబిస్తూ ట్వీట్ చేశారు.
కాగా జర్మనీతో గురువారం జరిగిన పురుషుల హాకీ పోరులో భారత్ అద్భుత విజయాన్ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో చివరకు మన్‌ప్రీత్ సింగ్ సారధ్యంలోని జట్టు 5-4 తేడాతో జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా భారత ఖాతాలో మరో ఒలింపిక్ పతకం చేరింది. అంతేకాదు. 41 ఏళ్ల తరువాత హాకీలో తొలిసారి ఒలింపిక్ పతకాన్ని సాధించడం విశేషం. భారత జట్టు సాధించిన విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువ కురుస్తోంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
I have suddenly become colour-blind. That Bronze looks Golden to me… #ChakDeIndia #TokyoOlympics2020
👏🏽👏🏽👏🏽👏🏽👏🏽 https://t.co/0FHbNrtnA1
— anand mahindra (@anandmahindra) August 5, 2021