Bronze
-
శ్రావణమాసం : రాగి, ఇత్తడి, పూజా పాత్రలు తళ తళలాడాలంటే, చిట్కాలివిగో!
శ్రావణమాసంలో కొత్త పెళ్లికూతుళ్లు మాత్రమే కాదు, ప్రతి ఇల్లు అందంగా ముస్తాబవుతుంది. ముత్తయిదువులందరూ ఇంటి అందాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా అలంకరించిని ఇంట్లో స్వయంగా ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. ఇంటిని పూలతోరణాలు, మామిడాకులతో అందంగా తీర్చిదిద్దుదాం. ఇంట్లో పూజ గది నుండి వంటగది వరకు ప్రతిదీ శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే అలంకరణ నిమిత్తం ఇంటి ముందు, వసారాలో పెద్ద పెద్ద ఇత్తడి పాత్రలను, దీపపు కుందులను అమర్చుతారు. ఆరోగ్యంపై పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో ఇత్తడి, రాగి , కంచు పాత్రల వాడకం బాగా పెరిగింది.చింతపండు:ఇత్తడి, రాగి పాత్రల మురికి వదిలించాలంటే అందరికీ గుర్తొచ్చేది చింతపండు గుజ్జు. చింతపండుతో, ఆ తరువాత మట్టితో తోమడం పెద్దల నాటినుంచి వస్తున్నదే. చింతపండును నీళ్లలో నానబెట్టి ఆ గుజ్జుతో రుద్దితే ఇత్తడి సామానులకు పట్టిన మకిలి, చిలుము అంతా పోయి గిన్నెలు మెరుస్తాయి. నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు. వీటిని ఆరనిచ్చి మెత్తని గుడ్డతో తుడిచి ఎండలో కాసేపు ఆరనివ్వాలి.వంట సోడా: రాగి, ఇత్తడి మెరిసేలా చేయడానికి దానిపై బేకింగ్ సోడా, సబ్బును అప్లయ్ చేయాలి. ఆ తరువాత శుభ్రంగా తోమాలి. గోధుమ పిండి: గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, టీస్పూన్ వైట్ వెనిగర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి. తరువాత ఈ పేస్ట్‌ను ఇత్తడి లేదా రాగి పాత్రలపై అప్లై చేసి, కాసేపు అలాగే ఉంచండి. స్క్రబ్బింగ్, క్లీనింగ్ తర్వాత అది మెరుస్తుంది.వెనిగర్: ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి, పాలిష్ చేయడానికి వైట్ వెనిగర్ ఒక అద్భుతంగా పని చేస్తుంది. గ్లాసు నీటిలో రెండు చెంచాల వెనిగర్ ఉడికించింది. దీనికి లిక్విడ్ డిష్ వాషర్ కానీ, విమ్ పౌడర్ గానీ మిక్స్ చేసి తోమి కడిగితే, పూజా వస్తువులు మెరుస్తాయి.నిమ్మ ఉప్పు: ఇత్తడి పాత్రలు కొత్తవిలా మెరిసిపోయేలా చేయడానికి నిమ్మ ఉప్పు ఉపయోగించండి. నిమ్మరసం, ఉప్పు కలపడం ద్వారా ఒక ద్రావణాన్ని సిద్ధం చేసి, దానిని ఇత్తడి పాన్‌కు అప్లై చేసి పాన్‌ను రుద్దండి. ఇలా చేయడం వల్ల ఇత్తడిపై నలుపు పోయి, ఇత్తడి పాత్రలు మెరుస్తాయి.పీతాంబరీ: ఇత్తడి, రాగి పాత్రలను శుభ్రం చేయడానికి పీతాంబరిమరో బెస్ట్ ఆప్షన్. బాగా కడిగిన మెత్తటి గుడ్డతోతుడిచి ఆరనివ్వాలి. -
భారత్ ఖాతాలో రెండో పతకం మనూ భాకర్ పై మోదీ ప్రశంసలు..
-
ధీరజ్‌కు రెండు కాంస్యాలు
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ రెండు కాంస్య పతకాలు సాధించాడు. మిక్స్డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్–భజన్ కౌర్ (భారత్) ద్వయం 5–3తో మటియాస్–వలెన్సియా (మెక్సికో) జోడీపై గెలిచింది. వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్ 7–3 తో మౌరో నెస్పోలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
తవ్వకాల్లో రెండు వేల ఏళ్ల నాటి కాంస్య చెయ్యి..దానిపై మిస్టీరియస్..!
స్పెయిన్‌లోని ఉత్తర ప్రాంతాల్లో జరిపిన తవ్వాకాల్లో శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్ల నాటి కాంస్య చెయ్యిని గుర్తించారు. దానిపై మిస్టిరియస్ లిపి ఉంది. ఆ లిపి ఏంటన్నది శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఆ కాంస్య చెయ్యిపై కొన్ని చిహ్నాలతో ఈ లిపి ఉన్నట్లు తెలిపారు. అది ఇనుపయుగం నాటి చారిత్రక స్థానిక తెగ గురించి అనుమానాలు తలెత్తాయి. నాడు వారు ఉపయోగించిన వాడుక భాష, తదితరాల గురించి అనుమానాలు లెవనెత్తాయి. ఆ లిపి అర్థమయ్యితే వాస్కోన్ తెగ రహస్యాలను కొంత వరకు తెలుసుకోగలుగుతామని అన్నారు. ఆ చేతిపై ఉన్న శాసనం పురాతన పాలియోహిస్పానిష్ భాషలతో ఆనుసంధానించి చూడాల్సి ఉందన్నారు. వాస్కోన్ తెగల గురించి కథకథలుగా వినడమే గానీ ఆధారాలు లేవు. ఇప్పుడి ఈ కాంస్య చెయ్యి వారు ఉండేవారనేందుకు ఆధారంగా ఉంటుంది. ఈ కాంస్య చేయి వారి అధునాత సాంస్కృతిక పద్ధతులకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది ఒకరకంగా వాస్కోన్ భాష, సంస్కృతులు గురించి తెలుసుకునేందుకు పురికొల్పొతోందన్నారు. అంతేగాదు ఈ పరిశోధన స్పెయిన్ గొప్ప చరిత్ర, గత వైభవం గురించి లోతుగా తెలుసుకునేందుకు మార్గం సుగమం చేస్తుందన్నారు శాస్త్రవేత్తలు. స్పెయిన్ దేశీయ భవనం వద్ద ఈ కాంస్య చెయ్యిని గుర్తించినట్లు తెలిపారు. ఈ కళాఖండంపై చెక్కబడిన వచనం అపోట్రోపిక్గా వ్యాఖ్యానించారు. ఇది అదృష్టాన్ని ప్రార్థించే టోకెన్ అని ఈ పురాతన తవ్వకాలకు సంబంధించిన ప్రాజెక్టులో పనిచేస్తున్న పరిశోధకులు అన్నారు. ఈ కాంస్య చేతికి ఆచార లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందని భావిస్తున్నారు. పురాతన కాలంలో, ఐబీరియన్లు తమ ఖైదీల కుడి చేతులను చేధించేవారిని తెలిసింది. అయితే కాంస్య చేయి కూడా కుడి చేతిగా ఉన్నప్పటికీ, ఈ కళాఖండంపై ఉన్న చిహ్నాలు ఏదో ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
ఇషా డబుల్ ధమాకా
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో తొలి రోజు భారత షూటర్లు అదరగొట్టారు. నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పతకాలు గెల్చుకున్నారు. అంతేకాకుండా రెండు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు కూడా ఖరారయ్యాయి. తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ భారత్‌కు ఒలింపిక్ బెర్త్ అందించింది. ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషా సింగ్ 243.1 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. తలత్ కిష్మలా (పాకిస్తాన్; 236.3 పాయింట్లు) రజతం, భారత్‌కే చెందిన రిథమ్ సాంగ్వాన్ (214.5 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. భారత్‌కే చెందిన మరోషూటర్ సురభి రావు 154 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి రావు 579 పాయింట్లతో వరుసగా మూడు, ఐదు స్థానాల్లో నిలువగా... ఇషా సింగ్ 578 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి, ఇషా సింగ్ సాధించిన స్కోరు ఆధారంగా భారత జట్టుకు టీమ్ విభాగంలో బంగారు పతకం లభించింది. భారత బృందం మొత్తం 1736 పాయింట్లు స్కోరు చేసింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ వరుణ్ తోమర్ స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు భారత్‌కు పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేశాడు. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా రజత పతకం నెగ్గాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో వరుణ్ 239.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలువగా... అర్జున్ 237.3 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వరుణ్, అర్జున్ సింగ్, ఉజ్వల్ మలిక్‌లతో కూడిన భారత బృందం 1740 పాయింట్లతో టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని గెల్చుకుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి 15 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ నుంచి 15 మంది షూటర్లు బరిలోకి దిగారు. -
వ్రితి అగర్వాల్‌కు కాంస్యం
పనాజీ: జాతీయ క్రీడల్లో తెలంగాణకు ఎనిమిదో పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల స్విమ్మింగ్ 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ కాంస్య పతకం గెలిచింది. వ్రితి 200 మీటర్ల దూరాన్ని 2ని:09.42 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ ఎనిమిది పతకాలతో 20వ ర్యాంక్‌లో ఉంది. పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు 2–3తో ఢిల్లీ జట్టు చేతిలో ఓడిపోయింది. అథ్లెటిక్స్ 100 మీటర్ల విభాగంలో ఎలాకియాదాసన్ (తమిళనాడు), స్నేహ (కర్ణాటక) చాంపియన్స్‌గా అవతరించారు. -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్‌గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్‌లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్‌కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్‌ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్‌ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్‌ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్‌ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్‌కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్‌కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్‌వాల్ట్‌లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
సూపర్ కైనన్...
ఆసియా క్రీడల్లో భారత షూటర్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. షూటింగ్ క్రీడాంశం చివరిరోజు భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం కలిపి మూడు పతకాలు వచ్చాయి. ఓవరాల్‌గా భారత షూటర్లు ఈ క్రీడల్లో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 22 పతకాలు గెలిచారు. ఆఖరి రోజు పురుషుల, మహిళల ట్రాప్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పోటీలు జరిగాయి. పురుషుల ట్రాప్ టీమ్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన కైనన్ చెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్‌లతో కూడిన భారత జట్టు 361 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల కొత్త రికార్డును నెలకొల్పింది. క్వాలిఫయింగ్‌లో కైనన్ 122 పాయింట్లు, జొరావర్ 120 పాయింట్లు స్కోరు చేసి టాప్–2లో నిలిచి వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్‌కు అర్హత పొందారు. వ్యక్తిగత విభాగంలో ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో జొరావర్ 23 పాయింట్లతో ఐదో స్థానంలో నిలువగా... కైనన్ 32 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెల్చుకున్నాడు. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో రాజేశ్వరి కుమారి, మనీశా కీర్, ప్రీతి రజక్‌లతో కూడిన భారత జట్టు 337 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది. రజతంతో ముగింపు... ఆసియా క్రీడల్లో తొలిసారి పసిడి పతకం సాధించే అవకాశాన్ని భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చేజార్చుకుంది. ఫైనల్లో భారత్ 2–3తో చైనా చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 22–20, 14–21, 21–18 తో షి యుకీపై గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యం ఇచ్చాడు. రెండో మ్యాచ్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–15, 21–18తో లియాంగ్ వెకింగ్–చాంగ్ వాంగ్ జంటను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో శ్రీకాంత్ 22–24, 9–21తో లి షిఫెంగ్ చేతిలో ... నాలుగో మ్యాచ్‌లో ధ్రువ్–సాయిప్రతీక్ ద్వయం 6–21, 15–21 తో లియు యుచెన్–జువాన్యి ఒయు జోడీ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో గాయంతో ఫైనల్‌కు దూరమైన భారత నంబర్‌వన్ ప్రణయ్ స్థానంలో మిథున్ ఆడాల్సి వచ్చింది. మిథున్ 12–21, 4–21 తో హాంగ్యాంగ్ వెంగ్ చేతిలో ఓటమి చెందాడు. -
‘నందివర్ధనం’.. పేద కుటుంబం నుంచి వచ్చి.. ‘అవరోధాలు’ అధిగమించి
Asian Games 2023: గత కొంత కాలంగా వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శనలతో సత్తా చాటుతూ వచ్చిన తెలంగాణ అథ్లెట్ అగసార నందిని అసలు సమయంలో తన ఆటను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలిసారి కాంస్యంతో మెరిసింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో నందిని మూడో స్థానంలో నిలిచి కంచు పతకాన్ని సొంతం చేసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఏడు ఈవెంట్లలో కలిపి నందిని 5712 పాయింట్లు సాధించింది. హెప్టాథ్లాన్‌లోని తొలి ఆరు ఈవెంట్లు ముగిసేసరికి నందిని ఐదో స్థానంలో నిలిచింది. 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసి 100 మీటర్ల హర్డిల్స్ (4వ స్థానం), హైజంప్ (9వ స్థానం), షాట్‌పుట్ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్‌జంప్ (3వ స్థానం), జావెలిన్ త్రో (9వ స్థానం)... ఇలా వరుసగా ఆమె ప్రదర్శన కొనసాగింది. అయితే చివరి ఈవెంట్ 800 మీటర్ల పరుగులో సత్తా చాటడంతో కాంస్యం ఖాయమైంది. ఈ పరుగును 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసిన నందిని అగ్ర స్థానంలో నిలిచింది. దాంతో ఓవరాల్ పాయింట్లలో ఆమె మూడో స్థానానికి ఎగబాకింది. 2018 ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన మరో భారత అథ్లెట్ స్వప్న బర్మన్ చివరి వరకు పోటీలో నిలిచినా... ఓవరాల్‌గా 5708 పాయింట్లతో నాలుగో స్థానానికే పరిమితమైంది. పేద కుటుంబం పేద కుటుంబం నుంచి వచ్చి నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివిన నందిని అదే పాఠశాలలో నెలకొల్పిన అథ్లెటిక్స్ అకాడమీ తొలి బ్యాచ్ విద్యార్థిని. ప్రస్తుతం సంగారెడ్డిలోని తెలంగాణ సాంఘిన సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాలలో బీబీఏ చదువుతున్న నందినికి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ తాజా విజయానికి రూ. 1 లక్ష నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. #KheloIndiaAthlete @AgasaraNandini's journey to 🥉at #AsianGames2022 is a testament to years of dedication and hard work. With a total score of 5712 in Women's Heptathlon, we have got a new champion🏆 Congratulations, Nandini. We wish to see you shine in all of your future… pic.twitter.com/nTRt320IIU — SAI Media (@Media_SAI) October 1, 2023 -
స్క్వాష్‌లో మహిళల జట్టుకు కాంస్యం
ఆసియా క్రీడల స్క్వాష్ క్రీడాంశంలో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. జోష్నా చినప్ప, తన్వీ ఖన్నా, అనాహత్ సింగ్, దీపిక పల్లికల్లతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1–2తో డిఫెండింగ్ చాంపియన్ హాంకాంగ్ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో తన్వీ ఖన్నా 6–11, 7–11, 3–11తో చాన్ సిన్ యుక్ చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో జోష్నా చినప్ప 7–11, 11–7, 9–11, 11–6, 11–8తో హో జె లోక్‌పై గెలిచి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అనాహత్ సింగ్ 8–11, 7–11, 10–12తో లీ కా యి చేతిలో ఓడిపోయింది. 2010 ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టు 2014, 2018 క్రీడల్లో రజతం సాధించింది. మరోవైపు భారత పురుషుల జట్టు 2–0తో డిఫెండిగ్ చాంపియన్ మలేసియాను ఓడించి పసిడి పతక పోరుకు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో అభయ్ సింగ్ 11–3, 12–10, 9–11, 11–6తో అదీన్ ఇద్రాకీపై... రెండో మ్యాచ్‌లో సౌరవ్ ఘోషాల్ 11–8, 11–6, 10–12, 11–3తో ఎన్జీ ఎయిన్పై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. -
భారత్ గురికి రెండు కాంస్యాలు
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నీలో రెండో రోజూ భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. తొలి రోజు బుధవారం కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్ చేరి కనీసం రెండు రజతాలు ఖరారు చేసుకోగా... గురువారం రికర్వ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్, తుషార్ ప్రభాకర్ షెలే్కలతో కూడిన భారత పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో 6–2తో (54–56, 57–55, 56–54, 57–55) స్పెయిన్ జట్టుపై గెలుపొందింది. సెమీఫైనల్లో భారత్ 0–6తో (54–56, 47–58, 55–56) చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకం కోసం పోటీపడింది. రికర్వ్ ఈవెంట్లో మ్యాచ్‌లను ‘బెస్ట్ ఆఫ్ ఫోర్ సెట్స్’ పద్ధతిలో మ్యాచ్‌ను నిర్వహిస్తారు. సెట్ గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. స్కోరు సమంగా నిలిస్తే రెండు జట్లకు ఒక్కో పాయింట్ వస్తుంది. నాలుగు సెట్ల తర్వాత స్కోరు సమమైతే ‘షూట్ ఆఫ్’ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మహిళల టీమ్ రికర్వ్ కాంస్య పతక మ్యాచ్‌లో అంకిత, భజన్ కౌర్, సిమ్రన్‌జిత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో 5–4తో (52–55, 52–53, 55–52, 54–52, 27–25) మెక్సికో జట్టును ఓడించింది. నాలుగు సెట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్ణయించగా... భారత బృందం 27 పాయింట్లు స్కోరు చేయగా... మెక్సికో జట్టు 25 పాయింట్లు చేసి ఓడిపోయింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ 0–6తో (52–57, 47–56, 52–53) చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకం కోసం ఆడింది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పతకం రేసులో నిలిచింది. సురేఖ తొలి రౌండ్లో 145–131తో పూన్ చియు యి (హాంకాంగ్)పై, రెండో రౌండ్లో 148–145తో చెన్ లి జు (చైనీస్ తైపీ)పై, మూడో రౌండ్లో 148–145తో హువాంగ్ జు (చైనీస్ తైపీ)పై, క్వార్టర్ ఫైనల్లో 147–144తో డాఫ్నీ క్వింటెరో (మెక్సికో)పై నెగ్గింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ఎల్లా గిబ్సన్ (బ్రిటన్)తో సురేఖ ఆడుతుంది. ప్రపంచ చాంపియన్, భారత ప్లేయర్ అదితి క్వార్టర్ ఫైనల్లో 135–148తో ఎల్లా గిబ్సన్ చేతిలో ఓడింది. -
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం
భోపాల్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం భారత్ ఖాతా లో ఒక కాంస్య పతకం చేరింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా మూడో స్థానంలో నిలిచింది. ఎంబీబీఎస్ చదువుతోన్న పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల సిఫ్ట్ కౌర్ క్వాలిఫయింగ్‌లో 588 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్ రౌండ్లో సిఫ్ట్ కౌర్ 403.9 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. సిఫ్ట్ కౌర్కిది రెండో ప్రపంచకప్ పతకం. గత ఏడాది కొరియాలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఆమె కాంస్య పతకం సాధించింది. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. చైనా ఎనిమిది స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. చదవండి: PAK vs AFG: టీ20ల్లో పాక్ బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
Commonwealth Games 2022: తులిక తెచ్చిన రజతం
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. బుధవారం జరిగిన పోటీల్లో జూడోలో రజతం... వెయిట్‌లిఫ్టింగ్, స్క్వాష్‌లలో కాంస్యాలు దక్కగా... ఇతర క్రీడాంశాల్లో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. స్వర్ణం బరిలోకి దిగిన భారత జూడోకా తులిక మన్ తుది పోరులో తడబడింది. మహిళల ప్లస్ 78 కేజీల ఫైనల్ మ్యాచ్‌లో స్కాట్లాండ్కు చెందిన సారా అడ్లింగ్టన్ చేతిలో తులిక ఓటమి పాలైంది. పురుషుల స్క్వాష్‌లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషాల్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్‌లో విభాగంలో కాంస్యం రూపంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్ సౌరవ్ 11–6, 11–1, 11–4 తేడాతో మాజీ నంబర్‌వన్ జేమ్స్ విల్స్ట్రాప్ (ఇంగ్లండ్)ను చిత్తు చేశాడు. 2018 క్రీడల్లో దీపిక పల్లికల్‌తో కలిసి సౌరవ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజతం గెలుచుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్ 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ స్నాచ్‌లో వరుసగా మూడు ప్రయత్నాల్లో ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ 157, 161, 163 కేజీల బరువునెత్తాడు. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా వరుసగా 185, 189 కేజీల తర్వాత 192 కేజీలతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తం (163+192)355 కేజీలతో ప్రీత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఈ విభాగంలో జూనియర్ పెరిక్లెక్స్ (కామెరూన్; 361 కేజీలు) స్వర్ణం సాధించగా, జాక్ ఒపెలాజ్ (సమోవా; 358 కేజీలు) రజతం గెలుచుకున్నాడు. అయితే మహిళల 87+ కేజీల కేటగిరీలో పూర్ణిమ పాండేకు నిరాశే ఎదురైంది. మూడు ప్రయత్నాలు కూడా పూర్తి చేయలేకపోయిన ఆమె ఆరో స్థానంతో ముగించింది. వెయిట్‌లిఫ్టింగ్‌పై ‘లవ్’తో... లవ్‌ప్రీత్ సింగ్ స్వస్థలం అమృత్సర్ సమీపంలోని బల్ సచందర్ గ్రామం. 13 ఏళ్ల వయసులో కొందరి స్నేహితుల కారణంగా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్న అతను ఆ తర్వాత దానినే కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఊర్లో చిన్న టైలర్ దుకాణం నడిపే తండ్రి కృపాల్ సింగ్‌కు కొడుకును క్రీడాకారుడిగా మార్చే శక్తి లేదు. ముఖ్యంగా అతని ‘డైట్’కు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయలేని పరిస్థితి. చాలా మందిలాగే దీనిని లవ్‌ప్రీత్ బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే తన ప్రయత్నం తండ్రికి భారం కారాదని భావించి ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు కొంత డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డాడు. అందుకే అమృత్‌సర్‌లోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో పని చేయడం ప్రారంభించాడు. పెద్ద వ్యాపారులకు అమ్మకాల్లో సహాయంగా ఉంటే రూ. 300 వచ్చేవి. వీటిని తన డైట్, ప్రొటీన్స్ కోసం లవ్‌ప్రీత్ వాడుకున్నాడు. అయితే అతని శ్రమ, పట్టుదల వృథా పోలేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టిన తర్వాత వరుస విజయాలు వచ్చాయి. ఈ ప్రదర్శన కారణంగా భారత నేవీలో ఉద్యోగం లభించింది. దాంతో ఆర్థికపరంగా కాస్త ఊరట దక్కడంతో అతను పూర్తిగా తన ఆటపై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత పటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లోని జాతీయ క్యాంప్‌కు ఎంపిక కావడంతో అతని రాత పూర్తిగా మారిపోయింది. 2017లో ఆసియా యూత్ చాంపియన్ షిప్లో కాంస్యంతో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న అతను జూనియర్ కామన్వెల్త్ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన మొదటి పతకం 24 ఏళ్ల లవ్‌ప్రీత్ స్థాయిని పెంచింది. నిఖత్, హుసాముద్దీన్‌లకు పతకాలు ఖాయం బాక్సింగ్ క్రీడాంశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించగా... హుసాముద్దీన్ 4–1తో ట్రైఅగేన్ మార్నింగ్ ఎన్‌డెవెలో (నమీబియా)పై, నిఖత్ 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచారు. రజతంతో సరి కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా ఈసారి ఫైనల్లో 1–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 18–21, 15–21తో టెంగ్ ఫాంగ్ చియా–వుయ్ యిక్ సో ద్వయం చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 22–20, 21–17తో జిన్ వె గోపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 19–21, 21–6, 16–21తో ప్రపంచ 42వ ర్యాంకర్ జె యోంగ్ ఎన్జీ చేతిలో ఓడిపోయాడు. నాలుగో మ్యాచ్‌లో థినా మురళీథరన్–కూంగ్ లె పియర్లీ ద్వయం 21–18, 21–17తో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటను ఓడించి మలేసియాకు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది. కాంస్య పతక పోరులో సింగపూర్ 3–0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. -
Khelo India Youth Games 2022: మాయావతికి కాంస్యం
పంచ్‌కుల (హరియాణా): ‘ఖేలో ఇండియా’ యూత్ గేమ్స్‌లో గురువారం తెలంగాణకు 2 కాంస్యాలు, ఆంధ్రప్రదేశ్‌కు ఒక కాంస్యం లభించాయి. బాలికల 200 మీటర్ల పరుగులో నకిరేకంటి మాయావతి కాంస్యం గెలుచుకుంది. 24.94 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో సుదేష్ణ (మహారాష్ట్ర–24.29 సె.), అవంతిక (మహారాష్ట్ర–24.75 సె.) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. బాలుర 200 మీటర్ల పరుగులో తెలంగాణకు చెందిన అనికేత్ చౌదరి (22.27 సె.) మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఆర్యన్ కదమ్ (మహారాష్ట్ర–21.82 సె.), ఆర్యన్ ఎక్కా (ఒడిషా–22.10 సె.) మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. బాలికల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్. గాయత్రి కాంస్య పతకం గెలుచుకుంది. 81 ప్లస్ కేజీల కేటగిరీలో గాయత్రి 160 కిలోల బరువెత్తింది. ఈ విభాగంలో మార్టినా దేవి (మణిపూర్–186 కేజీలు), కె.ఒవియా (తమిళనాడు–164 కేజీలు) స్వర్ణం, రజతం సాధించారు. -
AP Special: ప్రోత్సహిస్తే ఇత్తడి భవిత బంగారమే!
వైఎస్సార్ జిల్లా (మైదుకూరు): మాయాబజార్ సినిమాలో ‘వివాహ భోజనంబు’ అంటూ ఘటోత్కచుడు వివిధ రకాల ఆహార పదార్థాలను ఆరగిస్తాడనేది చూసే ఉంటారు. పెద్ద పెద్ద ఇత్తడి పాత్రల్లో పాయసాలు, లడ్డూలు, పులిహోర, అప్పలు.. దప్పలాలు కనిపిస్తాయి. భోజనం సంగతి సరే.. అంత పెద్ద వంట పాత్రలు ఎక్కడివి అని ప్రశ్నించుకుంటే.. ఇత్తడి కళాకారులు వాటిని తయారు చేస్తారు. మన రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో అలాంటి ఇత్తడి వస్తువులు తయారు చేసే కళాకారులున్నారు. వందల ఏళ్ల కిందట నుంచే వనిపెంటలో ఇంటికి కావాల్సిన వంట పాత్రలు, దేవాలయాలకు అవసరమైన దేవతా విగ్రహాలు, గంటలు, గోపుర కలశాలను తయారు చేస్తున్నారు. అప్పట్లో వివాహాల్లో, అన్నదాన కార్యక్రమాల్లో ఇత్తడి పాత్రలు అవసరమయ్యేవి. వీటిని వనిపెంటలోని అన్ని కులాల వారు తయారు చేసేవారు. ఇత్తడి వస్తువులు తయారు చేసే 200 కుటుంబాల వారు అప్పట్లో ఉండేవారు. రానురాను కాలం మారిపోయింది. ఆచార వ్యవహారాలు సన్నగిల్లాయి. ఇత్తడి పాత్రల వాడకం తగ్గిపోయింది. స్టీలు పాత్రల రాకతో ఇత్తడి పాత్రలు అటకెక్కాయి. ఇప్పుడైతే ప్లాస్టిక్ రాజ్యమేలుతోంది. పెళ్లిళ్లలో ప్లాస్టిక్ పళ్లేలు, గ్లాసులు, డెకరేషన్ పువ్వులు కనిపిస్తున్నాయి. ఇత్తడి కళాకారులకు పనితగ్గిపోయింది. కొందరు పొట్టచేతబట్టుకొని వలసలకు వెళ్లిపోయారు. గ్రామంలో ఉన్న కొద్ది మంది కళాకారులు దేవాలయాలకు విగ్రహాలు, కలశాలు ఆర్డర్లు తీసుకొని తయారు చేస్తున్నారు. వైఎస్ చేయూత వనిపెంటలో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వనిపెంట ఇత్తడి కళాకారులకు చేయూతనిచ్చారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే 2005లో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ డిజైనర్లతో వనిపెంట ఇత్తడి కళాకారులకు శిక్షణ ఇప్పించారు. మారుతున్న కాలానికి ప్రజల అభిరుచి మేరకు ఇత్తడి వస్తువులను కొత్తరీతిలో తయారు చేయడంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం వస్తువుల తయారీకి తగిన వసతులుండాలన్న తలంపుతో వైఎస్ వనిపెంటలో ఇత్తడి కళాకారుల మౌలిక వసతుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. కేంద్ర జౌళి, హస్తకళల అభివృద్ధి శాఖ నిధులతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో 2008లో మౌలిక వసతుల కేంద్రం నిర్మాణం ప్రారంభమైంది. సుమారు రూ. 60లక్షల వ్యయంతో ఈ కేంద్రం 2012లో పూర్తయింది. ముడిసరుకు కొనుగోలుకు రుణాలు ఇప్పించమని కళాకారులు కోరినా, అధికారులు అలసత్వంతో ఇప్పటికీ వారికి ఎలాంటి రుణాలు అందలేదు. తయారు చేసిన వస్తువులను లేపాక్షి ఎంపోరియాల ద్వారా విక్రయించుకుందామన్నా వస్తువుల తయారీకి పెట్టుబడి లేక కళాకారులు ఊసురుమంటున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే జీవనోపాధితోపాటు రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతి తెస్తామని కళాకారులు అంటున్నారు. ఆశతో ఉన్నాం. ఎప్పటికైనా ఇత్తడి వస్తువులకు గిరాకి పెరిగి తమకు చేతినిండా పని దొరుకుతుందని ఆశతో ఉన్నాం. కొద్ది రోజుల కిందట హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బడిగించల విజయలక్ష్మి గారు మౌలిక వసతుల కేంద్రాన్ని సందర్శించారు. కళాకారులను ప్రోత్సహించే విషయమై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ తమ తండ్రి లాగానే ఇత్తడి కళాకారులను ఆదరిస్తారని ఆశిస్తున్నాం. – ఇస్మాయిల్, అధ్యక్షుడు, ఇత్తడి కళాకారుల అభివృద్ధి సంఘం, వనిపెంట, వైఎస్సార్ జిల్లా. ఇత్తడి వృత్తిని వదిలిపెట్టలేకున్నాం.. ఇప్పుడు ఇత్తడి వస్తువులకు గిరాకి లేదు. అయినా మాకు తెలిసిన పని ఇదొక్కటే. అందువల్ల వదిలేయలేకున్నాం. దేవాలయాలు కట్టేవాళ్లు విగ్రహాలు, కలశాలు ఆర్డర్లు ఇస్తే తయారు చేసి ఇస్తున్నాం. ప్రభుత్వం ప్రోత్సహించి పెట్టుబడికి ఆర్థిక సాయం అందిస్తే మళ్లీ ఇత్తడి పరిశ్రమ పుంజు కుంటుంది. – పూల రామసుబ్బయ్య, ఇత్తడి కళాకారుడు, వనిపెంట, వైఎస్సార్ జిల్లా. చదవండి: కాకినాడ టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బోటు యజమానులు -
పంజాబ్ ఆటగాళ్లకు భారీ నజరానా
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో విజయ దుందుభి మోగించిన టీమిండియా హాకీ జట్టులో తమ ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జర్మనీతో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్‌లో విజయంతో కాంస్య పతకం సాధించిన జట్టులో రాష్ట్రానికి చెందిన హాకీ జట్టు ఆటగాళ్లకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు సర్కార్ వెల్లడించింది. పంజాబ్ క్రీడా మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధి ఈ ప్రకటన చేశారు. ఇండియన్ హాకికి ఇదొక చారిత్రాత్మక రోజని ఆయన ట్వీట్ చేశారు. మరింత ఉన్నతమైన గోల్డ్ మెడల్‌తో తిరిగి రావాలని ఎదురుచూస్తున్నామన్నారు. మరోవైపు భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, కోచ్ గ్రాహం రీడ్, సహాయక కోచ్ పియూష్ దుబేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్బంగా జట్టులోని సభ్యులందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు మోదీ. కాగా టోక్యో ఒలింపక్స్ జర్మనీతో గురువారం జరిగిన మ్యాచ్ భారత్ టీం 5-4 తేడాతో విజయం సాదించింది. తద్వారా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు, 41 ఏళ్ల తరువాత తొలిసారి ఒలింపిక్ పతకాన్ని సాధించిన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. On this historic day for #IndianHockey I am delighted to announce a cash award of Rs 1crore each to players 4m #Punjab We await ur return to celebrate the much deserving medal in #Olympics #Cheer4India #Tokyo2020 #IndvsGer #Hockey #IndianHockeyTeam@capt_amarinder @Media_SAI https://t.co/VJ8eiMu1up — Rana Gurmit S Sodhi (@iranasodhi) August 5, 2021 #WATCH | PM Narendra Modi speaks to the India Hockey team Captain Manpreet Singh, coach Graham Reid and assistant coach Piyush Dubey after the team won #Bronze medal in men's hockey match against Germany#TokyoOlympics pic.twitter.com/NguuwSISsV — ANI (@ANI) August 5, 2021 -
మురిసిపోతున్న సెలబ్రిటీలు: సంబరాలు మామూలుగా లేవుగా!
టోక్యో ఒలింపిక్స్ వేదికగా భారత కీర్తి పతాకం మరోసారి సగర్వంగా రెపరెపలాడింది. గురువారం జర్మనీతో జరిగిన పోరులో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయం సాధించి యావత్‌దేశాన్ని ఎనలేని ఆనందంలో ఓలలాడించింది. ఈ చారిత్రక విజయంపై భారత రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఆనంద్ మహీంద్ర, కిరణ మజుందార్ షా లాంటి వ్యాపారవేత్తలు సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు భారత హాకీ జట్టు ఘనతను పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లకు కల నిజమైందంటూ మురిసిపోతున్నారు. మెన్ ఇన్ బ్లూ.. చక్ దే ఇండియా అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ స్పందిస్తూ వావ్ !! భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన మ్యాచ్ అంటూ షారూఖ్ పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే విజయం! అద్భుత ప్రదర్శన 41 సంవత్సరాల తర్వాత ఇండియాకు ఒలింపిక్ పతకం.. అంటూ టీమిండియాకు అభినందనలు తెలిపారు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా. మరోవైపు పురుషుల హాకీలో టీమిండియా విజయం సాధించిన సందర్భంగా మణిపూర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇంపాల్‌లో హాకీ ఆటగాడు నీలకంఠ శర్మ కుటుంబం సంతోషానికి హద్దే లేకుండా పోయింది. బంధువులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులంతాచేరి నృత్యాలతో సందడి చేశారు. అటు పంజాబ్‌లో అమృత సర్‌లో కూడా పండగ వాతావరణం నెలకొంది. గుర్జంత్ సింగ్ కుటుంబ సభ్యులు డాన్స్‌లతో భారత జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒలింపిక్స్‌లో పురుషుల హాకీలో టీం కాంస్య పతకం ఖాయం కావడంతో పంజాబ్‌కు భారత హాకీ ఆటగాడు మన్ దీప్ సింగ్ కుటుంబం సంబరాలు చేసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత భారతదేశం పతకం సాధించింది. ఈ విజయంపై తనకు మాటలురావడం లేదంటూ మన్ దీప్ తండ్రి రవీందర్ సింగ్ ఆనందాన్ని ప్రకటించారు. Yeaaa! What a win for our men in blue - after 41 years we get to stand on the podium for Olympic Hockey! Jai Hind! 👏👏👍 — Kiran Mazumdar-Shaw (@kiranshaw) August 5, 2021 -
నాకు బంగారంలా కనిపిస్తోంది: ఆనంద్ మహీంద్ర
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పురుషుల హాకీ జట్టు సాధించిన ఘన విజయంపై పారిశ్రామిక వేత్త మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో స్పందించారు. ఒక్కసారిగా తనకు కలర్ బ్లైండ్నెస్ ఆవరించిదంటూ హాకీ టీం విజయంపై సంతోషాన్ని ప్రకటించారు.. మనవాళ్లు గెల్చుకున్న కాంస్య పతకం కాస్తా స్వర్ణ పతకంలా కనిపింస్తోందంటూ కితాబిస్తూ ట్వీట్ చేశారు. కాగా జర్మనీతో గురువారం జరిగిన పురుషుల హాకీ పోరులో భారత్ అద్భుత విజయాన్ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో చివరకు మన్‌ప్రీత్ సింగ్ సారధ్యంలోని జట్టు 5-4 తేడాతో జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా భారత ఖాతాలో మరో ఒలింపిక్ పతకం చేరింది. అంతేకాదు. 41 ఏళ్ల తరువాత హాకీలో తొలిసారి ఒలింపిక్ పతకాన్ని సాధించడం విశేషం. భారత జట్టు సాధించిన విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువ కురుస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) I have suddenly become colour-blind. That Bronze looks Golden to me… #ChakDeIndia #TokyoOlympics2020 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽 https://t.co/0FHbNrtnA1 — anand mahindra (@anandmahindra) August 5, 2021 -
‘అమ్మ దయతో సింధు మెడల్ గెలిచింది’
సాక్షి, పశ్చిమగోదావరి: పీవీ సింధు కాంస్య పతకం సాధించిన అనంతరం ఆమె తండ్రి పీవీ వెంకట రమణ పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన రాట్నాలమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా పూర్వీకుల నుంచి మాకుల దేవతగా రాట్నాలమ్మను పూజిస్తున్నాము. టోర్నమెంట్‌కు వెళ్లే ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకుని సింధు ఆడేందుకు వెళ్లిందని, అమ్మ దయతో దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చిందన్నారు.130 కోట్ల భారతీయుల ఆశీస్సులతో పాటు ,అమ్మ దీవెనతో మెడల్ సాధించిందని తెలిపారు. ఒలింపిక్స్ లో ఆడటం గొప్ప అవకాశం..అది అందరికీ రాదని, అమ్మాయిలలో రెండో సారి ఒలింపిక్స్ లో మెడల్ పొందిన వారిలో సింధు మొదటి యువతి కావడం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఒలింపిక్స్‌కు వెళ్ళే ముందు క్యాంపు కార్యాలయంకు పిలిపించి సింధు, సాత్విక్ ,హాకీ క్రీడాకారులను సన్మానించి, మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ప్రోత్సాహించారని చెప్పారు. -
దివ్యాంశ్ శ్రేయ జంటకు కాంస్యం
చాంగ్వాన్ (కొరియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు భారత సీనియర్ షూటర్లు విఫలమైనా జూనియర్లు సత్తా చాటారు. 10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ జూనియర్ ఈవెంట్లో దివ్యాంశ్ సింగ్–శ్రేయ అగర్వాల్ జోడీ కాంస్యం సాధించింది. ఫైనల్లో దివ్యాంశ్–శ్రేయ జంట 435 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. అంతకుముందు 42 జట్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్లో దివ్యాంశ్–శ్రేయ జోడీ 834.4 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరగా... మరో భారత జంట ఎలవనీల్ వలరివన్–హిృదయ్ హజారికా జంట (829.5 పాయింట్లు) 13వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ ప్రస్తుతం మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో పతకాల పట్టికలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. సీనియర్లు విఫలం... 2020 టోక్యో ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నమెంట్‌గా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో పురుషుల 50 మీ. రైఫిల్ ప్రోన్ విభాగంలో చైన్ సింగ్ 623.9 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచి నిరాశపరచగా... తాజా ఆసియా క్రీడల రజత పతక విజేత సంజీవ్ రాజ్‌పుత్ (620 పాయింట్లు) 48వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టీమ్ విభాగంలో చైన్ సింగ్, సంజీవ్, గగన్ నారంగ్‌ల త్రయం 1856.1 పాయింట్లతో 15వ స్థానం దక్కించుకుంది. మహిళల 50 మీ. రైఫిల్ ప్రోన్ విభాగంలో తేజస్విని సావంత్ 617.4 పాయింట్లతో 28వ స్థానం దక్కించుకోగా... అంజుమ్ మౌద్గిల్ (616.5 పాయింట్లు) 33వ స్థానం... శ్రేయ సక్సేనా (609.9 పాయింట్లు) 54వ స్థానంలో నిలిచారు. టీమ్ విభాగంలో అంజుమ్, తేజస్విని, శ్రేయలతో కూడిన భారత జట్టు 1848.1 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. -
స్క్వాష్‌లో సంచలనం
జకార్తా: కఠినమైన ప్రత్యర్థి అనుకున్న మలేసియాను అతి సులువుగా ఓడించిన భారత మహిళల జట్టు ఆసియా క్రీడల స్క్వాష్‌లో తొలిసారి ఫైనల్ చేరి సంచలనం సృష్టించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మొదటి మ్యాచ్‌లో జోష్నా చిన్నప్ప 12–10, 11–9, 6–11, 10–12, 11–9తో ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్, ఐదుసార్లు ఏషియాడ్ సింగిల్స్ విజేత నికోల్ డేవిడ్‌ను మట్టికరిపించింది. నాలుగో గేమ్‌లో 10–9 స్కోరుపై జోష్నా మ్యాచ్ బాల్ మీద ఉండగా... నికోల్ అద్భుతంగా పుంజుకుని మూడు పాయింట్లు సాధించి గేమ్‌ను గెల్చుకుంది. ఐదో గేమ్‌లోనూ సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైనా... ఈసారి జోష్నా పట్టువిడవకుండా పోరాడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో మ్యాచ్‌లో దీపికా పల్లికల్ 11–2, 11–9, 11–7తో లొ వీ వెర్న్‌ను ఓడించడంతో భారత్ 2–0తో గెలిచింది. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్‌ను నిర్వహించలేదు. పురుషుల విభాగంలో కాంస్యమే డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగిన భారత పురుషుల స్క్వాష్ జట్టు సెమీఫైనల్లో హాంకాంగ్ చేతిలో 2–0 తేడాతో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో సౌరవ్ ఘోషాల్ 7–11, 9–11, 10–12తో మాక్స్ లీ చేతిలో... రెండో మ్యాచ్‌లో హరీందర్ పాల్ సంధూ 9–11, 11–9, 9–11, 11–13తో లియో అయు చేతిలో ఓడిపోయారు. -
టీటీలో కాజోల్కు కాంస్యం
విజయవాడ స్పోర్ట్స్: మూడో 11స్పోర్ట్స్ జాతీయ ఇంటర్ స్కూల్స్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో నగరంలోని మద్ది సుబ్బారావు ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు చెందిన విజయవాడ అమ్మాయి కాజోల్ సునార్ సీనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. నగరంలోని దండమూడి రాజగోపాలరావు స్టేడియంలో ఆదివారం జరిగిన టోర్నీలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన స్కూల్ జట్లు పూర్తి ఆధిక్యత ప్రదర్శించాయి. సీనియర్ బాలికల విభాగం సెమీస్‌లో కాజోల్ సునార్ 1–3 తేడాతో ఎస్.రాధాప్రియాగోయల్ (డీపీఎస్, యూపీ)పై ఓటమి చెంది కాంస్య పతకం సాధించింది. సీనియర్ బాలికల ఫైనల్స్‌లో జూనియర్ వరల్డ్ సర్కూట్ కాంస్య పతకం విజేతైన రాధాప్రియా గోయల్ (డీపీఎస్, యూపీ)ను 0–3 తేడాతో పొయమ్తీబైస్యా (మఖాల విద్యానికేతన్, పశ్చిమబెంగాల్) ఓడించింది. సీనియర్ బాలుర విభాగం ఫైనల్లో చిన్మయి సోమయ (మయూర్ స్కూల్, రాజస్థాన్) 3–2 తేడాతో అకాష్పాల్ (అమరేంద్ర విద్యాపీఠ్, పశ్చిమబెంగాల్)పై విజయం సాధించాడు. జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో కర్ణాటకకు చెందిన శ్రీకుమరన్ చిల్డ్రన్స్ హోం జట్టుకు చెందిన సుజన్ భరద్వాజ్ 3–2 తేడాతో అదే స్కూల్‌కు చెందిన శ్రీకాంత్ కాశ్యప్‌పై స్వర్ణపతకం సాధించాడు. జూనియర్ బాలికల సింగిల్స్‌లో పీఎస్ సీనియర్ సెకండరీ స్కూల్(తమిళనాడు)కు చెందిన ఎస్.హృతిక 3–0 తేడాతో సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ (యూపీ)కు చెందిన వర్టికా భరత్‌పై విజయం సాధించింది. టోర్నీ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు ట్రోపీలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, ఏపీ టేబుల్ టెన్నిస్ వెటరన్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతా రవికుమార్, 11స్పోర్ట్స్ డైరెక్టర్ కమలేష్ మెహతా, రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఎం సుల్తాన్, ఉపాధ్యక్షుడు విశ్వనాథ్, జిల్లా అ«ధ్యక్ష కార్యదర్శులు కేవీఎస్ ప్రకాష్, కె.బలరామ్ పాల్గొన్నారు. -
గౌరవ్ బిధురికి కాంస్యం
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశించిన గౌరవ్ బిధురికాంస్య పతకంతో చరిత్ర సృష్టించాడు. గురువారం హాంబర్గ్‌లో జరిగిన సెమీ ఫైనల్లో (56 కేజీల విభాగం) గౌరవ్, డ్యూక్ రగన్ (అమెరికా) చేతిలో పరాజయం చెందాడు. దీంతో భారత్ నుంచి ఈ టోర్నీలో పతకం సాధించిన విజేందర్ (2009), వికాస్ క్రిషన్ (2011), శివ థాపా (2015) సరసన 24 ఏళ్ల గౌరవ్ కూడా చేరాడు. తాజాగా భారత్ ఈ ఒక్క పతకంతోనే చాంపియన్‌షిప్‌ను ముగించింది. -
కార్తీకకు కాంస్యం
సాక్షి, గుంటూరు: జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మూడోరోజు ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ ఖాతాలో పతకం చేరింది. స్థానిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం జరిగిన మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో జి. కార్తీక (ఏపీ) కాంస్య పతకాన్ని సాధించింది. ఆమె 12.51 మీ. దూరం జంప్ చేసి మూడో స్థానంలో నిలవగా, షీనా (12.78మీ., కేరళ), జోలిన్ లోబో (12.52మీ., కర్నాటక) వరుసగా స్వర్ణ, రజతాలను గెలుచుకున్నారు. 20, 000 మీ. రేస్ వాక్ ఈవెంట్లో సౌమ్య విజేతగా నిలిచింది. ఆమె గంటా 42 నిమిషాల 23.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. మహిళల పోల్‌వాల్ట్ ఈవెంట్లో ఖ్యాతి వఖారియా (కర్ణాటక) 3.70 మీ. జంప్ చేసి చాంపియన్‌గా నిలిచింది. జావెలిన్ త్రో విభాగంలో అన్నూరాణి (54.29మీ.), పూనమ్ రాణి (51.14మీ., హరియాణా), రష్మీ శెట్టి (47.76మీ., కర్నాటక) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. -
శ్రీజ సంచలనం
ఇండియా ఓపెన్ టీటీ టోర్నీలో కాంస్యం న్యూఢిల్లీ: హైదరాబాద్ యువతార ఆకుల శ్రీజ తన కెరీర్లో గొప్ప ప్రదర్శన చేసింది. అంత్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) వరల్డ్ టూర్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో అండర్–21 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. బుధవారం జరిగిన అండర్–21 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 322వ ర్యాంకర్ శ్రీజ 2–11, 11–13, 7–11తో వాయ్ యామ్ మినీ సూ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో శ్రీజ 11–7, 6–11, 6–11, 11–3, 11–9తో ప్రపంచ 171వ ర్యాంకర్ లిన్ పో సువాన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించగా... తొలి రౌండ్లో 7–11, 8–11, 11–6, 11–5, 11–5తో అమృత పుష్పక్ (భారత్)ను ఓడించింది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు ఆంథోనీ అమల్‌రాజ్, హర్మీత్ దేశాయ్, జ్ఞానశేఖరన్ సత్యన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. -
ఆశల పల్లకిలో హారిక
టెహరాన్: గత రెండు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో (2012, 2015) కాంస్య పతకాలు సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉంది. శనివారం ఇరాన్‌లోని టెహరాన్‌లో మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ తెలుగు అమ్మాయి నాలుగో సీడ్‌గా బరిలోకి దిగనుంది. శని వారం జరిగే తొలి రౌండ్ తొలి గేమ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన షమీమాతో హారిక తలపడుతుంది. మొత్తం 64 మంది క్రీడాకారిణుల మధ్య నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీ మార్చి 3వ తేదీన ముగుస్తుంది. సెమీఫైనల్ దశ వరకు ఇద్దరు క్రీడాకారిణుల మధ్య రెండు గేమ్‌ల చొప్పున జరుగుతాయి. ఎక్కువ పాయింట్లు సాధించిన క్రీడాకారిణికి విజయం దక్కుతుంది. ఒకవేళ స్కోరు సమంగా ఉంటే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. భారత్ నుంచి మరో ప్లేయర్ పద్మిని రౌత్ కూడా బరిలోకి దిగుతోంది. -
శ్రీనివాసరావుకు రెండు పతకాలు
జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లూరి శ్రీనివాసరావు రెండు పతకాలు సాధించాడు. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో మంగళవారం జరిగిన పురుషుల 62 కేజీల విభాగంలో శ్రీనివాసరావు కాంస్యంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. శ్రీనివాసరావు స్నాచ్‌లో 112 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 143 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 255 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. అంతర్ రాష్ట్ర విభాగంలో శ్రీనివాసరావు (255 కేజీలు) స్వర్ణం సొంతం చేసుకోగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గౌరి బాబు (246 కేజీలు) కాంస్య పతకాన్ని సంపాదించాడు. -
14 ఏళ్లకే భారత సీనియర్ జట్టులోకి
మీరట్ షూటర్ శపథ్ ఘనత పాటియాలా: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఉత్తరప్రదేశ్ యువ షూటర్ శపథ్ భరద్వాజ్ 14 ఏళ్లకే భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది న్యూఢిల్లీ, మెక్సికో, సైప్రస్‌లలో జరిగే షూటింగ్ ప్రపంచకప్‌లలో పాల్గొనే భారత ‘డబుల్ ట్రాప్’ జట్టు ఎంపిక కోసం సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్‌లో శపథ్ విశేషంగా రాణించి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో శపథ్ 150 పాయింట్లకు 122 పాయింట్లు... రెండో రౌండ్లో 150 పాయింట్లకు 136 పాయింట్లు స్కోరు చేశాడు. అంకుర్ మిట్టల్ తొలి స్థానంలో, సంగ్రామ్ దహియా మూడో స్థానంలో నిలిచి శపథ్తో కలిసి జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. మీరట్‌లో తొమ్మిదో తరగతి చదువుతోన్న శపథ్ ఇటీవలే జైపూర్‌లో జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ‘డబుల్ ట్రాప్’ జూనియర్ విభాగంలో రజతం, సీనియర్ విభాగంలో కాంస్యం సాధించాడు. గత జులైలో ఇటలీలో జరిగిన అంతర్జాతీయ గ్రాండ్‌ప్రి టోర్నీలో శపథ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణాలు గెలిచాడు. -
ఆసియా కప్ హాకీలో భారత్‌కు కాంస్యం
బ్యాంకాక్: మహిళల అండర్–18 ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్‌కు కాంస్యం దక్కింది. కొరియాతో గురువారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 3–0తో ఘనవిజయం సాధించింది. హాకీ ఇండియా తమ ఆటగాళ్లకు ప్రోత్సాహకగా రూ. లక్ష చొప్పున నజరానా ప్రకటించింది. సహాయక సిబ్బందికి రూ.50 వేల చొప్పున అందించనుంది. సంగీత కుమారి (55, 58వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. రితు (45) మరో గోల్ చేసింది. ఇరు జట్లు మెరుగ్గా తలపడటంతో ప్రథమార్థంలో గోల్స్ నమోదు కాలేదు. కొరియాకు పలు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కినా భారత డిఫెన్స్ గట్టిగా నిరోధించగలిగింది. ద్వితీయార్ధంలో భారత్ విజృంభించి మూడు గోల్స్‌తో విరుచుకుపడింది. -
కశ్యప్ ఖాతాలో కాంస్యం
జెజు (కొరియా): ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్లో సెమీఫైనల్‌కు చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ఆ అడ్డంకిని దాటలేకపోయాడు. కొరియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్యాన్ని సాధించాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)తో జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో కశ్యప్ 21–23, 16–21తో ఓటమి పాలయ్యాడు. సెమీస్‌లో ఓడిన కశ్యప్‌కు 1,740 డాలర్ల (రూ. లక్షా 17 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు
మెల్బోర్న్: వర్గీకరణ మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం చలారుుంచిన భారత పురుషుల జట్టు నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్లో కాంస్య పతకాన్ని సాధించింది. మలేసియా జట్టుతో మూడు, నాలుగు స్థానాల కోసం ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (2వ ని.లో), కెప్టెన్ రఘునాథ్ (45వ ని.లో), తల్విందర్ సింగ్ (52వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... మలేసియా జట్టుకు జోయెల్ వాన్ హుజెల్ (45వ ని.లో) ఏకై క గోల్ అందించాడు. మరోవైపు ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోరుుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో టీమిండియా 1-3తో ఓడిపోరుుంది. భారత్ తరఫున మోనిక (30వ ని.లో) ఏకై క గోల్ చేసింది. -
కైనన్కు కాంస్యం
జైపూర్: జాతీయ సీనియర్ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్ కైనన్ షెనాయ్ కాంస్య పతకాన్ని సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కైనన్... కాంస్య పతక పోరులో 14-12తో అధిరాజ్ సింగ్ రాథోడ్ (రాజస్తాన్)పై గెలిచాడు. ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఈ పంజాబ్ షూటర్ 14-13తో రణీందర్ సింగ్ (ఒడిశా)పై విజయం సాధించాడు. -
ప్రియేషా దేశ్‌ముఖ్‌కు కాంస్యం
పుణే: తొలిసారిగా వినికిడి లోపం ఉన్న అథ్లెట్లకు నిర్వహించిన వరల్డ్ డెఫ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ ప్రియేషా దేశ్‌ముఖ్ కాంస్యంతో ఆకట్టుకుంది. రష్యాలోని కజాన్‌లో జరిగిన ఈ ఈవెంట్లో తను 10మీ. ఎరుుర్ రైఫిల్ విభాగం ఫైనల్లో 180.4 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. మూడేళ్ల క్రితమే కెరీర్‌ను ఆరంభించిన 23 ఏళ్ల ప్రియేషాకు ఇది తొలి అంతర్జాతీయ ఈవెంట్ కావడం విశేషం. -
తృటిలో చేజారిన కాంస్యం
రియో డి జనీరో: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ అమిత్ కుమార్ సరోహ తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. శుక్రవారం జరిగిన ఎఫ్51 క్లబ్ త్రో ఈవెంట్లో 31 ఏళ్ల ఈ హరియాణా పారా అథ్లెట్ 26.63మీ. దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. స్లొవేకియాకు చెందిన మరియన్ కురేజ 26.82మీ. విసిరి కాంస్యం సాధించాడు. వీరిద్దరి మధ్య దూరం కేవలం 0.19మీ. మాత్రమే. తొలి స్థానంలో నిలిచిన జెల్జికో దిమిత్రిజెవిక్ (29.96మీ) ప్రపంచ రికార్డును సృష్టించాడు. -
అద్వానీకి కాంస్యం
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): భారత స్టార్ క్యూరుుస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ఘనత చేరింది. 6-రెడ్ స్నూకర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పంకజ్ కాంస్య పతకం గెలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 4-7 (0-37, 68-0, 73-0, 41-26, 49-15, 7-57, 0-57, 67-0, 57-0, 20-34, 69-9) ఫ్రేమ్‌ల తేడాతో డింగ్ జున్హుయ్ (చైనా) చేతిలో ఓడిపోరుు కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పటికే పంకజ్ బిలియర్డ్స్, స్నూకర్ విభాగాల్లో మొత్తం 15 ప్రపంచ టైటిల్స్ సాధించాడు. -
స్వదేశానికి రెజ్లర్ సాక్షి మాలిక్
-
లేడీ ‘సుల్తాన్’
ఒకప్పుడు ఆ అమ్మాయి ఆకాశంలో వెళ్లే విమానాలు చూసి జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కితే చాలనుకుంది... కానీ విమానాలు కూడా అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది. ఒక మహిళా రెజ్లర్ ట్రోఫీ అందుకుంటున్న ఫొటోను పత్రికలో చూసి తానూ అలాగే కావాలని భావించింది. ఇప్పుడు దేశంలోని పత్రికలన్నీ ఆమె నామజపంతోనే నిండిపోయే ఘనతను సాధించింది. ప్రతిభకు లోటు లేకున్నా, చాలా కాలంగా ఫోగట్ సిస్టర్స్ నీడలోనే ఉండిపోయిన ఆ రెజ్లర్ ఇప్పుడు తన పట్టును ప్రదర్శించింది. కోట్లాది భారతీయులు గర్వపడేలా విశ్వ వేదికపై త్రివర్ణాన్ని రెపరెపలాడించింది. మోఖ్రా నుంచి సాక్షి టీవీ ప్రతినిధి ఎన్.వెంకటేష్ అమ్మాయిల భ్రూణహత్యలకు నెలవైన హరియాణా నుంచి మరో ఆడపిల్ల ఆటల్లో ప్రపంచాన్ని గెలిచింది. ఆర్థిక పరంగా కష్టాలు, కన్నీళ్లవంటి కథలేమీ ఆమె వెనక లేకపోవచ్చు. కానీ క్రీడాకారిణిగా 12 ఏళ్లుగా ఆమె చేసిన పోరాటం, శ్రమ ఎవరికంటే తక్కువ కాదు. అమ్మాయికి ఈ ఆట ఎందుకు అని సొంత ఊరినుంచే వెక్కిరింతలు వచ్చిన చోట ఇప్పుడు ‘వో హమారీ బేటీ’ ఊరు ఊరంతా గర్వపడేలా చేయడం సాక్షి సాధించిన గొప్ప విజయం. తల్లిదండ్రుల అండతో: రెజ్లింగ్‌లాంటి క్రీడను ఆడపిల్ల ఎంచుకోవడమే పెద్ద సాహసం. బయటివాళ్ల మాటలు సరేసరే... చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులే దీనిని వ్యతిరేకించే పరిస్థితి. అయితే తమ అమ్మాయి కోరికకు ఆమె తల్లిదండ్రులు మద్దతు తెలపడంతో సాక్షికి మొదటి అడ్డంకి తొలగిపోయింది. ఢిల్లీ ఆర్టీసీలో కండక్టర్ అయిన తండ్రి, అంగన్వాడీ సూపర్వైజర్ అయిన తల్లి తమ కూతురి లక్ష్యానికి అండగా నిలిచారు. కుస్తీ అంటే సాక్షి మలిక్‌కు అమిత ఇష్టం. దాంతోపాటు... తినడం కూడా బాగా ఇష్టం. ముగ్గురు తినే తిండి, ముగ్గురు తాగే పాలు... చిన్నప్పటి సాక్షికి ప్రియమైన వ్యాపకం. తన స్వస్థలం మోఖ్రాకు సమీపంలోని రోహ్టక్లో ఆమె 12 ఏళ్ల వయసులో ఈశ్వర్ దహియా అనే కోచ్ వద్ద శిక్షణకు సిద్ధమైంది. సాక్షి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబం పూర్తిగా రోహ్టక్కు మారిపోయింది. ఆరేళ్ల కష్టం తర్వాత 2010లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచి తొలి సారి తన ఆటతో ఆనందాన్ని అందుకుంది. అంచనాలు లేకుండానే...: సీనియర్ విభాగంలో 2013 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించడంతో సాక్షి రెజ్లింగ్ ప్రపంచంలో నిలదొక్కుకోగలిగింది. అయితే ఆ తర్వాత కూడా ఆమె అనామకురాలే. భారత మహిళల రెజ్లింగ్‌లో ఫోగట్ కుటుంబం తర్వాత మరొకరి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. బహుశా ఏ ఒత్తిడి లేకపోవడం కూడా ఆమెకు రియోలో కూడా కలిసొచ్చినట్లుంది! అదృష్టవశాత్తూ ఈ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మలిక్...కఠోర సాధన చేసింది. ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావడంతో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ఆమెకు అండగా నిలిచింది. తన ఈవెంట్లో అద్భుత పోరాటపటిమ కనబరుస్తూ చివరి పది సెకన్లలో సీన్ ‘రివర్స్’ చేసి సగర్వంగా సింహనాదం చేసింది. మహా మాస్: ఆట కోసం ఎంతైనా కష్టపడే స్వభావం ఉన్న ఈ రెజ్లర్ మాటతీరులో మాత్రం భోళాతనం కనిపిస్తుంది. పతకం గెలిచిన తర్వాత ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎక్కడా తెచ్చి పెట్టుకున్న హుందాతనం లేదు. తన భాషలో, తనదైన శైలిలోనే మాట్లాడుతూ పోయింది. ఆరు నిమిషాలు నిలబడితే చాలు గెలుస్తానని నమ్మాను అని చెప్పడం 24 ఏళ్ల సాక్షి ఆత్మవిశ్వాసానికి సంకేతం. చిన్నప్పుడు చాలా అల్లరి చేసి నా... రెజ్లర్ అయిన తర్వాత చాలా గంభీరంగా మారి పోయిందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. చదువుల్లోనూ చురుగ్గా ఉండే సాక్షి 70 శాతం మార్కులతో మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ను పూర్తి చేయడం విశేషం. ఇంటీరియర్ డిజైనింగ్‌పై ఆసక్తి కనబర్చే తన అభిరుచి ప్రకారం ఇంటిని అలంకరించుకుంది. సిని మాలు, స్నేహితులతో కలిసి తిరగడంపై ఆసక్తి లేదు. ఖాళీ దొరికితే ఇంట్లో ఉండటాన్నే ఇష్టపడుతుంది. -
సాక్షి మెరిసింది దేశం మురిసింది
భారత్‌కు తొలి పతకం అందించిన మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ {ఫీస్టయిల్ 58 కేజీల విభాగంలో కాంస్యం ఈ ఘనత సాధించిన తొలి మహిళా రెజ్లర్ ఇంత పెద్ద దేశం... ఇంత భారీ జనాభా.... అయినా ఒక్క పతకమూ లేదే...? మనసు నిండా వెలితి... 70 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాన్ని జరుపుకుంటున్నా... చిన్న దేశాల ఒడిలో వాలిన పతకాలను చూసి మనకు లేవే..? అంతులేని ఆవేదన... రోజులు గడిచిపోతున్నాయి... ఇక నాలుగు రోజులే మిగిలాయి... ఈ సారికి పతకం రాదేమో..? అని మానసికంగా సన్నద్ధమవుతున్న వేళ. అయినా సరే ఎవరో ఒకరు ఒక్క పతకమైనా తీసుకు రాకపోతారా అని ఏదో ఓ మూల చిన్న ఆశ? పతకాల పట్టికలో మన దేశం పేరును చేర్చేవాళ్లు ఎవరు..? గురువారం ఉదయం... పొద్దుటే చెల్లెలు వచ్చి రాఖీ కడుతుందని నిద్ర లేచిన భారతీయుడికి... సోదరి సాక్షి మలిక్ తెచ్చి కట్టిన పతకం చూసి ఆనంద భాష్పాలు వచ్చేసాయి... రియో నుంచి ప్రత్యేకంగా పంపిన మిఠాయి లాంటి వార్తతో నోరు తీపి అయిపోయింది.పదకొండు రోజుల ఆవేదనకు, కోట్లాది భారతీయుల ఎదురుచూపులకు, అంతు లేని నిరీక్షణకు తెరదించుతూ... మన హృదయాల్లో సంబరం నింపుతూ... మువ్వన్నెలు మురిసేలా... భారతదేశం గర్వించేలా సాక్షి దేశం మెడలో పతకహారాన్ని చేర్చింది. థ్యాంక్యూ సిస్టర్... రియో డి జనీరో: దేశం మొత్తం గాఢనిద్రలో ఉన్న సమయంలో రియో ఒలింపిక్స్ నుంచి తీపి కబురు వచ్చింది. 12 రోజుల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల ఫ్రీస్టయిల్ 58 కేజీల విభాగంలో సాక్షి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతక పోరులో సాక్షి 8-5 పాయింట్ల తేడాతో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై విజయం సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. కాంస్య పతక బౌట్లో ఒకదశలో 0-5తో వెనుకబడి ఓటమివైపు సాగుతున్న దశలో సాక్షి తన పోరాటపటిమతో అద్భుతమే చేసింది. వెంటవెంటనే 2,2,1 పాయింట్లు సాధించి స్కోరును 5-5తో సమం చేసింది. మరో ఆరు సెకన్లలో బౌట్ ముగుస్తుందనగా... సాక్షిని నిలువరిస్తే బౌట్ ఆరంభంలో ఆధిపత్యం చలాయించినందుకు తనకే అనుకూల ఫలితం వస్తుందని తినిబెకోవా భావించింది. కానీ సాక్షి ఈ ఆరు సెకన్లను ఏమాత్రం వృథా చేయకుండా తినిబెకోవాను కిందకు పడేసి... 8-5తో విజయాన్ని ఖాయం చేసుకొని దేశం మొత్తం సంబరాల్లో మునిగేలా చేసింది. వెనుకబడి.. విజయాల ఒడిలోకి.. తన విభాగంలో సాక్షి గెలిచిన అన్ని బౌట్లలోనూ తొలుత వెనకబడినా గెలిచింది. జోనా మాట్సన్ (స్వీడన్)తో జరిగిన తొలి రౌండ్లో సాక్షి మొదట 0-4తో వెనుకంజ వేసి ఆ తర్వాత 5-4తో విజయాన్ని దక్కించుకుంది. మరియానా (మాల్డొవా)తో జరిగిన రెండో రౌండ్లో తొలుత 1-3తో వెనుకబడి ఆ తర్వాత తేరుకొని 5-5తో స్కోరును సమం చేసింది. అయితే బౌట్లో ఆధిపత్యం చలాయించినందుకు సాక్షిని విజేతగా ప్రకటించారు. ఒర్ఖాన్ ప్యూర్విడోర్డ్ (మంగోలియా)తో జరిగిన రెప్‌చేజ్ తొలి రౌండ్ బౌట్లో సాక్షి 2-3తో వెనుకబడి ఆ తర్వాత వరుసగా 11 పాయింట్లు సాధించింది. అదృష్టంతోపాటు పోరాటం సాక్షికి పతకం రావడం వెనుక కాస్త అదృష్టంతోపాటు ఆమె పోరాటం కూడా ఉంది. రెండు గ్రూప్‌ల నుంచి ఫైనల్‌కు వచ్చిన వారి చేతుల్లో ఓడిపోయిన వారందరికీ ‘రెప్‌చేజ్’ నిబంధన ప్రకారం మరో అవకాశం ఇస్తారు. రెప్‌చేజ్ రౌండ్ విజేత సెమీఫైనల్లో ఓడిన వారితో కాంస్యం కోసం ఆడతారు. క్వార్టర్ ఫైనల్లో వలేరియా (రష్యా) చేతిలో సాక్షి ఓడిపోయింది. వలేరియా ఫైనల్‌కు చేరడంతో సాక్షికి ‘రెప్‌చేజ్’ అవకాశం లభించింది. అంతకుముందు వలేరియా చేతిలో తొలి రౌండ్లో ఓడిన లుసా హెల్గా (జర్మనీ), రెండో రౌండ్లో ఓడిన ఒర్ఖాన్ రెప్‌చేజ్ తొలి రౌండ్లో పరస్పరం తలపడ్డారు. ఈ బౌట్లో నెగ్గిన ఒర్ఖాన్ రెండో రౌండ్లో సాక్షితో ఆడింది. ఒర్ఖాన్పై గెలిచిన సాక్షి... వలేరియా చేతిలో సెమీఫైనల్లో ఓడిన తినిబెకోవాతో కాంస్యం కోసం తలపడింది. రెప్‌చేజ్‌లో సాక్షి ప్రత్యర్థిగా ఉన్న ఒర్ఖాన్ పేరున్న రెజ్లరే. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు నెగ్గిన జపాన్ దిగ్గజం కవోరి ఇచో (జపాన్)పై ఇటీవల జరిగిన ఓ టోర్నీలో ఒర్ఖాన్ 10-0తో గెలిచి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా రెండు అంతర్జాతీయ టోర్నీల్లో స్వర్ణాలు సాధించింది. ఇచో లాంటి మేటి రెజ్లర్‌ను ఓడించిన ఒర్ఖాన్పై సాక్షి గెలవడం నిజంగా ఆమె పోరాటపటిమకు నిదర్శనం. ఇక కాంస్య పతకపోరు ప్రత్యర్థి తినిబెకోవా ప్రస్తుత ఆసియా చాంపియన్ కావడం గమనార్హం. ప్రత్యర్థి ఎంత పేరున్న వారైనా చివరి సెకను వరకు వారిపై విజయం కోసం ప్రయత్నించి సాక్షి అనుకున్న ఫలితం సాధించింది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుందని సాక్షి నిరూపించింది. -
మెరిసిన సింధూరం
ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించిన పీవీ విజయవాడవాసి కూతురి బిడ్డే విజయవాడ స్పోర్ట్స్: రియో ఒలింపిక్స్‌లో తెలుగుతేజం ‘సింధూ’రం మెరిసింది. గత లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ సెమీస్‌లో చైనా అమ్మాయి యిహాన్‌వాంగ్ చేతిలో ఓడిపోగా, ఇప్పుడు రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ఫైనల్లో అదే యిహాన్‌వాంగ్‌పై సింధూ విజయం సాధించి సెమీస్‌కు చేరింది. ఆ తరువాత జరిగిన ప్లే ఆఫ్‌లో సైనా చైనా అమ్మాయి జిన్‌వాంగ్ (రిటైర్డ్ హర్ట్)పై గెలిచి కాంస్య పతకం సాధించింది. ఈసారి సింధు 21–19, 21–10 తేడాతో జపాన్‌కు చెందిన ఒకుహారాపై విజయం సాధించి మిసై్సల్లా ఫైన ల్కు దూసుకెళ్లింది. సింధు ఆటతీరుకు నవ్యాంధ్ర క్రీడాభిమానులే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా పులకించిపోయారు. రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం ఎదురు చూసి మొహం వాచిపోయిన భారత్ క్రీడాభిమానులకు తెలుగుతేజం పీవీ సింధు స్వర్ణపతక పోరు కోసం తిరుగులేని స్థానానికి చేరుకుంది. ఫైనల్లో ఒక వేళ. స్వర్ణపతకం చేజారినా... రజత పతకమైనా ఖాయంగా దేశానికి అందించనుంది. భారతీయులు గర్వపడేలా మువ్వన్నెల జెండాను ప్రపంచ క్రీడాపటంలో రెపరెపలాడించి చెరగని ముద్ర వేసింది. ముందే చెప్పిన ‘సాక్షి’ ప్రత్యర్థి చైనా అయితే చాలు ఆమె రాకెట్ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచరై అగ్ని వర్షం కురిపించినట్టుగా శివాలెత్తిపోతుందని గతేడాది జనవరి నెలాఖరులో విజయవాడలో జరిగిన 79వ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఆడేందుకు విచ్చేసిన సింధు ఆట తీరు గురించి ఆనాడే ‘సాక్షి’ చెప్పింది. రియో ఒలింపిక్స్‌లో అదే జరిగింది. ఈ సింధూరం ఎవరో కాదు... అచ్చమైన పదహారణాల తెలుగింటి ముద్దు బిడ్డ పీవీ సింధు పిన్నవయసులోనే భారతదేశ బ్యాడ్మింటన్ స్టార్‌గా దూసుకొచ్చింది. ఈ సింధూరం ఎవరో కాదు...బెజవాడకు ముద్దుల మనువరాలే. ‘కలవారి సంసారం, బందిపోటు వంటి ఆనాటి హిట్ చిత్రాల నిర్మాత జైహింద్ టాకీస్ యజమాని దోనేపూడి బ్రహ్మయ్య కూతురి బిడ్డ. సింధు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఇద్దరూ అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు. పైగా ఇద్దరూ అర్జున అవార్డీలే. సింధు కూడా అర్జున అవార్డీనే. సింధు పూర్తిగా బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఎనిమిదేళ్ల వయసులో గోపీచంద్ అకాడమీలో చేరింది. రోజూ హైదరాబాద్ గచ్చిబౌలీలోని అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుంది. 2012లో సీనియర్ నేషనల్స్‌లో చాంపియన్ అయ్యింది. జూనియర్ ఏషియన్ చాంపియన్‌షిప్ ఆడింది. 2013 హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. 2014లో మరోసారి కాంస్య పతకం దక్కించుకుంది. 19 ఏళ్లకే అర్జున (2014లో), పద్మశ్రీ (2015లో) అందుకుంది. -
భారత్‌కు నాలుగో స్థానం
న్యూఢిల్లీ: జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. జర్మనీలో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు మూడు పసిడి, నాలుగు రజతం, మూడు కాంస్యాలతో మొత్తం 10 పతకాలు సాధించారు. -
కాంస్యంతో సరి
మెడెలిన్ (కొలంబియా): ప్రపంచ ఆర్చరీ కప్ స్టేజి 4లో భారత్ ఓ కాంస్యంతో సరిపుచ్చుకుంది. టాప్ ఆర్చర్లు దూరంగా ఉన్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన కాంస్య పతక ప్లేఆఫ్‌లో సర్వేష్ పరేక్, సందీప్ కుమార్, ఇసయ్యా రాజేందర్ సనమ్లతో కూడిన కాంపౌండ్ టీమ్ విజేతగా నిలిచింది. తమకన్నా పటిష్టమైన వెనిజులా జట్టును 231-222 తేడాతో వీరు మట్టికరిపించారు. కాంపౌండ్ మిక్స్‌డ్‌లోనూ కాంస్య పతకం కోసం పోరాడిన పరీక్, త్రిష దేవ్ 150-156 తేడాతో అమెరికా జోడి చేతిలో ఓడారు. -
శ్రీనివాసరావుకు స్వర్ణం
ఉష, వెంకట లక్ష్మిలకు కాంస్యాలు * జాతీయ క్రీడలు త్రిసూర్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ తొలి రోజే స్వర్ణ పతకంతో మెరిసింది. ఆదివారం సోమవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఏపీ ఆటగాళ్లు మూడు పతకాలు సాధించారు. పురుషుల 56 కేజీల విభాగంలో వల్లూరి శ్రీనివాస రావు (243 కేజీలు) స్వర్ణం సాధించగా... మహిళల 48 కేజీల విభాగంలో బంగారు ఉష (161 కేజీలు), 53 కేజీల విభాగంలో వెంకట లక్ష్మి (168 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. ఈ ముగ్గురూ విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్‌లిఫ్టర్లు కావడం విశేషం. 2011 జార్ఖండ్ జాతీయ క్రీడల్లో ఇదే విభాగంలో పోటీ పడి స్వర్ణం దక్కించుకున్న 34 ఏళ్ల శ్రీనివాస రావు ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. మహిళల 53 కేజీల విభాగంలో పోటీపడాల్సిన ఆంధ్రప్రదేశ్ స్టార్ వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషి బరిలోకి దిగలేదు. తొలిరోజు జరిగిన పోటీల్లో హరియాణా ఆరు స్వర్ణాలు, ఓ రజతంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజకు కాంస్యం
జాతీయ జూనియర్ టీటీ టోర్నీ అలెప్పీ (కేరళ): జాతీయ జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ కాంస్య పతకం సాధించింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 11-3, 11-5, 11-2, 11-6 స్కోరుతో మానసి (మహారాష్ట్ర)పై గెలిచింది. యూత్ టీమ్ విభాగంలో శ్రీజ రాణించడంతో తెలంగాణ బాలికల జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. -
అనూప్ కుమార్‌కు కాంస్యం
ప్రపంచ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ స్కేటర్ అనూప్ కుమార్ యామ వరుసగా మూడోసారి ప్రపంచ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించాడు. స్పెయిన్‌లోని రియోస్ పట్టణంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అనూప్ ఇన్లైన్ స్కేటింగ్ అంశంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో 2012లో కాంస్యం నెగ్గిన అనూప్ గత ఏడాది స్వర్ణాన్ని సాధించడం విశేషం. ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో అనూప్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు గెలిచాడు. అనూప్ కుమార్‌కు, కాంస్యం, ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్, Anup Kumar, bronze, artistic roller skating -
జిబెట్ నవ్వింది
మహిళల స్టీపుల్‌చేజ్ స్వర్ణం బహ్రెయిన్ క్రీడాకారిణిదే లలితకు కాంస్యం, సుధా సింగ్‌కు నిరాశ ఇంచియూన్: ఆసియా క్రీడల్లో శనివారం జరిగిన స్టీపుల్ చేజ్లో తొలి స్థానంలో నిలిచిన రూత్ జిబెట్ (బహ్రెయిన్)పై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ అంశంలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన భారత క్రీడాకారిణులు లలిత, సుధాసింగ్లకు... జిబెట్పై వేటు కారణంగా ఓ స్థానం మెరుగై రజత, కాంస్యాలు లభించింది. అయితే ఈ ఫలితంపై బహ్రెయిన్ అధికారులు తిరిగి విచారించాలని ఆసియా క్రీడల నిర్వాహకులకు అప్పీలు చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల జ్యూరీ విచారణ జరిపి... జిబెట్ తప్పు చేయలేదని ఆమెకే స్వర్ణం అని ప్రకటించారు. దీంతో ఆదివారం తిరిగి ఈ విభాగంలో పతకాలు ఇచ్చారు. ముసిముసి నవ్వులతో ఈ బహ్రెయిన్ క్రీడాకారిణి సగర్వంగా స్వర్ణం అందుకుంది. భారత క్రీడాకారిణి లలిత తిరిగి కాంస్య పతకానికి పడిపోగా... సుధాసింగ్‌కు నాలుగో స్థానంతో నిరాశ మిగిలింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై భారత బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య దృష్టికి తీసుకెళతామని భారత చెఫ్ డి మిషన్ సమారివాల చెప్పారు. -
ఆసియా క్రీడల్లో భారత్‌కు మూడు కాంస్యాలు
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ ఆరో రోజు మూడు పతకాలను సాధించింది. రోయింగ్ విభాగంలో రెండు, షూటింగ్ విభాగంలో మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆసియా క్రీడల్లో షూటింగ్ లో భారత్ కు కాంస్యం లభించింది. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్ లో భారత్ కు ఈ పతకం దక్కింది. షూటింగ్లో భాతర్ కు ఇది ఏడో పతకం కావటం విశేషం. రోయింగ్ పురుషుల సింగిల్స్‌లో సవర్ణ సింగ్‌కు కాస్యం, రోయింగ్ మెన్స్ 8వ విభాగంలో మరో కాంస్యంతో పాటు మహిళల డబుల్ ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత్ కాంస్యాన్ని సాధించింది. -
ఆసియా గేమ్స్: దుష్యంత్‌కు కాంస్యం
ఇంచియోన్: ఆసియా గేమ్స్‌లో ఐదో రోజు బుధవారం భారత షూటర్లు నిరాశపరిచారు. పతకాల వేటలో విఫలమయ్యారు. కాగా రోయర్ దుష్యంత్ చౌహాన్ మాత్రం కాంస్య పతకం సాధించాడు. పురుషులల లైట్ వెయిట్ సింగిల్స్ కల్స్ ఈవెంట్లో దుష్యంత్ మూడో స్థానంలో నిలిచి పతకం గెలుచుకున్నాడు. భారత్ ఓవరాల్‌గా 14వ స్థానంలో నిలిచింది. -
కాంస్యంతో సరిపెట్టుకున్న సనతోయి దేవి
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో వుషు క్రీడాంశంలో సనోతోయిదేవి కాంస్యంతో సరిపెట్టకుంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో ఈ మణిపూర్ క్రీడాకారిణి జాంగ్ లుయాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. సోమవారం మహిళల సాండా 52 కేజీల క్వార్టర్ ఫైనల్లో సనతోయి దేవి అద్భుత ప్రదర్శన చేసి సెమీ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. మంగోలియాకు చెందిన అమ్‌గలన్ జర్గల్‌ను 2-0తో విన్ బై రౌండ్ పద్దతిన నెగ్గి సెమీస్‌కు చేరినా.. ఇక్కడ సనతోయిదేవికి నిరాశే ఎదురైంది. కాగా, ఏషియన్ గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 100మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్లో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్పుట్ జట్టు పతకాన్ని సాధించింది. ఇదిలా ఉండగా స్వ్కాష్ లో ఘోషల్ రజతంతో సరిపెట్టుకున్నాడు. -
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో కాంస్యం
ఇంచియాన్ : ఏషియన్ గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 100మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్లో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్పుట్ జట్టు పతకాన్ని సాధించింది. కాగా అభినవ్ బింద్రా ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలతో అయోమయం నెలకొల్పాడు. ప్రొఫెషనల్ షూటర్‌గా ఇదే తన చివరి రోజు అని ఈ మాజీ ఒలింపిక్ చాంపియన్ ట్వీట్ చేయడం కలకలం రేపింది. -
అదిరిన గురి
25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత మహిళలకు కాంస్యం ఇంచియాన్: మిగతా విభాగాల్లో ఎలా ఉన్నా... ఏషియాడ్‌లో భారత షూటర్ల గురి మాత్రం అదురుతోంది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్‌లో రాహీ సార్నోబాత్, అనిసా సయ్యద్, హీనా సిద్ధూల బృందం ఓవరాల్‌గా 1729 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ర్యాపిడ్‌లో సూపర్ షాట్స్‌తో అలరించిన అనిసా 294/300 పాయింట్లు సాధించింది. ప్రిసిషన్ రౌండ్లో 283 పాయింట్లు రావడంతో ఓవరాల్‌గా 577 పాయింట్లు సాధించింది. సార్నోబాత్ ర్యాపిడ్ 298, ప్రిసిషన్‌లో 291 పాయింట్లతో 580 పాయింట్లు గెలిచింది. హీనా ర్యాపిడ్‌లో 281, ప్రిసిషన్‌లో 291 పాయింట్లతో 572 పాయింట్లు సాధించింది. ఈ విభాగంలో కొరియా (1748 పాయింట్లు), చైనా (1747 పాయింట్లు) స్వర్ణం, రజతం గెలుచుకున్నాయి. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రాహీ సార్నోబాత్ సెమీస్‌లో 15 పాయింట్లు సాధించి ఏడో స్థానంతో ఫైనల్స్‌కు దూరమైంది. అనిసా, హీనాలు నిరాశపర్చారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అయోనికా పాల్ (417.7), అపూర్వి చండిలా (413.8), రాజ్ చౌదురీ (407.6)లు ఓవరాల్‌గా 1239.1 పాయింట్లు సాధించి ఆరోస్థానంతో సంతృప్తిపడ్డారు. చైనా (1253.8 పాయింట్లు), ఇరాన్ (1245.9 పాయింట్లు) స్వర్ణం, రజతాలను దక్కించుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో అపూర్వి, రాజ్ చౌదురీ నిరాశపర్చినా అయోనిక ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ తుది పోరులో ఆమె 101.9 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. -
ఆసియా గేమ్స్ షూటింగ్లో భారత్‌కు కాంస్యం
ఇంచియోన్: ఆసియా గేమ్స్‌లో భారత మహిళా షూటర్లు మెరిశారు. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్ కాంస్యం సాధించింది. భారత షూటర్లు రాహి సర్నోబత్ (580), అనీసా సయ్యద్ (577), హీనా సిద్ధు (572) మొత్తం 1729 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా స్వర్ణం, చైనా రజత పతకాలు సొంతం చేసుకున్నాయి. -
ఆసియా క్రీడల్లో భారత్ ఆటగాళ్లు
-
షూటింగ్లో భారత్‌కు మరో కాంస్యం
ఇంచియాన్ : ఏషియన్ కీడ్రల్లో మూడోరోజు భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది. 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో భారత్ కాంస్య పతకం సాధించింది. పసిడి పతకాన్ని సౌత్ కొరియా, చైనా సిల్వర్ పతకాన్ని సొంతం చేసుకున్నాయి. షూటింగ్ విభాగంలో ఇప్పటికే భారత్ నాలుగు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడల్లో భారత షూటర్ జీతూ రాయ్ తొలిస్వర్ణం సాధించగా, శ్వేతా చౌదరి కాంస్య పతకం గెలుచుకొంది. మరోవైపు సైక్లింగ్ లో భారత్ క్రీడాకారులు నిరాశపరిచారు. -
జీతూ రాయ్ కు రూ.50 లక్షల నజరానా
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో తొలిస్వర్ణం సాధించిన భారత షూటర్, ఉత్తరప్రదేశ్ క్రీడాకారుడు జీతూ రాయ్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షలు నజరానా ప్రకటించింది. ఇచియాన్ లో ఆరంభమైన ఆసియా క్రీడల్లో జీతూ స్వర్ణం సాదించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నజరానాను ప్రకటించారు. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఏషియన్ గేమ్స్‌లో ప్రపంచ ఐదో నంబర్ క్రీడాకారుడు జీతూ రాయ్ భారత్ కు తొలి స్వర్ణం అందించాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. చైనా రజిత, కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. కాగా మహిళల విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది.బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్ మహిళల విభాగంలో భారత్, మకావు బరిలో దిగనున్నాయి.. సైనా నెహ్వాల్, సింధూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనున్నారు. ఇక బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్ పురుషుల విభాగంలో భారత్, కొరియా పోటీ పడతాయి. -
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఏషియన్ గేమ్స్‌లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. చైనా రజిత, కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. కాగా మహిళల విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది. బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్ మహిళల విభాగంలో భారత్, మకావు బరిలో దిగనున్నాయి.. సైనా నెహ్వాల్, సింధూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనున్నారు. ఇక బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్ పురుషుల విభాగంలో భారత్, కొరియా పోటీ పడతాయి. -
బోణీ కొట్టిన భారత్, శ్వేతా చౌదరికి కాంస్యం
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో వైభవంగా ప్రారంభమైన ఏషియాడ్ గేమ్స్‌లో భారత క్రీడాకారిణి శ్వేతా చౌదరి తొలి పతాకాన్ని అందించింది. పది మీటర్ల ఎయిర్‌పిస్టల్ మహిళల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఒలింపిక్స్ అనంతరం రెండో అతి పెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు తెచ్చుకున్న ఈ గేమ్స్‌లో శనివారం నుంచి ఆసియా ఖండానికి చెందిన 45 దేశాల నుంచి 13 వేల మంది అథ్లెట్లు తమ ప్రావీణ్యాన్ని చూపనున్నారు. 2010లో భారత్ 35 క్రీడాంశాల్లో పోటీపడగా.. ఈసారి ఆసంఖ్య 28కి పడిపోయింది. ఇక ఇంచియాన్‌లో పలు క్రీడాంశాల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యమే లేదు. మొత్తం 516 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల్లో బరిలో ఉన్నారు. అలాగే 2018లో జరగబోయే ఆసియా గేమ్స్‌కు ఇండోనేసియాలోని జకర్తా ఆతిథ్యమివ్వనుంది. -
ప్రదీప్‌కు కాంస్యం
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ గ్రనాడా (స్పెయిన్): ఒకవైపు సీనియర్లు వరుసగా విఫలమవుతోంటే... మరోవైపు జూనియర్ షూటర్ ప్రదీప్ సత్తాచాటాడు. ఫలితంగా ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. ఈ పోటీల్లో ఇంతకుముందు సీనియర్ విభాగంలో జీతూ రాయ్ (50 మీటర్ల పిస్టల్) రజతం సాధించగా... తాజాగా జూనియర్ షూటర్ ప్రదీప్ కాంస్య పతకం అందించాడు. బుధవారం జరిగిన 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ జూనియర్ విభాగంలో ప్రదీప్ మూడో స్థానంలో నిలిచాడు. ఫైనల్లో ప్రదీప్, డారియో డి మార్టినో (ఇటలీ) 561 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచారు. అయితే ‘షూట్ ఆఫ్’లో ప్రదీప్ 45 పాయింట్లు స్కోరు చేయడంతో అతనికి కాంస్యం... 46 పాయింట్లు సాధించిన మార్టినోకు రజతం దక్కాయి. అలెగ్జాండర్ చిచ్కోవ్ (అమెరికా) 563 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించాడు. -
వరల్డ్ బ్యాడ్మింటన్ : సింధూకు కాంస్య పతకం
-
కాంస్య ‘సింధూ’రం
►సెమీస్‌లో ఓడిన హైదరాబాద్ అమ్మాయి ►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో కాంస్యం ► ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు కోపెన్‌హాగెన్: గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన కాంస్యం గాలివాటం కాదని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నిరూపించింది. వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి కాంస్యం సాధించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 17-21, 15-21తో ప్రపంచ 10వ ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయినా... కాంస్య పతకం దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో అద్వితీయ విజయాలు సాధించిన సింధు సెమీఫైనల్లో మాత్రం అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు కనీసం 15 పాయింట్లను నెట్ వద్ద సమర్పించుకుంది. ఆమె కొట్టిన చాలా షాట్లు నెట్‌కు తగిలాయి. కొన్నిసార్లు కరోలినా చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో పాయింట్లు రాబట్టింది. తొలి గేమ్‌లో ఒకదశలో 2-6తో వెనుకబడిన సింధు వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 8-6తో ముందంజ వేసింది. కానీ కీలకదశలో తప్పిదాలు చేసి తేరుకోలేకపోయింది. 10-15తో వెనుకబడిన సింధు స్కోరును సమం చేసేందుకు యత్నించినా సఫలం కాలేకపోయింది. తుదకు 21 నిమిషాల్లో తొలి గేమ్‌ను కోల్పోయింది. గత రెండు మ్యాచ్‌ల్లో తొలి గేమ్‌ను కోల్పోయి పుంజుకున్న సింధు ఈసారి మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ఒకదశలో సింధు 11-9తో రెండు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత తడబాటుకు లోనైంది. సింధు ఒత్తిడిలో ఉందనే విషయాన్ని గ్రహించిన కరోలినా సమయస్ఫూర్తితో ఆడుతూ వరుసగా నాలుగు పాయింట్లు సంపాదించి 16-12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు సంచలనం నమోదు చేసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 19-21, 21-19, 21-15తో అద్భుత విజయం సాధించింది. కెరీర్లో షిజియాన్‌పై సింధుకిది నాలుగో విజయం కావడం విశేషం. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ సింధు క్వార్టర్ ఫైనల్లో షిజియాన్‌ను ఓడించింది. సైనాకు ఐదోసారి నిరాశ మరో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సైనా 15-21, 15-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. సైనా తాను ఆడిన ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ క్వార్టర్ ఫైనల్ దశలోనే నిష్ర్కమించడం గమనార్హం. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు లభించిన నాలుగు పతకాలూ కాంస్యాలే కావడం గమనార్హం. 1983లో కోపెన్హాగెన్లోనే జరిగిన పోటీల్లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు తొలి కాంస్యాన్ని అందించాడు. 2011లో లండన్‌లో జరిగిన పోటీల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప మహిళల డబుల్స్ విభాగంలో భారత్ ఖాతాలో రెండో కాంస్యాన్ని జతచేశారు. 2013లో చైనాలోని గ్వాంగ్జూలో జరిగిన పోటీల్లో... ఈ ఏడాది కోపెన్‌హాగెన్‌లో జరిగిన పోటీల్లో పి.వి.సింధు మహిళల సింగిల్స్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు అందించింది. -
74 ఏళ్ల కుర్రాడు
74 ఏళ్ల వయసులో చాలామందికి నడవడమే కష్టం. ఓ మూలన కూర్చొని కృష్ణా... రామా అంటూ శేష జీవితం గడిపేస్తుంటారు. సొంతంగా తన పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే నడవడానికే కష్టమైన ఈ వయసులో... బెజవాడకు చెందిన ఓ వృద్ధుడు అంతర్జాతీయ యవనికపై అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బద్ధకంగా కదిలే టీనేజ్ కుర్రాళ్లకు కనువిప్పు కలిగేలా అథ్లెటిక్స్‌లో అచ్చెరువొందే విజయాలు సాధిస్తున్నాడు. మైదానంలో ఆయన్ని చూస్తే... పరుగెత్తుతున్న కుర్రాడు కూడా ఓ క్షణం ఆగిపోతాడు. అథ్లెట్లయితే ఆ పరుగు పూర్తయ్యే వరకు ఆయన్నే అనుసరిస్తారు. జాగింగ్ చేస్తున్న వారు కూడా ఆ క్షణం పరుగెత్తేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే 74 ఏళ్ల ఎస్. పద్మనాభన్ ప్రాక్టీస్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. లేటు వయసు (54 ఏళ్లలో)లో అంతర్జాతీయ యవనికపైకి దూసుకొచ్చినా ఘాటుగా తన సత్తాను చూపిస్తున్నారు. వెటరన్ (70+) విభాగంలో ఆసియా స్థాయిలో ఇప్పటికే 17 పతకాలు సొంతం చేసుకున్నారు. ఇందులో 3 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. 8వ ఆసియా చాంపియన్‌షిప్‌తో ప్రారంభమైన ఈయన జైత్రయాత్ర ఇంకా కొనసాగుతోంది. మధ్యలో ఒకటి, రెండు (15, 16వ చాంపియన్‌షిప్) మిస్ అయినా ఎక్కువ ఈవెంట్లలో తన లక్ష్యాన్ని సాధించారు. 200 మీటర్లు (30 సెకన్లు), 300 మీటర్ల హర్డిల్స్ (50 సెకన్లు), 80 మీటర్ల హర్డిల్స్ (16.1 సెకన్లు)లలో బరిలోకి దిగే ఆయన 4ఁ100, 4ఁ400 రిలేలో పాల్గొనే భారత్ జట్టుకు ఫినిషింగ్ టచ్‌నూ ఇస్తారు. ఇంతకీ ఎవరితను? విజయవాడకు చెందిన పద్మనాభన్... ఏపీఎస్ఆర్టీసీలో డివిజనల్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. పిల్లలంతా వాళ్ల... వాళ్ల కెరీర్లో స్థిరపడిన తర్వాత ‘ఆట’ మొదలుపెట్టారు.. చిన్నప్పుడు క్రికెట్, ఫుట్‌బాల్ ఆటల్లో ప్రావీణ్యం ఉండటం, శరీరం కూడా అనువుగా ఉండటంతో 1990లో అథ్లెటిక్స్‌పై దృష్టిపెట్టారు. అలా మెల్లగా మొదలైన కసరత్తులు ఈవెంట్లలో పతకాలు సాధించే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే మూడు అంశాలు ‘అంకితభావం, ఆహారం, క్రమశిక్షణ’ గురించి చెబుతారు. జపాన్ను కొట్టాలి! చైనా, కొరియాలపై సులువుగా గెలిచినా... జపాన్ను మాత్రం ఓడించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసే పద్మనాభన్ ఆ లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించనంటారు. జూలైలో జపాన్‌లో జరగబోయే 18వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. ఈ టోర్నీకి అర్హత సాధించాలంటే ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు కోయంబత్తూరులో జరిగే జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో సత్తా చాటాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ‘ఫీల్డ్‌లోకి ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్యా... ఏం చేశామన్నదే ముఖ్యం’ ఓ సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను పద్మనాభన్ తన నిజ జీవితంలో చేసి చూపిస్తున్నారు. ఏదేమైనా మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ అథ్లెట్ తాతయ్యకు ‘హ్యాట్సాఫ్’ చెప్పాల్సిందే. - ఆలూరి రాజ్‌కుమార్, (సాక్షి స్పోర్ట్స్, విజయవాడ) హైదరాబాద్‌లో ఏపీఎస్ఆర్టీసీలో అసిస్టెంట్ ఇంజ నీర్‌గా పనిచేస్తున్న సమయంలో 1988లో లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన జాతీయ వెటరన్ అథ్లెటిక్ మీట్ చూశాను. అప్పటి నుంచి అథ్లెటిక్స్ మీద ఆసక్తి పెరిగింది. 1990లో తొలిసారి మలేసియాలో మీట్‌కు వెళ్లాను. అందులో నాలుగో స్థానం వచ్చింది. 1992 నుంచి పాల్గొన్న ప్రతి మీట్లో ఏదో ఒక పతకం సాధించా. ఆర్టీసీలో వర్క్స్ మేనేజర్‌గా పనిచేసిన రాజగోపాల్ గారు నా గురువు. వర్షం వచ్చినా, వాతావరణం ఎలా ఉన్నా ప్రాక్టీస్ ఆపకూడదు. మనం పాల్గొనే పోటీల్లో ఉత్తమ టైమింగ్ ఎంత? మన టైమింగ్ ఎంత? ఈ రెండు అంశాలను బేరీజు వేసుకుని ప్రాక్టీస్ చేయాలి. నాలాంటి చిన్న పెన్షనర్లకు విదేశాలకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్న పనే. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా.. మక్కువను చంపుకోలేం కదా. - పద్మనాభన్ సాధించిన ఘనతలు 1994 జకర్తాలో జరిగిన 8వ ఆసియా వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, రజతం 1996 సియోల్‌లో జరిగిన 9వ ఆసియా వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం, కాంస్యం. 1998 ఒకినోవాలో జరిగిన 10వ ఆసియా వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఓ స్వర్ణం, కాంస్యం. 2000 బెంగళూరులో జరిగిన 11వ ఆసియా వెటరన్ చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు. 2002 చైనాలో జరిగిన 12వ ఆసియా వెటరన్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం. 2004 బ్యాంకాక్‌లో జరిగిన 13వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో రెండు రజతాలు, ఒక కాంస్యం. 2006 బెంగళూరులో జరిగిన 14వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ఒక రజతం. 2012 చైనాలో జరిగిన 17వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు. నాలుగు బిస్కెట్లు... తన ఫిట్‌నెస్‌కు మితాహారమే కారణమనే పద్మనాభన్... తన దినచర్యలో కూడా కచ్చితమైన నియమాలను పాటిస్తారు. ఉదయం కాఫీతో పాటు నాలుగు మ్యారీ గోల్డ్ బిస్కెట్లు తీసుకుంటారు. మధ్యాహ్నం కప్ రైస్, పప్పు, సాంబార్, కూరగాయలు, ఒక ఫ్రూట్‌ను లంచ్‌గా తీసుకుంటాడు. డిన్నర్లో కూడా వీటినే కొనసాగిస్తారు. అయితే ఎక్కడున్నా... వాతావరణం ఎలా ఉన్నా... రోజుకు గంటన్నర ప్రాక్టీస్ తప్పనిసరి. -
చిత్రకు కాంస్యం
డాగాపిల్స్ (లాత్వియా): ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి చిత్ర మగిమైరాజన్ కాంస్య పతకాన్ని సాధించింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో చిత్ర 1-4 (75-29, 60-66, 23-65, 0-74, 33-66) ఫ్రేమ్‌ల తేడాతో వెండీ జాన్స్ (బెల్జియం) చేతిలో ఓడిపోయింది. ఈ పోటీలో సెమీఫైనల్లో ఓడిపోయిన వారికి కాంస్య పతకాలు ఇస్తారు. వెండీ జాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్ర తొలి ఫ్రేమ్‌ను గెల్చుకున్నా ఆ తర్వాత అదేస్థాయి ఆటతీరును కనబర్చలేకపోయింది. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్‌కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది.