గౌరవ్ బిధురికి కాంస్యం
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశించిన గౌరవ్ బిధురికాంస్య పతకంతో చరిత్ర సృష్టించాడు. గురువారం హాంబర్గ్‌లో జరిగిన సెమీ ఫైనల్లో (56 కేజీల విభాగం) గౌరవ్, డ్యూక్ రగన్ (అమెరికా) చేతిలో పరాజయం చెందాడు. దీంతో భారత్ నుంచి ఈ టోర్నీలో పతకం సాధించిన విజేందర్ (2009), వికాస్ క్రిషన్ (2011), శివ థాపా (2015) సరసన 24 ఏళ్ల గౌరవ్ కూడా చేరాడు. తాజాగా భారత్ ఈ ఒక్క పతకంతోనే చాంపియన్‌షిప్‌ను ముగించింది.