స్పెయిన్‌లోని ఉత్తర ప్రాంతాల్లో జరిపిన తవ్వాకాల్లో శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్ల నాటి కాంస్య చెయ్యిని గుర్తించారు. దానిపై మిస్టిరియస్ లిపి ఉంది. ఆ లిపి ఏంటన్నది శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఆ కాంస్య చెయ్యిపై కొన్ని చిహ్నాలతో ఈ లిపి ఉన్నట్లు తెలిపారు. అది ఇనుపయుగం నాటి చారిత్రక స్థానిక తెగ గురించి అనుమానాలు తలెత్తాయి. నాడు వారు ఉపయోగించిన వాడుక భాష, తదితరాల గురించి అనుమానాలు లెవనెత్తాయి. ఆ లిపి అర్థమయ్యితే వాస్కోన్ తెగ రహస్యాలను కొంత వరకు తెలుసుకోగలుగుతామని అన్నారు.
ఆ చేతిపై ఉన్న శాసనం పురాతన పాలియోహిస్పానిష్ భాషలతో ఆనుసంధానించి చూడాల్సి ఉందన్నారు. వాస్కోన్ తెగల గురించి కథకథలుగా వినడమే గానీ ఆధారాలు లేవు. ఇప్పుడి ఈ కాంస్య చెయ్యి వారు ఉండేవారనేందుకు ఆధారంగా ఉంటుంది. ఈ కాంస్య చేయి వారి అధునాత సాంస్కృతిక పద్ధతులకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది ఒకరకంగా వాస్కోన్ భాష, సంస్కృతులు గురించి తెలుసుకునేందుకు పురికొల్పొతోందన్నారు. అంతేగాదు ఈ పరిశోధన స్పెయిన్ గొప్ప చరిత్ర, గత వైభవం గురించి లోతుగా తెలుసుకునేందుకు మార్గం సుగమం చేస్తుందన్నారు శాస్త్రవేత్తలు.
స్పెయిన్ దేశీయ భవనం వద్ద ఈ కాంస్య చెయ్యిని గుర్తించినట్లు తెలిపారు. ఈ కళాఖండంపై చెక్కబడిన వచనం అపోట్రోపిక్‌గా వ్యాఖ్యానించారు. ఇది అదృష్టాన్ని ప్రార్థించే టోకెన్ అని ఈ పురాతన తవ్వకాలకు సంబంధించిన ప్రాజెక్టులో పనిచేస్తున్న పరిశోధకులు అన్నారు. ఈ కాంస్య చేతికి ఆచార లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందని భావిస్తున్నారు. పురాతన కాలంలో, ఐబీరియన్లు తమ ఖైదీల కుడి చేతులను చేధించేవారిని తెలిసింది. అయితే కాంస్య చేయి కూడా కుడి చేతిగా ఉన్నప్పటికీ, ఈ కళాఖండంపై ఉన్న చిహ్నాలు ఏదో ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.
(చదవండి: అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment