Ancient language
-
తవ్వకాల్లో రెండు వేల ఏళ్ల నాటి కాంస్య చెయ్యి..దానిపై మిస్టీరియస్..!
స్పెయిన్‌లోని ఉత్తర ప్రాంతాల్లో జరిపిన తవ్వాకాల్లో శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్ల నాటి కాంస్య చెయ్యిని గుర్తించారు. దానిపై మిస్టిరియస్ లిపి ఉంది. ఆ లిపి ఏంటన్నది శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఆ కాంస్య చెయ్యిపై కొన్ని చిహ్నాలతో ఈ లిపి ఉన్నట్లు తెలిపారు. అది ఇనుపయుగం నాటి చారిత్రక స్థానిక తెగ గురించి అనుమానాలు తలెత్తాయి. నాడు వారు ఉపయోగించిన వాడుక భాష, తదితరాల గురించి అనుమానాలు లెవనెత్తాయి. ఆ లిపి అర్థమయ్యితే వాస్కోన్ తెగ రహస్యాలను కొంత వరకు తెలుసుకోగలుగుతామని అన్నారు. ఆ చేతిపై ఉన్న శాసనం పురాతన పాలియోహిస్పానిష్ భాషలతో ఆనుసంధానించి చూడాల్సి ఉందన్నారు. వాస్కోన్ తెగల గురించి కథకథలుగా వినడమే గానీ ఆధారాలు లేవు. ఇప్పుడి ఈ కాంస్య చెయ్యి వారు ఉండేవారనేందుకు ఆధారంగా ఉంటుంది. ఈ కాంస్య చేయి వారి అధునాత సాంస్కృతిక పద్ధతులకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది ఒకరకంగా వాస్కోన్ భాష, సంస్కృతులు గురించి తెలుసుకునేందుకు పురికొల్పొతోందన్నారు. అంతేగాదు ఈ పరిశోధన స్పెయిన్ గొప్ప చరిత్ర, గత వైభవం గురించి లోతుగా తెలుసుకునేందుకు మార్గం సుగమం చేస్తుందన్నారు శాస్త్రవేత్తలు. స్పెయిన్ దేశీయ భవనం వద్ద ఈ కాంస్య చెయ్యిని గుర్తించినట్లు తెలిపారు. ఈ కళాఖండంపై చెక్కబడిన వచనం అపోట్రోపిక్గా వ్యాఖ్యానించారు. ఇది అదృష్టాన్ని ప్రార్థించే టోకెన్ అని ఈ పురాతన తవ్వకాలకు సంబంధించిన ప్రాజెక్టులో పనిచేస్తున్న పరిశోధకులు అన్నారు. ఈ కాంస్య చేతికి ఆచార లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందని భావిస్తున్నారు. పురాతన కాలంలో, ఐబీరియన్లు తమ ఖైదీల కుడి చేతులను చేధించేవారిని తెలిసింది. అయితే కాంస్య చేయి కూడా కుడి చేతిగా ఉన్నప్పటికీ, ఈ కళాఖండంపై ఉన్న చిహ్నాలు ఏదో ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
తెలుగును పరిరక్షించుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
తెలుగు.. 4,500 ఏళ్ల వెలుగు!
సాక్షి, హైదరాబాద్: వేయి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 4,500 ఏళ్లు! ఒక భాషగా తెలుగు ఉనికిలో ఉన్న కాలమిది! ఒక్క తెలుగేమిటి.. కన్నడ, తమిళ, మలయాళ భాషలతో కూడిన ద్రావిడ భాషా కుటుంబం మొత్తం ఇంత పురాతనమైందని అంటోంది జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ప్రాచీన భాషగా గుర్తింపు కోసం తెలుగు, కన్నడ భాషలు సుప్రీంకోర్టులో పోరాడుతున్న తరుణంలో ఈ అధ్యయనానికి ప్రాముఖ్యత ఏర్పడింది. దక్షిణాదిన ఉన్న 4 ప్రధాన భాషలతోపాటు ఎక్కడో బలూచిస్తాన్‌లో మాట్లాడే బ్రాహుయీ వంటివన్నీ ద్రావిడ భాషా కుటుంబానికే చెందుతాయి. అఫ్గానిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకూ ఉండే దక్షిణాసియాలో ఈ భాషా కుటుంబంలో మొత్తం 80 భాషలు, యాసలున్నాయని అంచనా. దాదాపు 22 కోట్ల మంది మాట్లాడే ఈ వేర్వేరు భాషలు, యాసలు ఎంత పురాతనమైనవో తెలుసుకునేందుకు ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. ఆయా భాషలు మాట్లాడేవారి నుంచి పదాలు, వాటి అర్థాల వంటి వివరాలు సేకరించి విశ్లేషించారు. అందులో తేలిందేమిటంటే.. ఇవన్నీ 4,000 నుంచి 4,500 ఏళ్ల పురాతనమైనవీ అని! అయితే తమిళం, సంస్కృత భాషలు వీటికంటే పురాతనమైనవి కావొచ్చని, సంస్కృత భాష వినియోగం కాలక్రమంలో అంతరించిపోగా, తమిళం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కె.విష్ణుప్రియ తెలిపారు. క్రీస్తుశకం 570 ప్రాంతానికి చెందిన కళ్లమళ్ల శాసనం తెలుగులో గుర్తించిన తొలి శాసనం అన్న సంగతి తెలిసిందే. యురేసియా చరిత్రకు ఇవే కీలకం యురేసియా ప్రాంతపు పూర్వ చరిత్రను తెలుసుకోవాలంటే ద్రావిడ కుటుంబ భాషలు కీలకమని, ఇవి ఇతర భాషలను ప్రభావితం చేయడమే అందుకు కారణమన్నది నిపుణుల అంచనా. ఈ భాషలన్నీ ఎప్పుడు, ఎక్కడ పుట్టాయి? ఎంత వరకూ విస్తరించాయి? అన్న అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కాకపోతే ద్రావిడులు భారత ఉపఖండానికి చెందినవారేనని ఉత్తర భారత ప్రాంతానికి ఆర్యులు రావడానికి ముందు నుంచే వీరు ఇక్కడ ఉన్నారనడంపై పరిశోధకుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. క్రీ.పూ. 3500 ప్రాంతంలో ఆర్యులు భారత్‌కు వచ్చారని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అయితే భారతీయుల జన్యుక్రమంలో ఇతర ప్రాంతాల వారి జన్యువులేవీ లేవని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా స్పష్టం చేశారు. గణాంక శాస్త్ర పద్ధతుల ద్వారా.. ద్రావిడ కుటుంబ భాషలు ఎంత పురాతనమైనవో తెలుసుకునేందుకు మ్యాక్స్‌ప్లాంక్ శాస్త్రవేత్తలు ఆధునిక గణాంక శాస్త్ర పద్ధతులను ఉపయోగించారు. అన్ని ద్రావిడ కుటుంబ భాషల ప్రజల నుంచి పదాలను వాటి అర్థాలను సేకరించి అవి 4,500 ఏళ్ల పురాతనమైన భాషలు, యాసలు కావచ్చునని గుర్తించారు. పురాతత్వ ఆధారాలు దీన్ని రూఢీ చేస్తున్నాయని విష్ణుప్రియ తెలిపారు. ఇదే సమయంలోనే ద్రావిడ భాషలు ఉత్తర, మధ్య, దక్షిణ భాగాలుగా విడిపోయాయని, సంస్కృతీపరమైన మార్పులూ ఈ కాలంలోనే మొదలైనట్లు పురాతత్వ ఆధారాల ద్వారా తెలుస్తోందని వివరించారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ భాషల మధ్య ఉన్న సంబంధాలపై మరింత స్పష్టత రావొచ్చని, భౌగోళిక చరిత్రకూ భాషలకూ మధ్య సంబంధం కూడా తెలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తెలంగాణలో తెలుగు భాషకు సంబంధించి 2 వేల సంవత్సరాల నాటి ఆధారాలు లభ్యమయ్యాయి. తాజా అధ్యయనం ప్రకారం తెలుగు 4,500 సంవత్సరాల పురాతనమైనదే అయితే తెలుగువాళ్లంతా స్వాగతించాలి. రామగిరి ఖిల్లాలో లభించిన గోపరాజుల నాణాలపై ‘అన్న’అనే తెలుగు పదం ఉంది. – నందిని సిధారెడ్డి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ -
సంస్కృతాన్ని ఆదరించాలి
ఇన్ బాక్స్ సంస్కృతం మన ప్రాచీన భాష. అది హైందవ నాగరికతకు ప్రతీక. భారతీయుల నిత్య జన వ్యవహారాలలో ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉంటుంది. ఇక యజ్ఞయాగాదులలో, దేవాలయాలలో ఆ భాష ప్రాధాన్యం విశేషమైనది. మనదైన జీవన విధానంతో ముడిపడి ఉన్న ఆ దేవభాషను కాపాడాలని చెప్పడం తప్పుకాదు. సంస్కృత భాష అభ్యాస, అధ్యయన, పారాయణాలకు అనువైన పవిత్ర స్థలాలు ఆశ్రమాలు, దేవాలయాలు, విద్యాపీ ఠాలు, గురుకులాలు, విద్యాలయాలను గుర్తిం చి కాపాడాలి. సంస్కృత భాషని మన భాషగా గౌరవించి, జాతి వారసత్వ లిపిని నేర్చుకోవాలి. సంస్కృతంలో ఉన్న జ్ఞానాన్ని వేర్వేరు శాఖలుగా విభజించి పోషించాలి. దక్షిణ భారతంలో ఒక్క తెలుగు, మరాఠీ, కన్నడ భాషలకు చెందిన వారిలో 30 శాతం సంస్కృతం మీద ప్రేమ చూపుతారు. తమిళనాడు మాత్రం ఇందుకు వ్యతిరేకం. ఉత్తర భారతంలో దీనికి ఎంతో ఆదరణ ఉంది. జనని సకల భాషలకు సంస్కృతంబు. ప్రపంచం గౌరవిస్తున్న మనదైన భాషను మనం నిర్లక్ష్యం చేయడం అవివేకం. దీనిని గుర్తించాలి. - కూర్మాచలం వెంకటేశ్వర్లు కరీంనగర్ -
చక్కటి కెరీర్‌కు చుక్కాని.. సంస్కృతం!
ప్రపంచ భాషలకు మూలం.. సంస్కృతం. అత్యంత ప్రాచీన భాష కూడా సంస్కృతమే. ఇది దేవభాష అని భారతీయులు భావిస్తారు. సంస్కృతం వచ్చినవారికి ఇతర భాషలను నేర్చుకో వడంచాలా సులభమని నిపుణుల అభిప్రాయం. మనదేశంలో ఈ భాషను మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోయినప్పటికీ ప్రభుత్వాల ప్రోత్సాహంతో దీన్ని నేర్చుకొనేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంస్కృతాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ లేకపోవడం యువతను ఆకర్షిస్తోంది. సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. మన దేశంలో ప్రస్తుతం 15 సంస్కృత యూనివర్సిటీలు ఉన్నాయి. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఆధ్వర్యంలో రెండు డీమ్డ్ యూనివర్సిటీ లు(ఢిల్లీ, తిరుపతి) కొనసాగుతున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్.. యూనివర్సిటీగా, నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. పలు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సంస్కృత కోర్సులను అందిస్తున్నా యి. యూనివర్సిటీలు, కాలేజీల్లో సంస్కృత అధ్యాప కులకు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. వీరికి ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు దక్కుతు న్నాయి. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, వారి పిల్లలు ఈ భాష నేర్చుకోవడంపై అమితాసక్తి చూపుతున్నారు. అక్కడి యూనివర్సిటీల్లో సంస్కృత పండితులుగా పనిచేయొచ్చు. ఇక భారత్‌లో సంస్కృత మేగజైన్లు, పత్రికల్లోనూ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా టీవీ, రేడియోలో సంస్కృత న్యూస్ రీడర్‌గా, వ్యాఖ్యాతలుగా కూడా స్థిరపడొచ్చు. ఇతర భాషల నుంచి ఈ భాషలోకి, ఈ భాష నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేసే అనువాదకులకు కూడా అధిక డిమాండ్ ఉంది. అర్హతలు: మనదేశంలో వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు సంస్కృతంలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్డీ కోర్సులను, వీటిలో స్పెషలైజేషన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. తర్వాత ఆసక్తిని బట్టి పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్డీ కూడా చేయొచ్చు. వేతనాలు: సంస్కృతం కోర్సులను చదివినవారికి విద్యాసంస్థల్లో ప్రారంభంలో నెలకు రూ.20 వేల నుంచి వేతనం ప్రారంభమవుతుంది. సీనియారిటీని బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. విదేశీ యూనివర్సిటీల్లో అధిక వేతనాలు లభిస్తాయి. అనువాదకులు ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు పైగానే అందుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు సంస్కృత అకాడమీ-ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in/sanskritacademy రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వెబ్సైట్: www.sanskrit.nic.in రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్-తిరుపతి వెబ్సైట్: http://rsvidyapeetha.ac.in శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వెబ్సైట్: www.svvedicuniversity.org కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం. వెబ్సైట్: www.ksu.ac.in యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వెబ్సైట్: www.ox.ac.uk సంస్కృత అధ్యయనమే అవకాశం! ‘‘సంస్కృత భాషా అధ్యయనం జీవన విధానాన్ని నేర్పుతుంది. బుద్ధి, ఆలోచనలు వికసించేందుకు దోహదపడుతోంది. మానసికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. తద్వారా మంచి సమాజం నిర్మాణానికి సంస్కృతం పరోక్షంగా సహాయపడుతుంది. ఉద్యోగ విరమణ తర్వాత సైతం చాలా మంది సంస్కృత పఠనంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. సంస్కృత భాషాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సంస్కృత భాషా బోధనకు మూడు నెలల కాలవ్యవధితో కూడిన కోర్సులను నిర్వహిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సంస్కృత అకాడమీ కూడా సంస్కృత భాష కోర్సులను ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్‌లోని సురభారతి సమితి, సంస్కృత భాషా ప్రచార సమితి ఈ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా పలు యూనివర్సిటీలు ఇంటర్, డిగ్రీల్లో సబ్జెక్టులతోపాటు మాస్టర్స్ స్థాయిలో సంస్కృతం కోర్సులను అందిస్తున్నాయి. సంస్కృత భాష అధ్యయనమే ఒక మంచి అవకాశం. ఈ భాష నేర్చుకున్న వారు వివిధ కళాశాలల్లో సంస్కృత అధ్యాపకులుగా కెరీర్ కొనసాగించొచ్చు. వాస్తుశాస్త్రం, జ్యోతిష్యం తదితర రంగాల్లోనూ రాణిస్తారు’’ - డా. వి.శ్రీనివాస శర్మ,డెరైక్టర్ ఇన్‌ఛార్జి, సంస్కృత అకాడమీ, ఉస్మానియా యూనివర్సిటీ