చక్కటి కెరీర్‌కు చుక్కాని.. సంస్కృతం! | careers with sanskrit language | Sakshi
Sakshi News home page

చక్కటి కెరీర్‌కు చుక్కాని.. సంస్కృతం!

Published Thu, Aug 28 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

చక్కటి కెరీర్‌కు చుక్కాని.. సంస్కృతం!

చక్కటి కెరీర్‌కు చుక్కాని.. సంస్కృతం!

ప్రపంచ భాషలకు మూలం.. సంస్కృతం. అత్యంత ప్రాచీన భాష కూడా సంస్కృతమే. ఇది దేవభాష అని భారతీయులు భావిస్తారు. సంస్కృతం వచ్చినవారికి ఇతర భాషలను నేర్చుకో వడంచాలా సులభమని నిపుణుల అభిప్రాయం. మనదేశంలో ఈ భాషను మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోయినప్పటికీ ప్రభుత్వాల ప్రోత్సాహంతో దీన్ని నేర్చుకొనేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంస్కృతాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ లేకపోవడం యువతను ఆకర్షిస్తోంది.
 
సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. మన దేశంలో ప్రస్తుతం 15 సంస్కృత యూనివర్సిటీలు ఉన్నాయి. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఆధ్వర్యంలో రెండు డీమ్డ్ యూనివర్సిటీ లు(ఢిల్లీ, తిరుపతి) కొనసాగుతున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్.. యూనివర్సిటీగా, నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. పలు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సంస్కృత కోర్సులను అందిస్తున్నా యి.
 
యూనివర్సిటీలు, కాలేజీల్లో సంస్కృత అధ్యాప కులకు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. వీరికి ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు దక్కుతు న్నాయి. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, వారి పిల్లలు ఈ భాష నేర్చుకోవడంపై అమితాసక్తి  చూపుతున్నారు. అక్కడి యూనివర్సిటీల్లో సంస్కృత పండితులుగా పనిచేయొచ్చు. ఇక భారత్‌లో సంస్కృత మేగజైన్లు, పత్రికల్లోనూ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా టీవీ, రేడియోలో సంస్కృత న్యూస్ రీడర్‌గా, వ్యాఖ్యాతలుగా కూడా స్థిరపడొచ్చు. ఇతర భాషల నుంచి ఈ భాషలోకి, ఈ భాష నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేసే అనువాదకులకు కూడా అధిక డిమాండ్ ఉంది.
 
అర్హతలు: మనదేశంలో వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు సంస్కృతంలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ కోర్సులను, వీటిలో స్పెషలైజేషన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. తర్వాత ఆసక్తిని బట్టి పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ కూడా చేయొచ్చు.
 
వేతనాలు: సంస్కృతం కోర్సులను చదివినవారికి విద్యాసంస్థల్లో ప్రారంభంలో నెలకు రూ.20 వేల నుంచి వేతనం ప్రారంభమవుతుంది. సీనియారిటీని బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. విదేశీ యూనివర్సిటీల్లో అధిక వేతనాలు లభిస్తాయి. అనువాదకులు ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు పైగానే అందుకోవచ్చు.
 
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
సంస్కృత అకాడమీ-ఉస్మానియా వర్సిటీ
వెబ్‌సైట్: www.osmania.ac.in/sanskritacademy
రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్
వెబ్‌సైట్: www.sanskrit.nic.in
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్-తిరుపతి
వెబ్‌సైట్: http://rsvidyapeetha.ac.in
శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.svvedicuniversity.org
కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం.
వెబ్‌సైట్: www.ksu.ac.in
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్
వెబ్‌సైట్: www.ox.ac.uk
 
సంస్కృత అధ్యయనమే అవకాశం!
‘‘సంస్కృత భాషా అధ్యయనం జీవన విధానాన్ని నేర్పుతుంది. బుద్ధి, ఆలోచనలు వికసించేందుకు దోహదపడుతోంది. మానసికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. తద్వారా మంచి సమాజం నిర్మాణానికి సంస్కృతం పరోక్షంగా సహాయపడుతుంది. ఉద్యోగ విరమణ తర్వాత సైతం చాలా మంది సంస్కృత పఠనంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. సంస్కృత భాషాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సంస్కృత భాషా బోధనకు మూడు నెలల కాలవ్యవధితో కూడిన కోర్సులను నిర్వహిస్తోంది.
 
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సంస్కృత అకాడమీ కూడా సంస్కృత భాష కోర్సులను ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్‌లోని సురభారతి సమితి, సంస్కృత భాషా ప్రచార సమితి ఈ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా పలు యూనివర్సిటీలు ఇంటర్, డిగ్రీల్లో సబ్జెక్టులతోపాటు మాస్టర్స్ స్థాయిలో సంస్కృతం కోర్సులను అందిస్తున్నాయి. సంస్కృత భాష అధ్యయనమే ఒక మంచి అవకాశం. ఈ భాష నేర్చుకున్న వారు వివిధ కళాశాలల్లో సంస్కృత  అధ్యాపకులుగా కెరీర్ కొనసాగించొచ్చు. వాస్తుశాస్త్రం, జ్యోతిష్యం తదితర రంగాల్లోనూ రాణిస్తారు’’
 - డా. వి.శ్రీనివాస శర్మ,డెరైక్టర్ ఇన్‌ఛార్జి, సంస్కృత అకాడమీ, ఉస్మానియా యూనివర్సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement