Sanskrit University
-
తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్శిటీలో డ్రగ్స్ కలకలం
సాక్షి, తిరుపతి: జాతీయ సంస్కృత యూనివర్శిటీలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఒడిశా విద్యార్థి శతపతి 20 ప్యాకెట్ల గంజాయి తీసుకొచ్చినట్లు రిజిస్ట్రార్ రమశ్రీ వెల్లడించారు. గరుడచల హాస్టల్లోని విద్యార్థి ఆంజనేయులకు 7 ప్యాకెట్ల గంజాయి ఇచ్చాడని.. హాస్టల్ తనిఖీల్లో 109 గదిలోని విద్యార్థులు గంజాయి సేవించినట్లు అభియోగం వచ్చిందన్నారు.యాంటీడ్రగ్స్ కమిటీచే విచారణ చేపట్టాం. నిర్థారణ కాగానే విద్యార్థులను కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తాం. క్యాంపస్‌లో ఆరు నెలలుగా విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నారన్నది అవాస్తవం అని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. సంస్కృత విశ్వవిద్యాల యంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే పలువురు విద్యార్థులు డ్రగ్స్ బానిసలుగా మారారంటూ సీనియర్ ఏబీవీపీ విద్యార్థి సంఘం నేత గణపతి ఆరోపించారు. -
తుదిశ్వాస దాకా వారణాసి ప్రజలకు సేవలు
వారణాసి: జీవితంలో ఆఖరి రోజుల్లోనే చాలామంది వారణాసి(కాశి)కి వస్తుంటారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. తాను తుదిశ్వాస విడిచేదాకా వారణాసి ప్రజలకు సేవలందిస్తూనే ఉంటానని చెప్పారు. మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు వారి పార్టీలను సొంత ఆస్తులుగా భావిస్తున్నారని, అలాంటివారు కార్యకర్తల పార్టీ అయిన బీజేపీని ఎప్పటికీ చాలెంజ్ చేయలేరని పేర్కొన్నారు. తాను కాశీలోనే చనిపోవాలని ఎవరైనా ప్రార్థిస్తే సంతోషిస్తానని తెలిపారు. వారణాసి గానీ, వారణాసి ప్రజలు గానీ తనను ఎప్పటికీ వదులుకోరనే విషయం తనకు అర్థమైందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలే తనకు ఒక విశ్వవిద్యాలయమని, వారి నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని ప్రధాని మోదీ వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ చరిత్రాత్మక, ఆధ్యాత్మిక నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని ఉద్ఘాటించారు. చాలా సంవత్సరాల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం పవిత్ర గంగానది తీరాన్ని తాకిందని హర్షం వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును అందరూ గర్వకారణంగా భావిస్తుంటే, కొందరు మాత్రం మతం కోణంలో చూస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. -
సంస్కృత వర్సిటీల బిల్లుకు రాజ్యసభ ఓకే
న్యూఢిల్లీ: కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లు(సెంట్రల్ సాంస్కిృట్ యూనివర్సిటీస్ బిల్–2019)కి సోమవారం రాజ్యసభ పలు సవరణలతో ఆమోదం తెలిపింది. డీమ్డ్ యూనివర్సిటీలైన రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్(న్యూఢిల్లీ), శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్(న్యూఢిల్లీ), రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ (తిరుపతి)లను సెంట్రల్ వర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది. ► లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో దేశంలో నెలకొన్న నిరుద్యోగితను సభ్యులు ప్రస్తావించారు. ఎంఎస్సీ గణితం చదివిన వ్యక్తి మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్ ఉద్యోగంలో చేరిన విషయాన్ని డీఎంకే నేత ప్రస్తావించారు. ► కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో.. పార్లమెంటు కాంప్లెక్స్‌లో థర్మల్ స్క్రీనింగ్ సౌకర్యాన్ని కల్పించారు. సిబ్బందిని, జర్నలిస్టులను స్క్రీనింగ్ చేస్తున్నారు. పార్లమెంట్‌లోకి సందర్శకులకు అనుమతించడం ఇప్పటికే నిలిపేశారు. ► ఐదు నెలల క్రితం మోటారు వాహనాల సవరణ చట్టం ఆమోదం పొందిన తరువాత.. వాహన ప్రమాదాల్లో మృతి చెందినవారి సంఖ్య 10% తగ్గిందని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభకు తెలిపారు. (చదవండి: ‘కోవిడ్’ నియంత్రణలో కీలక అడుగు!) ► లోక్‌సభలో అదనపు ప్రశ్నలు అడిగేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్యాంకు రుణాలను అత్యధిక మొత్తంలో ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారి గురించి ప్రశ్నించానని, ఆ ప్రశ్నకు అనుబంధంగా మరో ప్రశ్న అడిగేందుకు స్పీకర్ అనుమతించలేదని పార్లమెంటు వెలుపల మీడియాకు తెలిపారు. -
మోదీ నియోజకవర్గంలో ఏబీవీపీకి షాక్..
వారణాసి : వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ ఘోరంగా ఓడిపోయింది. మొత్తం నాలుగు సీట్లను కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ కైవసం చేసుకుంది. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్ఎస్యూఐకి చెందిన శివమ్ శుక్లా ఏబీవీపీ నాయకుడు హర్షిత్ పాండే మీద భారీ మెజారిటీతో గెలుపొందారు. అలాగే ఎన్ఎస్యూఐకి చెందిన చందన్ కుమార్ ఉపాధ్యక్షుడిగా, అవ్నీశ్ పాండే జనరల్ సెక్రటరీగా, రజనీకాంత్ దుబే లైబ్రెరియన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి ప్రొఫెసర్ శైలేష్ కుమార్ ఫలితాలు ప్రకటించిన తరువాత.. యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజరామ్ శుక్లా.. వారిచేత సంస్కృతంలో ప్రమాణం చేయించారు. అలాగే వివాదాలకు దూరంగా ఉండేందుకు గెలిచిన అభ్యర్థులు క్యాంపస్‌లో ఊరేగింపు చేపట్టరాదని శుక్లా సూచించారు. అయితే గెలిచిన ఎన్ఎస్యూఐ నేతలు వారి ఇళ్లకు వెళ్లేటప్పుడు పోలీసు భద్రత కల్పించారు. అయితే ఈ ఎన్నికల్లో కేవలం 50.82 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఓటు వేయడం గమనార్హం. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం పరిధిలోని యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో కూడా ఏబీవీపీ ఒక్క సీటులో గెలుపొందని సంగతి తెలిసిందే. -
చక్కటి కెరీర్‌కు చుక్కాని.. సంస్కృతం!
ప్రపంచ భాషలకు మూలం.. సంస్కృతం. అత్యంత ప్రాచీన భాష కూడా సంస్కృతమే. ఇది దేవభాష అని భారతీయులు భావిస్తారు. సంస్కృతం వచ్చినవారికి ఇతర భాషలను నేర్చుకో వడంచాలా సులభమని నిపుణుల అభిప్రాయం. మనదేశంలో ఈ భాషను మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోయినప్పటికీ ప్రభుత్వాల ప్రోత్సాహంతో దీన్ని నేర్చుకొనేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంస్కృతాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ లేకపోవడం యువతను ఆకర్షిస్తోంది. సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. మన దేశంలో ప్రస్తుతం 15 సంస్కృత యూనివర్సిటీలు ఉన్నాయి. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఆధ్వర్యంలో రెండు డీమ్డ్ యూనివర్సిటీ లు(ఢిల్లీ, తిరుపతి) కొనసాగుతున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్.. యూనివర్సిటీగా, నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. పలు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సంస్కృత కోర్సులను అందిస్తున్నా యి. యూనివర్సిటీలు, కాలేజీల్లో సంస్కృత అధ్యాప కులకు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. వీరికి ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు దక్కుతు న్నాయి. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, వారి పిల్లలు ఈ భాష నేర్చుకోవడంపై అమితాసక్తి చూపుతున్నారు. అక్కడి యూనివర్సిటీల్లో సంస్కృత పండితులుగా పనిచేయొచ్చు. ఇక భారత్‌లో సంస్కృత మేగజైన్లు, పత్రికల్లోనూ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా టీవీ, రేడియోలో సంస్కృత న్యూస్ రీడర్‌గా, వ్యాఖ్యాతలుగా కూడా స్థిరపడొచ్చు. ఇతర భాషల నుంచి ఈ భాషలోకి, ఈ భాష నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేసే అనువాదకులకు కూడా అధిక డిమాండ్ ఉంది. అర్హతలు: మనదేశంలో వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు సంస్కృతంలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్డీ కోర్సులను, వీటిలో స్పెషలైజేషన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. తర్వాత ఆసక్తిని బట్టి పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్డీ కూడా చేయొచ్చు. వేతనాలు: సంస్కృతం కోర్సులను చదివినవారికి విద్యాసంస్థల్లో ప్రారంభంలో నెలకు రూ.20 వేల నుంచి వేతనం ప్రారంభమవుతుంది. సీనియారిటీని బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. విదేశీ యూనివర్సిటీల్లో అధిక వేతనాలు లభిస్తాయి. అనువాదకులు ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు పైగానే అందుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు సంస్కృత అకాడమీ-ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in/sanskritacademy రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వెబ్సైట్: www.sanskrit.nic.in రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్-తిరుపతి వెబ్సైట్: http://rsvidyapeetha.ac.in శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వెబ్సైట్: www.svvedicuniversity.org కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం. వెబ్సైట్: www.ksu.ac.in యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వెబ్సైట్: www.ox.ac.uk సంస్కృత అధ్యయనమే అవకాశం! ‘‘సంస్కృత భాషా అధ్యయనం జీవన విధానాన్ని నేర్పుతుంది. బుద్ధి, ఆలోచనలు వికసించేందుకు దోహదపడుతోంది. మానసికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. తద్వారా మంచి సమాజం నిర్మాణానికి సంస్కృతం పరోక్షంగా సహాయపడుతుంది. ఉద్యోగ విరమణ తర్వాత సైతం చాలా మంది సంస్కృత పఠనంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. సంస్కృత భాషాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సంస్కృత భాషా బోధనకు మూడు నెలల కాలవ్యవధితో కూడిన కోర్సులను నిర్వహిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సంస్కృత అకాడమీ కూడా సంస్కృత భాష కోర్సులను ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్‌లోని సురభారతి సమితి, సంస్కృత భాషా ప్రచార సమితి ఈ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా పలు యూనివర్సిటీలు ఇంటర్, డిగ్రీల్లో సబ్జెక్టులతోపాటు మాస్టర్స్ స్థాయిలో సంస్కృతం కోర్సులను అందిస్తున్నాయి. సంస్కృత భాష అధ్యయనమే ఒక మంచి అవకాశం. ఈ భాష నేర్చుకున్న వారు వివిధ కళాశాలల్లో సంస్కృత అధ్యాపకులుగా కెరీర్ కొనసాగించొచ్చు. వాస్తుశాస్త్రం, జ్యోతిష్యం తదితర రంగాల్లోనూ రాణిస్తారు’’ - డా. వి.శ్రీనివాస శర్మ,డెరైక్టర్ ఇన్‌ఛార్జి, సంస్కృత అకాడమీ, ఉస్మానియా యూనివర్సిటీ