సాక్షి, తిరుపతి: జాతీయ సంస్కృత యూనివర్శిటీలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఒడిశా విద్యార్థి శతపతి 20 ప్యాకెట్ల గంజాయి తీసుకొచ్చినట్లు రిజిస్ట్రార్ రమశ్రీ వెల్లడించారు. గరుడచల హాస్టల్‌లోని విద్యార్థి ఆంజనేయులకు 7 ప్యాకెట్ల గంజాయి ఇచ్చాడని.. హాస్టల్ తనిఖీల్లో 109 గదిలోని విద్యార్థులు గంజాయి సేవించినట్లు అభియోగం వచ్చిందన్నారు.
యాంటీడ్రగ్స్ కమిటీచే విచారణ చేపట్టాం. నిర్థారణ కాగానే విద్యార్థులను కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తాం. క్యాంపస్‌లో ఆరు నెలలుగా విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నారన్నది అవాస్తవం అని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. సంస్కృత విశ్వవిద్యాల యంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే పలువురు విద్యార్థులు డ్రగ్స్ బానిసలుగా మారారంటూ సీనియర్ ఏబీవీపీ విద్యార్థి సంఘం నేత గణపతి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment