
న్యూఢిల్లీ:లోక్‌సభ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సంస్కృతంలోకి అనువదించడంపై డీఎంకే ఎంపీ దయానిధిమారన్ అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై మంగళవారం(ఫిబ్రవరి11) లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో దయానిధి మాట్లాడారు.
‘2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో కేవలం 73వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నారని తేలింది.సంస్కృతం ఎవరికీ అర్థం కాదు. ఇది కేవలం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో చేస్తున్న పని. సంస్కృతంలోకి అనువదించడం వల్ల ప్రజలు కష్టపడి కడుతున్న పన్నులు వృథా అవుతున్నాయి’అని మారన్ వ్యాఖ్యానించారు.
దీనికి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తీవ్రంగా స్పందించారు. మారన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.‘క్‌సభలో కేవలం సంస్కృతమే కాదు హిందీ సహా పలు భాషల్లో అనువాదం జరుగుతోంది. మీ సమస్య ఏంటో అర్థం కావడం లేదు’అని మారన్‌ను ఉద్దేశించి స్పీకర్ అన్నారు.స్పీకర్ మాట్లాడుతుండగా డీఎంకే సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment