
న్యూఢిల్లీ:ఇటీవల జరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం అంశంపై లోక్‌సభలో రాహుల్‌గాంధీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సోమవారం(ఫిబ్రవరి3) లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్‌గాంధీ మాట్లాడారు. మోదీ ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థపై సీరియస్‌నెస్ లేదని విమర్శించారు. ట్రంప్ ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించాలని అడిగేందుకే దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను ముందుగా అమెరికా పంపారని రాహుల్‌గాంధీ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్‌గాంధీ ఆధారాల్లేని ఆరోపణలు చేయవద్దని మంత్రి కిరణ్ రిజిజు హితవు పలికారు.ఇది రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి అంశమని,ప్రధానమంత్రికి ఆహ్వానంపై ఏది పడితే అది మాట్లాడవద్దని సూచించారు. దీనికి స్పందించిన రాహుల్‌గాంధీ మీ మనశ్శాంతికి భంగం కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.
అనంతరం రాహుల్ చైనా ఆక్రమణలపై మాట్లాడారు. భారత్‌లో కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకుందని ప్రధాని మోదీ చెప్పేదానికి,సైన్యం చెప్పేదానికి పొంతన లేదని విమర్శించారు. వెంటనే స్పీకర్ ఓంబిర్లా కలుగజేసుకుని ఆధారాలు లేకుండా ఇలాటి విషయాలు సభలో మాట్లాడడం సరికాదన్నారు.
యూపీఏనూ విమర్శించిన రాహుల్‌గాంధీ..
యువతకు ఉద్యోగాల కల్పన అంశంపై రాహుల్‌గాంధీ లోక్‌సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశం వృద్ధి చెందుతోంది. అయితే వృద్ధిలో ప్రస్తుతం వేగం తగ్గింది. ఉద్యోగాలు కల్పించే విషయంలో గత యూపీఏ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు యువతకు సమాధానం చెప్పలేకపోయాయని రాహుల్ అన్నారు. మేకిన్ ఇండియా మంచిదే అయినప్పటికీ దానితో ఒరిగేది ఏమీ లేదన్నారు. జీడీపీలో తయారీ రంగ వాటా తగ్గిపోయిందని రాహుల్ విమర్శించారు.

Comments
Please login to add a commentAdd a comment