loksabha sessions
-
స్పీకర్Vsమారన్.. లోక్‌సభలో వివాదం
న్యూఢిల్లీ:లోక్‌సభ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సంస్కృతంలోకి అనువదించడంపై డీఎంకే ఎంపీ దయానిధిమారన్ అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై మంగళవారం(ఫిబ్రవరి11) లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో దయానిధి మాట్లాడారు.‘2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో కేవలం 73వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నారని తేలింది.సంస్కృతం ఎవరికీ అర్థం కాదు. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ భావజాలంతో చేస్తున్న పని. సంస్కృతంలోకి అనువదించడం వల్ల ప్రజలు కష్టపడి కడుతున్న పన్నులు వృథా అవుతున్నాయి’అని మారన్ వ్యాఖ్యానించారు. దీనికి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తీవ్రంగా స్పందించారు. మారన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.‘క్‌సభలో కేవలం సంస్కృతమే కాదు హిందీ సహా పలు భాషల్లో అనువాదం జరుగుతోంది. మీ సమస్య ఏంటో అర్థం కావడం లేదు’అని మారన్‌ను ఉద్దేశించి స్పీకర్ అన్నారు.స్పీకర్ మాట్లాడుతుండగా డీఎంకే సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
‘మార్గదర్శి’పై ఎంపీ మిథున్‌రెడ్డి ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అని, ఈ స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం(ఫిబ్రవరి10) మిథున్‌రెడ్డి లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా మాట్లాడారు.‘ మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసింది. మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి.మిథున్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..మార్గదర్శి రూ. 2600 కోట్ల రూపాయలు వసూలు చేసిందిఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వసూలు చేసిందిడిపాజిటర్లకు న్యాయం జరగాలిదీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకోవాలిఒకవైపు 75 వేల మెడికల్ సీట్లని కేంద్రం చెబుతోందికానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మాకు మెడికల్ సీట్లు వద్దని సరెండర్ చేస్తుంది ఏపీలో 17 మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపేశారు.కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇప్పించాలికేంద్రం విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలిపోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దుపోలవరం నిర్మాణానికి అరకొరగా నిధులు ఇస్తున్నారురాజధాని అమరావతికి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలిపదేళ్ల తర్వాత రైల్వే జోన్ ఇచ్చారువాల్తేర్ డివిజన్ రెండుగా విభజించి అన్యాయం చేశారువాల్తేర్ డివిజన్ విశాఖ జోన్లోనే ఉంచాలివిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాంతిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో నాపై దాడిచేశారు: ఎంపీ గురుమూర్తి తిరుపతిలో తనపై జరిగిన దాడి అంశాన్ని లోక్‌సభలో 377 నిబంధన కింద లేవనెత్తిన ఎంపీ గురుమూర్తిఏపీలో ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగిందితిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నాపైన, మహిళా కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డారుఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకున్నారుతిరుపతి జిల్లా పోలీసులు దాడులు నిరోధించడంలో ఫెయిల్ అయ్యారుబాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర చూస్తున్నారుఈ దాడులపై వెంటనే దర్యాప్తు జరపాలిదాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి -
యూపీఏపైనా రాహుల్ విమర్శలు.. లోక్‌సభలో ఆసక్తికర పరిణామం
న్యూఢిల్లీ:ఇటీవల జరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం అంశంపై లోక్‌సభలో రాహుల్‌గాంధీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సోమవారం(ఫిబ్రవరి3) లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్‌గాంధీ మాట్లాడారు. మోదీ ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థపై సీరియస్‌నెస్ లేదని విమర్శించారు. ట్రంప్ ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించాలని అడిగేందుకే దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను ముందుగా అమెరికా పంపారని రాహుల్‌గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్‌గాంధీ ఆధారాల్లేని ఆరోపణలు చేయవద్దని మంత్రి కిరణ్ రిజిజు హితవు పలికారు.ఇది రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి అంశమని,ప్రధానమంత్రికి ఆహ్వానంపై ఏది పడితే అది మాట్లాడవద్దని సూచించారు. దీనికి స్పందించిన రాహుల్‌గాంధీ మీ మనశ్శాంతికి భంగం కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. అనంతరం రాహుల్ చైనా ఆక్రమణలపై మాట్లాడారు. భారత్‌లో కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకుందని ప్రధాని మోదీ చెప్పేదానికి,సైన్యం చెప్పేదానికి పొంతన లేదని విమర్శించారు. వెంటనే స్పీకర్ ఓంబిర్లా కలుగజేసుకుని ఆధారాలు లేకుండా ఇలాటి విషయాలు సభలో మాట్లాడడం సరికాదన్నారు.యూపీఏనూ విమర్శించిన రాహుల్‌గాంధీ..యువతకు ఉద్యోగాల కల్పన అంశంపై రాహుల్‌గాంధీ లోక్‌సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశం వృద్ధి చెందుతోంది. అయితే వృద్ధిలో ప్రస్తుతం వేగం తగ్గింది. ఉద్యోగాలు కల్పించే విషయంలో గత యూపీఏ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు యువతకు సమాధానం చెప్పలేకపోయాయని రాహుల్ అన్నారు. మేకిన్ ఇండియా మంచిదే అయినప్పటికీ దానితో ఒరిగేది ఏమీ లేదన్నారు. జీడీపీలో తయారీ రంగ వాటా తగ్గిపోయిందని రాహుల్ విమర్శించారు. -
పార్లమెంట్ రేపటికి వాయిదా
Parliament Winter Session Live Updates:సభ్యుల ఆందోళనతో లోక్‌సభ రేపటికి వాయిదా రాజ్యసభ రేపటికి వాయిదా..ఢిల్లీ : పార్లమెంట్లో జరిగిన తోపులాట బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి,ముఖేష్ రాజ్‌పుత్‌లు గాయపడిన ఘటనపై ఎన్డీయే కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఎన్డీయే నేతలు సిద్ధమయ్యారు.అంతకంటే ముందే పార్లమెంట్లో ఎంపీల మధ్య జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియోల్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. స్పీకర్‌కు ఖర్గే లేఖపార్లమెంట్ ముఖ ద్వారం వద్ద జరిగిన తోపులాటలో తనకు గాయమైందని, విచారణ జరపాలని స్పీకర్ ఓంబిర్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పీకర్‌కు లేఖ రాశారు. My letter to the Hon’ble @loksabhaspeaker urging to order an inquiry into the incident which is an assault not just on me personally, but on the Leader of the Opposition, Rajya Sabha and the Congress President. pic.twitter.com/gmILQdIDYW— Mallikarjun Kharge (@kharge) December 19, 2024 ప్రధానితో కిరణ్ రిజుజు భేటీపార్లమెంట్లో జరిగిన తోపులాట ఘటనకు సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రధాని మోదీతో పార్లమెంటరీ కమిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్లమెంట్లో జరిగిన నిరసన, అపై జరిగిన పరిణామల గురించి వివరిస్తున్నారు. పార్లమెంట్లో ఎంపీల తోపులాట పార్లమెంట్లో గందర గోళం నెలకొంది. అంబేద్కర్‌ను అవమానించి కాంగ్రేస్సే నంటూ బీజేపీ.. కాదు..కాదు కమలం నేతలు అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేట్టిన నిరసనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రతాప్ సారంగిని పరామర్శించేందుకు కేంద్ర మంత్రులు ఆస్పత్రికి వెళ్లనున్నారు. #WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, "Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down...I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me..." pic.twitter.com/xhn2XOvYt4— ANI (@ANI) December 19, 2024పార్లమెంట్ భయట ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష,విపక్ష ఎంపీ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను పార్లమెంట్ మెట్ల దగ్గర నిలబడ్డా.. ఆ సమయంలో రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టాడు. ఆ ఎంపీ వచ్చి నాపై పడ్డాడు. దీంతో నాకు గాయాలు అయ్యాయి’ అని చెప్పారు.పార్లమెంట్ లోపలికి వెళ్లే హక్కు మాకుంది : రాహుల్ఈ తోపులాటపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్ మెట్లపై నిల్చున్నాను. నన్ను అడ్డుకునేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నించారు. కావాలంటే మీరే చూడంటే పార్లమెంట్‌లోని కెమెరాల్లో రికార్డయి ఉంటుంది. నేను పార్లమెంటు గేటు నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకున్నారు. మల్లికార్జున్ ఖర్గేను నెట్టారు. పార్లమెంట్ లోపలికి వెళ్లే హక్కు మాకుంది. మమ్మల్ని లోపలికి పోనివ్వకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు’ అని ఆయన అన్నారు.#WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, "This might be on your camera. I was trying to go inside through the Parliament entrance, BJP MPs were trying to stop me, push me and threaten me. So this happened...Yes, this has happened (Mallikarjun Kharge being pushed). But we do not… https://t.co/q1RSr2BWqu pic.twitter.com/ZKDWbIY6D6— ANI (@ANI) December 19, 2024అంబేద్కర్‌ను అవమానించిన పార్టీ కాంగ్రెస్పార్లమెంట్లో అధికార, విపక్షాల ఆందోళనపై తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిన పార్టీ కాంగ్రెస్. సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టడాన్ని వ్యతిరేకించింది. అంబేద్కర్‌కు బీజేపీ సమున్నత గౌరవం ఇచ్చింది. నిజాలు బయటపెడుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది. అమిత్ షా వీడియోని వక్రీకరించి రాద్ధాంతం చేస్తోంది. -
జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదం
Lok Sabha Session Updatesలోక్‌సభ రేపటికి వాయిదాతిరిగి ప్రారంభమైన లోక్‌సభ లంచ్‌కు ముందు జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదంఇక.. జేపీసీ ముందుకు జమిలి బిల్లులు!లోక్‌సభలో జమిలి ప్రవేశపెట్టడానికి ఆమోదంపార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) ముందుకు బిల్లులువన్ నేషన్.. వన్ ఎలక్షన్లో భాగంగా 129 రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లు కూడాజేపీసీ ద్వారా విస్తృస్థాయి చర్చకు అవకాశంఅతిత్వరలో జేపీసీ ఏర్పాటుజేపీసీ చైర్మన్‌ను ఎంపిక చేయనున్న లోక్‌సభ స్పీకర్సంఖ్యా బలం దృష్ట్యా బీజేపీ నుంచే జేపీసీకి చైర్మన్జేపీసీలో విపక్ష సభ్యులకు కూడా స్థానంసభ్యుల పేర్లను ప్రతిపాదించని తరుణంలో.. సభ్యత్వం కోల్పోయే అవకాశంజమిలి బిల్లు కాపీ కోసం క్లిక్ చేయండి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదంతీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలుబిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ ఓం బిర్లాకొత్త పార్లమెంట్లో ఫస్ట్ డిజిటల్ ఓటింగ్అనుమానాలున్నవాళ్లకు స్లిప్పులు పంచిన సిబ్బందిఅనుకూలంగా 269 ఓట్లు.. వ్యతిరేకంగా 198 ఓట్లులోక్సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా‘జమిలి’ బిల్లుపై ఓటింగ్ అనంతరం 3 గంటలకు వాయిదాపడ్డ లోక్‌సభ ‘జమిలి’ బిల్లు ‘జేపీసీ’కి.. సాధారణ మెజారిటీతో ఓకే అన్న లోక్‌సభ కొత్త పార్లమెంట్ భవనంలో జమిలి బిల్లుపై తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్విపక్షాలు డివిజన్ కోరడంతో ఓటింగ్‌కు అనుమతిచ్చిన స్పీకర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, జేపీసీలో చర్చకు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 198 ఓట్లు #WATCH | In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha. (Source: Sansad TV) pic.twitter.com/dMRk6UEjeO— ANI (@ANI) December 17, 2024జేపీసీకి జమిలి బిల్లు పంపేందుకు సిద్ధం: అమిత్ షా జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ కి పంపేందుకు సిద్ధంఈ బిల్లును జేపీసీకి పంపి విస్తృతంగా చర్చించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారుజేపీసీ నివేదిక తర్వాత మళ్లీ బిల్లు తీసుకువస్తాం లోక్‌సభలోకి జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మేఘ్వాల్ తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే చర్య అని మండిపాటు రాజ్యాంగ సవరణకు సంబంధించిన రెండు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి రాష్ట్రాల అసెంబ్లీల కాలపరమితి కుదించడం రాజ్యాంగ విరుద్ధం కాంగ్రెస్ ఎంపీ మనీష్‌తివారీ డిమాండ్ జమిలి ఎన్నికల బిల్లుపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫైర్ జమిలి ఎన్నికలు నియంతృత్వ పాలనకు నాంది అని వ్యాఖ్యబిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన బిల్లును ఉపసంహరించుకోవాలని టీఎంసీ, డీఎంకే డిమాండ్జమిలి ఎన్నికలు ఎన్నికల సంస్కరణ కాదన్న టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల కమిషన్‌కు సర్వాధికారాలు వస్తాయిజమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేనపుడు బిల్లు ఎలా తెస్తారని ప్రశ్నించిన డీఎంకే జమిలి బిల్లు రాజ్యాంగ విరుద్ధం: ఎంఐఎం అధినేత అసదుద్దీన్జమిలి ఎన్నికలు ఒక లీడర్ ఈగో కోసమే వచ్చిన ఆలోచనరాష్ట్రాల హక్కులను హరిస్తున్నారుబిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాంజమిలి ఎన్నికలకు వైఎస్సార్సీపీ మద్దతులోక్సభలో జమిలి బిల్లులకు టీడీపీ మద్దతుజమిలి ఎన్నికల బిల్లుపై దేశమంతా చర్చ జరగాలి: ఎంపీ రఘునందన్‌రావు గతంలో కూడా నాలుగు సార్లు జమిలి ఎన్నికలు జరిగాయిజమిలి ఎన్నికలతో అధ్యక్ష తరహా పాలన జరగదుఈ బిల్లుకు 31 పార్టీలు మద్దతిస్తున్నాయిఇంకా 15 పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉందిఏ పార్టీని మేము బుల్డోజ్ చేయంజమిలి ఎన్నికలు దేశ ప్రజల ఆకాంక్షప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలికాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలిఇండియా కూటమిలో ఇప్పటికే లుకలుకలు ఉన్నాయివన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తప్పనిసరిగా పాస్ అవుతుందని నమ్మకం ఉందిఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్..జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టనున్నారుఈ సందర్భంగా కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసిందిఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరింది సభలోకి వెళ్లేముందే జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం ఉందిసభలోకి రెండు బిల్లులు..జమిలి ఎన్నికల 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు వాటిని ఇవాళ లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు.20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది.జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది. -
ఆ ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్
సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం అవమానించిందంటూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధాని మాట్లాడారు. ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ నిర్మాతలను అవమానించారని.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందని ధ్వజమెత్తారు. ప్రజల మద్దతు లేకుండానే గాంధీ కుటుంబం దేశాన్ని పాలించిందన్నారు. దళిత నేత సీతారాం కేసరిని కాంగ్రెస్ అవమానించలేదా?. సీతారాం కేసరిని బాత్రూమ్లో బంధించలేదా?’’ అంటూ మోదీ నిలదీశారు.‘‘ఆనాటి కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి 75 సార్లు సవరణలు చేశారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు హరించారు. వేలాది మందిని జైళ్లకు తరలించారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కుట్రలు పన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునేది పార్టీ అధ్యక్షురాలు అని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు’’ అని మోదీ గుర్తు చేశారు.‘‘రాజ్యాంగాన్ని సవరించి పేదలకు రిజర్వేషనుల ఇచ్చాం. ఓబీసీలకు న్యాయం చేయడం కోసం మేం రాజ్యాంగాన్ని సవరించామని ప్రధాని అన్నారు. ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ ప్రజలను విభజించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మనం ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నాం. రాజ్యాంగ నిర్మాతలతో పాటు దేశ ప్రజలకు ధన్యవాదాలు. ప్రజాస్వామ్య భావనను 75 ఏళ్లుగా నిలబెట్టుకున్నాం. అందుకు ప్రజలకే మొదట ఘనత దక్కుతుంది. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది’’ అని ప్రధాని మోదీ చెప్పారు.‘‘మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు కూడా. మనది మదర్ ఆఫ్ డెమోక్రసీ. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే మూడో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించబోతుంది. రాజ్యాంగంలో మహిళలు కీలక ప్రాంత పోషించారు. వివిధ రంగాలకు చెందిన ఆ మహిళలు రాజ్యాంగ నిర్మాణంలో చాలా ప్రభావశీలంగా పనిచేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకత. భారతీయుల ఏకతనే రాజ్యాంగం కూడా ప్రస్తావించింది. ఆర్టికల్ 370 దేశం ఏకత్వానికి అడ్డుగా నిలిచింది. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం తల్లి లాంటింది. భారత ప్రజాస్వామ్యం, గణతంత్రం ఎంతో గొప్పది. మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఎందరో మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు. ప్రజా స్వామ్య దేశాలు భారత్‌ను విశ్వసిస్తున్నాయి.’’ అని ప్రధాని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇందిరకు నచ్చని మేనక?.. అయినా సంజయ్‌తో పెళ్లెలా జరిగింది? -
ఈనెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నవంబర్ 25వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం.. వక్ఫ్ బిల్లు ఆమోదానికి పెట్టే అవకాశం ఉంది.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 26న జాయింట్ పార్లమెంట్ సెషన్ ఉండనుంది. ఇక, డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కాగా, ఈ శీతాకాల సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లుకు ఆమోదానికి పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ఒక్క ఏడాదిలో 30 లక్షల మందికి కుక్కకాటు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 ఒక్క ఏడాదిలోనే 286 మంది కుక్కకాటుకు బలయ్యారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. 2023లో మొత్తంగా 30 లక్షలకుపైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ మేరకు మంగళవారం(జులై 30) కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు. 2023లో 46లక్షల 54వేల98మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రేబిస్ నియంత్రణకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేబిస్ టీకాకు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. -
‘సూపర్‌సిక్స్’ అమలు ఎప్పుడు?: లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్ గా మార్చవద్దని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. సోమవారం(జులై 29) లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ అమలుకు గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు లేకుండా పెట్టుబడులు ఎలా..ఏపీలో శాంతిభద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయి. నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. నాపైన దాడి చేశారు. నా వాహనాన్ని ధ్వంసం చేశారు. అన్ని టీవీ చానల్స్ చూస్తుండగానే దాడి జరిగింది. నాపైనే దాడి చేసి నాకు వ్యతిరేకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలి. హింసకు చరమ గీతం పాడాలి. అమరావతికి రుణం వద్దు.. గ్రాంట్‌గా కావాలి..పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి బాధ్యులు ఎవరు. అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్లు రుణంగా కాకుండా గ్రాంట్‌గా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. పదేళ్లు గడిచిన విశాఖ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. బడ్జెట్లో రూ. 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించవద్దు’అని మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
దేశంలోపెండింగ్ కేసులు ఐదు కోట్లకుపైనే: కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కోర్టుల్లో కలిపి ఐదు కోట్లకుపైనే కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. శుక్రవారం(జులై 26) లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. ఐదు కోట్లకు పైగా పెండింగ్ కేసుల్లో సుప్రీంకోర్టులో 85వేలు, వివిధ హైకోర్టుల్లో 60 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.అత్యధికంగా జిల్లా స్థాయి, అంతకంటే దిగువకోర్టుల్లోనే 4కోట్ల54లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కోర్టుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, న్యాయపరమైన చిక్కులు ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్ పడుతున్నాయని తెలిపారు. అత్యంత ఎక్కువగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్ ప్రదేశ్‌లోని కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటం గమనార్హం. -
Budget 2024: గంటన్నరలోపే బడ్జెట్ స్పీచ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ సమయాన్నిగణనీయంగా తగ్గించుకున్నారు. మంగళవారం(జులై 23) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల తన స్పీచ్‌ను కేవలం 86 నిమిషాల్లోనే ముగించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఇదే ఆమె అతి చిన్న బడ్జెట్ ప్రసంగం కావడం గమనార్హం. 2020లో ఆమె ఏకంగా రెండు గంటల నలభై నిమిషాల పాటు అత్యంత ఎక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేశారు. నిర్మల తొలిసారి ఆర్థిక మంత్రి అయిన 2019లోనూ 2 గంటల 17 నిమిషాలు, 2021లో గంట 50 నిమిషాలు, 2022లో గంట 32 నిమిషాలు, 2023లో గంటగ 27 నిమిషాలు బడ్జెట్ ప్రసంగాలు చేశారు. -
లోక్‌సభ టుడే రౌండప్.. ప్రధాని స్పీచ్ హైలైట్స్
లోక్‌సభ సమావేశాలు మంగళవారం(జులై 2) హాట్‌హాట్‌గా జరిగాయి. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తొలుత ఉదయం విపక్ష పార్టీల సభ్యులు పలువురు మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై జరిగిన చర్చకు సాయంత్రం ప్రధాని మోదీ సమాధానమిచ్చారు.ప్రధాని ప్రసంగిస్తుండగా లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు ఒక దశలో వెల్‌లోకి దూసుకువచ్చారు. నీట్, అగ్నివీర్లపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు. చివరకు సభలో నీట్‌పై ప్రధాని ప్రకటన చేయక తప్పలేదు. ప్రధాని ప్రసంగం పూర్తయిన తర్వాత సభను స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు. కాంగ్రెస్,రాహుల్ టార్గెట్‌గా ప్రధాని ప్రసంగం.. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్, ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీని లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. ముఖ్యంగా రాహుల్ సోమవారం సభలో చేసిన ప్రసంగానికి కౌంటర్‌గా ప్రధాని స్పీచ్ సాగింది. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్డీఏను ఓడించామనే భ్రమలో ఉందని ప్రధాని ఎద్దేవా చేశారు. వరుసగా మూడుసార్లు ప్రజలు కాంగ్రెస్‌ను 100 సీట్లలోపే పరిమితం చేశారని ప్రధాని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చింది 100 కాదని 99 సీట్లని గుర్తుచేశారు. మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన చోటే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయని, సింగిల్‌గా పోటీచేసిన చోట కాంగ్రెస్ చతికిలపడిందన్నారు.ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పిల్ల చేష్టలు చేస్తున్నారని, సింపథీ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. తాము పదేళ్ల పాలనలో కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని, ప్రపంచంలోనే భారత్‌ను మూడవ అతిపెద్ద ఎకానమిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. చివరగా ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ప్రధాని సంతాపం ప్రకటించారు. నీట్‌పై ప్రకటన చేసిన ప్రధాని నీట్ అక్రమాలపై పార్లమెంట్లో ప్రభుత్వంపై విపక్షాల ఒత్తిడి పనిచేసింది. ప్రధాని లోక్‌సభ ప్రసంగంలో నీట్ పేపర్‌లీక్‌పై స్పందించారు. పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసుకుంటామన్నారు.స్పీచ్ తొలగించడంపై రాహుల్ షాక్..అంతకుముందు రాహుల్‌గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంలో కొన్ని వివాదాస్పద అంశాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ఈ ప్రకటనపై రాహుల్‌గాంధీ స్పందించారు. తన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్‌ను తొలగించటంపై షాక్‌కు గురయ్యానన్నారు. తన మాటాలను పునురుద్ధరించాలని స్పీకర్‌కు ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈవీఎంలపై అఖిలేష్ సంచలన కామెంట్స్.. లోక్‌సభ మార్నింగ్ సెషన్లో మాట్లాడిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇండియా కూటమి నైతిక విజయం సాధించిందన్నారు. బీజేపీ 400 సీట్ల నినాదం విఫలమైందన్నారు. జూన్ 4 నుంచి మత రాజకీయాలకు విముక్తి లభించిందని తెలిపారు. వర్షాలు వస్తే ఉత్తరప్రదేశ్‌లో నగరాలు చెరువులయ్యాయని విమర్శించారు. తమకు 80 సీట్లు వచ్చిన ఈవీఎంలను నమ్మేది లేదని అఖిలేష్ తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడిచేది కాదని, పడిపోయే ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.ఎన్నికలు బాండ్లు పెద్ద స్కామ్: కేసీ వేణుగోపాల్ కాగా, రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని వ్యాఖ్యానించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీలో పాలనలో ఢిల్లీ ఎయిర్ పోర్టు, జబల్పూర్ ఎయిర్‌పోర్టుల పైకప్పులు కూలిపోయాయన్నారు. అయోధ్యలో రోడ్లు అధ్వానంగాఉన్నాయని, రామ మందిరంలో నీరు లీక్ అవుతోందన్నారు. ముంబై హార్బర్ లింక్ రోడ్డుకు పగుళ్లు వచ్చాయని విమర్శించారు. ఉదయం ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశంఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభానికి ముందు ఎన్డీయే కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్లో ఎంపీలంతా నిబంధనలను పాటించాలని కోరారు. లోక్‌సభ ఎంపీల ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలా వ్యవహరించవద్దని హితవు పలికారు. ఎంపీలు అభివృద్దిపై దృష్టి పెట్టాలని, సభ జరగుతున్నప్పడు ఎక్కువ సమయం సభలోనే ఉండాలన్నారు. రాజ్యసభలో ఖర్గేకు చైర్మన్ షాక్..బీజేపీ, ఆర్ఎస్ఎస్పై ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే రాజ్యసభలో సోమవారం తన ప్రసంగంలో భాగంగా చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. తిరిగి మంగళవారం కూడా చైర్మన్ ధన్‌ఖడ్, ఖర్గే మధ్య వాదనలు జరిగాయి. చైర్మన్ సీటుకు ఖర్గే అసలు గౌరవమే ఇవ్వడం లేదని దన్ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే స్థానంలో జైరాం రమేష్ ఉంటే బాగుండేదని ధన్‌ఖడ్ అనడం చర్చనీయాంశమైంది. ఇక కాళ్ల నొప్పులతో తాను నిల్చొని మాట్లాడలేకపోతున్నాని ఖర్గే అనడంతో కూర్చొని మాట్లాడేందుకు ధన్‌ఖడ్ అనుమతించారు. తనను ప్రతిపక్ష నేత స్థానంలో కూర్చోబెట్టింది సోనియాగాంధీ అని ఖర్గే అన్నారు. -
రాహుల్ వర్సెస్ బీజేపీ.. దద్దరిల్లిన లోక్‌సభ
ప్రతిపక్షనేతగా లోక్‌సభలో రాహుల్‌గాంధీ తన గళం విప్పారు. పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు వేదికగా నిలదీశారు. ప్రతిపక్షనేతగా ముందు ముందు తన శైలి ఎలా ఉండబోతుందనేదానిపై తొలి సెషన్లోనే సంకేతాలిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణమయ్యాయి. ఈ సందర్భంగా మోదీ మొదలుకుని అమిత్ షా ఇతర బీజేపీ నేతలు రాహుల్‌పై ఎదురుదాడికి దిగారు. వీరికి సమాధానం చెబుతూనే అటు స్పీకర్ ఓంబిర్లాకు రాహుల్ పలు సూచనలు చేశారు. రాహుల్ ప్రసంగిస్తుండగా బీజేపీ ఎంపీలు పదే పదే అంతరాయం కలిగించారు. మొత్తంగా సోమవారం(జులై1)న లోక్‌సభలో రాహుల్ వర్సెస్ ఆల్ అన్నట్లుగా మారింది. పదేళ్లలో నేనూ బాధితుడినే.. దేశమంతా ఏకమై రాజ్యాంగాన్ని రక్షించేందుకు కృషి చేసిందని రాహుల్‌గాంధీ అన్నారు. గత పదేళ్లలో బీజేపీని ఎదుర్కొన్న లక్షలాదిమందిపై దాడి జరిగిందని ఆరోపించారు. తానూ బాధితుడినేనని తనపై చాలా కేసులు మోపారన్నారు. నాకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. నా ఇల్లు తీసేసుకున్నారు. ఈడీ విచారణను 55 గంటల పాటు ఎదుర్కొన్నానని రాహుల్ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్షంలోనే సత్యం ఉందన్నారు. పవర్లో ఉండటం కంటే ఇదే గొప్పదన్నారు.శివుడి ఫొటో చూపిస్తూ మాటల తూటాలు..ప్రసంగంలో ఆర్ఎస్ఎస్, బీజేపీపై విమర్శల దాడి చేసిన రాహుల్ గాంధీ సభలో ఒక సందర్భంలో శివుని ఫొటో చూపించారు. శివుని ఎడమ చేతి వెనుక ఉన్న తత్రిశూలం హింసకు గుర్తు కాదన్నారు. హింసకే అయితే కుడిచేతిలో ఉండేదని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు రూల్స్ ఒప్పుకోవని స్పీకర్ ఓం బిర్లా రాహుల్‌కు చెప్పారు.ప్రధానితో సహా బీజేపీ నేతల ఎదురుదాడి.. ఇంతలో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్ పేర్కొనడం సరైనది కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రధాని, షా వ్యాఖ్యలకు రాహుల్ స్పందించారు. తాను కేవలం బీజేపీని ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ స్పష్టం చేశారు.రైతులకు కనీసం సంతాపం తెలపలేదు..రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్ల ప్రస్తావన లేదని, నీట్‌ను వాణిజ్య పరీక్షగా మార్చారని రాహుల్ ఆరోపించారు. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారికి సంతాపంగా సభలో కనీసం మౌనం కూడా పాటించలేదని విమర్శించారు. బీజేపీ హయాంలో రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఫైర్ అయ్యారు. మీ విధానలతో ప్రజలకు ఒరిగిందేంటి..దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా ప్రధానే చెప్పిన విషయాన్ని రాహుల్ సభలో గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను రెండు ముక్కలు చేసిందని మండిపడ్డారు. అల్లర్లతో మణిపుర్ అట్టుడికినా ప్రధాని అటువైపు వెళ్లలేదు.మణిపూర్‌లో తన కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.నోట్ల రద్దు వల్ల యువత ఉపాధి కోల్పోయిందన్నారు. జీఎస్టీ కారణంగా వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాల వల్ల దేశ ప్రజలకు కలిగిన లాభమేంటని రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.స్పీకర్‌కూ రాహుల్ చురకలు..ప్రసంగిస్తుండగా తన మైక్‌ను మళ్లీ కట్ చేశారని రాహుల్‌గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్ కట్ చేశారని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభలో స్పీకర్ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ. తొలి రోజు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు స్పీకర్ తలవంచారని, తాను షేక్ హ్యాండ్ ఇస్తే నిటారుగా నిలుచున్నారని రాహుల్ గుర్తుచేశారు. తన కంటే వయసులో మోదీ పెద్దవారైనందునే తలవంచానని స్పీకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. -
లోక్‌సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్‌గాంధీ
సాక్షి,ఢిల్లీ:లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ప్రసంగం వివాదానికి దారి తీసింది. సోమవారం(జులై1) ఆయన సభలో మాట్లాడుతూ బీజేపీపై లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. హిందుత్వ అంటే అబద్ధాలు ప్రచారం చేయడం, ద్వేషం పెంచడం కాదన్నారు.బీజేపీ మాత్రం ఇవే చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. హిందువులుగా చెప్పుకునే వాళ్లు హింస, అబద్ధాలు, ద్వేషం గురించే మాట్లాడతారు. ఇలాంటి వాళ్లు హిందువులు కాదన్నారు. సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్...స్పీకర్ అభ్యంతరం..అయితే రాహుల్ సభలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ శివుని ఫొటోనూ సభలో ప్రదర్శించారు. దీనిని స్పీకర్ ఓంబిర్లా తప్పుపట్టారు. సభలో ప్లకార్డులు, ఫొటోలు ప్రదర్శించడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..నా ఇల్లు, పదవి లాగేసుకున్నారువిపక్ష నేతలను, ఈడీ, సీబీఐలతో బెదిరిస్తున్నారుఈడీ నుంచి 55 గంటల విచారణ ఎదుర్కొన్నాపరమతాత్మ మోదీతో నేరుగా మాట్లాడతారుఅదికారం కంటే నిజం గొప్పదిప్రతిపక్షంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా, గర్వపడుతున్నాశివుడి ఎడమ చేతి వెనక త్రిశులం ఉంటుందిత్రిశూలం హింసకు చిహ్నం కాదుఒకవేళ త్రిశూలం హింసకు చిహ్నం అయితే, శివుడి కుడి చేతిలో ఉండేదికొందరికి ఆ చిహ్నం అంటే భయంసభలో గురునానక్ ఫోటోను సైతం ప్రదర్శించిన రాహుల్హిందూ సమాజం అంటే ఒక్క మోదీ కాదుహిందువులంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వారే కాదుసభలో ఉన్నావారు, బయటవారు కూడా హిందువులేరాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం..లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద ప్రసంగంపై ప్రధాని మోదీ అభ్యంతరం తెలిపారు. హిందువులు హింసావాదులన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువులపై దాడి అని మోదీ అని అభివర్ణించారు.అనంతరం మాట్లాడిన కేంద్రహోం మంత్రి అమిత్ షా రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా మైక్ మళ్లీ కట్ చేశారు.. రాహుల్లోక్‌సభలో తన మైక్‌ను మళ్లీ కట్ చేశారని రాహుల్‌గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్ కట్ చేశారని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. రాహుల్ వర్సెస్ స్పీకర్లోక్సభలో స్పీకర్ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ.మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తలవంచారని, తాను షేక్ హ్యాండ్ ఇస్తే నిటారుగా నిలబడే ఇచ్చారని రాహుల్ వ్యాఖ్యానించారు.దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. ‘ తన కంటే వయసులో మోదీ పెద్దవారు కాబట్టే తలవంచానని వివరణ ఇచ్చారు.రాజ్యాంగానికి మేము రక్షణగా నిలబడతాం: రాహుల్కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలో పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు రాహుల్. ‘ఈడీ విచారణను 65 గంటలు ఎదుర్కొన్నా అధికారం కంటే నిజం గొప్పది’ అని రాహుల్ స్పష్టం చేశారు. -
‘నీట్’పై మాట్లాడితే రాహుల్ మైక్ కట్ చేశారు’’
సాక్షి,ఢిల్లీ: నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం(జూన్28) వాయిదా పడ్డాయి. అంతకుముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై మాట్లాడుతుండగానే ఆయన మైక్ కట్ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. మైక్రోఫోన్లో మాట్లాడేందుకు అనుమతించాలని స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ విజ్ఞప్తి చేయడం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. నీట్‌పై ప్రధాని మోదీ ఏం స్పందించడం లేదని, సభలో యువత తరఫున రాహుల్ తన గొంతు వినిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇలాంటి సీరియస్ అంశంలో కూడా మైక్ కట్‌చేసి యువత గొంతు నొక్కుతున్నారని ట్వీట్లో కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ చేసిన మైక్‌కట్ ఆరోపణలపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. తాను ఎంపీల మైక్రోఫోన్ స్విచ్చాఫ్ చేయనని, అలాంటి నియంత్రణ ఏదీ తన వద్ద లేదని స్పీకర్ స్పష్టంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సమయంలో ఇతర విషయాలేవీ రికార్డు కావని తెలిపారు. -
స్పీకర్ ఎన్నిక.. ‘ఇండియా’ కూటమిలో చిచ్చు !
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ప్రతిపక్షాల తరపున స్పీకర్ పదవికి కె.సురేష్‌ను కాంగ్రెస్ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపిస్తోంది. స్పీకర్ పదవికి కె.సురేష్‌ను పోటీపెట్టేముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌బెనర్జీ పార్లమెంటు బయట మంగళవారం(జూన్25) మీడియాకు తెలిపారు. ‘మమల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చ జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏకపక్షంగా కె.సురేష్‌ను స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టింది’అని అభిషేక్ బెనర్జీ మీడియాకు చెప్పారు. ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.కాగా, 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బుధవారం(జూన్26) జరగనుంది. స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను బీజేపీ కోరినప్పటికీ అవి అంగీకరించలేదు. సాంప్రదాయానికి విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రతిపక్షానికి ఆఫర్ చేయకపోవడంతో స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టాయి. -
లోక్‌సభలో నినాదాల వివాదం.. స్పీకర్ కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండోరోజు మంగళవారం(జూన్25) కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణాలు చేసిన తర్వాత పలువురు ఎంపీలు చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు.BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath. Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024తమిళనాడులోని తిరువళ్లూర్ ఎంపీ శశికాంత్ సెంథిల్ రాజ్యాగం చేత పట్టుకుని తమిళ్లో ప్రమాణం చేశారు. ఈయన కూడా తన ప్రమాణం ముగిసిన తర్వాత ‘ఆదివాసీలు, దళితులు, మైనారిటీల మీద వేధింపులు ఆపండి. జై భీం, జై సంవిధాన్’అని నినదించారు. ఈయన కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా అప్పట్లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. The IAS officer who resigned after the abrogation of #Article370 in #Kashmir and #Tiruvallur's #Congress MP #SasikanthSenthil took oath in Tamil.When he said, "Stop the shameful atrocities against the Minorities, Dalits & Adivasis. Jai Bhim, Jai Sanvidhan" #BJP MPs protested.… pic.twitter.com/jv1uyp2pGu— Hate Detector 🔍 (@HateDetectors) June 25, 2024సభలో అసదుద్దీన్, శశికాంత్ సెంథిల్ చేసిన నినాదాలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ కలుగజేసుకుని ఎంపీలు చేసిన వివాదాస్పద నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. -
అసదుద్దీన్ నినాదాలతో లోక్‌సభలో దుమారం
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణం దుమారం రేపింది. మంగళవారం(జూన్25) తెలంగాణ ఎంపీల ప్రమాణాల్లో భాగంగా అసదుద్దీన్ కూడా ప్రమాణం చేశారు.ఈ ప్రమాణం ముగిసిన తర్వాత అసదుద్దీన్ చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. జై తెంగాణ, జై భీమ్, జై పాలస్తీనా అని అసదుద్దీన్ నినదించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ప్రొటెం స్పీకర్ మెహతాబ్ అసదుద్దీన్ నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. స్పీకర్ ప్రకటన అనంతరం వివాదం సద్దుమణిగింది. BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath. Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024 -
లోక్‌సభలో ధర్మేంద్ర ప్రదాన్‌కు ‘నీట్’ సెగ
న్యూఢిల్లీ: లోక్‌సభలో కొత్త ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా మోదీ 3.0 ప్రభుత్వానికి నీట్ పరీక్ష అక్రమాల సెగ తగిలింది. సోమవారం(జూన్24) లోక్‌సభలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు సీట్లో నుంచి వెళుతుండగా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై నిరసన తెలిపారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో సభను హోరెత్తించారు. ఇవేవీ పట్టించుకోకుండా ప్రదాన్ ఆయన ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో పాటు మార్కులు ఇష్టం వచ్చినట్లుగా వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. నీట్ అక్రమాలపై దేశవ్యాప్త నిరసనలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. -
పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి
సాక్షి,ఢిల్లీ : కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 272 మార్క్ దాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుని బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా, కేబినెట్ సభ్యులు, సహాయ మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. వారికి శాఖల కేటాయింపు సైతం పూర్తయింది. ఇక, లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఎనిమిది రోజులపాటు కొనసాగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జూన్ 24 నుంచి 25 ఈ రెండు రోజుల పాటు కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎంపిక జరగనుంది.స్పీకర్ రేసులో ఎవరున్నారంటే? రాజస్థాన్ కోట లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత ఓం బిర్లా 2019 నుంచి 2024 వరకు లోక్‌సభకు 17వ స్పీకర్‌గా పనిచేశారు. అయితే ఇటీవల సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో లోక్‌సభకు 18వ స్పీకర్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన ఓం బిర్లా స్థానంలో కొత్తగా ఎన్నికైన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పార్లమెంట్ సభ్యులను లోక్‌సభ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం టీడీపీ,ఏపీ బీజేపీ, జేడీయూ పోటీపడుతున్నాయి. -
ఇస్తారా.. ఆపుతారా? నామినేటెడ్ పదవుల భర్తీపై ఉత్కంఠ!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ నేతలు గంపెడాశతో ఉన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు పొందడం కోసం ఆశావహులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను రద్దు చేయగా.. జిల్లాస్థాయిలోనూ పలు పదవులను భర్తీచేయాల్సి ఉంది. ఈ నేపథ్యాన లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా.. ఆలోపే పదవులు భర్తీచేస్తారా, ఎన్నికల తర్వాతే పదవుల పందేరం ఉంటుందా అనే సందిగ్ధంలో ఆశావహులు ఉన్నారు. అయితే, పదవులు ఎప్పుడు భర్తీ చేసినా తమకే దక్కేలా నేతలు లాబీయింగ్‌లో నిమగ్నమయ్యారు.' రాష్ట్రస్థాయి పదవులే లక్ష్యం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు మిత్రపక్షమైన సీపీఐతో కలిసి కాంగ్రెస్ తొమ్మిది స్థానాలను దక్కించుకుంది. అలాగే మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులు దక్కాయి. ఈ నేపథ్యాన జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఈ ముగ్గురు నేతల అనుచరుల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన నేతలు ఉండగా.. పార్టీ అధికారంలోకి రావడంతో వీరంతా రాష్ట్రస్థాయి పదవులనే ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కూడా జిల్లాకు చెందిన కొండబాల కోటేశ్వరరావు కు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, బొర్రా రాజశేఖర్‌కు మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్, పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. దీంతో కాంగ్రెస్ హయాంలో కూడా జిల్లా నేతలకు రాష్ట్రస్థాయి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. జిల్లాస్థాయిలోనూ.. ఇక జిల్లాస్థాయి నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఏమీ లేదు. ఓ పక్క రాష్ట్రస్థాయి పదవుల కోసం ప్రయత్నిస్తూనే అది దక్కకపోతే ఉమ్మడిజిల్లా, జిల్లాస్థాయి పదవులు దక్కించుకోవాలనే వ్యూహంతో పలువురు నేతలు ఉన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలాగైనా పదవి పొందాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను రద్దు చేసిన నాటి నుంచే ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 14 వ్యవసాయ మార్కెట్లతో పాటు ఆలయాల పాలకవర్గాలు, ఇతర నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. త్వరలోనే లోక్‌సభ నోటిఫికేషన్! మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ తరుణాన నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే యత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను రద్దు చేయగా.. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులను కట్టబెట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. దీంతో త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని పలువురు భావించగా.. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తి కావొస్తున్నా అడుగులు పడలేదు. మొదట్లో లోక్‌సభ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఎన్నికల తర్వాత జరుగుతుందా అనే మీమాంస నెలకొంది. ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే పదవులు రాని వారు పార్టీ అభ్యర్థుల తరఫున పనిచేయరనే భావనతో కొంతకాలం ఆపుతారని ప్రచారం జరుగుతుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. జాబితా పెద్దదే.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు ప్రధాన అనుచరులుగా ఉన్న నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారు. భట్టికి ప్రధాన అనుచరులుగా మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో పాటు రాయల నాగేశ్వరరావు, నాగా సీతారాములు, పువ్వాళ దుర్గాప్రసాద్, జావీద్ కొనసాగుతున్నారు. అలాగే పొంగులేటికి బొర్రా రాజశేఖర్, మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మద్దినేని బేబిస్వర్ణకుమారి, మేకల మల్లిబాబు, తుమ్మలకు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్‌రెడ్డి, కమర్తపు మురళి, చావా నారాయణ అనుచరులుగా ఉన్నారు. ఇందులో కొందరు నామినేటెడ్, మరికొందరు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం. ఇవి చదవండి: బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం! మంత్రి కొండా సురేఖ -
త్వరలో ఢిల్లీకి కెసిఆర్.. ఏం చేయబోతున్నారు?
BRS అధ్యక్షుడు KCR మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. త్వరలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కెసిఆర్ చేస్తున్న మొదటిసారి పర్యటన ఇది. రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాదాన్యత ఏర్పడింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిఅర్ఎస్, బిజెపి ల మద్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరిగినా.. పొత్తు అవకాశాలను రెండు పార్టీల నేతలు కొట్టి పారేస్తున్నారు. కెసిఆర్‌తో పాటు BRS పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పొత్తుల్లేవు.. గిత్తుల్లేవు.! ఢిల్లీలో కెసిఆర్ రాజకీయ చర్చల కోసం వస్తున్నారన్న వార్తలను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారని ప్రశ్నించారు. "మేము కిషన్ రెడ్డి తో ఏమైనా ఎప్పుడైనా పొత్తుల గురించి ఊసెత్తమా? బండి సంజయ్ లక్ష్మణ్ కిషన్ రెడ్డి ఎందుకు ఎగిరి పడుతున్నారు? బీఆర్ఎస్ ఒక సెక్యులర్ పార్టీ, మా నాయకుడు కెసిఆర్ ఒక సెక్యులర్ నాయకుడు. ఇలాంటి వార్తలకు లీకులు ఇచ్చేది బీజేపీనే. అలాగే వార్తలు రాయించేది బీజేపీ." అన్నారు బాల్క సుమన్. పొత్తు ఊహగానాలకు అవకాశమిచ్చిందెవరు? సాధారణంగా బీఆర్ఎస్, బీజేపీ నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుంటాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. దానికి కొనసాగింపుగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. అలాగే ఎంపీ బండి సంజయ్ కూడా ఇదే అంశంపై ప్రకటన చేశాడు. ఇటీవల మల్లారెడ్డి ఏమన్నాడంటే.. "బీజేపీతో BRSకు పొత్తు ఉండే అవకాశం ఉంది, మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు మా ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లోనే లేరు, రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తే.. BRSకు మల్కాజ్ గిరి సీటు ఇస్తారు. BJPతో BRS పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు...పొయ్యేది లేదు" అన్నారు మల్లారెడ్డి. మల్లారెడ్డి మాటలకు నేపథ్యమేంటీ? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలుపై మల్లారెడ్డి మాట్లాడారు. బండి సంజయ్ ఏమన్నాడంటే.. "ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు BRS సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు. అయినా లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదు" అని స్పష్టం చేశారు. "బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే NDAలో బీఆర్ఎస్ను చేర్చుకోలేదు. ఎటుకాని BRS పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం.? ప్రస్తుతమున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? మొత్తం 119 మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30, 2023న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64, దాని మిత్రపక్షం సిపిఐకి 1, బీఆర్ఎస్కు 39 సీట్లు రాగా, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మరో రెండు నెలల్లో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ సారి పార్లమెంటు ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణంలో మార్పులు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
పదిహేడవ లోక్‌సభ.. ప్రధాని మోదీ లాస్ట్ స్పీచ్ ఇదే..
న్యూఢిల్లీ: తమ పాలనలో దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు 17వ లోక్‌సభ చివరిరోజు సమావేశాల్లో అయోధ్య రామమందిర తీర్మానంపై ప్రధాని మాట్లాడారు. గత ఐదేళ్లలో అద్భుతమైన మార్పులు ఆవిష్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. దేశాన్ని తామెప్పుడూ వెనకడుగు వేయనివ్వలేదన్నారు. 17వ లోక్‌సభను దేశం తప్పకుండా ఆశీర్వదిస్తుందన్నారు. ‘ఎన్నో ఏళ్ల కల అయిన కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకున్నాం. మార్గదర్శకంగా సెంగోల్‌ను స్థాపించుకున్నాం. కరోనా లాంటి విపత్కర పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. జీ20 సమావేశాన్ని నిర్వహించడం వల్ల భారత్ ప్రతిష్ట పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తోంది. పేపర్‌లెస్ పార్లమెంట్, డిజిటలైజేషన్ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పార్లమెంట్‌కు హాజరయ్యే సభ్యుల సంఖ్య పెరిగింది. ఈ ఐదేళ్లలో పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. రీ ఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. మార్పు దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. గత పదేళ్లలో దేశంలో ఉత్పాదకత పెరిగింది. ఈ టర్ములో పార్లమెంట్ సమావేశాల్లో చేసిన అనేక సంస్కరణలు గేమ్ చేంజర్లుగా మారాయి. ఉగ్రవాద నిర్మూళనకు తీసుకున్న చర్యల వల్ల కాశ్మీర్లో శాంతి పెరిగింది. ఆర్టికల్ 370 తొలగింపుతో రాజ్యాంగ నిర్మాతల ఆత్మకు శాంతి చేకూరింది. మహిళల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నారీశక్తి వందన్ చట్టం తెచ్చాం. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించి ముస్లిం మహిళల హక్కులను కాపాడాం. మేం చేసిన పనులు చూసి ముస్లిం ఆడబిడ్డలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుంది. వికసిత్ భారత్ ఫలాలు మన భావితరాలకు అందుతాయి. రాబోయే 25 ఏళ్లు భారత్‌కు ఎంతో కీలకం. ప్రశ్న ప్రతాల లీకేజీ యువత పాలిట శాపంగా మారింది. యువతకు అన్యాయం జరగకుండా గొప్ప నిర్ణయం తీసుకున్నాం. పేపర్ లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం తెచ్చాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను 17వ లోక్ సభ ఆమోదించింది. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతరిక్ష రంగంలో మనదేశ సత్తా చాటాం. ఆర్థిక సంస్కరణల ప్రక్రియలో ఎంపీలంతా పాలుపంచుకున్నారు’ అని ప్రధాని మోదీ తెలిపారు. ఇదీ చదవండి.. ఇండియా కూటమికి కేజ్రీవాల్ షాక్ -
పేపర్ లీక్ చేస్తే కోటి ఫైన్.. లోక్‌సభలో కేంద్రం బిల్లు
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి కేంద్రం ఇక చెక్ పెట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి జితేందర్‌సింగ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో పాలు పంచుకునే అధికారులు, లీకేజీకి పాల్పడే ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్లెం వేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత దీని కింద నేరం రుజువైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష,రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలోనూ ప్రస్తావించారు. ఇదీచదవండి.. పేటీఎంపై సీబీఐ,ఈడీల మౌనం దేనికి: కాంగ్రెస్ -
‘లోక్‌సభ’పై ఫోకస్! ఎంపీ ఎన్నికలపై పార్టీల కసరత్తు..
సాక్షి, ఆదిలాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో కసరత్తు షురూ చేశాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఎస్టీ రిజర్వుడ్ తెలిసిన విషయమే. ఆయా పార్టీలు జనవరి మధ్యలోనే అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఈ ఎంపీ స్థానం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ గెలుపొందింది. ఈ ఎన్నికలోనూ ఎలాగైనా గెలుపొందాలని ధీమాగా ఉంది. ఇక కాంగ్రెస్ ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ ఈ సారి మాత్రం సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. రెండు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఓట్లు సాధించడం ద్వారా బీఆర్ఎస్ కూడా విజయంపై నమ్మకంగా ఉంది. ఇదీ పరిస్థితి.. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు ఎంపీగా గెలుపొందారు. అప్పుడు 3,76,892 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన గొడం నగేష్ 3,18,665 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ 3,14,057 ఓట్లు సాధించారు. గడిచిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచినప్పటికీ పార్లమెంట్ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. బీఆర్ఎస్ అత్యధిక ఓట్లు సాధించింది. కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు తేడా ఉంటుందన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రా బోయే ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై దృష్టి.. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు దృష్టి సారించాయి. గురువారం రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో జరి గిన బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఇందులో ఆదిలా బాద్ ఎంపీ సోయం బాపూరావు, నిర్మల్, ఆదిలా బాద్, ముథోల్, సిర్పూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావుపటేల్, పాల్వాయి హరీష్‌బాబు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ పాల్గొన్నారు. కాగా ఈ సమావేశంలో సిట్టింగ్ ఎంపీలు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి తిరిగి పోటీ చేయాలని ఆదేశించినట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యంలో సోయం మరోసారి బరిలో నిలుస్తారా చూడాల్సిందే. ఇక బీఆర్ఎస్ కూడా సమాయత్తం అవుతుంది. జనవరిలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. వచ్చేనెల 3న ఆదిలాబాద్‌కు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ముఖ్యనేతలు ఈ సమావేశం నిర్వహిస్తుండగా, పార్లమెంట్ పరిధిలోని ముఖ్యలందరినీ ఆహ్వానించారు. కాగా గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన గొడం నగేష్ పేరే మరోసారి తెరపైకి వస్తుంది. ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇన్చార్జి మంత్రిగా సీతక్కను నియమించిన విషయం తెలిసిందే. ఆమె ఈ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులను సమన్వయం చేసుకొని అభ్యర్థి ఎంపిక విషయంలో ముందుకు కదులుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నరేశ్ జాదవ్‌తో పాటు ఎవరైన ఆదివాసీ అభ్యర్థిపై పార్టీ దృష్టి సారించినట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లు.. బీజేపీ: 4,48,961, బీఆర్ఎస్: 4,65,476, కాంగ్రెస్ : 2,52,286 -
నిజామాబాద్ ఎంపీ బరిలో నిర్మాత దిల్ రాజు..?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపులో పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఎంపీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అర డజను మంది నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ దక్కుతుందోననే అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.' పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు పలు వురు నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం రావడంతో నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పాటు జాతీయ అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో ప్రత్యేకత నెలకొంది. సానుభూతిపరంగా సునీల్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన ముత్యాల సునీల్‌రెడ్డి సైతం ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. స్వల్ప తేడాతో ఓడిపోయినందున సునీల్‌రెడ్డిపై సానుభూతి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీగా బరిలోకి దిగితే సానుకూల ఫలితం వస్తుందని సునీల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని దీటుగా ఎదుర్కోవడంతో సునీల్‌కు కొందరు పార్టీ సీనియర్లు కూడా మద్దతు ఇస్తున్నారు. దీంతో సునీల్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మైనారిటీ కోటాలో ఈ టికెట్ ఆశావహుల జాబితాలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ సైతం ఉన్నారు. మైనారిటీ కావడంతో సదరు ఓట్లు తనకు గంపగుత్తగా వస్తాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్టు ఆశించి విఫలమయ్యారు. దీంతో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జాబితాలో ఈరవత్రి.. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ కూడా ఎంపీ టికెట్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. బీసీ కోటాలో తనకు టికెట్టు ఇస్తే నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో ఉన్న బీసీ ఓట్లతో పాటు తన సామాజికవర్గానికి చెందిన పద్మశాలి ఓట్లు గంపగుత్తగా వస్తాయనే భావనలో ఉన్నారు. అదేవిధంగా మైనారిటీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌కే వస్తాయని భావిస్తున్నారు. సోషల్ ఇంజినీరింగ్ లెక్కల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో మాత్రమే కచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తనకు టికెట్టు ఇస్తే కులాల సమీకరణలో ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సైతం ఎంపీ టికెట్ ఆశించే వారి జాబితాలో ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండేలా చేసిన మానాలకు టికెట్టు కేటాయించాలని పలువురు అంటున్నారు. ఇదిలా జిల్లాలోని మోపాల్ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కూడా నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం తనవంతుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటారనే పేరుంది. ఈ నేపథ్యంలో ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరు ముఖ్యులకు.. ఇక ఉమ్మడి జిల్లాకు చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పీసీసీ అధ్యక్ష పీఠం రేసులో ఉన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. బీసీకి కేటాయిస్తే మహేష్కుమార్గౌడ్కే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఇచ్చి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌గౌడ్‌ను నియమించేందుకు పార్టీ అధిష్టానం యోచి స్తున్నట్లు తెలుస్తోంది. అయితే షబ్బీర్అలీకి మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర కేబినెట్లో బెర్త్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బోధన్ నుంచి గెలుపొందిన పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి కేబినెట్ ఖాయమైనట్లు తెలుస్తోంది. షబ్బీర్‌కు మంత్రి పదవి ఇస్తే జిల్లా నుంచి రెండు బెర్త్‌లు వచ్చినట్లే. ఇవి చదవండి: ప్రజా పాలన.. అపోహలొద్దు.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి -
మెదక్‌కు దామోదర.. జహీరాబాద్‌కు సుదర్శన్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను నియమించింది. అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు మెదక్ బాధ్యతలు అప్పగించింది. అలాగే జహీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డిని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, అందోల్(ఎస్సీ), జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట్, సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండడంతో కాంగ్రెస్ ఇన్చార్జిలను నియమించింది. ఇవి చదవండి: 'నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..' : ఎమ్మెల్యే పాయల్ శంకర్ -
Womens Reservation Bill 2023: ఇంకెంతకాలం నిరీక్షణ
మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేవలం చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం కాదు. ఇది మహిళల పట్ల పక్షపాతం, అన్యాయాన్ని తొలగించడానికి ఉద్దేశించినది. మహిళలకు ప్రత్యేకంగా వందనాలు అవసరం లేదు. అందరితోపాటు సమాన గౌరవాన్ని పొందాలని మహిళలు కోరుకుంటున్నారు. మహిళా కోటాను అమలు చేయడంలో జాప్యం తగదు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయనడం సరైంది కాదు. ఇంకా ఎంత కాలం నిరీక్షించాలి? రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమే – కనిమొళి, డీఎంకే ఎంపీ ఓబీసీ కోటా సంగతేంటి? చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు ప్రత్యేక కోటా కల్పించాలి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోతే పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చి బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎముంది? ఇది పోస్టు–డేటెడ్ చెక్కులాగా ఉంది. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేయాలి. మహిళా రిజర్వేషన్లను ఎప్పటి నుంచి అమలు చేస్తారో కచి్చతమైన తేదీ, టైమ్‌లైన్‌ను ప్రభుత్వం ప్రకటించాలి. దేశంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో కరువు నివారణ చర్యలపై చర్చించాలి – సుప్రియా సూలే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బడుగు వర్గాల మహిళలకు భాగస్వామ్యం కావాలి మహిళా రిజర్వేషన్లలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు భాగస్వామ్యం కల్పించాల్సిందే. ఈ మేరకు అవసరమైతే చట్టంలో సవరణలు చేయాలి. బడుగు వర్గాల మహిళలకు న్యాయం చేకూర్చాలి. – డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం దేశంలో మహిళలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ రిజర్వేషన్లను రాబోయే ఎన్నికల్లో అమలు చేయకుండా జాప్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అధికార బీజేపీ నాయకులు మహిళలపై ఎన్నో నేరాలకు పాల్పడ్డారు. వారిపై ఎలాంటి చర్యలకు తీసుకోలేదు. దేశంలో గత ఐదేళ్లలో మహిళలపై నేరాలు 26 శాతం పెరిగినప్పటికీ మోదీ ప్రభుత్వం స్పందించడం లేదు – హర్సిమ్రత్ కౌర్ బాదల్, శిరోమణి అకాలీదళ్ ఎంపీ మహిళా సాధికారతను అడ్డుకోవద్దు మహిళా రిజర్వేషన్లలో మైనారీ్టలకు కోటా కల్పించాలనడం అర్థరహితం. మతపరమైన రిజర్వేషన్లపై రాజ్యాంగం నిషేధం విధించింది. చట్ట ప్రకారం.. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుంది. వెంటనే అమలు చేయాలని కోరడం సమంజసం కాదు. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరించాల్సిందే. మహిళా సాధికారతను అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను కోరుతున్నా – స్మతి ఇరానీ, కేంద్ర మంత్రి, బీజేపీ నేత 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కేవలం 33 శాతం కాదు, కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ విషయంలో మీకు చేతనైతే మమ్మలి్న(తణమూల్ కాంగ్రెస్)ను పట్టుకోండి చూద్దాం – కకోలీ ఘోష్–దస్తీదార్, తణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పేరును ‘రీషెడ్యూలింగ్ బిల్లు’ అని పెడితే పోలా? ఈ బిల్లు ఒట్టి మాయ. షెడ్యూల్ ప్రకారం ఫలానా తేదీకల్లా అమల్లోకి వస్తుందని చెప్పలేము. అలాంటప్పుడు ఈ బిల్లుకు మహిళా రిజర్వేషన్ రీషెడ్యూలింగ్ బిల్లుగా మారిస్తే సరిపోతుంది’ అని తణమూల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మొయిత్రా సభలో ఎద్దేవా చేశారు. ఇదంతా పెద్ద గిమ్మిక్కు. – టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా -
మణిపుర్‌కు దక్కిందేమిటి..?
గత మూడు నెలలుగా అత్యంత ఘోరమైన, దారుణమైన పరిణామాలను చవిచూస్తున్న మణిపుర్ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండిపోయారని ఆరోపిస్తూ లోక్‌సభలో విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం గురువారం వీగిపోయింది. మోదీ వాక్పటిమ గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆయన రెండు గంటల పది నిమిషాల సుదీర్ఘ ప్రసంగం మరోసారి ఆ విషయాన్ని రుజువు చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగి, ఆయన సభకు రావటం అటు విపక్షాలతోపాటు ఇటు అధికార పక్షానికి కూడా కలిసొచ్చింది. విపక్ష స్వరం దీటుగా వినబడ టానికి రాహుల్ దోహదపడితే... ఆయనపైనా, కాంగ్రెస్‌పైనా నిప్పులు చెరిగేందుకు అధికారపక్షానికి అవకాశం చిక్కింది. అయితే క్షతగాత్రగా మారిన మణిపుర్‌కు ఏమాత్రం సాంత్వన చేకూర్చామన్నది ఇరుపక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సేవుంది. ఇది గతంలో అనేకమార్లు సభలో చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానాలవంటిది కాదు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి దాగుందంటూ 2018లో విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాసంతో కూడా దీన్ని పోల్చలేం. ఇది యావత్తు సమాజమూ సిగ్గుతో తలదించు కోవాల్సిన దురదృష్టకర ఉదంతాల పర్యవసానంగా చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానం. మణిపుర్లో దాదాపు అంతర్యుద్ధ పరిస్థితులేర్పడటం, పరస్పరం భౌతిక దాడులు చేసుకోవటం, నివాసాలు తగలబెట్టుకోవటంతో మొదలై... చివరకు మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టే హీన స్థితికి చేరు కోవటం చరిత్రలో కనీవినీ ఎరుగనిది. ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి ప్రజలు చెట్టుకొకరూ, పుట్టకొకరూ కావటం, అలా వెళ్లలేనివారిని సాయుధ మూకలు చిత్రవధ చేయటం, పోలీసులే తమ కస్టడీలో ఉన్న మహిళలను సాయుధ గుంపులకు అప్పగించాన్న ఆరోపణలు రావటం మామూలు విషయం కాదు. ఈ హింసాపర్వం మొదలై మూడు నెలలు దాటుతున్నా ఇప్పటికీ అక్కడ సాధారణ పరిస్థితులు నెల కొనకపోవటం, పోలీసులూ, కేంద్ర బలగమైన అస్సాం రైఫిల్స్ పరస్పరం నిందారోపణలు చేసు కోవటం దిగ్భ్రాంతికరం. ఆఖరికి లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని జవాబిస్తున్న సమయంలో కూడా మే 3 నాటి మరో దారుణ ఉదంతం వెలుగులోకొచ్చింది. ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె ఇంటిని తగులబెట్టారన్నది ఆ ఉదంతం సారాంశం. ఇప్పటికీ స్వస్థలాలకు వెళ్లే సాహసం చేయలేనివారు వేలాదిమందివుంటే, వెళ్లినవారు భయాందోళనల్లో మునిగి తేలు తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను సంజాయిషీ ఇచ్చుకునేలా చేయటంలో అవి శ్వాస తీర్మానం బ్రహ్మాస్త్రం వంటిది. అందునా రాక్షసమూకల కొమ్ముకాసిందన్న ఆరోపణలెదుర్కొంటున్న మణిపూర్ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకోవటంలో తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టడానికి దీనికి మించిన ఆయుధం లేదు. మూడురోజులపాటు ఇరుపక్షాల నేతలూ ప్రసంగించారు. అయితే ఆ వాగ్ధాటి హోరులో మణిపుర్ విషాదం మరుగున పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. ప్రధాన అంశాన్ని మరిచి సవాళ్లూ, ప్రతిసవాళ్లూ, అర్థరహితమైన ఆరోపణలూ విసురు కుంటూ రెండు పక్షాలూ కాలక్షేపం చేశాయి. వర్తమాన దుఃస్థితికి గతంలో పాలించిన కాంగ్రెసే కారణమని అధికారపక్షం అంటే... కేంద్ర బలగాలను ఉద్దేశపూర్వకంగానే వినియోగించుకోలేదనీ, అందువల్లే ఇంతటి హింస చెలరేగిందనీ విపక్షాలు ఆరోపించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపుర్ గురించి సవివరమైన ప్రకటనే చేశారు. అమిత్ షాయే మాట్లాడతారని మొదటినుంచీ అధి కారపక్షం చెబుతోంది. కాదు, ప్రధానే మాట్లాడాలన్నది విపక్షం డిమాండ్. ప్రధాని సుదీర్ఘ ప్రసంగంలో మణిపుర్ ప్రస్తావన వచ్చింది. దుండగులపై చర్య తీసుకుంటామని, శాంతి నెలకొల్పుతా మన్న హామీ కూడా ఇచ్చారు. ఈశాన్యానికి తమ హృదయంలో కీలక స్థానమున్నదని చెప్పారు. మణి పుర్ మహిళలతో భుజం భుజం కలిపి నడుస్తామన్నారు. కానీ ఇది మాత్రమే సరిపోతుందా? అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మణిపుర్ ప్రజానీకానికి ఈ సభావేదిక నుంచి సహానుభూతి ప్రకటిస్తూ, ఈ ఉదంతాలు పునరావృతం కానీయబోమనీ, దోషులను కఠినంగా దండిస్తామనీ వాగ్దానం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించివుంటే దాని ప్రభావం వేరుగా ఉండేది. వారి పునరా వాసానికి అవసరమైన పథకాలు ప్రకటిస్తే బాగుండేది. అధికార పక్షం వీటిని విస్మరించిందనుకున్నా ప్రతిపక్షం మాత్రం చేసిందేమిటి? ప్రధాని ప్రసంగం పూర్తిగా వినకుండానే వాకౌట్ చేసింది. అధికార పక్షానికి తిరుగులేని మెజారిటీ ఉన్న సభలో అవిశ్వాసం చివరికేమవుతుందో అందరికీ తెలుసు. అయినా ఆ సందర్భంగా జరిగే చర్చలను ప్రజానీకం ఆసక్తిగా గమనిస్తుంది. విపక్షం ఏయే అంశాలపై అధికారపక్షాన్ని నిలదీస్తున్నదో, వాటికి అధికారపక్షం ఏం చెబుతున్నదో తెలుసుకోవ టమే ఆ ఆసక్తిలోని ఆంతర్యం. ఆ సందర్భంగా ఎవరి మంచిచెడ్డలేమిటో బేరీజు వేసుకుంటారు. ముఖ్యంగా మణిపుర్ ప్రజలూ, ఈశాన్య రాష్ట్రాల ప్రజానీకం తమకు జరగబోయే న్యాయం గురించి ఆలోచిస్తారు. కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికలు, అందులో గెలుపోటములే చర్చల్లో ప్రధానంగా వినబడ్డాయి. ఇది సరైందేనా? మణిపుర్ విషాదంపై సుప్రీంకోర్టు ఇప్పటికే చొరవ తీసుకుని లైంగిక హింసపై సాగే సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించింది. పునరావాసం, పరిహారం, ఆవాసాల, ప్రార్థనామందిరాల పునర్నిర్మాణం తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు రిటైర్డ్ మహిళా న్యాయమూర్తులతో కమిటీ ఏర్పరిచింది. తనవంతుగా చేయబోయేదేమిటో కేంద్రం ప్రకటిస్తే ఈ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు అర్థవంతమైన ముగింపు ఉండేది. -
అసలు మీది ఇండియానే కాదు.. రాహుల్‌కు స్మృతి ఇరానీ స్ట్రాంగ్ కౌంటర్
న్యూ ఢిల్లీ: బుధవారం జరిగిన లోక్ సభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపైనా ప్రధానిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అంతేస్థాయిలో తిప్పికొట్టారు. మీరసలు భారత దేశానికి చెందినవారే కాదన్నారు. బుధవారం పార్లమెంటు సమావేశాలు మొదలవుతూనే ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈరోజు సమావేశాల్లో లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి సభలో ప్రసంగించారు. ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం సందర్బంగా మాట్లాడిన రాహుల్ మణిపూర్ భారత దేశంలో భాగమన్న విషయాన్ని ప్రధాని మర్చిపోయారని, మణిపూర్ లో భారత మాతను చంపేశారన్నారు. రావణాసురుడు ఎలాగైతే కుంభకర్ణుడు, మేఘనాధుడు ఇద్దరి మాటలు విన్నాడో ప్రధాని కూడా ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల మాటలే వింటున్నారని విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం తన స్వార్ధ రాజకీయాల కోసం ఒకే దేశంలో రెండు మణిపూర్ లను సృష్టించారన్నారు. #WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "Bharat maa ki hatya ki baat karne wale kabhi bhi mez nahi thapthapate. Congressiyo ne baith kar maa ki hatya ke liye mez thapthapaai hai..." https://t.co/Nay92GDe4k pic.twitter.com/uAPE2YQIRN — ANI (@ANI) August 9, 2023 రాహుల్ మాట్లాడిన తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మణిపూర్ విభజించబడలేదు.. ఒక్కటిగానే ఉందన్నారు. ఆయన మణిపూర్‌లో భారత మాత చంపబడిందని అన్నారు. దానికి వారి మద్దతుదారులంతా చప్పట్లు కూడా కొట్టారు. కుటుంబపాలనలో దేశం చాలా నాశనమైంది. అందుకే కుటుంబపాలను స్వస్తి పలకాలి. అవినీతికి స్వస్తి పలకాలి అన్నారు. మీరనుకునే ఇండియా కాదిది. అవినీతి రహిత ఇండియా. ఇక్కడ కుటుంబపాలనకు చోటు లేదన్నారు. అసలు మీరు ఇండియాకు చెందిన వారే కాదన్నారు. నాడు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా నినదించినట్లు ఇప్పుడు మీ కుటుంబ పాలనకు,అవినీతి పాలనకు వ్యతిరేకంగా మరోసారి క్విట్ ఇండియా అంటూ నినదించాలన్నారు. #WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "Manipur is an integral part of India. Khandit na tha, na hai aur na kabhi hoga..." https://t.co/CIFqt9F5H4 pic.twitter.com/2uTrTWRG84 — ANI (@ANI) August 9, 2023 కశ్మీర్ లో గిరిజా టిక్కు అనే పండిట్ పై సామూహిక అత్యాచారం చేసి క్రూరంగా చంపేశారు. అదే విషయాన్ని సినిమాలో చూపిస్తే కొంతమంది కాంగ్రెస్ లీడర్లు దాన్ని దుష్ప్రచారమన్నారు. ఇప్పుడు విచిత్రంగా వారే మాట్లాడుతున్నారు. రాజ్జస్థాన్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న బిల్వారాలో అభంశుభం తెలియని పసికందుపై మానభంగం జరిగింది. ఇవేవీ మీకు కనిపించవా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆమె 1984లో కాంగ్రెస్ పాలనలో నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. చరిత్ర చూస్తే కాంగ్రెస్ పాలన అంతా రక్తసిక్తమై ఉంటుందని అన్నారు. -
అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించిన మమతా
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రెవేశ పెట్టిన సమయంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మీ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మోదీనే అధికారంలోకి వస్తారని అన్నారు. అమిత్ షా వ్యాఖలపై స్పందిస్తూ.. అమిత్ షా చెప్పింది కరెక్టే వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో INDIA కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీలో అధికారాలపై పట్టు కోసం ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం ఎలాగైనా పార్లమెంటులో బిల్లును ఆమోదింప చేసుకోవాలన్న మొండి పట్టుదలతో ఉంది. ఈ నేపధ్యంలో గురువారం బిల్లును ప్రవేశ పెడుతూ అమిత్ షా ప్రతిపక్ష INDIA కూటమిని టర్గెట్ చేసి.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే.. మీరంతా కొత్తగా ఏర్పడిన మీ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమంటూ వ్యాఖ్యలు చేశారు. సమావేశాల అనంతరం విపక్ష కూటమిలో ప్రధాన సభ్యురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విలేఖరుల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ అమిత్ షా చెప్పింది వాస్తవం. ఢిల్లీలోనే పార్లమెంటు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారం INDIA కూటమిదే. మాతృభూమిని కాపాడుకోవడం కోసమే INDIA కూటమి ఏర్పడిందన్నారు. NDA బలహీనమైందని అందులోని వారంతా కూటమిని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్లిపోయారని అన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగి దేశం మరింత దయనీయ స్థితికి చేరకుండా, మతపరమైన విద్వేషాలు చెలరేగకుండా ఉండాలంటే మా కూటమి అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. వారు దేశమంతా కాషాయమయం చేసేస్తామంటున్నారు. మాకు కూడా కాషాయమంటే ఇష్టమే... కానీ మిగతా రంగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి’ -
సుశాంత్ మృతిలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? దర్యాప్తు స్టేటస్ ఏంటి?
న్యూఢిల్లీ: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ కేసు విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే క్యాంప్ ఎంపీ రాహుల్ షెవాలే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? సీబీఐ దర్యాప్తు స్టేటస్ ఏమిటి? అని ప్రశ్నించారు ఎంపీ. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఆదిత్య ఠాక్రే 44 సార్లు ఫోన్ చేసినట్లు గతంలో తేలిందని గుర్తు చేశారు. లోక్‌సభలో షిండే వర్గం ఎంపీ రాహుల్ షెవాలే మాట్లాడుతూ..‘ఏయూ నుంచి రియా చక్రవర్తికి 44 సార్లు ఫోన్ వెళ్లింది. ఏయూ అంటే ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే అని బిహార్ పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రస్తుత స్టేటస్ ఏంటి?’అని ప్రశ్నించారు. తిప్పికొట్టిన ఆదిత్య ఠాక్రే.. లోక్‌సభ వేదికగా తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు ఆదిత్య ఠాక్రే. సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే వారి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఊహించలేమని విమర్శలు గుప్పించారు. ‘నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పగలను. సొంత పార్టీకి, ఇంట్లో విధేయుడిగా ఉండని వారి నుంచి ఇంతకు మించి ఆశించలేం. ఇది కేవలం సీఎం ఏక్నాథ్ షిండే భూకుంభకోణం, రాష్ట్ర ప్రముఖులను అవమానించిన అంశాలను పక్కదారిపట్టించేందుకే చేస్తున్నారు. అలాంటి నిరాధారమైన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు.’ అని స్పష్టం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఏయూ అనే వ్యక్తికి మధ్య పలుమార్లు ఫోన్ కాల్స్ నడిచినట్లు 2020లోనే ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 44 కాల్స్ వెళ్లినట్లు పేర్కొంది. సుశాంత్ సింగ్ మరణంపై ఆదిత్య ఠాక్రే మౌనంగా ఉండిపోవడంతో ఏయూ అంటే ఆదిత్య ఠాక్రే అని బిహార్ ప్రభుత్వం ఆరోపించింది. యాదృచ్చికంగా ఆ సమయంలో ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ ఖాతా @AUThackeray అని ఉండటం ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఇదీ చదవండి: సుశాంత్.. నువ్వు లేకుండా జీవితం లేదు: రియా భావోద్వేగం -
దేశంలో చెలామణిలో ఉన్న నోట్ల విలువ...రూ.31.92 లక్షల కోట్లు..
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో రూ.31.92 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో చెప్పారు. ‘‘జీడీపీలో వృద్ధి, ద్రవ్యోల్బణం, పాడయిన నోట్లకు బదులు కొత్త నోట్లను చెలామణిలోకి తేవడం, నగదుయేతర చెల్లింపుల సరళికి అనుగుణంగా ఆర్థికవ్యవస్థలో కరెన్సీ నోట్ల సంఖ్య ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నల్లధనాన్ని అరికట్టేందుకు పరిమిత నగదు వ్యవస్థతోపాటు డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడం ఆర్బీఐ, కేంద్రం బాధ్యత’’ అన్నారు. మరోవైపు, 60 పాత చట్టాల రద్దుకు, ఒక చట్టంలో సవరణకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే భూ సేకరణ (గనులు) చట్టం (1885), టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం(1950) వంటివి రద్దవుతాయి. చదవండి: ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్ -
తవాంగ్ ఘర్షణపై లోక్‌సభలో రాజ్‌నాథ్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తవాంగ్ సెక్టార్ ఘటనపై లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. చైనా ఆర్మీ మన భూభాగంలోకి వచ్చేందుకు యత్నించిందని, చైనా కుత్రంతానికి భారత బలగాలు దీటుగా బదులిచ్చాయని స్పష్టం చేశారు. భారత పోస్టును ఆక్రమించేందుకు చైనా జవాన్లు యత్నించినట్లు పేర్కొన్నారు. సరైన సమయంలో భారత బలగాలు స్పందించటంతో పీఎల్ఏ సైన్యం తోకముడుచుకుని తిరిగి వారి పోస్టులోకి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. భారత సైనికుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడలేదన్నారు. ‘డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్లో పీఎల్ఏ బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నించాయి. చైనా కుతంత్రాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. వారిని వెనక్కి వెళ్లేలా చేశాయి. ఈ అంశాన్ని దౌత్యపరమైన విధానంలో చైనా ముందుకు తీసుకెళ్తాం. మన సరిహద్దులను కాపాడేందుకు, ఎలాంటి సంఘటనలు ఎదురైనా తిప్పికొట్టేందుకు మన బలగాలు సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇస్తున్నాం. ఈ ఘర్షణలో ఇరువైపుల కొద్ది మంది సైనికులు గాయపడ్డారు. మన సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు, తీవ్రంగా గాయపడలేదు. మన బలగాలు సరైన సమయంలో స్పందించటంతో పీఎల్ఏ సైనికులు తిరిగి వారి వారి ప్రాంతానికి వెళ్లిపోయారు.’ - రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. తవాంగ్ ఘర్షణ తర్వాత డిసెంబర్ 11న స్థానిక కమాండర్ చైనా కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు రాజ్‌నాథ్. ఈ సందర్భంగా సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకే తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా కమాండ్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై... శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
పూణే: లోక్‌సభ, శాసన సభల్లో మహిళల రిజర్వేషన్ విషయమై కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ఉత్తర భారతదేశం సానుకూలంగా లేదని, వాళ్లు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ మేరకు శనివారం పూణే డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన కుమార్తె లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలేతో పాల్గొని ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలోనూ అన్ని రాష్ట్రాల శాసన సభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలని రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయలో దేశం ఇంకా మానసికంగా సిద్ధంగా లేనట్టుంది అని శరద్ పవర్‌ని మీడియా ప్రశ్నించగా...దీనికి ఆయన సమాధామిస్తూ...తాను కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్లో ఈ అంశంపై మాట్లాడుతున్నానని పవార్ అన్నారు. ముఖ్యంగా అందుకు ఉత్తర భారతదేశం సుముఖంగా లేదని స్పష్టం చేశారు. తాను ఒకసారి ఈ అంశంపై ప్రసంగిస్తుంటే తమ పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీలు లేచి వెళ్లిపోయారని చెప్పారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన వారే దీన్ని జీర్ణించుకోలేకపోత్నురని తనకు అప్పుడే స్పష్టమైందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని శరద్‌పవార్ అన్నారు. అంతేగాదు తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ..జిల్లా పరిషిత్, పంచాయితీ సమితి వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టానని, మొదట్లో వ్యతిరేకించిన తర్వాత ప్రజలే దానిని ఆమోదించారని చెప్పుకొచ్చారు. (చదవండి: యడ్డి తనయుడిపై లోకాయుక్తాలో కేసు) -
భారత్‌లో 3,291 విదేశీ కంపెనీలు
న్యూఢిల్లీ: దేశంలో నమోదైన 5,068 విదేశీ కంపెనీల్లో 2022 జూలై 27వ తేదీ నాటికి 3,291 కంపెనీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సోమవారం వెల్లడించారు. క్రియాశీలంగాలేని విదేశీ కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించడం లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కంపెనీల చట్టం, 2013ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. దేశంలో పనిచేస్తున్న కంపెనీలు ఈ చట్టం కింద తప్పనిసరిగా నమోదుకావాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం పొందిన తర్వాత విదేశీ కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) ఢిల్లీలో నమోదవుతాయి. విదేశీ క్రియాశీల కంపెనీలు తప్పనిసరిగా చట్ట ప్రకారం స్టాట్యూటరీ ఫైలింగ్ జరుపుతాయి. వివిధ చట్ట పరమైన అంశాలకు అనుగుణంగా పనిచేస్తాయి. ఆయా అంశాలపై లోక్‌సభలో మంత్రి లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. భారతదేశంలో 1,777 విదేశీ కంపెనీలు తమ వ్యాపార కార్యాలయాను మూసివేసినట్లు చెప్పారు. షెల్ కంపెనీల నిర్వచనం లేదు: కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం, రిజిస్టర్డ్ విదేశీ షెల్ కంపెనీలను నిర్వచించలేదని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘కంపెనీల చట్టంలోని సెక్షన్ 2(42)లోని నిబంధనలు విదేశీ కంపెనీలు నిర్వచనాన్ని ఇస్తున్నాయి. దీని ప్రకారం భారతదేశం వెలుపల ఒక కంపెనీ లేదా సంస్థ రిజిస్టరై, అది భారతదేశంలో స్వయంగా లేదా ఏజెంట్ ద్వారా, భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా ఏవైనా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుంది. ఇలాంటి కంపెనీని చట్టం విదేశీ కంపెనీగా పేర్కొంటోంది’’ అని సింగ్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన బ్రాంచ్ ఆఫీస్ అద్దె ఒప్పందం అమలు నిలిచిపోవడం, చెల్లుబాటు గడువు ముగియడం వంటి కారణాల వల్ల భారతదేశంలో ఒక విదేశీ కంపెనీ క్రియాశీలంగా లేదని పరిగణిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 119 కేసుల విచారణకు ఎస్‌ఎఫ్‌ఐఓకు ఆదేశాలు.. 2017–18 నుండి ఇప్పటి వరకు 119 కేసులను విచారించాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపింది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అలాగే 2022–23 జూన్ 30వ తేదీ వరకూ కార్పొరేట్ మోసానికి పాల్పడిన ఏ లిస్టెడ్ కంపెనీని గుర్తించలేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తెలియజేసినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. -
ఐదేళ్లలో కేంద్రం ప్రకటనల ఖర్చు రూ.3,339 కోట్లు
న్యూఢిల్లీ: 2017–18 నుంచి ఈ ఏడాది జూలై 12వ తేదీ దాకా.. ఐదేళ్లలో మీడియాలో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం ఈ సొమ్ము వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు, రూ. 1,756.48, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు రూ.1,583.01 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. -
మర్యాద మంటగలుస్తోంది.. నోరు.. జారిపోతున్నాం!
నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయం.. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఏదో అంశంపై వేడి వేడిగా చర్చ జరుగుతోంది. ప్రఖ్యాత సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా ఆగ్రహంతో.. ‘ప్రధాని నెహ్రూ మొఘల్ చక్రవర్తుల కోర్టుల్లో చప్రాసీలుగా పనిచేసిన వంశం నుంచి వచ్చినవాడు..’ అని మాట తూలారు. తమ పూర్వీకులను అంతమాట అన్నా.. ‘నేను సాధారణ ప్రజల మనిషిని అని ఇన్నాళ్లుగా చెప్తునే ఉన్నాను. ఇప్పటికైనా గౌరవనీయ సభ్యుడు ఈ విషయాన్ని అంగీకరించారు’ అన్నారు నెహ్రూ నవ్వుతూ.. అది 1962.. చైనా దురాక్రమణపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది.. ఆక్సాయ్‌చిన్‌ను చైనా ఆక్రమించడంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ‘అది చాలా చిన్న భాగం అక్కడ గడ్డి కూడా మొలవదు. వ్యర్థ భాగమే’.. ఆ నిరసనకు అప్పటి ప్రధాని నెహ్రూ సమాధానం. ‘మరి నా తలపై కూడా ఏమీ మొలవట్లేదు. అది కూడా వ్యర్థమేనా?’.. స్వపక్షమే అయినప్పటికీ కాంగ్రెస్ ఎంపీ మహవీర్ త్యాగి చురక .. నెహ్రూ సహా అంతా ఘొల్లుమని నవ్వారు.. ►ఇక కొద్దికాలం క్రితం రాజ్యసభలో చర్చ.. ‘విదేశాలన్నా, వారి తెల్ల తోలు అన్నా భారతీయులకు మోజెక్కువ. తెల్లని వధువే కావాలనుకుంటారు..’ అంటూ వెటకారంతో దక్షిణాది మహిళల శరీరం, వారి ఛాయపైనా రాజ్యసభలో కామెంట్లు.. నిజానికి ఇక్కడ చర్చ అంశం ‘బీమాలోకి విదేశీ పెట్టుబడులు...’. కానీ కామెంట్స్ చేసినది స్త్రీలు, వారి శరీరాలపై.. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ఓ బిహార్ ఎంపీ తీరు ఇది.. ఈ వ్యాఖ్యలపై మహిళా సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా తన ‘మాట’ను వెనక్కి తీసుకోవడానికి ఆయన మొరాయించారు. ..ఇదీ ఇప్పటి పెద్దల సభలో మర్యాద. ►ఇక ఇప్పుడు అన్‌పార్లమెంటరీ పదాల (అమర్యాద నుంచి అసభ్యందాకా అర్థం రూపాంతరం చెందింది) గురించి మాట్లాడుకునే సందర్భం వచ్చింది. లోక్‌సభ ‘అన్‌పార్లమెంటరీ’ పుస్తకంలో కొత్తగా ‘కోవిడ్ వ్యాప్తి కారకుడు, సిగ్గుచేటు, వంచకుడు, అవినీతి పరుడు, అసమర్థుడు, కపటబుద్ధి’లాంటివి చేర్చారు. ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన జుమ్లా అనే పదాన్ని (మన స్థానిక నేతల నోటి నుంచి తరచూ వింటున్నాం) కూడా నిషేధించారు. ►‘మేం కొత్తగా చేర్చిందేమీ లేదు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో వద్దనుకుని తొలగించిన పదాలనే ఇప్పుడు మేమూ అన్‌పార్లమెంటరీ పదాల్లో చేర్చాం. 1954 నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది..’అని లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా చెబుతున్నారు.. అన్నీ మాట్లాడుకోవచ్చు, భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డేమీ ఉండదని అంటున్నారు. అమర్యాద.. బాగా పెరిగింది..! ►1954 నుంచి చేర్చుతూ పోతూంటే అన్‌పార్లమెంటరీ పదాలు, నిబంధనలు గట్రా కలిసి ఇప్పటికి ఏకంగా 900 పేజీల పుస్తకంగా తయారైంది. ఈ కరదీపిక మన రాజకీయ ఔన్నత్యానికి సూచికలాంటిది. పదునైన మాటలు, భావాలతో కూడిన ఈ పట్టిక రాజకీయ నేతల హుందాతనానికి ప్రతీక అనుకుందాం. కొంచెం అటు ఇటుగా అసెంబ్లీలు, శాసన మండళ్లకూ ఇవి వర్తిస్తాయి. ►‘పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..?’’.. ఇది ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తరచుగా కనిపిస్తున్న, వినిపిస్తున్న జోక్. మన నేతలు మాటలతో సభ్య సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఇదీ.. ►‘పెద్ద మగాడివా.. నోర్మూస్కో.. చెయ్యి తీస్తా.. నీయవ్వ.. గాజులు వేసుకోలే.. నాలుక కోస్తా..’.. ఇవన్నీ వీధి చివర గలాటాలోనో, రచ్చబండ దగ్గర గొడవలోనో వినిపిస్తున్నవి కాదు. అచ్చంగా మనం ఓట్లేసి.. ‘మా బతుకులు మార్చండి. మీరు చర్చలు చేసుకుని, మాట్లాడుకుని మా భవిష్యత్తు తీర్చిదిద్దండి’అంటూ చట్టసభలకు పంపిన గౌరవనీయ ప్రజాప్రతినిధులే చర్చలను ఇలాంటి మాటలతో రచ్చ చేస్తున్నారు. చదవండి: అన్పార్లమెంటరీకి నిర్వచనం ఇదే.. విపక్షాల సెటైర్లు అవినీతీ.. అమర్యాదే.. సమాజంపై వీటి ప్రభావం వంటి విషయాలు వదిలేసి ‘పొలిటికల్’గా చూస్తే.. ఈ అమర్యాద, అసభ్య (అన్‌పార్లమెంటరీ) పదాల లిస్టులు ఎందుకు పెరుగుతాయి? ‘పాలక పక్షం’అవసరం కోసమే కదా! లేటెస్ట్ లిస్టు చూడండి. ‘అవినీతిపరుడు.. అసమర్థుడు.. కపట బుద్ధి.. నియంత.. సిగ్గుచేటు’ఇలాంటి పదాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ‘‘ఈ పదాలు లేకుండా విపక్షాలు ఏం మాట్లాడుతాయి? ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేసే పనులే ఇవి కదా! వీటి గురించి మాట్లాడకుండా నోరు మూస్తే ఎలా?’’ అని విపక్షాలు భగ్గుమంటున్నాయి. ‘జై మోదీ’ తప్ప అన్నీ అన్‌పార్లమెంటరీ పదాలేనా అని విమర్శిస్తున్నాయి. ‘మీ అసమర్థతను, అవినీతిని, అబద్ధాలను ప్రజలకు చెప్పొద్దా? మేం అనొద్దా’అంటూ గగ్గోలు పెడుతున్నాయి. ఇలా వేటినైతే నిషేధిస్తూ వెళుతున్నారో.. అవే పదాలు పాలక, ప్రతిపక్ష రాజకీయాలకు పర్యాయపదాలు కావడం ‘అమృతోత్సవ భారతా’నికి గొంతులో గరళమే.. మరి పాలక పక్షాలు ఇలా తమకు అనువైన పదాల ‘లిస్టు’ను నిషేధిత జాబితాలో చేర్చడం ఇప్పుడే జరిగిందా..? ►2012లో యూపీఏ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. అప్పట్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తరచూ మాట్లాడే ‘అలీబాబా 40 దొంగలు, బద్మాష్, బ్లాక్మెయిల్..’వంటి పదాలను అన్ పార్లమెంటరీ లిస్టులో పెట్టింది. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మర్యాద పూర్వకంగా అమర్యాదకర లిస్టులు మారుతాయన్నమాట. ►మాటలు బుక్కుల్లోకి చేరుతున్నాయి.. కానీ బయటికి రాకుండా ఆగుతున్నాయా? అందరికీ సమాధానం తెలిసిన ప్రశ్నే ఇది. పార్లమెంటులో మాటలపై కోర్టులు జోక్యం చేసుకోలేవు. కానీ లోక్‌సభలో స్పీకర్, పెద్దల సభ చైర్మన్ వాటిని కంట్రోల్ చేయవచ్చు. మాటలను వెనక్కి తీసుకోవాలని సభ్యులను ఆదేశించవచ్చు. తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. రికార్డుల్లోంచి తొలగించవచ్చు. కానీ ఈ మాట చూడండి.. ►‘మీరు నిషేధించిన మాటలే వాడుతాను. కావాలంటే నన్ను సస్పెండ్ చేసుకోండి..’ అని టీఎంసీ నేత ఓబ్రియాన్ అంటున్నారు. ‘తగ్గేదేలే’అనే మన రాజకీయ వ్యవస్థకు, మనం పైన వేసుకున్న ప్రశ్నకు చక్కని సమాధానం ఇది. అయితే.. అసాధారణంగా స్వయంగా ప్రధాని మోదీ మాటలనే రాజ్యసభలో రికార్డుల నుంచి తొలగించిన సందర్భాలూ ఉన్నాయి. ►సభ్యులు మాట్లాడే మాటలను పార్లమెంట్ సిబ్బంది రాసుకుని, అందులో అభ్యంతరకరమైన మాటలను స్పీకర్‌కు ఇవ్వడం, స్పీకర్ వాటిని రికార్డుల నుంచి తొలగించడం ఒకప్పుడయితే ఓకే.. ఇప్పుడంతా లైవ్.. రికార్డుల నుంచి తొలగించేలోపే జనంలో ఆ మాటలన్నీ రికార్డయిపోతాయి. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఓ కుర్రాడి మాట.. ‘సభల్లో ఫైట్లే లైవ్‌లో చూస్తున్నాం.. ఇక తిట్లెందుకు కంట్రోల్ చెయ్యడం. సరదాగా ఉంటుందని కానీయండి..’అని.. చదవండి: ఏ పదాన్ని నిషేధించలేదు: లోక్‌సభ స్పీకర్ ఇది బాగుంది ‘ఖలిస్తానీ, చెంచా, చెంచాగిరీ, పిరికివాడు, క్రిమినల్, గాడిద, అహంకారి..’సభలో ఇలాంటివి మరొక వ్యక్తిని అనకూడదు. ఎవరిని వారే అనుకుంటే తప్పులేదట.. ఓ వెసులుబాటు ఇది బాగుంటుంది అధ్యక్షా.. మీ సభల్లోనే కాదు. మా వీధుల్లో కూడా.. ‘బట్టేబాజ్, బచ్చా, సన్నాసి, బేవకూఫ్, సాలే, గూట్లే, లఫంగి’వంటి పదాలు మారుమోగుతున్నాయి. ఇవి ఆపడానికి నిబంధనలు పెట్టండి.. మరిన్ని కరదీపికలు వేయండి.. ఓ విన్నపం మాటలకు ‘కట్టడి’ఉంది! రాజ్యాంగంలోని 105 (2) ఆర్టికల్ ప్రకారం.. ‘పార్లమెంటు సభ్యులు సభల్లో మాట్లాడే అంశాలపై ఏ కోర్టులో, ఎలాంటి విచారణ జరగడానికి వీల్లేదు’.. అంటే పార్లమెంటులో సభ్యులు మాట్లాడే మాటలకు రాజ్యాంగ రక్షణ ఉంది. కానీ చట్టసభల నిర్వహణ నిబంధనలు ఆయా సభల్లో సభ్యులు ‘సరిగా’ ప్రవర్తించేలా, ‘సరిగా’ మాట్లాడేలా చూసుకునే బాధ్యతను, అధికారాన్ని లోక్‌సభలో స్పీకర్‌కు, రాజ్యసభలో చైర్మన్‌కు దఖలుపర్చాయి. లోక్‌సభ నియమావళిలోని రూల్ 380, 381 ప్రకారం.. ‘సభలో జరిగే చర్చల్లో ఏవైనా మాటలు ఎవరినైనా అగౌరవపర్చేలా, అసభ్యంగా ఉంటే.. స్పీకర్ ఆ పదాలను సభ రికార్డుల నుంచి తొలగించవచ్చు’. 400 ఏళ్ల నాటి నుంచే ‘అన్ పార్లమెంటరీ’ గొడవ చట్ట, ప్రజాప్రతినిధుల సభల్లో ‘అన్ పార్లమెంటరీ’పదాల గొడవ ఈనాటిదేమీ కాదు. బ్రిటిష్ చరిత్రకారుడు పాల్ సీవార్డ్ రాసిన వివరాల ప్రకారం.. 1604వ సంవత్సరంలోనే సభ్యుల మాటలను తొలగించే ‘పని’ మొదలైంది. నాటి బ్రిటిష్ సభలో అంతకుముందు రోజు జరిగిన చర్చలో లారెన్స్ హైడ్ అనే న్యాయవాది వాడిన ‘అభ్యంతరకర’మాటలపై.. మరునాడు చర్చించి రికార్డుల నుంచి తొలగించారు. అప్పుడే ‘సభలో చర్చ జరిగే విషయాన్ని వదిలేసి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడకుండా స్పీకర్ నియంత్రించాలి’అని నిబంధననూ పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో ప్రతినిధుల సభలో ‘అబద్ధాలకోరు (లైయర్), మూగ (డంబో)’పదాలను ‘అన్ పార్లమెంటరీ’గా ప్రకటించుకుంది. ‘చిన్నపిల్లల్లా వ్యవహరించడం (చైల్డిష్నెస్)’అనే పదాన్నీ నిషేధించుకుంది. న్యూజిలాండ్ చట్టసభల్లో ‘కమ్మో (కమ్యూనిస్టు అనే పదానికి షార్ట్‌కట్)’పదాన్ని అనుమతించరు. కెనడాలో అయితే మరో అడుగు ముందుకేసి.. ‘దుష్ట మేధావి (ఈవిల్ జీనియస్), కెనడియన్ ముస్సోలిని (ముస్సోలిని అనేది ఒకప్పటి ఇటలీ నియంత పేరు), జబ్బుపడ్డ జంతువు (సిక్ యానిమల్)’వంటి పదాలూ నిషేధిత జాబితాలో పెట్టుకున్నారు. ఇవేకాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల చట్టసభల్లో పాలకవర్గాలు ‘అన్ పార్లమెంటరీ’మాటలను లిస్టుల్లో పెట్టేసుకుంటూనే ఉన్నాయి. నోటికి బట్టకట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. -సరికొండ చలపతి చదవండి: సభా విలువలు కాపాడాలి -
హత్యా రాజకీయాలు చేయడం బీజేపీ సంస్కృతి కాదు..
న్యూఢిల్లీ: బీజేపీ ఎప్పుడూ హింసను నమ్ముకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ‘సిద్ధాంత ప్రాతిపదికగానే ఎన్నికల్లో గెలుస్తున్నా. నాయకత్వానికున్న జనాదరణ, ప్రభుత్వ పనితీరు, పథకాల ఆధారంగా ఓట్లు అడుగుతాం తప్ప ప్రత్యర్థులపై హింసకు దిగడం బీజేపీ విధానం కాదు’ అన్నారు. లోక్‌సభలో ఓ చర్చకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను చంపడం, భార్యాపిల్లలపై అత్యాచారాలకు ఒడిగట్టడం, హత్యా రాజకీయాలు చేయడం బీజేపీ సంస్కృతి కాదని తృణమూల్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల తరబడి అంతర్గత ఎన్నికల ఊసే ఎత్తకుండా కుటుంబ రాజకీయాలు చేయడం కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలకు అలవాటని ధ్వజమెత్తారు. ముందుగా వాళ్ల పార్టీలో ఎన్నికలు జరుపుకుని ఆ తర్వాత దేశం గురించి మాట్లాడాలంటూ ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలన్నది బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతకు ముందు.. బీర్భూం హత్యాకాండపై సీబీఐ చేస్తున్న దర్యాప్తులో నిజ నిర్ధారణ కమిటీ ముసుగులో బీజేపీ వేలు పెడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధశారం ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్లందరినీ జైలుపాలు చేయాలన్న అజెండా దేశవ్యాప్తంగా నడుస్తోందని విమర్శించారు. తృణమూల్, పోలీసుల కుమ్మక్కుతో రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించిన నివేదికలో కమిటీ ఆరోపించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని సూచించింది. దీనిపై మమత మండిపడ్డారు. -
రుణ రికవరీలకు యూపీఏ ప్రభుత్వ చర్యలు శూన్యం
న్యూఢిల్లీ: రుణ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) మార్చిన వారి నుండి డబ్బును రికవరీ చేయడంలో గత యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సోమవారం తీవ్రంగా విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో బ్యాంకులు మొదటిసారి డిఫాల్టర్ల నుండి డబ్బును తిరిగి రాబట్టగలుగుతున్నాయని స్పష్టం చేశారు. రుణ ఎగవేతదారులపై ప్రభుత్వ చర్యల గురించి డీఎంకేకు సభ్యుడు టీఆర్ బాలు అడిగిన ప్రశ్న ఆమె ఈ మేరకు సమాధానం చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...వివిధ మోసపూరిత చర్యల ద్వారా చిన్న మొత్తాల పొదుపు డిపాజిటర్లను మోసం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుతో సహా పలు చర్యలు తీసుకోవడం జరిగింది. యాప్ ఆధారిత ఆర్థిక సంస్థల కార్యకలాపాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రుణాలను ‘‘రైట్ ఆఫ్’’ చేయడం అంటే ‘పూర్తిగా మాఫీ చేయడం‘ కాదు. బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి పొందేందుకు బ్యాంకులు తగిన ప్రతి చర్యనూ తీసుకుంటాయి. ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారి నుంచి రుణ బకాయిల రికవరీకి ప్రభుత్వ రంగ బ్యాంకులు తగిన అన్ని చర్యలూ తీసుకుంటాయి. ఎఫ్ఆర్డీఐ బిల్లుపై ఇలా... ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు, 2017 (ఎఫ్ఆర్డీఐ బిల్లు)ను కేంద్రం 2017 ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అటు తర్వాత దానిని సమీక్షించి నివేదిక పంపాలని కోరుతూ పార్లమెంట్ జాయింట్ కమిటీకి నివేదించడం జరిగింది. ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రధాన లక్ష్యం ఎంపిక చేసిన ఆర్థిక రంగ సంస్థల వివాదాలకు ప్రత్యేక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. కాగా, ప్రభుత్వం ఎఫ్ఆర్డీఐ బిల్లును 2018 ఆగస్టులో ఉపసంహరించుకుంది. మరింత సమగ్ర పరిశీలన, అ అంశంపై పునఃపరిశీలన ఈ ఉపసంహరణ ఉద్దేశం. అయితే అటు తర్వాత ఈ అంశానికి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. డిపాజిటర్లకు రక్షణ.. డిపాజిట్ల రక్షణకు సంబంధించి ఆమె చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే, ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఇన్సూరెన్స్ కింద బ్యాంకుల్లో డిపాజిటర్లకు బీమా కవరేజ్ పరిమితిని లక్ష రూపాయల స్థాయి నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. బ్యాంకుల్లో డిపాజిటర్లకు మరింత రక్షణ కల్పించాలన్నది ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నిర్ణయం 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దివాలా చర్యల పటిష్టత దివాలా ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరక్కుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటుందని ఆర్థికమంత్రి తెలి పారు. ప్రకటన ప్రకారం, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ల ఇన్సాల్వెన్సీ, లిక్విడేషన్ ప్రొసీడింగ్స్– అడ్జుడికేటింగ్ అథారిటీకి దరఖాస్తు నిబం« దనలు, 2019ను 2019 నవంబర్ 15న ప్రభుత్వం నోటిఫై చేసింది. బ్యాంకులు కాకుండా ఇతర ప్రొవైడర్లు లిక్విడేషన్ ప్రొసీ డింగ్స్‌లో ఎటువంటి అవరోధాలూ ఎదురుకాకూడదన్నది దీని లక్ష్యం. తదనంతరం రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణం కలిగిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకూ (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) దివాలా కోడ్, 2016 వర్తించేలా నిబంధనలను 2019 నవంబర్ 18న ప్రభుత్వం నోటిఫై చేసింది. -
మొత్తం మీరే చేశారు! టాటా చేతికి ఎయిర్ ఇండియా, లోక్ సభలో ఆసక్తికర చర్చ!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌నకు విక్రయించడంపై ప్రతిపక్షాల విమర్శలను పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తిప్పికొట్టారు. లాభాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోవడానికి యూపీఏ పాలనా విధానాలే కారణమని అన్నారు. ప్రజా ధనం సంరక్షణే లక్ష్యంగా కేంద్రం ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. లోక్‌సభలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్‌పై ఎనిమిది గంటల పాటు జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ... ఎయిర్ ఇండియా–ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనం, 111 కొత్త విమానాల కొనుగోలు, ద్వైపాక్షిక హక్కుల సరళీకరణ, ఎయిర్ నష్టాలకు కారణాల వంటి అశాలను ప్రస్తావించారు. తప్పని పరిస్థితిలోనే... మంత్రి ప్రకటన ప్రకారం, 2005కి ముందు ఎయిర్ ఇండియా ఏడాదికి రూ.15 కోట్లు, ఇండియన్ ఎయిర్‌లైన్స్ రూ.50 కోట్ల లాభా లను ఆర్జించేవి. ఈ విమానయాన సంస్థలు దాదాపు రూ. 55,000 కోట్లతో 111 విమానాలను కొనుగోలు చేయడం సంస్థలను తీవ్ర నష్టాల్లోకి నెట్టాయి. 14 సంవత్సరాల్లో రూ.85,000 కోట్ల నష్టాలు, రూ.54,000 కోట్ల ప్రభుత్వ ఈక్విటీ ఇన్ఫ్యూషన్, రూ.50,000 గ్రాంట్లు, రూ.66,000 కోట్ల నికర అప్పులు వెరసి ఎయిరిండియాను దాదాపు రూ.2.5 లక్షల కోట్ల సంక్షోభంలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లోనే ప్రధానమంత్రి ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్కు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఉద్యోగుల తొలగింపు ఉండదు మొదటి సంవత్సరంలో ఉద్యోగుల తొలగింపులు ఉండవని టాటాలతో షేర్‌హోల్డర్ ఒప్పందం స్పష్టంగా పేర్కొన్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. మొదటి సంవత్సరం తర్వాత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అందజేయడం జరుగుతుందని, అలాగే పదవీ విరమణ పొందిన పొందిన ఉద్యోగులకు జీజీహెచ్ఎస్ కింద వైద్య ప్రయోజనాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. -
ఈ నెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు
Parliament Budget Session: బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ఈనెల 14వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విడత మాదిరిగానే ఈసారి కూడా రాజ్యసభ, లోక్‌సభలు సమావేశాలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన సీటింగ్, ఇతర ఏర్పాట్లపై మంగళవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశమై చర్చించారు. బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో రాజ్యసభ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, లోక్‌సభ సాయం త్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఉభయ సభల సెక్రటరీ జనరళ్లు సమావేశమై దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గినందున తీసుకోవాల్సిన చర్యల ను చర్చించారు. బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో మాదిరిగానే చాంబర్లు, గ్యాలరీల్లో సభ్యులకు స్థానం కల్పించనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఉభయ సభల సంయుక్త సమావేశంతో జనవరి 31న మొదలైన విషయం తెలిసిందే. (చదవండి: ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు) -
మహిళా వివాహ వయసు పెంపు.?
-
‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి’
TIME: 5:00PM ►విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు. దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారంటూ లోక్‌సభలో ఆయన మాట్లాడారు TIME: 4:00PM ►జీఎస్టీ నష్టపరిహారం కింద గత నవంబర్ 3న రాష్ట్రాలకు 17 వేల కోట్లు విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 543 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఏప్రిల్ 20 నుంచి మార్చి 21 మధ్య కాలంలో జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రలకు విడుదల చేసిన 1,13,464 కోట్ల రూపాయలకు ఇది అదనం అని తెలిపారు. TIME: 3:30PM ►2021 రబీలో తెలంగాణాలో పంటల సాగుపై ఎలాంటి నిబంధనలు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. తెలంగాణాలో పంటల సాగుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పెట్టలేదని స్పష్టం చేశారు. 2021 రబీ సీజన్‌కు సంబంధించి వరి లేదా ఇతర పంటల సాగు పై కేంద్ర ఏమైనా నిబంధనలు విధించిందా.. అని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాగా రైతులు వరి సాగు చేయొద్దు, ఇతర పంటలు వేసుకోండి అని తెలంగాణ సీఎం కేసీఆర్ , తెలంగాణా ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం ప్రాధాన్యత సంతరించుకుంది. TIME: 12.05 PM ► ధాన్యం సేకరణ అంశంపై కేంద్రం వైఖరి పట్ల నిరసన తెలుపుతూ.. తాము.. శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ పార్లమెంటరీనేత కేశవరావు తెలిపారు. 11.15 AM ► ఏపీ తరహలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయ్యాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగ గీత లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వంగ గీత మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకం మహిళల ఆర్థిక పురోగతికి మరింత సహకరిస్తుందన్నారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మహిళల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల రుణపరిమితిని 10 నుంచి 12 లక్షలకు పెంచామని తెలిపారు. వడ్డీ మినహయింపుకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక పథకాలు ఉన్నాయని గిరిరాజ్ సింగ్ తెలిపారు. 10.55 AM ► 12 మంది ఎంపీల సస్సెన్షన్ వ్యవహరం రాజ్యసభను కుదిపేస్తుంది. విపక్ష సభ్యులు చైర్మన్ వేల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 10.45 AM ► వరిధాన్యం కొనుగొలు అంశంపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన బాటపట్టారు. కాగా, కేంద్రం వైఖరీకి నిరసనగా పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఎంపీలు తెలిపారు. 10.42 AM ► వ్యవసాయ చట్టాల ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహరం అందించాలని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన.. లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటిసును ఇచ్చారు. అదే విధంగా.. ఎంపీ దీపేందర్ సింగ్ హుడా రైతుల పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహరం ఇవ్వాలని కోరుతూ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. 10.22 AM ► నవంబరు 15వ తేదీని.. జనజాతీయ దివాస్‌గా గుర్తించినందుకు పలువురు నేతలు మోదీని సన్మానించారు. కాగా, నవంబరు 15న బిర్సాముండ జన్మించారు. 10.12 AM ► ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు ప్రహ్లద్ జోషి, అర్జున్‌రామ్ మేఘ్వాల్, ఇతర బీజేపీ నాయకులు సమావేశంలో పాల్లొన్నారు. 9.52 AM ► లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మనిష్ తివారి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 9.50 AM ► పార్లమెంట్లో సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల సవరణ బిల్లు 2021ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేషపెట్టారు. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం సభ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం పార్లమెంట్లో వరిధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కాగా, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
తిలా పాపం... తలా పిడికెడు!
అనుకున్నదే అయింది. అందరూ అనుమానించినట్టే అయింది. ఏ ప్రజాసమస్య పైనా తగిన చర్చ జరగకుండానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వర్షార్పణమయ్యాయి. అదీ... మొదట ప్రకటించిన ఆగస్టు 13 కన్నా రెండు రోజుల ముందే ముగిశాయి. ప్రతిపక్షాలు గొంతు చించుకున్నా పట్టించుకోని ప్రభుత్వం, సర్కారు సావధానంగా పోదామన్నా పట్టు వీడని విపక్షం, సాక్షాత్తూ పార్లమెంటరీ స్థాయీ సంఘం కబురు చేసినా సరే ఖాళీ లేదనే అధికార వర్గం, మంత్రి చేతిలోని ప్రకటనను చించివేసే సభ్యుల తెంపరితనం, పెద్దల సభలోనే బల్లలెక్కి అధ్యక్షుడి ఖాళీ కుర్చీ మీదకు నిబంధనావళిని విసిరేయగల దాదాగిరి, సమస్యల పరిష్కారం కన్నా ప్రతిపక్షాలదే తప్పు అన్న ప్రచారమే కీలకమని భావించిన పాలకులు, ప్రతిపక్ష మహిళా ఎంపీలపై మార్షల్స్ దౌర్జన్యం, మహిళా మార్షల్‌పై ఎంపీలే దాడి చేశారన్న పాలకపక్ష ఆరోపణలు – ఇలా ఈ విడత పార్లమెంట్లో ఎన్నెన్నో వివాదాలు, విషాద దృశ్యాలు. చివరకు, ఈ విడత కూడా విలువైన సభాసమయం వృథా అయింది. తిలాపాపంలో తలా పిడికెడు వాటా అన్ని పక్షాలకూ దక్కింది. లెక్కిస్తే – ఈ సమావేశాల్లో కేవలం 17 సార్లే సభ కొలువు తీరింది. నిజానికి, లోక్‌సభ 96 గంటలు పనిచేయాల్సి ఉండగా, కేవలం 21 గంటల 14 నిమిషాలే పని చేసింది. ఏకంగా 74 గంటల 46 నిమిషాల సమయం గందరగోళాలకే సరిపోయింది. వెరసి, నిరుడు పార్లమెంట్ ఉత్పాదకత 126 శాతం దాకా ఉంటే, ఈసారి ఏకంగా 22 శాతానికి పడిపోయింది. సాధారణంగా సభా నిర్వహణకు నిమిషానికి రూ. 2.5 లక్షలు, రోజుకు రూ. 9 కోట్లు ఖర్చవుతాయని లెక్క. అంటే విలువైన సమయంతో పాటు, ఎంత ప్రజాధనం వృథా అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ సమావేశాల్లో ప్రభుత్వం 13 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. మరో 20 బిల్లుల్ని ఆమోదించింది. చర్చకు అవకాశమివ్వకుండా, సంఖ్యాబలంతో కీలకమైన బిల్లులకు క్షణాల్లో ఆమోదముద్ర వేస్తూ పోయింది. ‘ఏ మాత్రం చర్చ లేకుండా దాదాపు 35కి పైగా బిల్లుల్ని పాస్ చేశారు. అనేక బిల్లుల్ని పార్లమెంటరీ సెలక్ట్ కమిటీకైనా పంపకుండానే ఆమోదిస్తున్నార’ని ప్రతిపక్షాల ఆరోపణ, ఆవేదన. సభకు అడ్డుపడి తమ వాదన వినిపించాలనుకోవడం, తామెత్తిన అంశంపై చర్చ జరగాలనడం ప్రతిపక్షాలు ఆది నుంచి చేసేదే. అధికారపక్షం ఎక్కడోచోట సర్దుకొని, అందుకు అంగీకరించడం సంప్రదాయం. కానీ, ఈసారి మోదీ సర్కారు విదేశీ నిఘా సాఫ్ట్వేర్ పెగసస్ వివాదంపై చర్చకు సై అనకుండా, తప్పుకు తిరగడంతో పీటముడి బిగిసింది. సమావేశాలకు ఒక్క రోజు ముందుగా బయటపడ్డ పెగసస్ పైనే చివరి దాకా ప్రతిష్టంభన సాగింది. అదే పట్టుకొని వేలాడిన ప్రతిపక్షాలు ఇతర అంశాలపై చర్చ లేవనెత్తడంలో విఫలమయ్యాయి. మరోపక్క ప్రతిపక్షాల అనుమానాల్ని నివృత్తి చేయాల్సింది పాలకులే. అధికారంలో ఉన్నవారే పెద్దమనసుతో ముందుకు రావడం ఎక్కడైనా మర్యాద, గౌరవం. కానీ, ఆపాటి విశాల హృదయం పాలకపక్షానికి లేకుండా పోయింది. పెగసస్‌పై ఐరోపా దేశాలు కొన్ని విచారణకు ఆదేశించినా, మనవాళ్ళు అందుకు సిద్ధమనలేదు. కేంద్ర ఐటీ మంత్రేమో ఫోన్లను తాము ట్యాప్ చేయలేదన్నారు కానీ, పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాకింగ్‌కు వాడారో లేదో చెప్పలేదు. రక్షణ మంత్రేమో లిఖిత పూర్వక ఏకవాక్య సమాధానంలో తమ శాఖ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదని సరిపెట్టారు. కానీ, దర్యాప్తు సంస్థలు దాన్ని వాడిందీ లేనిదీ సర్కారు సూటిగా జవాబివ్వలేదు. సభలో ప్రతిష్టంభనకు కారణం ప్రతిపక్షాలే అని ప్రచారం చేస్తే చాలనుకుంది. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి, మాట్లాడలేమంటూ తర్కం లేవదీసింది. ‘కరోనా రెండో వేవ్ మరణాలు స్వతంత్ర భారత ప్రభుత్వాలన్నిటి సమష్టి వైఫల్యం’ అంటూ ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా చేసిన భావోద్వేగభరిత ‘మాఫీనామా’ ప్రసంగమొక్కటే ఈ సమావేశాల్లో అందరినీ కదిలించింది. అధికార, విపక్షాలు రెంటి మధ్య ఒకే ఒక్క అంశంలో అరుదైన ఐక్యత కనిపించింది. అది – సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్ఈబీసీలు – వాడుకలో ఓబీసీలు) జాబితాను రాష్ట్రాలే తయారుచేసుకొనే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఓటుబ్యాంకు ఓబీసీల విషయంలో రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచాయి. అయితే, ఓబీసీల జాబితా రూపకల్పనకు రాష్ట్రాలకున్న అధికారాన్ని 2018లో మోదీ ప్రభుత్వమే తొలగించిందనీ, ఇప్పుడా తప్పు దిద్దుకొనేందుకు తాము సహకరించామనీ విపక్షాల వాదన. ఆ బిల్లు పని కాగానే సర్కారు ఈ సమావేశాలకు సెలవిచ్చేసింది. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో జరగాల్సింది ప్రజాసమస్యలపై విలువైన చర్చ. ఈ విడత సభలో చర్చలు లేవు. జరిగిందల్లా రచ్చ. దానితోనే చివరకు సమావేశాలు సమాప్తం కావడం విచారకరం. సభలో ఘటనలతో రాత్రి నిద్ర పట్టలేదంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగం చూపారు. అధికార – ప్రతిపక్షాల మంకుపట్టు, ఓబీసీ బిల్లు వేళ కూడా సభా నాయకుడు – హోమ్ మంత్రుల గైర్హాజరు, ప్రతిపక్షాల ప్రశ్నలకు కొన్నేళ్ళుగా సభలో జవాబివ్వని పాలకుల తీరు చూస్తుంటే నిజంగానే ప్రజాస్వామ్య వాదులకు కన్నీరొస్తుంది. లోక్‌సభ కొలువుదీరి రెండేళ్ళు దాటినా, ప్రతిపక్షాలకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవ డమూ విడ్డూరమనిపిస్తుంది. మూకబలానికే తప్ప, చర్చకు స్థానం లేనివేళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి రోజులు కావా అన్న అనుమానమొస్తోంది. ఇప్పుడిక దీని మీద చర్చ జరగాల్సిందే! -
లోక్‌సభలో పెగాసస్ ప్రకంపనలు
-
మహిళల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో నేర్పండి
మీరొక మహిళ అయుండి, మీ పేరో లేక మీకు తెలిసిన మహిళ పేరో ‘నవనీత’ అయుండి.. ఆ పేరును అలానే పలకాలా లేక నవ్‌నీత అని పలకాలా లేక ఇంకోలా పలకాలా అని సందేహం వచ్చినప్పుడు మీ దరిదాపుల్లో ఉన్న ఏ పురుషుడినైనా అడిగి డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. పేరు ఒక్కటే కాదు, మీ తీరు ఎలా ఉండాలో కూడా ఎనీ గన్నాయిని అడిగినా వారు చెప్పేస్తారు. అడగకున్నా చెప్పే జ్ఞానధనులు పురుషులు. బై బర్త్ ఎందుకనో వాళ్లు అలా నాలెడ్జిబుల్ గా ఉంటారు! ‘తిక్కల్’ అని మృదువుగా చేతిలోని నాలుగు వేళ్లతో స్త్రీ తలను తడితే చాలు ఇక ఏ మాత్రపు పురుషుడైనా ఆమెకు విషయ దిగ్దర్శనం చేసేయొచ్చు. అలా తనకు మాన్స్‌ప్లెయినింగ్ చేయబోయిన అరవింద్ అనే ఎంపీకి, నవనీత అనే ఎంపీ తగిన రీతిలోనే సమాధానం ఇచ్చారు. ‘‘సీఎంతో అలాగేనా మాట్లాడేది! నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకో’’ అని ఆయన. ‘‘ఆడవాళ్ల బాడీల పై ధ్యాస తగ్గించి, నీ లాంగ్వేజ్ సరి చేసుకో’ అని నవనీత. చెప్పడానికి అలవాటు పడిన పురుషులు వినడానికి ఇష్టపడతారా! నవనీత పూర్తి ప్రొఫైల్ తెలిస్తే అరవింద్ సావంతే కాదు, ఎవరైనా వింటారు. నవనీత్ కౌర్ లోక్‌సభ సభ్యురాలు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. స్వతంత్ర భావాలున్న వ్యక్తి కూడా. తండ్రి ఆర్మీ ఆఫీసర్. నటిగా, మోడల్‌గా రాణించారు. పంజాబీ అమ్మాయి. ఇరవైకి పైగా సినిమాల్లో నటించారు. వాటిల్లో ఎక్కువ సినిమాలు తెలుగువే. ‘‘సీఎంతో మాట్లాడేటప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్ సరిగా లేదు’’ అని తన గురించి మహారాష్ట్ర అధికార పార్టీ ఎంపీ అరవింద్ సావంత్ అన్నట్లు ఆమె దృష్టికి రావడంతో తీవ్రంగా స్పందించారు. ‘‘సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడేటప్పుడు మహిళల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో నేర్పితే నేర్చుకుంటాం’’ అని ఆమె అన్నారు. మహిళల బాడీ మీద ధ్యాస తగ్గించి, లాంగ్వేజ్‌ని అదుపులో పెట్టుకోవాలని కూడా ఆమె సావంత్‌కు సలహా ఇచ్చారు. అతడి మీద నవనీత్ చేసిన ఆరోపణ లు ఇంకా ఉన్నాయి. మనుషుల చేత ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడు. జైల్లో తోయిస్తానని అంటున్నాడు. ఆసిడ్ దాడులు జరుగుతాయని హెచ్చరిస్తున్నాడు. వీటన్నిటి పై ఇప్పుడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు. సస్పెండ్ అయిన ముంబై అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజెను అవినీతి కేసు నుంచి తప్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తను లోక్‌సభలో ప్రస్తావించినందుకే సావంత్ తనను బెదరిస్తున్నారని ఆమె లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో మొదలైన వివాదం ఇది. సినిమా, రాజకీయాలు, వ్యక్తిగత జీవితం.. ఈ మూడింటిలో నవనీత్ వ్యక్తిగతం జీవితం మరింత స్ఫూర్తిదాయమైనది. ఆమె భర్త రవి రాణా కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన బద్నేరా నియోజకవర్గం ఎమ్మెల్యేగా మూడోసారి కొనసాగుతున్నారు. ఆయనా స్వతంత్ర పార్టీ అభ్యర్థే. 2004 నుంచీ సినిమాల్లో నటిస్తున్న నవనీత 2011లో రాణాను వివాహం చేసుకున్నాక సినిమాలు మానేశారు. వాళ్ల పెళ్లి ఆదర్శవంతంగా జరిగింది. ఆ ఏడాది ఫిబ్రవరి 3 న ముంబైలో 3720 మంది వధూవరులతో ప్రభుత్వం నిర్వహించిన సామూహిక వివాహ మహోత్సవంలో వీళ్లదీ ఒక జంట! నాటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, బాబా రామ్ దేవ్ వంటి ప్రముఖులు హాజరై ఆశీస్సులు అందించారు. అప్పటికే రవి రాణా ఎమ్మెల్యే. తర్వాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నవనీత్ ఎన్.సి.పి. తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాతి ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ముప్పై ఐదేళ్ల నవనీత్ ముక్కుసూటిగా ఉంటారు. ఆ స్వభావం వల్లనే మహారాష్ట్ర రాజకీయాలలో బలమైన మహిళా శక్తిగా రాణిస్తున్నారు. అంతటి మహిళను బాడీ లాంగ్వేజ్ బాగోలేదని సావంత్ అనడంపై సాధికా సెహ్గల్ అనే కాలమిస్ట్ ‘అవుటర్ఫ్లై’ అనే వెబ్సైట్లో రాస్తూ.. ‘‘పేరు ఎలా పలకాలో పురుషులే నేర్పిస్తారు. ఏ బ్రాండ్ టాంపన్లు మంచివో పురుషులే సూచిస్తారు. ఆఖరి కి కరెక్ట్ బ్రా సైజ్ ఏదో కూడా వాళ్లే చెప్పడానికి వస్తారు. ఈ మాన్స్‌ప్లెయినింగ్ ఎంతకాలం సాగుతుంది’’ అని ప్రశ్నించారు. మ్యాన్స్‌ప్లెయినింగ్ అంటే మగవాళ్లు ఆడవాళ్లకు నిరంతరం సలహాలు ఇస్తూ ఉండటం. -
పీఎఫ్ డిపాజిట్ రూ.5 లక్షలపై పన్ను లేదు!
న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై 5 లక్షల వరకు జమ చేసుకునే వారికి వడ్డీపై పన్ను ఉండదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. 2021–22 బడ్జెట్లో భాగంగా.. భవిష్యనిధి ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి జమలు రూ.2.5లక్షలకు మించితే వడ్డీపై పన్ను వర్తిస్తుందంటూ మంత్రి ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆర్థిక బిల్లు 2021పై చర్చకు మంత్రి సమాధానమిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. 127 సవరణలకు కేంద్రం అంగీకారం తెలపడంతో ఫైనాన్స్ బిల్లు సభామోదం పొందింది. బుధవారం ఇది రాజ్యసభ ముందుకు రానుంది. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్‌పై చర్చకు సిద్ధం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను తీసుకురావాలన్న ప్రతిపాదనపై తదుపరి జీఎస్టీ కౌన్సిల్ భేటీలో చర్చించేందుకు సుముఖంగా ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల పన్నుల వాటాయే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో అధిక శాతంగా ఉన్న విషయం తెలిసిందే. పెట్రోల్ రిటైల్ ధరలో 60 శాతం, డీజిల్ విక్రయ ధరలో 53 శాతం పన్నులే. కేంద్రం, రాష్ట్రాలు రెండూ పెట్రోల్, డీజిల్‌పై పన్నులు విధిస్తున్నాయని మంత్రి పేర్కొంటూ.. అయినప్పటికీ కేంద్రం వసూలు చేసిన పన్నులను రాష్ట్రాలతో పంచుకుంటున్నట్టు చెప్పారు. తదుపరి జీఎస్టీ సమావేశంలో రాష్ట్రాలు ఈ ప్రతిపాదనతో ముందుకు వస్తే చర్చించేందుకు సంతోషంగా ఉన్నట్టు ప్రకటించారు. -
దేశంలో 37 మెగా ఫుడ్ పార్కులకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 37 మెగా ఫుడ్ పార్కులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలో గోదావరి మెగా ఆక్వాపుడ్ పార్క్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీంతో 50 మందికి ప్రత్యక్షంగా, 200 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. చిత్తూరులోని శ్రీని పుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిద్వారా 1,200 మందికి ప్రత్యక్షంగా, 16 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. తెలంగాణలోని నిజామాబాద్‌లో స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ఏర్పాటు వల్ల 25 మందికి ప్రత్యక్షంగా, 100 మందికి పరోక్షంగా ఉపాధి చేకూరనున్నట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించారు. పొలం నుంచి మార్కెట్ వరకు నిల్వతో పాటు.. ఆహార ప్రాసెసింగ్ కోసం ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం ఎమ్‌ఎఫ్‌పీఎస్(మెగా ఫుడ్ పార్క్) ప్రాథమిక లక్ష్యం. వ్యవసాయం, రవాణా, లాజిస్టిక్స్, కేంద్రీకృత ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల కల్పన ఇందులో ఉంటుంది. (ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత) మెగా ఫుడ్ పార్కులను స్థాపించడం ద్వారా హబ్, స్పోక్స్ మోడల్ ఆధారంగా క్లస్టర్ ఆధారిత విధానంతో ఈ పథకం పనిచేస్తుంది. ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు (పీపీసీలు), కలెక్షన్ సెంటర్లు (సీసీలు).. సాధారణ సౌకర్యాల రూపంలో పొలం దగ్గర ప్రాధమిక ప్రాసెసింగ్, నిల్వ కోసం మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, విద్యుత్, నీరు ప్రసరించే చికిత్స ప్లాంట్ (ఇటిపి) వంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను ఈ పథకంలో కల్పిస్తారు. (ఆ బాధ్యత రాష్ట్రాలదే: కేంద్ర హోం శాఖ) ఈ పథకం సాధారణ ప్రాంతాలలో ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం (భూమి వ్యయాన్ని మినహాయించి), కష్టతరమైన కొండ ప్రాంతాలలో అంటే ఈశాన్య ప్రాంతంలో ప్రాజెక్టు వ్యయంలో 75 శాతం (భూమి వ్యయాన్ని మినహాయించి) చొప్పున మూలధన మంజూరు కోసం అందిస్తుంది. సిక్కిం, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఐటీడీపీ రాష్ట్రాల నోటిఫైడ్ ప్రాంతాలతో సహా ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా రూ .50 కోట్లు కేటాయించనుంది. -
సీతామాతలను దహనం చేస్తున్నారు: అధిర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు రామాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే.. మరో వైపు సీతామాతలను దహనం చేస్తున్నారని అధిర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా లోక్‌సభ గందరగోళ వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో గురువారం అత్యాచార బాధితురాలిని దహనం చేసిన ఘటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. హైదరాబాద్, ఉన్నావ్‌లో రేప్‌లు జరుగుతున్నాయని, అక్కడి ప్రజల్లో అభద్రతా భావం నెలకొని ఉందని ఆయన అన్నారు. ఈ దేశంలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. చట్టం లేని ప్రాంతంగా ఉత్తరప్రదేశ్ మారిపోయిందన్నారు. ఉత్తరప్రదేశ్‌ను 'ఉత్తమప్రదేశ్'గా మార్చాలని మాటలు వినిపిస్తున్న తరుణంలో అది అధర్మప్రదేశ్‌గా మారిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలో జరిగిన ఘటనలు బాధాకరమని.. కానీ ఆ విషయాలను కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మాత్రం సరికాదన్నారు. దీంతో కాంగ్రెస పార్టీ రెండు ఘటనలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసింది. -
'అలాంటి డీఎన్ఏ ఆ పార్టీలకే ఉంది'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి.. నిర్మలా కాదు నిర్బల అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. పార్లమెంట్లో తనను అనేక పేర్లతో పిలిచారని ఆమె పేర్కొన్నారు. తాను ఒక ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టలేని ఆర్థికమంత్రిని అంటూ గత కొంతకాలంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని, తన పదవీకాలం పూర్తయ్యే వరకు కూడా వాళ్లు ఆగలేకపోతున్నారని విమర్శించారు. ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేందుకు అవసరమైన మరిన్ని సలహాలు ఇవ్వాలని తాను వారికి చెప్పానన్నారు. ఏదైనా విని సమాధానం ఇచ్చే ప్రభుత్వం ఉంటే అది మోడీ ప్రభుత్వమేనని కాంగ్రెస్ నాయకులకు ఆమె చురకలంటించారు. ప్రశ్నలు అడిగి, సమాధానం చెప్పేలోగా పారిపోయే డీఎన్ఏ ఎవరికైనా ఉందంటే అది ఇతర పార్టీలకని, తమ పార్టీకి కాదని ఆమె అన్నారు. వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ చేసిన విమర్శలపై కూడా ఆమె స్పందిస్తూ.. విమర్శలను స్వీరించే మనస్తత్వం ఉంది కాబట్టే విమర్శను విన్నాము. దానిని పరిగణనలోకి తీసుకొని సమాధానం కూడా చెప్పాము. విమర్శను స్వీకరించే గుణమే లేకపోతే.. వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెలిబుచ్చే అవకాశమే ఇచ్చేవాళ్లం కాదని ఆమె సమాధానమిచ్చారు. చదవండి: ఆయన క్షమాపణలు చెప్పి తీరాల్సిందే: బీజేపీ -
ఆయన క్షమాపణలు చెప్పి తీరాల్సిందే: బీజేపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి మరోసారి నోరుజారారు. లోక్‌సభలో సోమవారం అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ .. నిర్మల సీతారామన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కార్పొరేట్ పన్నుల తగ్గింపు గురించి వివరణ ఇచ్చిన నేపథ్యంలో అధిర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మీరంటే నాకు గౌరవం ఉంది కానీ, నిర్మల సీతారామన్ అనడానికి బదులుగా నిర్బలా సీతారామన్ అనడం సరైనదా.. కాదా..? అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను. మీరు మంత్రి పదవిలో ఉన్నారు. అయితే మీరు మీ మనసు విప్పి మాట్లాడుతున్నారా.. లేదా అనే సందేహం కలుగుతోందని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. గతంలో నరేంద్రమోదీ, అమిత్‌షా తాజాగా నిర్మలా సీతారామన్‌లపై చేసిన వ్యాఖ్యలకు అధిర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని లోక్‌సభలో బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పటికే.. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వలసదారులంటూ అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశమంతా ఎన్ఆర్సీని అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై అధిర్ రంజన్ చౌదరి సోమవారం మాట్లాడుతూ.. దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. భారత్ ఏ ఒక్క మతానికో పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం వలసదారులేనని, వారి ఇళ్లు గుజరాత్లో ఉన్నాయని, కానీ వారు ఢిల్లీలో ఉంటున్నట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
‘హోదా’పై కేబినెట్ నిర్ణయాన్ని అమలుచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేస్తూ 2014 మార్చిలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్థిక బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కొత్త డిమాండ్ ఏమీ కాదు. 2014 మార్చిలో అప్పటి కేంద్ర కేబినెట్ ఏపీకి ప్రత్యేక హోదా వర్తింపజేయాలని నిర్ణయించింది. దానిని తక్షణం అమలుచేయాలని ప్రణాళిక సంఘానికి పంపింది. కానీ, గడిచిన ఐదేళ్లలో దీనిని అమలుచేయలేదు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను ఆక్షేపించిందని సభలో పలుమార్లు చెప్పారు. కానీ, ఇది వాస్తవం కాదు. కేంద్రం ఒక్క సంతకంతో దానిని అమలుచేయవచ్చు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా అవసరం. రాష్ట్రంలో అప్పులు పేరుకుపోయాయి. కేంద్రం స్పందించేందుకు ఇది సరైన సమయం. రెవెన్యూ లోటు రూ.63 వేల కోట్ల మేర ఉంది. రాజధాని లేకుండా, మౌలిక వసతలు లేకుండా ఉన్న రాష్ట్రం ఇంత మొత్తం రెవెన్యూ ఎలా భర్తీ చేసుకోగలదు? అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఒకటి రెండే ప్రకటించారు. గడిచిన ఐదేళ్లలో ఏపీలో రూ.5 వేల కోట్లకు మించి పెట్టుబడులు రాలేదు. ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత ఎదురుచూస్తున్నారు. అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’.. అని మిథున్‌రెడ్డి వివరించారు. చట్టంలో హామీలు నెరవేర్చండి ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక హామీలు పొందుపరిచారు. కడప స్టీలు ప్లాంటు గురించి బడ్జెట్లో ప్రస్తావనలేదు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాల్సి ఉండగా.. గడిచిన రెండేళ్లుగా ఇవ్వలేదు. బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ఇచ్చిన ప్యాకేజీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో మీరు పారిశ్రామిక రాయితీలు ఏమిచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే, దుగరాజపట్నం పోర్టు ప్రస్తావనలేదు.. వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు.. మెట్రో రైలు పనులు ప్రారంభం కాలేదు.. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముంది’.. అని మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వాటా లెక్కించే విషయంలో 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటోందని, ఇది సరికాదని ఆయనన్నారు. -
‘అరే.. మమ్మల్ని కింద పడేస్తారా ఏంటి’
కోల్‌కతా : తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయిన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తీలు లోక్‌సభ సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం బయటకు వచ్చిన మహిళా ఎంపీల చుట్టూ విలేకరుల గుమిగూడారు. వారిని కదలనీయకుండా చుట్టుముట్టి.. ప్రశ్నలు అడుగుతూ.. ఫోటోలు తీస్తూ ఇబ్బంది పెట్టారు. ముందుకు వెళ్లడానికి దారి లేకుండా చుట్టూ చేరారు. ఒకానొక సమయంలో ఈ మహిళా ఎంపీలు తిరిగి పార్లమెంట్‌లోకి వెళ్దామనుకున్నారు. కానీ అది కూడా వీలు పడలేదు. దాంతో తమకు దారి ఇవ్వాల్సిందిగా విలేకరులను కోరారు. అయితే వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. దాంతో సహనం కోల్పోయిన ఈ యువ ఎంపీలు విలేకరుల మీద మండి పడ్డారు. ‘మీరంతా ఇలా చుట్టుముట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని పడేస్తారా ఏంటి.. అర్థం చేసుకోండి.. మమ్మల్ని వెళ్లనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఇబ్బంది గమనించిన భద్రతా సిబ్బంది అక్కడకు వచ్చి.. ఎంపీలు వారి వాహనం వద్దకు వెళ్లేందుకు సాయం చేశారు. కారు దగ్గరకి వచ్చాక కూడా విలేకరులు వీరిని వదిలిపెట్టలేదు. ఒక్క ఫోటో అంటూ ఇబ్బంది పెట్టారు. దాంతో ఈ మహిళా ఎంపీలు క్యూలైన్లో తమకు దూరంగా నిలబడితే ఫోటో దిగుతామని కండిషన్ పెట్టి.. ఫోటోలు దిగి అక్కడ నుంచి బయటపడ్డారు. -
పెళ్లి తర్వాత ప్రమాణ స్వీకారం
తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయిన నుస్రత్ జహాన్, మిమి చక్రబర్తీలు లోక్‌సభ సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. తమ ప్రమాణ స్వీకారం ’బంగ్లా’లో చేసిన వీరు, తమ ప్రసంగం చివరలో ’వందేమాతరం’, ’జై హిందీ’, ’జై బంగ్లా’ వంటి పదాలు ఉపయోగించారు. తర్వాత వెంటనే లోక్‌సభ స్పీకర్ ’ఓం బిర్లా’కు పాదాభివందనం చేశారు. నుస్రత్ జహాన్ ఇటీవలే టర్కీకు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకోగా, మిమి చక్రబర్తీ ఆ వేడుకకు హాజరయ్యారు. దీంతో మంగళవారం సభకు వచ్చిన ఈ ఇద్దరు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నుస్రత్ జహాన్ బసిర్హాట్, మిమి జాదవ్‌పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
ఒక్క క్లిక్‌తో న్యూస్ రౌండప్..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. మరోవైపు 17 వ లోక్‌సభ సోమవారం కొలువు తీరింది. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ లోక్‌సభకు కొత్తగా ఎంపికైన సభ్యులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జేపీ నడ్డా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి.. -
పార్లమెంటుకు ప్రత్యేక హోదా పోరాటం!
-
పార్లమెంటుకు ప్రత్యేక హోదా పోరాటం!
నేడు లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాపై పార్లమెంటులో గళమెత్తేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై పార్లమెంటు వేదికగా పోరాడేందుకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం లోక్‌సభలో ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్టీ ప్రవేశపెట్టబోతున్నది. పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన ప్రవేశపెట్టబోతున్న ప్రత్యేక హోదా బిల్లు.. ప్రైవేటు మెంబర్ బిజినెస్‌లో 9వ ఐటెంగా లిస్ట్ అయింది. ప్రత్యేక హోదా కోసం గత కొన్నేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపులేని పోరాటాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హోదాకు మద్దతుగా విశాఖ ఆర్కే బీచ్‌లో తలపెట్టిన ఉద్యమానికి కూడా వైఎస్ జగన్ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. హోదాకు మద్దతుగా ఆయన కొవ్వొత్తుల ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను విశాఖ విమానాశ్రయంలోనే నిర్బంధించి.. నిరంకుశంగా ప్రభుత్వం వెనుకకు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోదా సాధించేవరకు అలుపెరుగని పోరాటాన్ని సాగిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందులోభాగంగానే పార్లమెంటు వేదికగా హోదా పోరాటాన్ని సాగించేందుకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. -
ప్రత్యేక హోదాపై జైట్లీ దాటవేత
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న విషయంలో గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు నిరాశ పరిచే అంశం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అంశంపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఆర్థిక బిల్లుపై గురువారం లోక్ సభలో మాట్లాడిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకున్నదానికంటే ఎక్కువగా నిధులు మంజూరు చేస్తున్నామన్నారే తప్ప ఎక్కడా ఆయన తన ప్రసంగంలో ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట చెప్పలేదు. ఆర్థిక బిల్లుపై చర్చకు సమాధానంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత ఏపీకి అధనపు నిధులు కేటాయిస్తున్నామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి కొంత మంజూరు చేయాల్సి ఉందే తప్ప మిగతా అన్ని రకాలుగా ఏపీని ఆదుకుంటున్నట్టు చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి రాష్ట్ర రెవెన్యూ వాటా కింద 21,900 కోట్ల రూపాయలు కేటాయించగా, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి 6,609 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పారు. అలాగే స్థానిక సంస్థల నిధుల కింద కేంద్రం 1259 కోట్ల రూపాయలు కేటాయించిందని, విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు పోలవరం ప్రాజెక్టు కోసం కూడా నిధులు సమకూర్చుతున్నామని చెప్పారు. అలాగే రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 2015 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. విభజన చట్టంలో ఏదైతే పొందుపరచారో దానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. ఏపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చామన్నారు. అయితే ఎక్కడ కూడా ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తలేదు. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని మాత్రం తమ ప్రభుత్వం చేస్తుందని అరుణ్ జైట్లీ చెప్పడం ద్వారా ఇక ఏపీకి ప్రత్యేక హోదా కల్పించరన్న విషయం దాదాపుగా స్పష్టంగా చేశారు. -
ఆటంకపర్వానికి అంతమెప్పుడు?
రూల్ 349 ప్రకారం తాను మాట్లాడని సమయంలో మౌనంగా ఉండాలి, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుతగలకూడదు, నినాదాలివ్వకూడదు, సభాపతి దగ్గరకు పోకూడదు, డాక్యుమెంట్లను చించకూడదు. రూల్ 356 సభాకార్యకలాపాలకు ఆటంకం కలిగించే విధంగా సభ్యులు మాట్లాడే హక్కును నిషేధిస్తున్నది. కానీ సభలో ఈ నియమాల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. చట్టసభలను దాని సభ్యులే ఆటంక పరచడం పరిపాటి అయింది. 16వ లోక్‌సభ సమావేశాలలో ఆటంకపర్వం ప్రారంభమైంది. 15వ లోక్ సభ ఆటంకపర్వాలలో అగ్ర స్థానం పొందింది. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆటంకపర్వం సాగించింది. ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉంది. ప్రతిపక్షంలోకి మారిన కాంగ్రెస్ ఆటంక పర్వాన్ని ఆరంభించింది. ఆటగాళ్లు, వారి పాత్రలు మారాయి కాని ఆటమాత్రం యథాతథం. ఆనాడు ఆయి ల్ ఫుడ్డు, 2జీ, బొగ్గు, క్రీడల స్కాములు, ఇప్పుడు వ్యాపం, లలిత్ గేట్ వగైరాలు. అప్పుడూ ఇప్పుడూ ఒకటే నినాదం. ముందు రాజీనామాలు, తర్వాతే సభలో చర్చ, లేకపోతే సభను నడవనివ్వం. అదే రగడ. సభను ఆటంక పరచడానికి తగిన సంఖ్యగల ఇతర పార్టీలు ఇదే బాట పడుతున్నాయి. తొలి లోక్‌సభ (1952-57) 677 రోజుల పాటు 3,748 గంటల కార్యకలాపాలు సాగించింది. 15వ లోక్ సభ (2009-14) కేవలం 335 రోజుల పాటు 1,329 గంటల కార్యకలాపాలు సాగించి అథమ స్థానంలో ఉం ది. చట్టాల మీద చర్చల కోసం తొలి లోక్‌సభ 49 శాతం సమయాన్ని వెచ్చిస్తే,15వ లోక్‌సభ కేవలం 23 శాతాన్ని వినియోగించింది. ఆమోదించిన 162 బిల్లులలో 30 శాతం బిల్లుల మీద గంటలోపు మాత్రమే చర్చ జరిగిం ది. బీజేపీ నిత్య ఆటంకాల నిర్వాకానికి ఫలితం ఇది. 2012లో వర్షాకాల సమావేశాలను పూర్తిగా స్తంభింప చేశారు. దీనిపై సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ పార్లమెం టును స్తంభింప చెయ్యడం కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతేనన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే బాణీలో పోటీ పడుతున్నది. పార్లమెంటు చట్టాలు చెయ్యడానికీ, ప్రజాసమస్య లను చర్చించడానికీ, పరిష్కారాలు సాధించడానికీ ఉద్దే శించింది. వాదనలకు బదులు వాకౌట్లకు, చర్చలకు బదులు అరుపులు కేకలు తోపులాటలు పోడియం ముట్టడి వంటి రచ్చలకు వేదికను చేశారు. చట్టసభలోనే చట్టాలను, నియమాలను ఉల్లంఘిస్తున్నారు. సభా నిర్వ హణకు సంబంధించిన రూల్ 349 ప్రకారం తాను మాట్లాడని సమయంలో మౌనంగా ఉండాలి, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుతగలకూడదు, నినాదాలివ్వ కూడదు, సభాపతి దగ్గరకు పోకూడదు, అసమ్మతి తెల పడానికి డాక్యుమెంట్లను చించకూడదు. రూల్ 356 సభాకార్యకలాపాలకు ఆటంకం కలిగించే విధంగా సభ్యులు మాట్లాడే హక్కును నిషేధిస్తున్నది. కానీ సభలో ఈ నియమాల ఉల్లంఘనలు జరిగిపోతూనే ఉన్నాయి. సుష్మా స్వరాజ్ చెప్పినట్లు సభను ఆటంక పరచడం ప్రజాస్వామ్య పద్ధతి కాకపోగా అది పూర్తిగా సభా నియమాల ఉల్లంఘన. ఇప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్నదీ నియమాల ఉల్లంఘనే. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒకే నాణేనికి బొ మ్మా బొరుసులు. చట్టాలను, నియమాలను తుంగలో తొక్కేవారికి చట్టసభలలో స్థానం ఉండకూడదు. ఇలాం టి వారిని దోషులుగా ప్రకటించి, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం కంటే సర్దిచెప్పడం, సభను వాయిదా వెయ్యడానికే సభాపతులు మొగ్గుతున్నారు. పత్రికలకు, ప్రసార మాధ్యమాలకు మైకు విరిస్తే పెద్ద వార్త అవుతు న్నది. మైకు ముందు అర్ధవంతమైన ప్రసంగం వార్త కాకుండా పోతున్నది. వాదనకు దిగలేని జీరోలు ఎంత రభస చేస్తే అంతటి హీరోలు. పార్లమెంటు సమావే శాలు నిత్య నిరసనలతో ధర్నా చౌక్‌ను తలపిస్తున్నాయి. ఈ పరిస్థితి మారితీరాలి. సభాహక్కుల సంఘం ఇలాం టి వారిని పార్లమెంటు లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోనులో ఎక్కించాలి. దోషిగా చూపించే ఈ చిత్రా లను బహిరంగ పరచాలి. వ్యక్తిగతంగా వారి జీతభత్యా లలో భారీ కోతలు, వివిధ కమిటీలలో ఉన్న సభ్యత్వాల సస్పెన్షన్‌తో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజ లకు అర్ధమయ్యే రీతిలో ఎంపీ లాడ్స్‌లో భారీ కోతలు విధించాలి. పార్లమెంటు కాలం ముగింపు సమావేశాల వెంటనే సభ్యుల ప్రవర్తనా నివేదికను ప్రకటించాలి. సభలో తన ప్రవర్తనకీ తర్వాత జరిగే ఎన్నికలకీ మధ్య ముడిపడితే తప్ప సభ్యుల తీరు మారదు. సజావుగా పార్లమెంటు కార్యకలాపాలు సాగకపోతే జరిగే దుష్ఫలి తాలు ఇప్పటికే కనిపిస్త్తున్నాయి. పార్లమెంటును పక్కన పెట్టి పాలన సాగించే అడ్డదారులను ప్రభుత్వాలు అను సరిస్తున్నాయి. ఆధార్ కార్డుల బిల్లు ఇప్పటికీ పార్లమెం టులో నానుతూనే ఉంది. చట్టం లేకుండానే ఆధార్ కార్డులు వచ్చేశాయి. దానితో అన్ని అనుసంధానాలు జరిగిపోతున్నాయి. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం చట్టం కాకముందే అమలులోకి వచ్చేసింది. బడ్జెట్లలో పెంచా ల్సిన ధరలు పార్లమెంటు ప్రమేయం లేకుండా ముందూ వెనకా వడ్డింపులుగా మారాయి. ఈ ధరల నిర్ణయానికి ప్రత్యేక వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. చర్చ లేకుండానే బడ్జె ట్లు ఆమోదం పొందుతున్నాయి. లక్షల కోట్ల పద్దులు గిలిటిన్ అవుతున్నాయి. బడ్జెట్లో లేకపోయినా కొత్త పథకాలు పుట్టుకొస్తున్నాయి. వాటికి నిధులు విడుదల జరిగిపోతున్నది. పార్లమెంటు ప్రజాధికారానికి ప్రతీక. ప్రజలు ఓటు ద్వారా తమ అధికారాన్ని దఖలు పరుస్తు న్నారు. రాజ్యాంగబద్ధంగా దేశాన్ని శాసించే శక్తిగా భాసి ల్లాలి. పార్లమెంటును పక్కన పెట్టడం, నిర్వీర్యం చెయ్య డం, స్తంభింపచెయ్యడం ప్రజల సార్వభౌమాధికారం మీద దాడి తప్ప వేరు కాదు. (వ్యాసకర్త: అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ లోక్‌సత్తా పార్టీ) 9866074023 - డీవీవీఎస్ వర్మ